అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 22, 2017

    వాళ్ళిచ్చిన ఈ శరీరాన్ని నేనేం చేసుకోను? … ఓసిప్ మాండెల్ స్టామ్, రష్యను

    ఇంత స్వంతమై, నాతో ఇంత ఆత్మీయంగా మసిలే ఈ శరీరాన్ని నేనేం చేసుకోను? బ్రతికున్నందుకూ, ప్రశాంతంగా ఊపిరిపీలుస్తున్నందుకూ, తెలిస్తే నాకు చెప్పు, ఎవర్ని స్తుతించాలో? నేనే పువ్వునీ, తోటమాలిని కూడా ఈ అఖండ భూగృహంలో నేను ఒంటరివాణ్ణి కాను. నేను విడుస్తున్న ఈ వెచ్చని ఊపిరి కాలమనే నిర్మలమైన అద్దంమీద నువ్వు చూడగలవు. అందులో ఇప్పటిదాకా కనీకనిపించని ఒక ఆకారం స్పష్టంగా రూపుకట్టి ఉంది. ఈ ఊపిరి దాని జాడ మిగల్చకుండా ఎక్కడికో నిష్క్రమిస్తుంది కానీ, ఈ…

  • ఫిబ్రవరి 19, 2017

    తెల్లబడుతున్న ప్రకృతి… జేమ్స్ డి సెనెటో, సమకాలీన అమెరికను కవి

    నాకు తెలుసు అటకమీది కిటికీదగ్గర చంద్రవంకల్లాంటి మంచుపలకలు ఈ హేమంతంలో పేరుకుంటాయి. వాటిలోంచి ప్రసరించే సూర్యకిరణాలు ఎర్రగా, నీలంగా విడివడుతూ నా కళ్ళలో ప్రతిఫలిస్తుంటాయి. అక్కడి చల్లదనంలో అచేతనత్వంలో నేను నా ఊహల్లో సిగరెట్లు తాగుతూ ప్రపంచం చలికి గడ్డకట్టుకుపోవడం గమనిస్తాను. ఆ నా ఏకాంతంలో నా కిటికీప్రక్కన దూదిమంచు తేలియాడడం గమనిస్తున్నాను. నేనున్న అనువైన ప్రదేశంనుండి చెట్టు చివరలనుండి క్రిందనున్న కంచెమీదకి ఒక మంచు పలక ప్రయాణాన్ని చూడగలుగుతున్నాను. క్రమక్రమంగా పొదలన్నీ “క్రంబ్ కేకు”ముక్కల్లా మారుతున్నై.…

  • ఫిబ్రవరి 16, 2017

    నాకు ప్రేమగా పలకరించే గతవ్యధల ముఖాలంటేనే ఇష్టం… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి

    స్నేహంగా పలకరించే పాతవ్యధల ముఖాలే నాకిష్టం; వాటికి తెలియని రహస్యాలంటూ నాకు ఏవీ లేవు. అవెంత పాతవంటే, అప్పుడెప్పుడో, ఎంత పరుషమైన మాటలు నేను వినాల్సొచ్చిందో అవి ఈపాటికి మరిచిపోయి ఉంటాయి. తీక్ష్ణమైన, కనికరంలేని కొత్త వ్యధలచూపులంటే నాకసహ్యం; ఎప్పుడూ ఒంటరిగా ఉన్నప్పుడే నన్ను పట్టుకుని అలా నిలబడి నన్నే పరీక్షిస్తుంటాయి. పాత వ్యధలు ఎంత మార్పుకు లోనయ్యాయో గుర్తుంచుకోగలిగితే బహుశా, నేను మరింత ధైర్యంగా ఉండగలిగేదాన్నేమో! . కార్ల్ విల్సన్ బేకర్  13 Oct 1878…

  • ఫిబ్రవరి 12, 2017

    శ్రామికుడు…. స్కడర్ మిడిల్ టన్, అమెరికను కవి

    ష్! నా గుండెలో పనిచేసే శ్రామికుడా! నువ్వలా పోటుపెడుతుంటే, నాకు నొప్పెడుతోంది. రాత్రీ, పగలూ లేక, నీ సుత్తి బాదుతూనే ఉంటుంది నువ్వేమిటి నిర్మిస్తున్నావో నాకు తెలియడం లేదు. నీ శ్రమకి నాకు అలుపు వచ్చేసింది. చక్కగా ప్రకాశిస్తున్న కొండమీద దారితప్పిన ఒంటరి గొర్రెలా నాకు నిశ్చలంగా ఉండాలనుంది. విశ్రాంతిలేని నీ పిచ్చి బాదుడు ఆపు! ఉత్సాహం తగ్గించుకుని తెలివిగా మసలుకో! నువ్వు కలకాలం నిలిచేదేదీ నిర్మించడం లేదు. నన్ను కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోనీ! .…

  • ఫిబ్రవరి 11, 2017

    వసంతఋతు ప్రశాంతత … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి

    హేమంతము ఇలా గతించింది వసంతం అలా అడుగుపెట్టింది నేనొక రహస్యప్రదేశంలో దాక్కుని అక్కడి కలకూజితాలు వింటాను. అక్కడ మావి చిగురుల్లో కోయిల మనోహరంగా పాడుతుంది అక్కడ పూల పొదల్లో మైనా కమ్మగా ఆలపిస్తుంటుంది ఆ చల్లని ఇంటికప్పుమీదకి దట్టంగా ఎగబాకిన లతలు గుబురుపొదలై మొగ్గతొడుగుతూ నెత్తావులు పరుచుకుంటున్నాయి సుగంధాలు నింపుకున్న అల్లరిగా తిరిగే చిరుగాలి మెల్లగా గుసగుసలాడుతోంది: “ఇక్కడ ఏ ఉచ్చులూ పన్నలేదు; “ఇక్కడ క్షేమంగా వసించు ఒంటరిగా నివసించు స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు నాచుపట్టిన బండరాయీ…

  • ఫిబ్రవరి 10, 2017

    దొంగాట… వాస్కో పోపా, సెర్బియన్ కవి

    ఒకడు మరొకడికి కనిపించకుండా దాక్కుంటాడు అతని నాలుకకింద దాక్కుంటాడు రెండవవ్యక్తి ఇతనికోసం నేలలో వెతుకుతాడు. ఒకడు  తన తలరాతలో దాక్కుంటాడు రెండవవాడు ఇతనికోసం చుక్కల్లో వెతుకుతుంటాడు అతను తన మతిమరుపులో దాక్కుంటాడు రెండవవాడితనికోసం గడ్డిలో వెతుకుతుంటాడు. అతనికోసం వెతుకుతూనే ఉంటాడు అతనికోసం వెతకనిచోటుండదు. అలా వెతుకుతూ దారితప్పిపోతాడు. . వాస్కో పోపా June 29, 1922 – January 5, 1991 సెర్బియన్ కవి Hide and Seek Someone hides from someone else Hides…

  • ఫిబ్రవరి 9, 2017

    వాన… ఎడ్వర్డ్ థామస్, ఇంగ్లీషు కవి

    ఒకటే వాన, అర్థరాత్రి కురుస్తున్న వాన, ఈ పాకమీద కుండపోతగా కురుస్తున్న వాన; నాకు మళ్ళీ దగ్గరలోనే చనిపోతానేమోనని అనిపిస్తోంది, బహుశా నేను మరోసారి వాన చప్పుడు వినలేకపోవచ్చు, నేను ఒంటరిగా పుట్టినప్పటికంటే నిష్కల్మషంగా నన్ను శుభ్రపరచినందుకు దానికి ఉచితరీతిలో కృతజ్ఞతలు చెప్పుకోలేకపోవచ్చు. అద్భుతమైన ఈ వాన తమమీద కురిసే విగతజీవులు ఎంతధన్యులో! కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ప్రేమించినవారితో సహా ఎవరూ ఈ రాత్రి మరణించకూడదనీ, ఒంటరిగా వానపడటం వింటూ గాని, బాధతో గాని ఎండిపోయిన…

  • ఫిబ్రవరి 8, 2017

    అయితే, నువ్వు రచయితవి కావాలనుకుంటున్నావన్న మాట!… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి

    ఇన్ని జరిగినప్పటికీ, అది నీలోంచి విస్ఫోటనం చెందుతూరాకపోతే నువ్వు రాయకు. నువ్వు అడక్కుండనే నీ గుండెలోంచీ, మనసులోంచీ, నోటిలోంచీ నీ గొంతులోంచీ రాకపోతే, నా మాటవిని రాయకు! దానికోసం నువ్వు గంటలతరబడి నీ కంప్యూటరు తెరవంక తేరిపారచూస్తూనో, లేక, నీ టైపురైటరు మీద వాలిపోయో మాటలకోసం వెతుక్కుంటూ కూచోవలసి వస్తే రాయకు! నువ్వు డబ్బు కోసమో, కీర్తికోసమో రాస్తుంటే దయచేసి ఆ పని చెయ్యకు. స్త్రీల పొందు దొరుకుందని ఆశించి నువ్వు రాద్దామనుకుంటే, రాయొద్దు. నువ్వు అక్కడ…

  • ఫిబ్రవరి 7, 2017

    హృదయవేదన… నజీం హిక్మెత్, టర్కీ కవి

    డాక్టర్ గారూ, నా గుండె సగం ఇక్కడ ఉంటే రెండో సగం చైనాలో ఉంది ” యెల్లో రివర్ ” వైపు పరుగులు తీస్తున్న సైనికులతో. ప్రతిరోజూ, డాక్టర్ గారూ, ప్రతి ఉదయమూ నా గుండె గ్రీసులో గాయపడుతుంది. ప్రతి రాత్రీ, డాక్టరు గారూ, ఖైదీలందరూ నిద్రిస్తున్నపుడు, ఆసుపత్రులన్నీ నిర్మానుష్యమైనపుడు, నా గుండె ఇస్తాన్ బుల్ లో ఒక పాడుబడ్డ ఇంటి ముందు ఆగిపోతుంది. పదేళ్ళు గడిచేక నా పేదప్రజలకి నేనివ్వగలిగింది నా చేతిలో ఉన్న ఈ…

  • ఫిబ్రవరి 6, 2017

    రెండు సానెట్ లు… చార్ల్స్ హామిల్టన్ సోర్లీ, స్కాటిష్ కవి

    I సత్పురుషులు ఉదాత్తమైన నీ ఆత్మని శ్లాఘించారు. మహోన్నతమైన నీ కీర్తిచంద్రికలకు కవులు సిగ్గుపడ్డారు. నువ్వు చూపిన మార్గంలో నడవడానికి ఉద్యుక్యులైన అనేకమంది సరసన మేమూ నిరీక్షిస్తూ నిలబడ్డాము. ఇప్పుడు పేరుబడ్డా, ఒకప్పుడు నువ్వెవరో ఎవరికీ తెలీదు; నీ ఉనికి గుర్తించకుండా జీవించడానికి ప్రయత్నించాము. కానీ ఇపుడు ప్రతి వీధిలోనూ, ప్రతి దిక్కునా నిలకడగా నిశ్చలంగా నీ గుర్తులున్న స్థంబాలు చూస్తున్నాము. ‘కొండలమీదకి ఎక్కడానికి మార్గము ‘అని సూచిస్తూ మా ఊర్లో ఉన్న పాడుబడ్డ పొడుగాటి రాటని…

←మునుపటి పుట
1 … 68 69 70 71 72 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు