-
దాస్యమూ- స్వాతంత్య్రమూ… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
రెండుచేతులతో పెనవేసుకుని కొండలతో సహా నిలబడడానికీ, భయాన్ని దూరంగా ఉంచడానికీ, గదిలో గది, గదిలో గదిగా, ప్రేమకి నేల ఆసరా ఉంది కానీ ఊహకి అలాంటి అవసరమేమీ లేదు, ఎందుకంటే దానికి భయమెరుగని రెండు రెక్కలున్నాయి. మంచులోనూ, ఇసుకలోనూ, పచ్చికమీదా నేను ప్రేమ విడిచిన పదముద్రలు చూశాను ప్రపంచపు బిగికౌగిటిలో అవి ఉక్కిరిబిక్కిరి అవుతూ… ప్రేమ అంటే అదే, దానికి అలా ఉండడమే ఇష్టం. కానీ ఊహకి కాళ్ళు ఒకచోట నిలువవు. ఊహ తారానివహాలమధ్యనున్న చీకట్లు చీలుస్తూ…
-
గతించినవన్నీ… వాల్టర్ డి లా మెర్, ఇంగ్లీషు కవి
ఈ వనాళి అతి పురాతనమైనది; ముళ్ళపొదల్లోంచి పైకిలేచే లేతీవెలపై కుసుమిస్తున్న మొగ్గలు, వసంతాగమన సూచీ వీచికలకు, ఎంత అందంతో ఇనుమడిస్తున్నాయో— ! ఈ గులాబి ఎన్ని అజ్ఞాత శతాబ్దులుగా నలుచెరగులా విరబూస్తున్నాదో ఏ మనిషీ చెప్పలేడు. ఈ సెలయేళ్ళూ పురాతనమైనవే; నీలాలనింగి క్రింద చల్లగా నిద్రించే హిమపాతాలనుండి ఉద్భవించే కొండవాగులు గతంలోకి జారుకున్న చరిత్రని ఎంతగా ఆలపిస్తాయంటే సాలమన్ చక్రవర్తికంటే వివేకవంతంగా వాటి ప్రతి పదమూ పలుకుతుంది. మనుషులం మనందరం పురాతనులమే; ఈవ్ కి చెలికత్తెలైన నైటింగేల్…
-
ప్రభాత గీతం… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి
ఆ కొండ చిగురున లేలేత వెలుగు ప్రసరిస్తోంది అక్కడెక్కడో ఒక పచ్చని చామంతి కనిపిస్తోంది, మరెక్కడో అంతకంటే తీయని మధువు ఆస్వాదించబడుతోంది. కొన్ని శిలలుగా ఉండిపో నిర్ణయించబడ్డాయేమో! తమకి తెలిసిన విషయాలే తెలుసుకుంటూ తమ ఆత్మలోకి మరింత గాఢంగా నాటుకుంటూ… కానీ, కొన్ని నన్నూ చిరుగాలినీ అనుసరించవలసిందే మేమెప్పుడూ స్వేచ్ఛగా, విహరించడానికి సిద్ధంగా ఉంటాం, భవిష్యంత ఆశావహంగా ఇంకెన్నడూ ఉండలేదు! . కార్ల్ విల్సన్ బేకర్ (1878–1960) అమెరికను కవయిత్రి. Photo Courtesy: Wikipedia .…
-
అతని అంతిమ యాత్రలో ఆమె… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
అతన్ని … తన కడపటి విశ్రాంతి స్థలానికి నెమ్మదిగా నడుస్తూ తీసుకుపోతున్నారు; నేనొక అపరిచితవ్యక్తిలా అనుసరిస్తున్నాను; వాళ్ళు అతనికి బంధువులు; నే నతని ప్రేయసిని వాళ్ళందరూ నల్లని శోకచిహ్నమైన నలుపుదుస్తుల్లో ఉన్నా, నేను గాఢమైన రంగులో ఉన్న నా గౌనుని మార్చలేదు; వాళ్ళు అతనిచుట్టూ ఏ విచారమూ లేకుండా నిలుచుంటారు, కానీ, నా పశ్చాత్తాపము నన్ను దహిస్తుంది. . థామస్ హార్డీ (2 June 1840 – 11 January 1928) ఇంగ్లీషు కవి. . . She…
-
మా అమ్మకు… ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి
ఊర్ధ్వలోకాలలోని దేవదూతలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ, వారి అత్యంత ప్రేమాస్పదమైన పదాల వెదుకులాటలో, “అమ్మ”ను మించిన పూజనీయమైన మాటను కనుగొనలేరని నేను భావిస్తున్నాను గనుక, ఇష్టమైన ఆ పేరుతోనే నిన్ను ఎప్పటినుండో పిలుస్తున్నాను… నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లికంటే పూజనీయురాలవు, నా మనోంతరాలములో సదా నిలుస్తావు, నా వర్జీనియను చైతన్యాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టడానికి మృత్యువు నిను నియోగించింది. నా తల్లి… కన్న తల్లి… నా చిన్నప్పుడే మరణించిన తల్లి కేవలం నాకు మాత్రమే తల్లి; కానీ నువ్వు…
-
గుప్తప్రేమ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా ప్రేమని నేను హృదయంలోనే పదిలపరిచాను నా కళ్ళల్లో నవ్వులు వెలిగించుకున్నాను, ఎందుకంటే, మేం కలుసుకున్నప్పుడు నా ప్రేమ అమరమని అతనికి తెలియకూడదు. కానీ ఒక్కోసారి అతను రాత్రి సుగంధాలు విరజిమ్మే చిక్కని, పచ్చని తోటలను కలగంటునపుడు, బహుశా నా ప్రేమ మెల్లిగా బయటకి జారుకుని అతనికి ఆ కలని తేప్పించిందేమో! ఒక్కోసారి అతని మది వేదనా భరితమై వెనువెంటనే కోలుకున్నప్పుడు, బహుశా, అక్కడ నా ప్రేమ ఉందేమో అతనికి బాధనుండి విముక్తి కలిగించడానికి! . సారా…
-
ఎడ్వర్డ్ థామస్ స్మృతిలో … రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
నీ కవితలు గుండెమీదపెట్టుకుని నిద్రలోకి జారుకున్నాను అలా పేజీలు తెరిచి ఉంచి, అర్థాంతరంగా విడిచిపెట్టి, సమాధిమీది చిత్రంలోని పావురాయి రెక్కల్లా నిద్రలోనైనా అవి మనిద్దరినీ కలుపుతాయేమోనని. నేను జీవించి ఉండగా తప్పిపోయిన అవకాశం మరి రాదు కొంచెం ఆలస్యమైనప్పటికీ నిన్ను నేను కలుసుకుంటాను ముందుగా నువు సైనికుడివి, తర్వాత కవివి, తర్వాత రెండూను, నీ జాతిలో సైనిక-కవిగా మరణించింది నువ్వే. నా ఉద్దేశ్యమూ, నీ ఉద్దేశ్యమూ కూడా మనిద్దరిమధ్యా ఏ దాపరికాలూ ఉండకూడదన్నది; సోదరా, ఇదొకటి మిగిలిపోయింది—…
-
నిరంకుశుడిపై స్మృతిగీతం… ఆడెన్, ఇంగ్లీషు- అమెరికను కవి
అతను ఒక విధమైన వేలెత్తిచూపలేని పరిపూర్ణతకై ప్రాకులాడుతున్నాడు దానికోసం అతను సృష్టించిన పరిభాష అందరికీ అవగతమే; అతనికి మనిషుల బలహీనతలు తన మండ ఎరిగినంతగా అవగతం, అతనికి సైనికపటాలాలన్నా, నావికదళం అన్నా గొప్ప ఇష్టం; అతను నవ్వితే చాలు, పూజ్య సభాసదులంతా పగలబడి నవ్వుతారు, అతను రోదిస్తే, రోడ్లపై పసిపిల్లలు మరణిస్తారు. . WH ఆడెన్ (21 February 1907 – 29 September 1973) ఇంగ్లీషు-అమెరికను కవి . . Epitaph on a tyrant…