-
Dear friends, As I am undergoing Cataract Operation today there will be no posts for next 10days. Please bear with me.
-
క్షయము … మేరీ లూయీ రిట్టర్, అమెరికను కవయిత్రి
కొండ శిఖరం నుండి పాదాల వరకూ కెరటాలు కెరటాలుగా పచ్చదనం ప్రవహిస్తునట్టు ఊగుతోంది ఆ గుసగుసలాడే సముద్రం వంటి పచ్చనాకుల సంపదలోంచి అగోచరమైన గాలి చిత్రంగా గొణుగుతూ పోతోంది. చుట్టూ ఆవరించిన చిన్ని చెట్ల గుబురుమధ్య ఒక బ్రహ్మాండమైన ఓక్ చెట్టు, ఏకాంత గభీరతతో నిలబడి దాని సువిశాలమైన చేతులు దశదిశలకు జాచి బాధాతప్త హృదయంతో దైవాన్ని దీనంగా అర్థిస్తోంది. వేసవి ఆకాశపు విద్యుల్లతాఘాతానికో లేక తన మనసులోని దిగులుతో నెమ్మదిగా కృశిస్తూనో కారణమేదైతేనేం, నిర్దాక్షిణ్యమైన విధి…
-
ఆకస్మిక వెలుగు… డాంటే గేబ్రియెల్ రోజేటీ, ఇంగ్లీషు కవి
నేనిక్కడకి ఎప్పుడో వచ్చేను, కానీ ఎప్పుడో, ఎలాగో చెప్పలేను: ఆ తలుపు దాటిన తర్వాత పచ్చని పచ్చిక దాని ఘాటైన సువాసనా, ఆ నిట్టూర్పుల చప్పుడూ, తీరం వెంట దీపాలూ పరిచయమే. ఒకప్పుడు నువ్వు నా స్వంతం,- ఎన్నాళ్ళ క్రిందటో చెప్పమంటే చెప్పలేను: కానీ, ఆ పిచ్చుకలు ఎగురుతున్నపుడే నీ మెడ అటుతిరిగింది, తెలియని తెర ఒకటి నీపై పడింది- నాకు తెలుసు అదంతా గతమని. అప్పుడుకూడా ఇలాగే ఉండేదా? సుడితిరుగుతూ ప్రవహించే కాలం మనజీవితాలతో పాటు…
-
వాయువు దాతృత్వము… పల్లడాస్, గ్రీకు కవి
మన నాసికలద్వారా పలుచని గాలి పీలుస్తూ మనం బ్రతుకుతాం సూర్యుని కిరణాలు అతి సన్నని తావుల్ని పరికిస్తూ పోతాయీ… బ్రతుకుతున్నవన్నీ… ప్రతిదీ ఒక సాధనం కనుక దయాళువైన వాయువు తనజీవితాన్ని ఎరువిస్తుంది. ఒక చేత్తో ఊపిరికై మన ఆర్తిని తీరుస్తూనే, పవనుడు మరొక చేత్తో ఈ ఆత్మని వణుకుతూ మృత్యువుకు ఎర చేస్తాడు. ఏపాటి విలువా చేయని మనల్ని మన అహంకారంతో మేపుతూ, ఏమాత్రం ఊపిరి లేకున్నా, మనం మరణించేలా చూస్తూ. . పల్లడాస్ క్రీ. శ.…
-
ఎండుటాకులు… ల్యూసీ ఎవలీనా ఆకర్మాన్, అమెరికను
ఎండుటాకులు తప్ప మరేం లేదు; ఆత్మ ఘోషిస్తుంది జీవితం వృధా చేసినందుకు; వివేకాన్ని నిద్రపుచ్చి, పాపం చేసినందుకు, వాగ్దానాలు చేసి ఎన్నడూ నిలబెట్టుకోనందుకు, ద్వేషం, పోరాటాలూ, ఘర్షణల ఎండుటాకులు తప్ప మరేం లేదు. ఎండుటాకులు తప్ప మరేం లేదు; న్యాయబద్ధమైన జీవితం నుండి ఏరుకున్న కంకులు లేవు; పండు గింజలు లేవు మాటలు, శుష్కమైన మాటలు; చిత్తశుద్ధితో చేసే పనికి బదులు; మనం గింజలు జల్లుతాం, ఓహ్ అవి పొల్లూ, కలుపుమొక్కలే. మనం శ్రమపడి, బాధలు ఓర్చుకుని…
-
అందమైన ముఖం ప్రభావం… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి, శిల్పకారుడు
ఒక అందమైన ముఖం నా ప్రేమని ఉదాత్తం చేస్తుంది అది నా మనసుని తుఛ్ఛమైన కోరికలనుండి మరల్చింది; ఇపుడిక మరణాన్నీ లక్ష్య పెట్టను, పాపపు కోరికల్నీ; నీ ముఖము పైలోకాలలోని సుఖాలకి మచ్చుతునక సత్పురుషులంగీకరించే బ్రహ్మానందాన్ని బోధిస్తుంది. ఆహా! స్వర్లోకపు కపోతానికి ప్రతిరూపంగా నీ అంత గొప్ప వస్తువు సృష్టించిన ఆ భగవంతుడు ఎంద సుందరుడూ, దయాళువూ అయిఉంటాడో గదా భూలోక స్వర్గాలైన ఆ సుందరమైన కనులనుండి నా దృష్టిని మరల్చుకోలేని నా అపరాధాన్ని మన్నించు అవే…
-
నాతో నేను … పాల్ ఫ్లెమింగ్, జర్మను కవి
ఓ మనసా! నిన్నేదీ విచారపడేలా, చిరచిరలాడేలా లేక పశ్చాత్తాపపడేలా చెయ్యకుండుగాక; నువ్వు నిశ్చింతగా ఉండు; దైవము ఏది ఆజ్ఞాపిస్తే అది సత్యము దాన్ని కనుక్కోవడంలోనే నీ ఆనందము. ఓ హృదయమా! రేపటి గురించిన చింతతో ఈ రోజంతా ఎందుకు విచారిస్తావు? పైనుండి అందర్నీ ఒకరు గమనిస్తున్నారు. నిజం. నీ భాగం నీకు అందే విషయమై ఎంతమాత్రం సందేహించకు. ధృఢంగా ఉండు; చంచలత్వం వద్దు; ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకు నిద్రకు తప్ప; నీకు తెలిసుండాలి భగవత్సంకల్పం అన్ని జీవరాసులకీ,…
-
ఇద్దరు దేవదూతలు… జాన్ గ్రీన్ లీఫ్ విటియర్, అమెరికను కవి
దేముడు స్వర్గంలో తనకి దగ్గరగా వసిస్తున్న ఇద్దరు దేవతల్ని పిలిచేడు అతిసుకుమారమైనది కరుణ, అతి ప్రీయమైనది ప్రేమ “లేవండి,” దేముడు ఆజ్ఞాపించేడు,”నా దేవతలారా! పాపపు, దుఃఖపు తెరలు స్వర్లోకపు ద్వారాలనుండి లోనకి ప్రవేశించి అంతటా విచారం అలముకుంటోంది. నా వీణియ అధోలోకాలనుండి వెల్లువెత్తుతున్న శోకస్వరాన్ని అందుకుంటోంది. వేదనా ధూమము దట్టంగా వెలుగునుకమ్ముకుంటోంది, పూలు చీడపడుతున్నాయి, మీరు అధోలోకాలకు వెళ్ళి అక్కడి బాధాతప్తమైన ఆత్మలపై బంగరు కేశాలుగల దేవతలైద్దరూ సింహాసనానికి ప్రణమిల్లేరు నాలుగు తెల్లని రెక్కలు అగాధ తమోమయ…
-
ప్రేమికుల వియోగం… అజ్ఞాత చీనీ కవి
ఆమె: “కోడి కూస్తోంది, విను! అతడు: “లేదు! ఇంకా చీకటిగానే ఉంది,” ఆమె: “వెలుగు రేకలు విచ్చుకుంటున్నై.” అతడు: “లేదు, నా వెలుగు కిరణమా!” ఆమె: “ఏదీ లేచి చూసి చెప్పు ఆకాశం తెల్లబడటం లేదు?” ఆమె: “వేగు చుక్క ఇప్పుడే తిర్యగ్రేఖదాటి ఎగబ్రాకుతోంది.” ఆమె: “అయితే నువ్వు త్వరగా వెళ్ళిపో: అయ్యో! నువ్వు వెళ్ళవలసిన వేళ సమీపించిందే!; కానీ ముందు ఆ కోడికి గుణపాఠం చెప్పు అదే మన కష్టాలకి నాంది పలికింది.” . అజ్ఞాత…