-
కేన్సరు వార్డు సందర్శన … గాట్ ఫ్రైడ్ బెన్, జర్మను కవి
హెచ్చరిక / మనవి: ఇది భీభత్సరసప్రధానమైన కవిత. దయచేసి గుండెధైర్యం లేనివారు ఈ కవిత చదవవొద్దని మనవి. *** పురుషుడు: ఈ వరుసలో గర్భాశయాలు క్షిణించిపోయిన వారు ఈ వరుసలో రొమ్ములు క్షీణించిపోయిన వారు. ఒకదాని పక్క ఒకటి దుర్గంధపూరితమైన పడకలు. గంటగంటకీ నర్సులు మారుతూనే ఉంటారు. రా! పైనున్న ఈ చిన్న దుప్పటీ నెమ్మదిగా పైకెత్తు. చూడు. కండపట్టిన ఈ మలిన మాంసపు ముద్దే ఒకప్పుడు పురుషుడికి అపురూపమయినదై ఆనందదాయకమై గృహస్థుని చేసింది. రా! రొమ్ము మీద…
-
గూఢప్రశ్నలు… సామ్యూల్ గ్రీన్ బెర్గ్, ఆస్ట్రియన్- అమెరికను కవి
నా తోడివారిలో నేను చెడ్డవాడిగా పేరుబడ్డాను. అయినాసరే, ఎవరూ దాసులు కాగోరని, ఆలోచనలు ఏకాగ్రతను జ్ఞానోదయం కంటే కలలలో విశృంఖలతవైపు నడిపించే ఆనందాలని నా అక్కున చేర్చుకుందికి చొరవచూపించాను. అభిమతాల తేరు నా ఆలోచనలకు ఆగింది, అగణితమైన తన సమ్మోహనకళలనీ ప్రదర్శిస్తూ ‘కళ ‘ తలవంచింది; శాస్త్రవిజ్ఞానం విస్తృతమైన దాని అనురూపత కొనియాడింది అంతరాత్మ పరిణతినీ, నడవడినీ సందేహిస్తూ; సూర్యుని వెలుగు కిరణం నా ఆలోచనలు గోళాల చుట్టూ తిరిగేలా ప్రోత్సహించింది. చంద్రసదృశమైన దివ్యాకృతులక్రింద నా కనులు…
-
తాతయ్య మరణం … అలెక్సాండర్ అలెక్సాండెరోవిచ్ బ్లోక్, రష్యను కవి
ఈ కవిత చివరి పాదంలో “నూతన గృహప్రవేశం” అని ఒక గొప్ప ప్రయోగం ఉంది. ఆ భావాన్ని అంత అందంగా తీసుకువచ్చిన అనువాదకుణ్ణి అభినందించకుండా ఉండలేను. *** సాధారణంగా నిద్రకోసమో, మరణం కోసమో నిరీక్షిస్తుంటాం ఆ సందర్భాలు ఎంతకీ ముగియక గొప్ప విసుగు తెప్పిస్తాయి. ఒక్క సారి కిటికీలోంచి అలసటతీరుస్తూ గాలి రివట ఒకటి వీచి, పవిత్రమైన బైబిలు పేజీలను తిరగేస్తుంది. తెల్లని జుత్తుతో ఒక ముసలాయన అక్కడికి వెళ్తాడు ఒంటరిగా, మెరిసే కళ్ళతో…
-
చిన్నప్పుడు గతించిన మిత్రుల స్మృతిలో … డొనాల్డ్ జస్టిస్, అమెరికను కవి
వాళ్ళని స్వర్గంలో వయోజనులుగా ఎన్నడూ కలుసుకోము, నరకంలోని బట్టతలల మధ్య, ఎండలోమాడుతూ చూడబోము; కలవడమంటూ తటస్థిస్తే, సంజచీకట్లలో స్కూలు ఆవరణలోనే గుండ్రంగా నిలబడి, బహుశా, ఒకరి చేతులొకరు పట్టుకుని, ఇపుడా పేర్లే గుర్తులేని ఏవో ఆటలు ఆడుకుంటూ… ఓ,జ్ఞాపకమా! రా! వాళ్ళని ఆ నీడల్లో వెదుకుదాం . . డొనాల్డ్ జస్టిస్ (12 ఆగష్టు 1925 – 6 ఆగష్టు 2004) అమెరికను కవి . On The Death Of Friends In Childhood We…
-
మా కతని పేరు ఎలా తెలిసిందంటే… ఏలన్ డూగన్, అమెరికను కవి
నది కొట్టుకొస్తోంది చచ్చిన గుర్రాలనీ, శవాలనీ, శిధిలమైన యుద్ధ సామగ్రినీ, ప్రవాహానికి ఎగువన యుద్ధమో, అధికార యంత్రాంగపు చర్యలో జరుగుతోందనడానికి సూచిస్తూ. అవన్నీ కొట్టుకుపోయాయి, ఆ మాటకొస్తే అన్నీ కొట్టుకుపోతాయి, ఏదీ మిగలదు అదే నదిలోని ప్రత్యేకత. తర్వాత ఒక దుంగమీద ఒక సైనికుడు కొట్టుకుంటూ వచ్చేడు. అతన్ని చూస్తే బాగా తాగినట్టున్నాడు. అతన్ని అడిగేము: అతనూ, ఆ చెత్తా అలా ఎగువనుండి కొట్టుకురావడానికి కారణం ఏమిటని. “మిత్రులారా,” అంటూ ప్రారంభించేడు, “గ్రానికస్ మహా సంగ్రామం ఇప్పుడే…
-
ఆసుపత్రినుండి ఉత్తరాలు… మైకేల్ రైయన్, అమెరికను కవి
వార్డులో మంచాలు, చీకటిలో దయ్యపు పడవల్లా తేలుతున్నాయి. నా తలదిక్కున ఉన్న చిరు దీపం లైట్ హౌస్ అయినట్టూ, అందులో ఒకపొట్టి మనిషి నావికుడి టోపీ పెట్టుకుని సముద్రం మీద చిన్ననాటిసాహసగాథలు చెబుతున్నట్టూ ఊహిస్తున్నాను. ఆ పొట్టిమనిషి ఎవరో కాదు, నేనే. బహుశా నా దగ్గర “ఓల్డ్ సాల్ట్” అన్న కుక్క నా అరచేతిని నాకుతూ, వర్తులాకారపు మెట్లమీద నిరంతరం పరిగెత్తేదొకటి ఉండుంటుంది. బహుశా అది ‘పాపం ‘ అంత గట్టిగా కాటువేస్తుందేమో. ఓడలు నీటిలోని రాతిగట్టులు ఢీకున్నట్టూ,…
-
శ్రీమతి వాల్టర్స్… ఫ్రాంక్ ఓమ్స్ బీ, నార్దర్న్ ఐర్లండ్ కవి
ఉత్తరాలిప్పటికీ వస్తుంటాయి “శ్రీమతి వాల్టర్స్ కి” అంటూ బహుశా, కొన్నాళ్ళ క్రిందట ఆవిడ ఈ ఇంట్లో మా లాగే, నివసించి ఉంటుంది. అన్నీ చిన్న విషయాలే… చుట్టజుట్టిన కాలెండరు, ఆమె ఇక్కడ ఉండి ఉంటే నేను తుప్పు పట్టిన మేకు తీసేసినచోట వేలాడుతూ ఉండేది, కేటలాగులూ, ఆమె చెల్లించని చివరి గేస్ బిల్లూ… అన్నిసార్లూ “శ్రీమతి G వాల్టర్స్” అనే సంబోధన. నా మట్టుకు ఈ ఇంటి ఆత్మలో స్త్రీత్వం కనిపిస్తుంది నిరంతరం దాని గుసగుసలువింటుంటే నాకు…
-
తోబా 1… షున్ తారో తనికావా, జపనీస్ కవి
నాకు రాయడానికి విషయం ఏమీ లేదు ఎండలో నా శరీరాన్ని ఆరబెట్టుకుంటున్నాను నా భార్య అందంగా ఉంటుంది నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు నేను మీకో నిజం చెప్పాలి నేను కవిని కాదు నేను అలా నటిస్తున్నాను, అంతే! సృష్టించి, ఇక్కడ వదిలివేయబడ్డాను నేను. చూడండి, సూర్యుడు కొండల్లోంచి ఎలా జారుకుంటున్నాడో సముద్రాన్ని చిక్కటి చీకటి సముద్రం చేస్తూ. అద్భుతమైన ఈ సమయంలోని ప్రశాంతత గురించి తప్ప మీకు నేను ఏదీ చెప్పదలుచుకో లేదు. మీ దేశంలో…
-
జింగ్-టింగ్ పర్వతశిఖరం… లి బాయ్, చీనీ కవి
పక్షులు గుంపులుగుంపులుగా ఆకాశపుదారులంట ఎగిరిపోయాయి ఒక ఒంటరి మబ్బుతునక, అటూఇటూ తచ్చాడి, అదీ తప్పుకుంది. నేను ఒక్కడినీ కూర్చున్నాను, ఎదురుగా జింగ్-టింగ్ పర్వతశిఖరం ఈ పర్వతానికీ నాకూ, ఒకర్నొకరు ఎంతచూసుకున్నా విసుగెత్తదు. . లి బాయ్ ( లి బో నికూడా పిలుస్తారు) (701- 762) చీనీ కవి . The Ching-Ting Mountain . Flocks of birds have flown high and away; A solitary drift of cloud, too, has gone,…
-
నా శ్రీమతికి… కాన్రాడ్ ఐకెన్,అమెరికను
ఈ సంగీతంలోగల ఆపాత మధురిమా అందమైన వస్తువులపట్ల కలిగే ఆపేక్షా, చీకటిలో చుక్కలనిచూడాలన్న తహతహ నీరసించిన రెక్కలల్లాడించాలన్న ఆరాటమూ వెలుగులకెగబ్రాకాలని గులాబి పడే తపనా నల్లని మట్టిబెడ్డ హృదయపూర్వకమైన చిరునవ్వూ వెన్నెలపట్ల సముద్రానికుండే అలవిమాలిన ప్రేమా మంచిదనంనుండి దేవునివరకూ అన్నిటిపైగల మక్కువా సుందరమైన అన్ని వస్తువులూ, ప్రేమికుని చూపుల్లా కనులలో ఆర్ద్రతతో అందాన్ని తిలకించగలిగే సర్వమూ… నీకే అంకితం; ఓ వెలుగురేకా!అవి నువ్వు అందించినవే; ఈ తారలన్నీ నీకే; ఈ ఆకాశం నువ్వు ప్రసాదించినదే! . కాన్రాడ్…