అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 10, 2017

    పూదోట… రోజ్ పార్క్ వుడ్ అమెరికను

    నీ పిల్లలిద్దరు ఒక వేసవి పొద్దు వాళ్ళ తోటలో పనిచేశారు ప్రభూ! వాళ్ళు నిన్నటి కలుపుమొక్కలను తీశారు, వాళ్ళకి నీ అందమైన చిరునవ్వు ప్రసాదించేవు. నీ బిడ్డలిద్దరు ఎండలో వాళ్ళతోటలో పనిచేశారు ప్రభూ! వాళ్ళు నాగలి తో తిన్నని చాళ్ళు వేశారు, నువ్వొక రాగరంజితమైన నవ్వుని ప్రసాదించేవు నీ పిల్లలిద్దరు విసురుగాలి రోజున తమతోటలో పనిచేశారు ప్రభూ! వాళ్ళు రేగడిమట్టిలోని పెల్లల్ని పగలగొట్టేరు, తేజోభరితమైన నీ నేత్రాలు మూసుకున్నావు. నీ బిడ్డలిద్దరు మేఘావృతమైన రోజు తమతోటలో పనిచేశారు ప్రభూ!…

  • జనవరి 9, 2017

    మంచు తుఫాను… విలియం కార్లోస్ విలియమ్స్, అమెరికను

    విలియం కార్లోస్ విలియమ్స్ ప్రతీకాత్మక కవిత్వానికి ప్రసిద్ధివహించినవాడు. కనుక ఇక్కడ మంచుతుఫాను ఒక ప్రతీక మాత్రమే. “ఏళ్ళతరబడి నిగ్రహించిన” అన్నమాటను బట్టి, అది ధర్మాగ్రహం కావొచ్చు. ధర్మాగ్రహం అణచుకున్నంతసేపూ ఫర్వాలేదు గాని, ఒక సారి ప్రదర్శితమైతే, దాని పర్యవసానం  వినాశం కావొచ్చు. అప్పుడు మిగిలిన శిధిలాల్లోంచి మనిషి ఒంటరి ప్రయాణం చెయ్యవలసిందే.   “వెలుగునీడల హేల”  ఆశనిరాశల మానసిక స్థితి. * మంచు: ఏళ్ళతరబడి నిగ్రహించుకున్న ఆగ్రహం గంటలతరబడి తీరుబాటుగా కురుస్తుంది ఈ మంచుతుఫాను దాని ప్రభావం…

  • జనవరి 8, 2017

    శాపం… ఎలిజబెత్ జె. కోట్స్ వర్త్, అమెరికను

    ఈ కవిత సుమారు 100 సంవత్సరాల క్రింద ప్రచురించబడిందంటే, అందులోనూ ఒక ఇంగ్లీషు పత్రికలో, ఆశ్చర్యంవేస్తుంది. దేశాకాలావధులు లేకుండా నవవధువుల జీవితాలు ఎలా ఆదిలోనే తృంచబడుతున్నాయో చెప్పేహృదయ విదారకమైన కవిత. ఇది డిశంబరు 1919లో Poetry అన్న పత్రికలో అచ్చయింది. * తాడుకి వేలాడుతోంది మా చెల్లెలు ఉరేసుకుని చక్కని ఆమె పాదాలు లిల్లీపువ్వుల్లా ఉంటాయి.  మా ఇంటి సుగంధపుష్పాన్ని వాళ్ళు నలిపేసేరు  వాళ్ళని ఆమె తగినట్టుగా శపిస్తుంది లెండి.  ఆమె చేతిలో ఉన్న చీపురును తీసుకొండి, ఆమె నిలబడగలిగేలా…

  • జనవరి 7, 2017

    గడ్డకట్టే చలికాలంలో… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    ప్రియతమా! మనిద్దరం రెండు పువ్వులాంటి వాళ్ళం వాడిపోతున్న తోటలో చివరగా పూచిన వాళ్ళం, ఊదారంగు పొద్దుతిరుగుడుపువ్వొకటీ, ఎర్రదొకటీ ఒంటరిగా నిస్సహాయంగా పాడుబడిన ప్రకృతిలో. తోటలోని చెట్లన్నీ వయసుడిగి, ఆకులురాలుస్తున్నాయి. ఒక బిరుసైన ఆకు మరో ఆకుతో రాసుకుంటోంది. నినదిస్తున్న రాలుతున్న పూరేకుల సవ్వడి ఇక నువ్వూ నేనే తలూచుకుంటూ మిగిలాం. ఒకప్పుడు మనతో చాలామంది ఉండేవారు; అందరూ వాడిపోయేరు. మనిద్దరమే ఎర్రగానూ, బచ్చలిపండు రంగులోనూ మిగిలున్నాం. మనిద్దరమే మంచుకురవని సుప్రభాతాలలో సూర్యుడు పైకెదుగుతుంటే, రంగుతో కళకళలాడుతున్నాం. పాలిపోయిన…

  • జనవరి 6, 2017

    వ్యవసాయదారులు… విలియం అలెగ్జాండర్ పెర్సీ, అమెరికను

    నేను రైతుల్ని వాళ్ళపొలాల్లో గమనిస్తూ నాలో నేను ఆశ్చర్యపోతుంటాను. వాళ్ళు ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా ఉంటారు వాళ్ళలో ఎంతో హుందాతనం ఉంటుంది. అంత చిన్నవిషయాలూ ఎంతోబాగా తెలుసు వాళ్ళకి వాళ్ళు పెద్దగా చదువుకోనప్పటికీ. కొందరికి ఏమీ దొరకని చోట వాళ్ళు నిలకడగా పంటపండించగలరు. దేవునితో వాళ్ళు పడే తగవులన్నీ త్వరలోనే సర్దుబాటు చేసుకుంటారు. వాళ్ళతనికి క్షమాభిక్షపెడతారు వెండివెలుగుల వానజల్లు ఆలస్యంగా కురిసినా. పంటదిగుబడి తగ్గినపుడు వాళ్ళ వినోదాలు నిండుకుని, బాధలు ముంచెత్తుతాయి అందరికీ తెలిసిందే, వాళ్ళు దేమునిమీద…

  • జనవరి 5, 2017

    ఏప్రిల్… లూయీ జిన్స్ బర్గ్, అమెరికను కవి

    నా శరీరందీర్ఘనిద్రలో మునిగినా నాకు ఇప్పటికీ ఇంకా గుర్తే సాయంసంధ్యవేళ పొదలు తడిగా ఉన్నపుడు ఏప్రిల్ నెల మనసులో పుట్టించే కోరికలు. వీధులంట వెన్నాడే సంజెవెలుగులు ఎక్కడో దూరాన తీతువు అరుపులు అందంగా, గుండ్రంగా, మెత్తగాలేస్తూ, వానకడిగిన పున్నమి చంద్రుడు. అందుకే, తలూచుతున్న పచ్చగడ్డి క్రింద దానికింద పరుచుకున్న మంచు దిగువన ఓ ఏప్రిల్ మాసమా! నువ్వెప్పుడు అలా అడుగేసినా నా రేణువులు నీకై కలవరిస్తాయి! . లూయీ జిన్స్ బర్గ్ October 1, 1895 –…

  • జనవరి 4, 2017

    ప్రకృతి ఆరాధకుడు మరణించేడు… డేనియల్ హెండర్సన్, అమెరికను

    (ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని తెగలలో ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయినపుడు తేనెటీగలకి ఆ వార్త చెప్పే సంప్రదాయం ఉంది) ***   తేనీగలారా! వెళ్ళండి అతని ఆస్తులు వివరించండి: ఓక్ చెట్టూ, పచ్చికా, పూలచెట్లూ… అతని జీవితాన్ని అంచనా వేసినా అతను వాటితోనే ఉన్నాడని చెప్పండి. అడవి పూలకీ, సుగంధభరితమైన గడ్డికీ భూమి అతన్ని తర్జుమా చేసిందని చెప్పండి. గలగలపారుతూ వంపులుతిరిగే వాగుకి చెప్పండి దాని కలలు అతను పంచుకునేవాడని. వేసవిలో విరిసే అడవులతో గుసగుసలాడండి వాటి…

  • జనవరి 3, 2017

    చతురత…. ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్, అమెరికను

    ఆమె చెప్పిన విధానం చూస్తే, (చెప్పినదాన్లో చాలవరకు నిజం), ఆమెకి ఇవ్వ వలసిన గౌరవాన్ని ఏ అహంకారమూ ఆపలేదు: ఆమె సులభంగా వంచించొచ్చు, కానీ ఆ పని ఆమె చెయ్యలేదు, అలా చేసుంటే పురుషుడు చిరునవ్వు నవ్వి మోసాన్ని అర్థం చేసుకునే వాడు. ఆమె అనుకున్నదానికంటే ఎక్కువ ఊహిస్తే, అన్నిటికీ ముగింపు పలకవస్తుందని తెలిసి అతను ఆగేడు; అతను వెళ్ళినపుడు ఉల్లాసమైన మాటతో వీడ్కోలు పలికేడు ఆ మాట అతనికి చుక్కలు మినుకుమినుకుమన్న రాత్రులలో అతను విన్న…

  • జనవరి 2, 2017

    వాసంత భీతి… లెనోరా స్పేయర్… ఆమెరికన్ కవయిత్రి

    నాకు వనాలలోకి పోవాలంటే భయం చెట్లన్నా, వాటి పచ్చని ఉన్మత్త ప్రాకారాలన్నా భయం. నా చొక్కా చేతులు లాగే చిరుగాలులన్నా భయం ఆకులగుబురులక్రింద ప్రాకే ‘ఆర్బ్యుటస్ ‘  లతలన్నా భయం. ఇచ్చవచ్చినట్టు తడిమాటలతో వెక్కిరించే సెలయేరన్నా భయం నేను పక్షుల కిలకిలారావాలు వింటే తడబడి పడిపోతుంటాను. అకస్మాత్తుగా వచ్చే ఆ చిరుజల్లుల సంగతి చెప్పక్కరలేదు విప్పారిన ఎర్రని కళ్ళతోభయపెట్టే పువ్వుల సంగతి చెప్పనక్కరలేదు. ఆ చిన్ని కీటకాలు ఒక్కసారి విచ్చుకున్న రెక్కలతో అవి నా చుట్టూ గోలచేస్తూ,…

  • జనవరి 1, 2017

    వీడ్కోలు పాట… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    బ్లాగు మిత్రులకి, పాఠకులకీ, శ్రేయోభిలాషులకీ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు దాన్ని మరిచిపోనీండి, ఒక పువ్వుని మరిచిపోయినట్టు ఒకప్పుడు పసిడికాంతులీనిన మంటను మరిచిపోయినట్టు. దాన్ని మరిచిపోనీండి ఎప్పటికీ, శాశ్వతంగా. కాలం ఒక మంచి మిత్రుడు, మనని త్వరగా వృద్ధుల్ని చేస్తాడు. ఎవరైనా అడిగితే, ఎప్పుడో చాలా రోజుల క్రిందటే, దాన్ని మరిచిపోయేనని చెప్పండి ఒక పువ్వునీ, ఒక మంటనీ, ఎన్నడో ఏమరిచిన మంచుదారిలో విడిచిన మౌన పాదముద్రనీ మరచినట్టు. . సారా టీజ్డేల్ (1884–1933) అమెరికను కవయిత్రి…

←మునుపటి పుట
1 … 71 72 73 74 75 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు