అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 10, 2016

    దాడి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    ఒక ఏడాదిపాటు నిశ్శబ్దంలో మునిగిపోవడంతో కప్పలు ఎలా అరుస్తాయో మరిచిపోయాను ఎవ్వరూ అంతగా నడవని ఈ దారిలో నేను ఈ సాయంవేళ నడవడానికి సాహసించి ఉండకూడదు. అందం నాకోసం దారికాసింది. లేకుంటే, నాకూ కప్పల బెకబెకలకీ మధ్య ఎవరు నడుస్తారు? ఓ నిసర్గ సౌందర్యమా! నన్ను పోనీ, నేనొక పిరికి మహిళను, ఒక ఇంటి నుండి వేరొక ఇంటికి పోతున్న దానను! . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (February 22, 1892 – October 19,…

  • సెప్టెంబర్ 9, 2016

    గాడిదలతో స్వర్గానికి … ఫ్రాన్సిస్ జేమ్స్, ఫ్రెంచి కవి

    ప్రభూ! నేను నీ కడకు రావలిసిన రోజు, అది దుమ్మూ ధూళీలేని త్రోవ కావాలని ప్రార్థిస్తున్నాను. భూమి మీద నా ప్రయాణాలలో నేను ఎన్నుకున్నట్టే, పట్ట పగలు చుక్కలు స్వచ్చంగా ప్రకాశించే స్వర్గానికి ఏ త్రోవలో వెళ్ళాలో నన్ను ఎంచుకుందికి అనుమతించు. నేను నా చేతికర్రపట్టుకుని నచ్చినత్రోవలో వెళ్తాను వెళుతూ, నా మిత్రులైన గాడిదలకు ఇలా చెప్తాను: “మిత్రులారా, నేనూ, ఫ్రాన్సిస్ జేమ్స్ ని. నేను స్వర్గానికి బయలుదేరాను. (ఎందుకంటే, దేవునిప్రేమతో నిండిన నేలమీద నరకమెక్కడిది?) అంతే…

  • సెప్టెంబర్ 8, 2016

    N N స్మృతిలో … చెస్లావ్ మీవోష్, పోలిష్ కవి

    అది నీకు దూరమైతే చెప్పు. * బాల్టిక్ చిరు కెరటాలని దాటుకుని వచ్చి డెన్మార్క్ క్షేత్రాల్ని గడచి, బీచ్ తోటలనుదాటి, సముద్రంవైపుకి తిరిగితే, అక్కడ త్వరలోనేమంచుతో తెల్లబడబోయే లాబ్రడార్ కనిపిస్తుంది. నగరాలకీ, అక్కడ రాజమార్గాలమీద తళుకుమనే వెలుగులకీ భయపడి ఏకాంతద్వీపాలగురించి కలగనే నీకు, కరిగి నీలివర్ణంలోకి మారే సెలయేటి నీటితో, జింకలూ కారిబూల కాలిజాడలతోనిండిన సుదీర్ఘమైన మరుభూమిగుండా తిన్నని త్రోవ, ఎంతదూరం అంటే, సియెర్రా వరకూ, విడిచిపెట్టినబంగారుగనులవరకూ కనిపిస్తుంది. పక్కన సాక్రమెంటో నది దట్టంగా, విచ్చలవిడిగా పెరిగిన…

  • సెప్టెంబర్ 7, 2016

    యాష్ ట్రేలో… వాస్కో పోపా, సెర్బియన్ కవి

    ఒక చిన్ని సూర్యుడు పసుపుపచ్చ పుగాకు జులపాలతో మండుతున్నాడు యాష్ ట్రేలో. చవుకబారు లిప్ స్టిక్ నెత్తురు ఆరిపోయిన సిగరెట్టు కొనలను పీలుస్తోంది. శిరఛ్ఛేదం జరిగిన అగ్గిపుల్లలు సల్ఫరు కిరీటాలకై తహతహలాడుతున్నాయి. కొడిగట్టిన ధూమ్రవర్ణపు నుసిలో ఇరుక్కున్న నీలిపొగల గుర్రాలు హేషతో పైకి లేస్తున్నాయి. ఒక పెద్ద చేయి అరచేతిలో నిప్పులుమిసే కంటితో దిగంతాలలో పొంచి చూస్తోంది. . (అనువాదం: Anne Pennington) వాస్కో పోపా June 29, 1922 – Jan 5, 1991 సైబీరియన్…

  • సెప్టెంబర్ 6, 2016

    ఒక కన్నియ రోదన … వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

    ఒకప్పుడతన్ని ప్రేమించలేదు; ఇప్పుడతను లేడు నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. అతను మాటాడుతుంటే మందలించాను; అతను మాటాడగలిగితే ఎంత బాగుండును. అయ్యో!ఇపుడు నేను మందలించను కదా! ఒకప్పుడు అతన్ని ప్రేమించకపోవడానికి కారణాలు వెతికేను అలసిపోయేదాకా నా ఆలోచనలన్నీ గిలకొడుతూ అతన్నీ విసిగించేను,నేనూ వేసారేను; నిన్నటి వరకు నా కోసం జీవించిన అతనే గనుక బ్రతికి రాగలిగితే ఇపుడు నా ప్రేమని అతనికి ఇవ్వడానికి సుముఖమే; ఎప్పుడైతే అతను వృధాశ్రమ అనుకున్నాడో, అతని ముఖాన్ని పవిత్రప్రదేశంలో మృత్యుచాయలో చాటుచేసుకున్నాడు. తన…

  • సెప్టెంబర్ 5, 2016

    నీ రోజులు ముగిసిపోయాయి… లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి

    నీ రోజులు ముగిసిపోయాయి… నీ కీర్తి మొదలయింది ఇకనుండి ఈ దేశపు గీతాలు  తమ అభిమాన పుత్రుడి విజయాలనీ అతని కరవాల విహారాన్నీ కీర్తిస్తాయి అతని వీర గాధలూ, జయించిన సామ్రాజ్యాలూ అతను పునరుద్ధరించిన స్వాతంత్య్రాన్నీ. నువ్వు రాలిపోయినా, మేము స్వేఛ్ఛగా జీవించినంతకాలమూ నీకు మరణం లేదు! నీ శరీరంలోంచి పారిన నెత్తుటేరులు నేలలోకి ఇంకడానికి విముఖతచూపించాయి. అవి మా రక్తనాళాల్లో ప్రవహిస్తున్నాయి, నీ సాహసం మాకు ఊపిరిగా నిలబడుతుంది!  నీ పేరు, ముందుకి ఉరుకుతున్న మా…

  • సెప్టెంబర్ 4, 2016

    ఆశ్చర్యమా?… ఇబ్న్ అరాబీ, అరబిక్ కవి, సూఫీ

    మంటల మధ్యలో ఈ పూలతోట ఏమిటని ఆశ్చర్యంగా ఉందా?! నా మనసు ఏ ఆకృతినైనా దాల్చగలదు: జింకలకి పచ్చికబీడులా సన్యాసులకి మఠంలా విగ్రహాలకి పవిత్రస్థలంగా తీర్థయాత్రికుడికి ‘కాబా’గా, ‘తోరా’ లకు వ్యాసపీఠాల్లా ఖురాను కి ‘కవిలె ‘ ల్లా నా నమ్మిక ప్రేమ; ఆ పథికులు ఏ మార్గం అనుసరిస్తే అదే నా విశ్వాసం అదే నా మతం. . ఇబ్న్ అరాబీ (25 July 1165 – 8 November 1240) అరబ్బీ కవి, సూఫీ…

  • సెప్టెంబర్ 3, 2016

    అంకితం… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి

    ఇదే నీకు నా మొదటిదీ కడసారిదీ బహుమతి ఈ చిన్ని కవితాగుచ్చాన్ని అంకితం ఇస్తున్నాను. నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి ఈ కవితలే వాటిని ఉన్నవున్నట్టుగా నీకు సమర్పిస్తున్నాను. నేను మత్తులో లేకుండా నిజం చెబుతున్నాను, నీ దృష్టికి వీటిని ఎప్పుడో తీసుకురావలసింది తీసుకువచ్చి, నా మనసుతో నింపిన ఈ కీర్తనలని నువ్వు మెచ్చుకుంటే ఎంతో బాగుండేది ఈ దయలేని ప్రపంచం అంతా, ముక్త కంఠంతో నాకూ, నా కవితలకూ, ఎంతకీ ఆగని కరతాళధ్వనులతో…

  • సెప్టెంబర్ 2, 2016

    నేను అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను… అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి

    నేను వివేకంగా, అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను: ఆకాశం వంక చూడడం, దేవుణ్ణి ప్రార్థించడం, అతివేలమయిన నా కష్టాలు మరిచిపోడానికి చీకటిపడకముందే ఎక్కువదూరం అలా నడవడం. కొండవాలులో అంట్రింత చెట్లు గలగలలాడుతున్నపుడూ, సంజెరంగులోని బెర్రీపళ్ళు గుత్తులుగా వాలినపుడూ నేను ఆనందంగా కవితలు అల్లుకుంటాను… నశ్వరమైన జీవితంగురించీ, సౌందర్యం, మృత్యువుగురించీ. నేను ఇంటికి తిరిగి వస్తాను. మెత్తని బొచ్చుగల పెంపుడుపిల్లి నా అరచేతిని నాకుతుంది. ముద్దుగా కులుకుతుంది. చెరువుగట్టుననున్న రంపపు మిల్లు పొగగొట్టం కొస క్రింద పొయ్యిలో చెలరేగుతున్న మంటలకి…

  • సెప్టెంబర్ 1, 2016

    వాయిదా పడిన కల… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి

    వాయిదా పడిన కల ఏమవుతుంది? ఎండబెట్టిన ద్రాక్షలా ఎండిపోయి ఒరుగు అయిపోతుందా? పుండులా సలిపి సలిపి తర్వాత రసి కారుతుందా? కుళ్ళిపోయిన మాంసంలా కంపుకొడుతుందా? ముదురుపాకంతో చేసిన మిఠాయికి పైన పంచదారలా పేరుకుంటుందా? బహుశా భారీ బరువుకి అది క్రిందకి సాగిపోతుందేమో! లేక, కొంపతీసి విస్ఫోటిస్తుందా?! . లాంగ్స్టన్ హ్యూజ్ (February 1, 1902 – May 22, 1967) అమెరికను కవి Dream Deferred . What happens to a dream deferred? Does…

←మునుపటి పుట
1 … 80 81 82 83 84 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు