అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 1, 2017

    మృత్యువుతో సమావేశం… ఏలన్ సీగర్, అమెరికను

    నాకు మృత్యువుతో సమావేశం ఉంది ఒకానొక వివాదాస్పదమైన సరిహద్దువెంబడి, మళ్ళీ వసంతం నీడలగలగలతో ఆపిలు పూలవాసనలో గాలిలో ఎగజిమ్ముకుంటూ వచ్చినపుడు నాకు మృత్యువుతో సమావేశం ఉంది… ఆమని మళ్ళీ వెచ్చని వెలుగులరోజులు తోడ్కొని వచ్చినపుడు. బహుశ తను నా చేతిని తనచేతిలోకి తీసుకుని తన చీకటి సామ్రాజ్యంలొకి తీసుకుపోవచ్చు, నా కళ్ళను మూసి, నా ఊపిరి ఆపవచ్చు… ఏమో, నేను అతని పక్కనుండి వెళ్లిపోయినా వెళ్ళిపోవచ్చు. అయినా, నాకు మృత్యువుతో సమావేశం ఉంది ఫిరంగులతాకిడికి బాగా దెబ్బతిని…

  • మే 30, 2017

    ఏరోన్ స్టార్క్… E.A. రాబిన్సన్, అమెరికను

    పైగా, ఏరోన్ స్టార్క్ చాలా బక్కపలచని మనిషి, శాపగ్రస్తుడు; మురికిగా, శుష్కించి, ఎప్పుడూ ఏదోపోయినట్టు, తగువులాడుతూ ఉంటాడు. అతనొక పిసినారి, తగ్గట్టే ముక్కుకూడా ఉందా లేదా అన్నట్టు ఉంటుంది, అతని కళ్ళు చీకట్లో చిరునాణేల్లా ఉంటాయి. అతని గీతగీసినట్టున్న నోరు అక్కడొక ఆనవాలులా ఉంటుంది; అతను మాటాడినపుడు నోటంట వచ్చే ఆ రెండుమూడు శబ్దాలూ ఎడమైనకోరలమధ్యనుండి కోపంతో వచ్చే బుసలా ఉండి, కుక్క దాని అరుపుకే భయపడి జాగ్రత్తపడినట్టు ఆగిపోతాయి. అతనికున్న చెడ్డపేరుకి సంతోషిస్తూనే ప్రేమచేబహిష్కృతుడైన అతడు…

  • మే 30, 2017

    నీలిదుస్తుల విద్యార్థినులు … జాన్ క్రో రాన్ సమ్, అమెరికను

    మీ నీలి గౌన్లను గిరగిర తిప్పుకుంటూ, మీ బడిని ఆనుకున్న పచ్చనిపొలాలలో నడుచుకుంటూ మీ గురువృద్ధులు చెప్పింది వినండి పిల్లలూ; కానీ, అందులో ఒక్కముక్కకూడా నమ్మకండి. మీ తలకట్టు చుట్టూ తెల్లని కేశబంధాల్ని తగిలించి, గడ్డిమీద ఎగురుకుంటూ ఉబుసుపోకమాటలు చెప్పుకునే నీలి నీలి పిట్టల్లా ఇక జరగబోయేదానికి ఆలోచించడం మానెయ్యండి. ఇదిగో నీలి దుస్తుల అమ్మాయిలూ, అంతరించకమునుపే మీ చక్కదనాన్ని సాధనచెయ్యండి. నేను పెద్ద గొంతుకతో నలుగురికీ ప్రకటిస్తాను:దాన్ని మన అధీనంలోని సమస్త శక్తులూ నిర్ణయించలేవని. చక్కదనం…

  • మే 26, 2017

    జానపదగీతిక … ఎజ్రా పౌండ్, అమెరికను కవి

    వెలుగు ఆమె హేలగా మారి, కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మనుషాకృతుల్లో ఎన్నో క్రీనీడలను ప్రాకిస్తోంది.  చూడు, వెలుగు మనసు దోచి మనచే ఎలా కూనిరాగాలు తీయిస్తోందో!  ఆమె క్షణకాలం సూర్యుడి వెలుగుని ధరిస్తుంది నా మనసు ఎన్నడో ఆమె అధీనమైపోయింది . కీకారణ్యాల్లో ఏ జింకపిల్లలూ, దుప్పులూ సంచరించవు అంత నిశ్శబ్దంగా ప్రాకుతోంది సూర్యరశ్మి; ఆమె నడుస్తున్నంత మేరా, తలవాల్చిన పచ్చిక మీద మెరుస్తున్న పచ్చలు ఎక్కడ త్వరగా ఇగిరిపోతాయోనని సూరీడు వాటిని క్రిందకి తరుముతున్నాడు; సాలీడు సైతం ఆమె…

  • మే 25, 2017

    యువ వీరులకు నివాళి… విల్ఫ్రెడ్ ఓవెన్ , ఇంగ్లీషు కవి

    సొమ్ముల్లా రాలిపోయిన ఈ యువతకి ఇవేమి మృత్యుఘంటికలు?! అవి భయానకమైన శతఘ్నుల కోపోద్దీపితమైన అరుపులు మాత్రమే డగడగ…డగడగమని ఆగకుండా తూటాలు విరజిమ్మే తుపాకుల చప్పుడు మాత్రమే వారి కడసారి ప్రార్థనలు త్వరగా వల్లెవేయగలదు. వారిని శ్లాఘిస్తూ ఏ ఉపన్యాసాలూ లేవు; ఏ ప్రార్థనలూ, గంటలూ లేవు. ఈ విషాద సంగీతం తప్ప వేరు శోక సంకేతాలు లేవు. అవిగో కీచుగా, పిచ్చిపట్టినట్టు శోకించే తూటాల ఆక్రందనలు, యువవీరులని జన్మభూమికి రారమ్మంటున్న తుత్తారల గద్గద నిస్వనాలు. వారికి అంతిమ…

  • మే 23, 2017

    ఏ రోజుకి ఆ రోజు బ్రతుకు… జోస్ వాండర్లీ దీయాస్, పోర్చుగీసు కవి.

    నువ్వు గ్రహించగలిసినదంతా గ్రహించు… ప్రతి రోజూ… ప్రతి క్షణమూ… ప్రతి ౠతువూ… నీ జీవించినంతకాలమూ. అప్పుడు భవిష్యత్తులోకి ధైర్యంగా చూడగలవు గతాన్ని విచారంలేకుండా అవలోడనంచేసుకోగలవు. నువ్వు నీలాబ్రతుకు, కానీ నీలోని ఉత్తమోత్తమపార్శ్వాన్ని చూపు. భిన్నంగా ఉండడానికి సాహసించు; నీ భవిత నువ్వే వెతుక్కో… ఆనందంగా ఉండడానికి ఎంతమాత్రం వెరవకు! సౌందర్యాన్ని ఆస్వాదించు. ప్రతిదాన్నీ మనసారా, హృదయపూర్వకంగా ప్రేమించు. నిన్ను ప్రేమించేవారిపై నమ్మకం ఉంచు. ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నప్పుడు, నిర్ణయాన్ని ఎంత వివేకంతో, తొందరగా తీసుకోగలవో,…

  • మే 22, 2017

    ఓ నా మిత్తికా! నువ్వూ గతించవలసిందే!… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి

    ఓ నా ప్రియ మిత్తికా! నువ్వూ గతించవలసిందే! ఇంత నీ సౌందర్యమూ నిన్ను ఎంతమాత్రం కాపాడలేదు; ఎక్కడా లోపం కనరాని ఈ నిపుణ హస్తమూ, అందమైన శిరసూ, జ్వలించే ఉక్కులాంటి ఈ శరీరమూ, సుడిగాలివంటి మృత్యువు ముందు, లేదా దానీ హేమంత హిమపాతం ముందు, ఏ ఆకు రాలడానికి భిన్నంగా లేకుండా, మొట్టమొదటి ఆకు రాలినట్టు రాలిపోక తప్పదు; ఈ అద్భుతం తెరమరుగుకాక తప్పదు… మార్పుకిలోనై, అందరికీ దూరమై, చివికి శిధిలమై. ఆ సమయంలో నా ప్రేమకూడా…

  • మే 21, 2017

    ఆ కొండ… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి

    ఎల్మర్, హెర్మన్, బెర్త్, టామ్, ఛార్లీ అంతా ఏరీ, స్థిరచిత్తం లేని వాళ్లూ, భుజబలం కలిగినవాళ్ళూ, హాస్యగాడూ, తాగుబోతూ, యోధుడూ…ఏరీ? అందరూ… అందరూ ఆ కొండమీద నిద్రిస్తున్నారు. ఒకరు జ్వరంతో పోయారు ఒకరు గనిలో కాలిపోయారు ఒకరు తగవులాటలో మరణించేరు మరొకరు చెరసాలలో మరణించేరు. భార్యాబిడ్డల్ని పోషించడానికి పనిచేస్తూ మరొకరు వంతెనమీంచి జారిపోయారు వాళ్ళంతా… అంతా… ఇప్పుడు ఆ కొండమీద నిద్రిస్తున్నారు. ఎలా, కేట్, మేగ్, లిజ్జీ, ఎడిత్ వీరంతా ఏరీ. మెత్తని మనసూ, అమాయకత్వం, గయ్యాళితనం,…

  • మే 20, 2017

    మనసా! కాస్త నెమ్మది… A E హౌజ్మన్, ఇంగ్లీషు కవి

    ఓ మనసా! కాస్త నెమ్మది వహించు; నీ అస్త్రాలు ఎందుకూ పనికిరావు, భూమ్యాకాశాల దగ్గర ఇంతకన్నా బలమైనవి ఎప్పటినుండో స్థిరంగా ఉన్నాయి. ఆలోచించు. ఒకసారి గుర్తుతెచ్చుకో, ఇప్పుడు నువ్వు విచారిస్తున్నావు గాని, ఒకప్పుడు మనం అచేతనంగా పడి ఉండే వాళ్ళం. ఆ రోజులు అనంతం. అప్పుడూ మనుషులు నిర్దాక్షిణ్యంగా ఉండెవారు; ణెను ఆ చీకటి గుహలో పడుకున్నాను అందుకు చూడలేదు; కన్నీళ్ళు చిందేవి, కానీ విచారించలేదు; చెమట కారేది, రక్తం ఉడుకెత్తేది, కానీ నే నెన్నడూ విచారించలెదు;…

  • మే 19, 2017

    తుదిశ్వాస విడిచిన తర్వాత… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

    (జెమీమా హార్డీ (1813 – 1904)  స్మృతిలో ) . ఇక చెయ్యడానికీ, భయపడడానికీ, ఆశించడానికీ ఏమీ లేదు; ఇక ఎవ్వరూ కనిపెట్టుకుని ఉండనక్కరలేదు;చిన్నగొంతుతో మాటాడడాలూ, విసిగి వేసారడాలూ ఉండవు; దుప్పటిమీద ఇబ్బందిగా కనిపించే ముడతలు సరిదిద్దనక్కరలేదు, తలగడ ఆమెకు వాలులో పెట్టనక్కరలేదు. మేము శూన్యదృక్కులతో చూస్తున్నాం. ఉండడం, వెళ్ళిపోవడం ఇక మా ఇష్టమే; ఆతృతతో వేసుకున్న రేపటి మా పథకాలు వాటి లక్ష్యం తప్పాయి; ఇక ఈ రాత్రికి ఊరు వదిలినా, రేపు ఉదయందాకా నిరీక్షించినా…

←మునుపటి పుట
1 … 62 63 64 65 66 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు