-
అడవి బాతులు… మేరీ ఓలివర్ , అమెరికను కవయిత్రి
మీరు మంచి వాళ్లై ఉండవలసిన అవసరంలేదు. ప్రాయశ్చిత్తం చేసుకుందికి మీరు మోకాళ్ళమీద ఎడారిలో వందలమైళ్ళు నడవ వలసిన పనీ లేదు. మీ శరీరంలో దాగున్న ఆ మృదువైన జంతువుని దానికి ఏది ఇష్టమయితే దాన్ని ఇష్టపడనిస్తే చాలు మీ నిరాశా నిస్పృహల గురించి నాకు చెప్పండి, నావి నేను చెబుతాను. ఈ లోపున ప్రపంచం దాని మానాన్న అది నడిచిపోతుంటుంది. ఈ లోపున సూర్యుడూ, స్ఫటికాల్లాంటి వడగళ్ళవానలూ ఈ సువిశాల మైదానాల మీంచి, పచ్చిక బయళ్ళమీంచి, దట్టమైన…
-
అవును… చార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను
ఒంటరితనాన్ని మించిన బాధాకరమైన విషయాలు అనేకం ఉన్నాయి. కానీ, అది గ్రహించే లోపున దశాబ్దాలు గడిచిపోతాయి. తీరా తెలుసుకునే వేళకి కాలాతీతమైపోతుంది. సమయం మించిపోవడాన్ని మించిన బాధాకరమైన విషయం మరొకటి లేదు. . చార్ల్స్ బ్యుకోవ్స్కీ August 16, 1920 – March 9, 1994 అమెరికను . oh yes . there are worse things than being alone but it often takes decades to realize this…
-
నానావర్ణ సౌందర్య జగతి… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి
ఇంత చిత్రవిచిత్రమైన జగతిని ప్రసాదించిన దేవునికి నమస్సులు! కపిలధేనువులాంటి రంగు రంగుల ఆకాసామూ, రంగు వేసినట్టు నీటిలో ఈదే చేపపిల్లలూ, రాక్షసిబొగ్గు మంటలాంటి రాలిపడ్ద చెస్ట్ నట్ పళ్ళూ, భిన్న వర్ణాల చారల రెక్కలున్న పిట్టలూ, పశులమందలతో, పంటలతో, దుక్కిదున్నీ, బీడుపడీ నేలా, జాలరీ, దర్జీ, మొదలైన ఎన్నో వృత్తిపనుల వారి పనిముట్లూ, ప్రకృతి సిద్ధమూ, మానవ నిర్మితమూ, అరుదైనవీ, చిత్రమైన వస్తువులూ, ఊసరవెల్లిలా స్థిరంలేని రంగులుగల జీవులూ (ఎలా మారుస్తాయో ఎవరికెరుక?) కొన్ని వేగవంతమూ, కొన్ని…
-
నేను అందంగా,యవ్వనంలో ఉన్నపుడు… ఎలిజబెత్ మహారాణి 1
నేను అందంగా,యవ్వనంలో దేముని అనుగ్రహానికి పాత్రమైనపుడు చాలామంది నా చేయి అర్థిస్తూ ప్రాధేయపడ్డారు. నేను వాళ్ళందరినీ తిరస్కరించాను. సమాధానంగా, “ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో, బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దు” అన్నాను ఎన్ని కళ్ళు దుఃఖంతో విచారిస్తూ ఏడవడం చూశాను ఎన్ని హృదయాలు నిట్టుర్చేయో నేను చూపించగల శక్తి నాకు లేదు. అయినా రోజూ గర్వంతో మిడిసిపడుతూ వాళ్ళతో అన్నాను: “ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో, బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దు” అని. ఒకరోజు సౌందర్యాధిదేవత…
-
నాకు తెలుసు… సర్ జాన్ డేవీస్, ఇంగ్లీషు కవి
నా శరీరం ఎంత దుర్బలమో నాకు తెలుసు బయటి శక్తులూ, లోపలి బలహీనతలూ దాన్ని చంపగలవు; నా మనసు దివ్యస్వభావమూ తెలుసు కానీ, దాని తెలివీ, ఇఛ్ఛ కలుషితమైపోయాయి. నా ఆత్మకి అన్నీ తెలుసుకోగల శక్తి ఉందని తెలుసు కానీ అది గుడ్డిగా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది; నేను ప్రకృతి గారాబు పట్టిలలో ఒకడినని తెలుసు కానీ చాలా అల్పవిషయాలకీ, బలహీనతలకీ దాసుణ్ణి. నాకు జీవితం బాధామయమనీ, క్షణికమనీ తెలుసు నా ఇంద్రియాలు ప్రతిదానిచే కవ్వింపబడతాయనీ తెలుసు, చివరగా, నాకు…
-
కవన కళ … ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
అరచేతిలోని గుండ్రని పండులా కవిత మౌనంగా ఉండాలి. బొటనవేలికి వేలాడుతున్న పతకాల్లా కనిపించాలి, మాటాడకూడదు. నాచు పట్టి, అరిగిపోయిన కిటికీగట్టు నాపరాయి పలకలా నిశ్శబ్దంగా ఉండాలి. ఎగురుతున్న పక్షులగుంపులా కవిత మాటలకందకుండా ఉండాలి * చందమామ ఆకాశానికి ఎగబాకుతున్నట్టు కవిత కాలాతీతంగా ఉండాలి. విడిచిపెడుతున్నపుడు, రాతిరిలో చిక్కుబడ్ద చెట్ల కొమ్మల్ని చంద్రుడు ఒకటొకటిగా వీడినట్టు వీడాలి పూర్తయిన తర్వాత, హేమంతపు చంద్రుడు విడిచిపెట్టే ఒక్కొక్క జ్ఞాపకంలా వదలాలి. చందమామ ఆకాశానికి ఎగబాకుతున్నట్టు కవిత కాలాతీతంగా ఉండాలి. *…
-
దేముడు లేడు… ఆర్థర్ హ్యూ క్లఫ్, ఇంగ్లీషు కవి
“దేముడు లేడు” అంటాడు దుర్మార్గుడు, “అది నిజంగా ఎంత అదృష్టమో, లేకపోతే, నన్నేమి చేసేవాడో అది ఊహ కందని విషయం.” “దేముడు లేడు,”అనుకుంటాడు యువకుడు, “నిజంగా ఉండడం అంటూ తటస్థిస్తే, మనిషి ఎప్పుడూ పసివాడుగా ఉండాలని కోరుకుంటాడనుకోను.” “దేముడు లేడు, ఉండి ఉంటేనా,” ఒక వ్యాపారి అనుకుంటాడు,”ఊహకి చిత్రంగా ఉంటుంది అతను నేను ఏదో నాలుగు డబ్బులు చేసుకుంటే దాన్ని తప్పుగా తీసుకోవడం.” “దేముడు ఉన్నా లేకున్నా,” అనుకుంటాడో ధనికుడు “పెద్ద తేడా ఏమీ పడదు. ఎందుకంటే…
-
భ్రమ … మ్యూరియల్ రుకేసర్, అమెరికను కవయిత్రి
( గ్రీకు ఇతిహాసంలోని ఒక చిన్న సంఘటనని ఆధారంగా తీసుకుని ఒక పదునైన స్త్రీవాదకవిత అల్లింది కవయిత్రి, ఏ ఆర్భాటాలూ, ప్రవచనాలూ లేకుండా. కవిత ముగింపు ఎంత సునిశితంగా చేసిందో గమనించగలరు.) . చాలా కాలం గడిచేక ఈడిపస్, వయసు ఉడిగి, గుడ్డివాడై రోడ్డుమీద నడుస్తున్నాడు. అతనికి బాగా పరిచయమున్న వాసన ముక్కుపుటాలను తాకింది. అది సింహిక (sphinx)ది. ఈడిపస్ అన్నాడు:”నిన్నొక ప్రశ్న అడగాలని ఉంది. నేను నా తల్లిని ఎందుకు గుర్తించలేకపోయాను?” “నువ్వు తప్పు సమాధానం చెప్పేవు,”…
-
కిటికీ ప్రక్క బాలుడు… రిచర్డ్ విల్బర్, అమెరికను కవి
మంచుమనిషి (స్నోమాన్*) అలా ఒక్కడూ చీకటిపడ్డాక చలిలో నిలబడటం చూసి తట్టుకోవడం అతనివశం కాలేదు. ఈదురుగాలి ఇక రాత్రల్లా పళ్ళుకొట్టుకునేలా గడగడ వణికించడానికి సిద్ధం అవడం చూసి ఆ చిన్ని కుర్రాడికి ఏడుపొచ్చింది. బహిష్కృతుడైన ఏడం స్వర్గం వీడుతూ చూసిన చూపువంటి దైవోపహతుడైన చూపు చూస్తున్న పాలిన ముఖం, తారు కళ్ళుకలిగిన ఆ బొమ్మని కన్నీరు నిండిన కళ్ళలోంచి అతని చూపులు చేరకున్నాయి. అంత పరిస్థితిలోనూ, మంచుమనిషి సంతృప్తిగానే ఉన్నాడు, అతనికి ఇంటిలోనికి పోయి చనిపోవాలని లేదు.…
-
కన్నులు… చెస్లా మీవోష్, పోలిష్ కవి
ఘనమైన నా కనులారా, మీరు అంత కుశలంగా ఉన్నట్టు లేదు, మీదగ్గరనుండి నాకు వస్తున్న ఆకారాలు అంత నిశితంగా ఉండడంలేదు, రంగుబొమ్మలయితే, మరీను , మసకగా అలికినట్లుంటున్నాయి. ఒకప్పుడు మీరు రాజుగారు వేటకి తీసుకెళ్ళే వేటకుక్కల్లా ఉండేవారు, మీతో నేను ప్రతిరోజూ ఉదయాన్నే షికారుకి వేళ్ళేవాడిని. అద్భుతమైన చురుకుదనం కల నా కనులారా! మీరు చాలా విషయాలు చూసేరు, నగరాలూ, ప్రదేశాలూ, దీవులూ, మహాసముద్రాలు. అప్పుడే కరుగుతున్న మంచు జాడల్లో స్వచ్చమైన చిరుగాలి మనని పరుగులుతీయిస్తుంటే జతగా మనం…