అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 29, 2016

    మంచు బిందువులు … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    అతను నావాడని కలగంటాను ఆతను నిజాయితీపరుడని కలగంటాను అతని మాటలు భద్రంగా దాచుకుంటాను గులాబి రేకులు మంచుబిందువులు దాచినట్టు. ఓ దాహార్తివైన గులాబీ, ఓ చిన్నారి నా మనసా జాగ్రత్త! లేకుంటే మీకు వంద గులాబుల బరువు భరించాల్సి వస్తుంది. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . Dew I dream that he is mine, I dream that he is true, And…

  • జూన్ 28, 2016

    రాత్రి పరామర్శలు … క్లారిబెల్ ఎలగ్రియా, నికరాగువా కవయిత్రి

    నేను మనకు తెలియని ఎంతోమంది యువకులు తమని తాము దహించుకున్నవారూ, అవయవాలు కోల్పోయినవారూ కుంటి వారూ రెండు కాళ్ళూ పోయినవారూ రెండు కళ్ళూ పోయిన వారూ ఆవేశంగా మాటాడే యువకులగురించి తలుచుకుంటాను. రాత్రిపూట వాళ్ళ ఆత్మలు నాతో మాటాడేది వింటాను నా చెవులో అరుస్తాయి నన్ను నా బద్ధకం వదిలేలా కుదుపుతాయి నాకు ఆదేశాలిస్తుంటాయి. నేను వాళ్ల చితికిపోయిన జీవితాలగురించీ నా చేతులను అందుకోడానికి ప్రయత్నించే వాళ్ళ ఉడుకుతున్నట్టుండే చేతులగురించీ ఆలోచిస్తాను. వాళ్ళు నన్ను బ్రతిమాలడం లేదు…

  • జూన్ 27, 2016

    రెస్టారెంటులోని సంగీతం… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి

    సిగరెట్టు పొగ పల్టీలు కొడుతూ మనమీదనుండి జారుకుంటుంది   వెయిటర్ కదలికలకి అనుగుణంగా క్రిందకి జారి సుళ్ళుతిరుగుతూ. నువ్వొక అగ్గిపుల్ల వెలిగించి మంటవైపు తదేకంగా చూస్తావు. ఆ చిన్ని వెలుగు నీ కళ్ళలో ఒక క్షణంసేపు కదలాడి  ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంత నిశ్శబ్దంగానూ ఆరిపోతుంది.    ఈ స్వరమాధురి వెనుక కొన్ని గొంతులున్నాయని నువ్వంటావు… వాళ్ళు జలకన్యల్లా ఏ నదిలోంచో అవతరించి, పాడుతూ, వాళ్ళ వెన్నెల వదనాల్ని ఎత్తి చూపి, చీకటిలోకి మునిగిపోతారు. నువ్వెక్కడికి వెళితే అక్కడికి ఈ…

  • జూన్ 26, 2016

    తుఫానుమీద సవారీ … యాహియా లబబీదీ, ఈజిప్షియన్-అమెరికను కవి

    ఈ తనువు నిగూఢమైన చిక్కుముడి విప్పలేకపొయాను ఆకలేసినపుడు నిద్రపుచ్చుతున్నాను కలలు గనవలసివచ్చినపుడు తెగమేపుతున్నాను. ఆదర్శాలకీ- యదార్థానికీ మధ్య మొదటిది తిరస్కరిస్తూ, రెండవదానిచే తిరస్కరించబడుతూ రెండు నాల్కలధోరణి ప్రదర్శించే నా ఆత్మతత్త్వానికి ఉక్కిరిబిక్కిరై ఊపిరిసలపనంత పని అయింది. నాకు ఇప్పటికీ తుఫానుపై సవారీ చేసే కళ అబ్బలేదు వాటి ప్రచండగాలుల ఊళలు వినడానికి చెవులూ ఉప్పెనలా వచ్చే కెరటాలు చూడడానికి కనులూ లేకుండా వాతావరణం ఎప్పుడూ నా అంచనాకి దొరక్క ఆశ్చర్యపరుస్తుంది ఈ పటాలూ, దిక్సూచిలూ, నక్షత్రాలూ, వాటి…

  • జూన్ 25, 2016

    మేని రంగులు… రిచ్ మండ్ లాటిమోర్ , అమెరికను కవి

    మనం ఎందులో ఇరుక్కు పోయామో చూడు. బాధలకీ, జ్వరాలకీ, జడత్వానికీ, కేన్సర్లకీ నిలయం నమ్మలేనంతగా సహిస్తుంది లోపల ఎంతగా మండుతున్నా. ఇది దయ్యానికి ఆటపట్టు యమభటులు హింసించడానికి సాటిలేని వస్తువు. ఊపిరి లేకుంటే (అదే ప్రాణం) ప్రాణం లేకుంటే (అదే ఊపిరి) ఎందుకూ పనికిరాదు లేదా, బల్లమీద దాని అంగాలతో పాటు పడుకోబెట్టిన ఒక సంచి. మళ్ళీ ప్రాణం పోసుకుంటుందా? ప్రకృతిలో కలిసిపోతుందా? భయమేస్తుంది ఆలోచిస్తే. భయపడుతుంది. కానీ, దాని వంపులకై, రంగులకై, రుచులకై, ఆకృతికై ఉబలాటపడుతుంది.…

  • జూన్ 23, 2016

    బ్రిడ్జ్ నుండి … క్లారిబెల్ ఎలెగ్రియా, నికరాగువా కవయిత్రి

    నేను కోరుకుంటున్న వ్యవస్థ నాకెక్కడా కనిపించలేదు. బదులుగా, అధికారం ఉన్న వాళ్ళ చేతిలో దుష్ట సంప్రదాయాలూ ప్రణాళికా బద్ధమైన అవ్యవస్థ దినదినాభివృద్ధిచెందుతూ, కాస్త దయగల ప్రపంచం కోసం ఆకలి లేని ప్రపంచం కోసం ఆశతో జీవించే అవకాశం కోసం ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో వారందరూ జైళ్ళలో హింసలపాలై మరణిస్తున్నారు. వద్దు వద్దు. నన్ను సమీపించవద్దు. కుళ్ళిన మాంసపు కంపు నా చుట్టూ వ్యాపించి ఉంది! . క్లారిబెల్ ఎలెగ్రియా (May 12, 1924- ) నికరాగువా కవయిత్రి…

  • జూన్ 22, 2016

    శ్లాఘించబడని అందం… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి

    ఉన్నది నువ్వొకతెవే ఇతరులు మోసగత్తెలూ,శుచిలేని, పరాన్నభుక్కులూ. నీ వొకతెవే నిరాడంబరంగా, స్థిరంగా, స్పష్టంగా ఉంటావు. కాంతి నీ చుట్టూ వక్రగతులుపోతుంది బంగారు తీవెల పొదరింటిలా. నీ మాటలు శీతల చంద్రకాంత ఫలకాలూ వాసనలేని పూవులూనా?   నవ్వు!నవ్వు! వాళ్ళు తప్పిదాలు చేస్తే చెయ్యనీ. సముద్ర మెప్పటికీ సముద్రమే. దాన్ని ఎవరూ మార్చలేరు. దాన్ని ఎవరూ స్వంతం చేసుకోలేరు. . రిచర్ద్ ఆల్డింగ్టన్ 8 July 1892 – 27 July 1962 ఇంగ్లీషు కవి . .…

  • జూన్ 21, 2016

    సంకటస్థితి… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి

    సరికొత్త అందాల్నీ, కొత్త ప్రదేశాల్నీ, కొత్తముఖాల్నీ, కొత్త సూర్య చంద్రుల్నీ, మహా పట్టణాలనీ, నువ్వెన్నడూ చూడని మహా సాగరాల్నీ, అడవుల్నీ, వెతుక్కుంటూ పోక తప్పదా అని నువ్వు అడిగేవు. నువ్వు అచేతనంగా మౌనంగా కూచుని ఇంతవరకు సాధించినది గుర్తుచేసుకుంటూ ఆలోచనలు నెమరు వేసుకుంటూ, విజయగాథలు లెక్కిస్తూ, ఏ ప్రభావం చూపించకుండా ప్రతిరోజూ గడపడమేనా? ఏ మార్పూలేక… మరో రోజు, గంటలు వెళ్ళబుచ్చడం ఒక బాధని గాని, హృదయస్పందనగానీ గుర్తించకుండా… నేను మాటల్లో ఎలా చెప్పను? అదిగాక, నాకు…

  • జూన్ 20, 2016

    నిన్ను నువ్వు మోసం చేసుకోకు… థామస్ బీటీ, ఇంగ్లీషు కవి

    నీ మనసు చెప్పినట్టు నడవడం నేర్చుకో పరులు అవరోధాలు కల్పిస్తే, పట్టించుకోకు, వాళ్ళు ద్వేషిస్తున్నారా? లక్ష్యపెట్టకు, నీ కూనిరాగం నువ్వుతీసుకుంటూ నీపనిచేసుకో! నీ ఆశలు అల్లుకో, ప్రార్థనలు పాడుకో, ఒకరు నీకివ్వలేని కీర్తికిరీటాలు ఆశించకు నీ విజయాలకు వాళ్ళ అరుపుల్నీ గణించకు. మనసారా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడు నీ మనసుకి నువ్వు నిజాయితీగా ఉండు నీ మనసు బోధిస్తున్నదేదో తెలుసుకోడం నేర్చుకో నీకు నిర్ణయించిన పాత్రని చక్కగా నెరవేర్చు నువ్వు ఏ విత్తు నాటితే ఆ పంటే…

  • జూన్ 19, 2016

    అప్పుడే చనిపోవు… పాబ్లో నెరూడా చిలీ కవి

    నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు; నువ్వు దేశాలు తిరగనప్పుడు, పుస్తకాలు చదవనప్పుడు, జీవన నిక్వాణాలని వినిపించుకోనపుడు, నిన్ను నువ్వు అర్థం చేసుకోలేనపుడు నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు. నీ ఆత్మగౌరవాన్ని చంపుకున్నప్పుడు, ఇతరులు నీకు సహాయంచెయ్యడానికి ఇష్టపడనపుడు నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు. నువ్వు నీ అలవాట్లకు బానిసవైపోయినపుడు, ఎప్పుడూ నడచినతోవల్లోనే నడుస్తూ ఉన్నప్పుడు… నీ దినచర్యమార్చుకోనపుడు, నువ్వు వేర్వేరు రంగులు ధరించలేనపుడు, లేక, అపరిచితులతో మాటాడడానికి ఇష్టపడనపుడు. నువ్వు మెల్ల మెల్లగా…

←మునుపటి పుట
1 … 85 86 87 88 89 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు