-
ఇసుకరేణువులు- I (జూన్ రాత్రి)….. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఓ ధరణీ! నువ్వీ రాత్రి ఎంత అందంగా ఉన్నావు! నలు చెరగులా వాన వాసన వ్యాపిస్తూ దూరంగా గంభీరమైన స్వరంతో కడలి నేలతో మాటాడుతుంటే, నాకు నిద్ర ఎలా వస్తుంది? ఓ పుడమితల్లీ, నాకున్నదంతా నువ్విచ్చిందే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ఇష్టం. ప్రతిగా నీకివ్వడానికి నాదగ్గర ఏముంది? నేను మరణించిన తర్వాత నా శరీరం తప్ప? . సారా టీజ్డేల్ (1884–1933) అమెరికను కవయిత్రి . Sea Sand-1 . June Night O Earth…
-
పోలికలు… వినిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి
నా ముఖంలో ఎంతవెదికినా నీకున్న దేవరాజ్ఞి ముఖం పోలికలు లేవు నా శరీరంలో ఎక్కడా నీకున్న లావణ్యం మచ్చుకి కనరాదు. ఏ దేవమాయో నను తారుమారుచేసుండొచ్చు బహుశా నేను కొడుకునయినా అయి ఉండొచ్చు కానీ, నేను నీకూతురులా పెరిగి నలుగురిలో ఒకతెగా కనిపించడానికి. నీ రొమ్ములు రెండూ విడివడేచోట ఒక నల్లని సన్నగీత ఉంది, నా గుండె కొట్టుకునేచోట సరిగ్గా నాకు అలాంటి మచ్చే ఉంది. ఒక చిన్న ముద్ర, రాజముద్ర దానిద్వారా అందరికీ తెలుస్తుంది నువ్వు…
-
నెత్తిమీద… స్కడర్ మిడిల్ టన్, అమెరికను
నిన్నూ నన్నూ చిన్నపెట్టెలలో భూమిలో పడుకోబెట్టినచోట గడ్డి ఒత్తుగా మొలిచినపుడు చిరునవ్వులతో మనమీంచి నడుచుకుంటూ వేళ్ళే నాగరీకులు మనగురించి రేపు ఏమనుకుంటారు? ఆమె ముచ్చటైనది, నెమ్మదస్తురాలు, ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, ఆనందంగా ఉంచేది. ఆమె ఇప్పుడు ఎంత హాయిగా ఉందో జీవితంపట్లకూడా అంత ఆశావహంగా ఉండేది. మనకి తెలిసి అంత తెలివైన వాడు మనలో లేడు అతను పోయేదాకా అందర్నీ నవ్విస్తుండేవాడు అతను మాటలాడడం ప్రారంభించాలి, అంతే, పక్కనతనున్నంతసేపూ, పొట్టచెక్కలయ్యేది. అప్పుడు మనిద్దరం పెట్టె మూతవేసుకుని మృతులభాషలో…
-
ఓ మిత్రమా! … ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను
ఓ నా మిత్రమా! నీ గురించి చెప్పడానికి నాదగ్గిర తగిన మాటలేవీ? ఓ నా చెలికాడా! చెప్పలేనన్ని సంభాషణలు పంచుకున్నవాడా! నా ప్రేరణా! నా మార్గదర్శీ! నా ఉత్తమవ్యక్తిత్వాన్ని బయటకి తెచ్చినవాడా! ఈ దేశా పశ్చిమభాగానికి నువ్వొక వెలుగువి. నువ్వే ఒక సంపదల ఖనివి. అఖండ యశస్సువి ఒక చెప్పలేని ఆకర్షణవి ఈ సంయుక్త రాష్ట్రాల పంటవీ, సంపదవీ నువ్వు! బిల్! నువ్వు లేవని తెలుసు. నేను ఈ ఊర్లోకి పొద్దున్నే వచ్చేను. జిగేలుమంటున్న ఈ జులై…
-
ఇష్టమైన పువ్వు… ఇరా టైటస్
మే నెలలో ఆకాశం నిర్మలంగా ఉన్న ఒక రోజు చంద్రుడు ధవళ సుగంధపుష్పంలా ఉన్నాడు: తీసి నా కోటుకి తగిలిద్దును కదా ప్రేమరసప్రవాహంలా ఉన్నాడు. నేనిప్పుడు నగరవీధుల్లో సంచారం చేస్తున్నప్పుడు తగిలించుకుంటాను నేను తమ పక్కనుండి పోతుంటే పౌరులంటుంటారు : “అతనికి చాలా మంచి మనసుంది” అని. వాళ్ళు నా కిష్టమైన పుష్పాన్ని చూడరు. వాళ్ళకి తెలియదు నా జీవనసౌరభం ఎక్కడనుండి వచ్చిందో. . ఇరా టైటస్ . My Flower . One night in…
-
మహరాజా మాక్స్మిలన్… కోర్సన్ మిల్లర్, అమెరికను
ఆటపట్టించడానికి అతన్ని ఎప్పుడూ మహారాజా మాక్స్మిలన్ అని పిలిచే వాళ్లం; అతను రోజూ మాకు ఎదురయ్యేవాడు, పాపం, అన్నడూ మాటాడేవాడు కాదు. తొడుక్కున్నచెప్పులు అరిగి చిరిగిపోయేయి, కాళ్లకి సరిపడేవి కావు; చింకి కోటు, మాసి మరకలుపడ్డ చొక్కాతో రోడ్డుమీద జోరుగా పొయ్యేవాడు. పొద్దుపుచ్చడమెలాగో తెలీక, ఒకరోజు మాక్స్ ని మేం ఎంతో వినయపడుతూ ఆపినపుడు, భయంభయంగా, అనుమానంతో మావంక చూడసాగేడు “దక్షిణసముద్ర కన్నియలు నృత్యంచేసే, ఎవరూ ఎరుగని ద్వీపానికి తమరు మహరాజని విన్నాం, నిజమేనా?” అని అతన్ని…
-
నావికులు… డేవిడ్ మోర్టన్, అమెరికను కవి
Merry Christmas To All My Christian Friends ఓడలను ప్రేమించిన మనుషులు సముద్రం మీదకి వెళ్తారు పొడవైన ఓడ స్థంబాల్నీ, నురుగుతో ఒరుసుకునే ఓడ తట్టుని ప్రేమిస్తారు. వాళ్ళ మనస్సుల్లో, ఎక్కడో, ఇంటికన్నా ప్రియమైన ప్రదేశం మరొకటి ఉందని తెలుసుకుంటారు. పై కప్పుమీద నడుస్తారు, తెరచాపని చుక్కల్లోకెగరేస్తారు, రాత్రి కాపలా కాస్తూ శుభ్రంగా ఉన్న బల్లలు లెక్కెడుతుంటారు … ఇవీ, జారుగా ఉండే వాడస్తంబం మీద మెరిసే సూర్యకిరణాలూ వాళ్ళని నిత్యం వెంటాడుతుంటాయి… మెలకువలోనూ, నిద్రలోనూ…
-
కాలవందనం… హామిల్టన్ ఫిష్ ఆర్మ్ స్ట్రాంగ్, అమెరికను
మనం దేనికి పోరాడేమో అది పోరాటానికి అనర్హమని అనిపించినపుడు మన గెలుపు చివరకి ఓటమిగా పరిణమించినపుడు స్వప్నం ఎప్పుడూ వినాశనానికి అతీతంగా మిగిలి ఉంటుందనీ ప్రతి పోరాటమూ ఒక ముసుగు తొలగిస్తుందనీ తెలుసుకో అలసిన గుర్రమూ, నిరాశకు గురైన రాజకీయవేత్తా మన గమ్యాలు మసకబార్చవచ్చు, గాని అందుకోకుండా ఆపలేరు. కాలం ఠీవిగా అడుగులేసుకుంటూ తన పనిమీద తాను పోతుంది ఆత్మలో క్రమేపీ వచ్చే పరివర్తనలు దానికి ఎరుకే. . హామిల్టన్ ఫిష్ ఆర్మ్ స్ట్రాంగ్ April 7,…
-
నిను మరిచిపోలేను… హెర్బర్ట్ గోర్మన్, అమెరికను
నిను మరిచిపోలేను; రాత్రనక పగలనక కలల్లోకి వస్తూ “నేను! నేను!” అంటుంటావు. నేను లేచి వచ్చి తలుపు గడియ వేస్తాను. నువ్వెంత తలుపు తట్టినా వినిపించుకోను. నువ్వు వెళిపోయిన తర్వాత రేయింబవళ్ళు విశ్రాంతి తీసుకుంటాను. “నేనూ! నేనూ!” అని అరవని నిశ్శబ్దంలో ఒక శూన్య ప్రశాంతతలో నిర్వాణాన్ని పొందుతాను. . హెర్బర్ట్ గోర్మన్ 1893- 1954 అమెరికను . I Cannot Put You Away . I cannot put you away; By night…
-
నేను పాడుతూ వస్తాను… జాకబ్ ఓస్లాండర్
వర్షంలో తడిసిన పచ్చగడ్డి కోసినపుడు వెలువడే సుగంధం గురించీ వెన్నులోని గింజలమీదనుండి జాలువారే చల్లని నీటిబిందుల పులకరింతలు గూర్చీ మైదానంలో నలుచెరగులా విస్తరించే వర్షస్నాతయైన వెలుతురు గురించీ పాడుతూ వస్తుంటాను విరబూచిన శరత్కాలపు వెన్నెలలగురించీ లోయల పిలుపులకు గుంపులు గుంపులుగా ప్రతిధ్వనిస్తూ ఎగసే పిచ్చుకలగురించీ పిచుకలపై వాలుతున్న తడిబారిన పడమటిగాలి గురించీ ఆలపిస్తూ వస్తాను. నిర్దాక్షిణ్యంగా కొరుక్కుతినే తెల్లని డిశంబరు నెల గురించీ బుసి ఆరిన చలిమంటలపై వీచిన గాలి రివటకి ఊగుతున్న ఉక్కువంటి చిక్కని చీకటిగురించీ, సూర్యాస్తమయాలగురించీ,…