అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 31, 2017

    ముగ్గురు బాలికలు… హేజల్ హాల్, అమెరికను కవయిత్రి

    ముగ్గురు బాలికలు ఇటువైపునుండే రోజూ బడికెళ్తుంటారు అందులో ఇద్దరు, ఆడపిల్లలకి సహజంగా ఉండే భయాలతో బెదురుతూ బెదురుతూ వెళుతూ ఉంటారు. ఒకమ్మాయి మాత్రం కళ్ళలో కలలతో నడిచిపోతుంటుంది. ఆ ఇద్దరికీ ఆడపిల్లలలకుండే బెరుకుచూపులున్నాయి వాళ్ళ జుత్తు వంకీలకే వంకలుపెడుతోందా అన్నట్టు ఉంది కానీ, ఆ మూడో అమ్మాయి కళ్ళు ఎక్కడో ఊహాతీరాలవైపు తెరుచుకున్న విశాలమైన తలుపుల్లా ఉంటాయి. వాళ్ళు ఈ రోజు వెళ్ళినట్టే వెళ్తారు క్షణికమైన ఈ జీవితపు చరమాంకందాకా; మొదటిద్దరికీ జీవితం ఏదిస్తే అదే అనుభవమౌతుంది…

  • మార్చి 27, 2017

    ప్రయాణం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    ఈ రైలు మార్గము మైళ్ళ కొద్దీ సాగుతోంది. రోజల్లా మనుషులమాటలతో సందడిగా ఉంటుంది కానీ రోజు రోజల్లా ఎదురుచూసినా ఏ రైలూ రాదు నాకు మాత్రం దాని కూత ఎక్కడినుండో వినిపిస్తూంటుంది రేయి నిద్రపోడానికీ, కలలు కనడనికే అయినా ఎంత చూసినా, రాత్రి మొత్తంలో ఏ రైలూ ఇటు రాదు; కానీ నాకు ఆకాశంలో ఎగురుతున్న నిప్పు రవ్వలు కనిపిస్తున్నాయి దాని ఇంజనులోంచి ఎగజిమ్ముతున్న ఆవిరిచప్పుడు వినిపిస్తోంది. నే నేర్పరచుకున్న స్నేహాలవల్ల మనసు హాయిగా ఉంది అంతకంటే…

  • మార్చి 21, 2017

    ఫిరంగుల మోత… రిచర్డ్ ఆల్దింగ్టన్, ఇంగ్లీషు కవి

    నాలుగురోజులపాటు భూమి ఇనపగుళ్ళ వర్షానికి పగిలి ముక్కలైంది. మా చుట్టూ ఉన్న ఇళ్ళు నేలమట్టమయాయి; మృత్యుసంకేతమైన ఇల్లుకూలిపోయిన శబ్దం ఎప్పుడు వినబడుతుందోనని చెవులు రిక్కించి భయంతో,చెమటలు కక్కుకుంటూ మూడురోజులూ అసలు నిద్రపోడానికి ధైర్యం చాలలేదు. నాలుగోనాటి రాత్రి ప్రతిఒక్కరూ, నరాలు పిట్లిపోయి, అలసట అంచులకు చేరి, నిద్రపోయాం, నిద్రలొ గుంజుకుంటూ, ఏవో గొణుక్కుంటూ పైన ఫిరంగులు అలా మోతమోగుతున్నా. ఐదవరోజుకి ఒక్కసారి ప్రశాంతత వచ్చింది; మేము మా కలుగుల్లోంచి బయటకి వచ్చాం నేలమీద జరిగిన విధ్వంసాన్ని చూశాము.…

  • మార్చి 19, 2017

    మార్మిక కవిత 2… రూమీ, పెర్షియను సూఫీ కవి

    వివేకం అంది,”చూస్తుండు, అతన్ని నా వాదనతో వంచిస్తాను;”అని. ప్రేమ అంది, “ఊరుకో! నేనతన్ని మనసుతో వంచిస్తాను.” అని మనసు హృదయంతో అంది, “ఫో!నన్ను చూసీ, నిన్ను చూసీ నవ్వకు. అతనిది కానిదేముందని అది చూపి అతన్ని మోసగించడానికి? అతనికి విచారంలేదు, ఆందోళన లేదు, అజ్ఞాతమే కొరుకుంటున్నాడు పోనీ అతనికి మద్యాన్నీ, అధికమొత్తంలో ధనాన్నీ చూపి వంచిద్దామన్నా. అతని చూపులతూపులు ఏ వింటినుండీ వెలువడటంలేదు ప్రతిగా మరొక వింటినుండి చూపుల అమ్ములతో ఖండించడానికి. అతనీ ప్రపంచానికి ఖైదీ కాడు,…

  • మార్చి 18, 2017

    కవిహృదయం… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను

    (మనవి : ఈ కవితకి శీర్షిక లేదు. ఎలా వీలర్ విల్ కాక్స్ తన Poems of Passion అన్న పుస్తకంలో ముందుమాటకంటే  ముందుగా ఈ కవితని పెట్టుకుంది.) *** ఓ పాఠకుడా!నేను పాడుకున్న ఏదో గీతాన్ని చదివినంతమాత్రాన ఏ హృదయపులోతులలోంచి వచ్చిందో నువ్వు పసిగట్టగలవా? కవి కన్న కల ఎన్నడైనా బయటకు గట్టిగా చెబుతుందా దాని రహస్యపుటాలోచనలను వింటున్న జనసమూహానికి? ఏదీ, లేచి సముద్రపుటొడ్డునున్న ఒక శంఖుని తీసుకో— నీకేమిటి కనిపిస్తుంది? దాని ఆకారం, రంగూ. అంతే! విశాలమైన…

  • మార్చి 17, 2017

    కొత్త జీవితం… ఆస్కార్ వైల్డ్ ఐరిష్ కవి

    ఏ వేటా లభించని సముద్రం అంచున అలా నిరీక్షిస్తూ నిలబడ్డాను నా ముఖాన్నీ, జుట్టునీ నురుగుతో కెరటాలు తడి ముద్ద చేసేదాకా. గతించిన రోజు ఎర్రని చితిమంటలు సుదీర్ఘంగా పశ్చిమాకాశాన మండుతున్నాయి; గాలి బావురుమని ఊళలేస్తోంది; అరుచుకుంటూ సీ గల్స్ నేలవైపు పరిగెత్తుతున్నాయి; “అయ్యో! నా జీవితమంతా బాధలమయమేగదా! నిత్యం ప్రసవవేదన పడే ఈ చవిటి నేలల్లో పళ్ళూ, బంగారు ధాన్యాన్నీ ఎవరు పండించగలరు?” అని వగచేను. నా వలలు తెగి, పురితగ్గి, నోరు వెళ్ళబెడుతున్నాయి. అయినప్పటికీ…

  • మార్చి 14, 2017

    రేపు సూర్యోదయం వేళకి… విక్టర్ హ్యూగో, ఫ్రెంచి కవి

    హ్యూగో పెద్ద కూతురు 19 ఏళ్ళ లెపాల్డైన్ ప్రమాదవశాత్తూ సెప్టెంబరు 4, 1843 లో సియాన్ నదిలో పడి, ఆమెను కాపాడబోయిన భర్తతో సహా మరణిస్తుంది. ఆమె స్మృతిలో రాసిన కవిత. ఆమె సమాధిని దర్శించడానికి వెళ్ళిన ఒక సందర్భంలో రాసిన ఈ కవిత అతనికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది.) . రేపు, సూర్యోదయం వేళకి, పల్లెలు తెల్లదనాన్నలముకుంటూంటే నేను బయలు దేరుతాను. నాకు తెలుసు నువ్వు నాకోసం నిరీక్షిస్తుంటావని. నేను కొండలు ఎక్కి అడవిగుండా ప్రయాణం…

  • మార్చి 13, 2017

    నీరు … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి

    అన్ని మతాల్లోనూ నీటిప్రాముఖ్యత గురించి కవి ఈ కవితలో పరోక్షంగా చెబుతున్నాడు. . నన్నే గనక ఒక మతాన్ని స్థాపించమని చెబితే నేను నీటిని ఉపయోగించాల్సి వస్తుంది. చర్చికి వెళ్ళాలంటే పాదాలు తడిసే నీళ్ళలోంచి నడవాలి వేరే రకమైన వస్త్రాలు ఆరబెట్టాలి. నా ప్రార్థనలూ పూజల్లో భక్తితో స్నానం చెయ్యడం నీటిలో నిలువునా తడవడం వంటి దృశ్యాలుంటాయి. నేను ‘తూర్పు’కి ఒక గ్లాసుడు నీళ్ళు ఎత్తితే చాలు దానిమీద ప్రతిఫలించే ఏపాటి కాంతైనా తండోపతండాలుగా ప్రజల్ని సమీకరిస్తుంది.…

  • మార్చి 12, 2017

    ఇదిగో నీకే…. వాల్ట్ విట్మన్, అమెరికను

    పద! అందరికీ దూరంగా మనిద్దరం కలిసినడుద్దాం; ఇక మనిద్దరం ఏకాంతంగా ఉన్నాం గనుక కాసేపు మర్యాదలన్నీ పక్కనబెడతావా? ప్రారంభించు! నువ్వింతవరకు ఎవరికీ చెప్పనిది నాతో చెప్పు. విషయమంతా ఉన్నదున్నట్టుగా చెప్పు. నువ్వు నీ సోదరుడికీ, నీ భార్యకీ (లేదా భర్తకీ), వైద్యుడికీ చెప్పనివన్నీ వినిపించు. . వాల్ట్ విట్మన్ మే 31, 1819 – మార్చి 26, 1892 పద అమెరికను . . To You . Let us twain walk aside from…

  • మార్చి 11, 2017

    మా పూర్వీకుల గ్రామంలో… వాస్కో పోపా, సెర్బియన్ కవి

    ఒకరు నన్ను కాగలించుకుంటారు ఒకరు నా వంక తోడేలులా చూస్తారు మరొకరు తన టోపీని తీస్తారు తనని నేను బాగా చూడగలిగేలా. ప్రతివారూ నన్నడుగుతుంటారు నేన్నీకు ఏమౌతానో చెప్పగలవా అంటూ ఎన్నడూ ఎరుగని వృద్ధ స్త్రీలూ, పురుషులూ నా చిన్నప్పటి జ్ఞాపకాలలోనిలిచిన పేర్లు చెబుతూ … వాళ్ళు తామే అంటారు. అందులో ఒకర్ని అడుగుతాను: నామీద దయ ఉంచి చెప్పండి “తోడేలు జార్జి” ఇంకా బ్రతికున్నాడా? ఏదో మరో లోకంనుండి మాటాడినట్టు ఒక వ్యక్తి “అది నేనే”…

←మునుపటి పుట
1 … 66 67 68 69 70 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు