-
ఈ సజీవ హస్తం… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఇది చాలా చిత్రమైన కవిత. నిజానికి ఇది అసంపూర్ణ కవిత. కీట్స్ దీనిని తన అసంపూర్ణ కవితల రాతప్రతులలో రాసుకున్నాడు. ఈ కవిత కాలం సుమారుగా అక్టోబరు 1819. నిజానికి 18 అక్టోబరు 1819 న కీట్స్ కీ అతని ప్రేయసి ఫానీ బ్రౌన్ కీ నిశ్చితార్థం జరిగింది. వారిద్దరు వివాహం చేసుకునే అదృష్టానికి నోచుకోలేదు. అప్పటికే అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. కీట్స్ కి తను ఎక్కువకాలం బ్రతకనని అప్పటికే తెలుసు. భయపడినట్టుగానే, రెండేళ్ళలో కీట్స్ చనిపోతాడు. అతనిమీద ఉన్న…
-
వెన్నెల… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ముదిమి పైబడిన తర్వాత నాకు బాధ అనిపించదు, చంద్రకాంతితో జ్వలిస్తూ సాగే కెరటాలు ఇకపై కోరలుసాచిన వెండి పాముల్లా నన్ను కాటెయ్యవు; రాబోయే రోజులు నిరుత్సాహపరుస్తూ విచారంగా గడుస్తాయి, అయినప్పటికీ, ముక్కలయ్యేది సంతుష్ట హృదయమే. మనసెప్పుడూ జీవితం ఇవ్వగలిగినదానికంటే ఎక్కువే ఆశిస్తుంది అది తెలుసుకోగలిగితే, సర్వమూ తెలిసుకున్నట్టే, ఒక విలువైన పాయమీద మరొకపాయగా కెరటాలు దొర్లిపడుతుంటాయి, కానీ సౌందర్యం మాత్రం స్థిరంగా నిలవక పలాయనం చిత్తగిస్తుంటుంది, అందుకే, ముదిమి పైబడినా, నాకు పెద్దగా బాధ అనిపించదు. .…
-
భగవంతుని వైభవం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి
ఈ సృష్టి అంతా భగవంతుని వైభవంతో నిండి ఉంది… కంపించే బంగారు రేకునుండి వెలువడే కాంతిపుంజంలా; అది గానుగలోంచి ఊరే నూనెలా కొద్దికొద్దిగా వస్తూనే అఖండమౌతుంది. మరి మనుషులెందుకు అతని అధికారాన్ని లెక్కపెట్టరు? తరాలు నడచి పోయాయి, నడుచుకుని పోయాయి, నడుచుకుంటూపోయాయి అందరూ తమ పనుల్లో, శ్రమలో, వేదనల్లో మునిగి తేలేరు; మనుషులుగా తమ ముద్ర వేసుకున్నారు, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు: ఇప్పుడామట్టి అంతా ఖాళీ; పాదరక్షలుండడంతో కాళ్ళు తగిలినా పోల్చుకోలేవు. అయినప్పటికీ, ప్రకృతికిలో “నిండుకుంది” అన్న…
-
నిరాకరణ… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
ప్రశాంతంగా ఉన్న నీ చెవులలోకి నా ప్రార్థనలు చొరబడలేనపుడు; నా కవితలాగే, నా హృదయమూ ముక్కలై, నా గుండెనిండా భయాలు నిండి అంతా అస్తవ్యస్తమైపోయింది. వక్రించిన నా ఆలోచనలు, శీర్ణధనువులా, రెండుగా చీలిపోయాయి; వేటిత్రోవన అవిపోయాయి; కొన్ని సుఖాలవేటలో పోతే కొన్ని పోరాటాలకీ, ప్రమాదకరమైన ప్రయత్నాలవైపు మరలాయి. ఎక్కడికెళితేనేమిటి, అని అవి అంటుండేవి, రేయింబవళ్ళు చేసే వాడికోళ్లకు హృదయమూ, కాళ్ళూ చచ్చుబడిన తర్వాత? ఓ ప్రభూ! కనికరించి కనిపించు, కనిపించు, అయినా నువ్వు కనిపించవు. చిత్రమేమిటంటే, నువ్వు…
-
ప్రతి ఉదయం నవోదయం… సూసన్ కూలిడ్జ్ , అమెరికను కవయిత్రి
ఓ మనసా! పదే పదే పునరావృతమయే పల్లవిని విను! ప్రతిరోజూ ఒక నవోదయం! బాధలు ఎప్పటిలాగే ఉండనీ, చేసిన పాపాలే చెయ్యనీ, భవిష్యత్తులో కొత్త కష్టాలు రాబోనీ, బహుశా సరికొత్త వేదనలూ కలగనీ… కానీ రోజుని ప్రేరణ తెచ్చుకో, జీవితాన్ని కొత్తగా ప్రారంభించు. . సూసన్ కూలిడ్జ్ (January 29, 1835 – April 9, 1905) అమెరికను కవయిత్రి . . New Every Morning . Every day is a fresh beginning,…
-
నీకు వయసు పైబడిన తర్వాత… విలియమ్ బట్లర్ యేట్స్, ఇంగ్లీషు కవి
నీకు వయసు పైబడి, జుత్తు నెరిసి, నిద్రాళువువై, పొయ్యిదగ్గర చలికాచుకుంటూ తలూపేవేళ, ఈ పుస్తకం చేతిలోకి తీసుకుని తీరికగా చదువుకుంటూ, యవ్వనంలో నీ కనులెంత కోమలంగా, వాటి ఛాయలు ఎంత గంభీరంగా ఉండేవో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. నువ్వు ఆనందంతోమురిసి మిసమిసలాడినపుడు నిన్నెందరు ప్రేమించేరో లెక్కలేదు నీ సౌందర్యాన్ని స్వచ్ఛమైన ప్రేమతోనూ, కపటంతోనూ ఆరాధించినవారున్నారు. కాని ఒక్కవ్యక్తి మాత్రం “దేహసంచారియైన నీ ఆత్మని” మనసారా ప్రేమించాడు ఆమ్రేడితమవుతున్న దుఃఖాలకి మారుతున్న నీ ముఖకవళికల్నీ ప్రేమించాడు. జ్వలిస్తున్న ఆ…
-
దాయాదుల పోరు… ఎలినార్ వైలీ, అమెరికను కవయిత్రి
ఒకసారి, మా ఆయన చిన్నతనంలో, వాళ్ళ నాన్నగారికి చుట్టాన్ననుకుంటూ ఒకాయన ఇంటికి భోజనానికి వచ్చేడు, అతను తొడుక్కున్న బట్ట వెలిసిపోయి, అతనికంటే పాలిపోయి ఉంది. అతను చూడడానికి గంభీరంగా ఉన్నా, దయాళువుగానే కనిపించాడు; గాయకుడు సెన్ లాక్ పేరుగలిగిన అతని నవ్వూ, అచ్చం అతనిలానే ఉంది. అతను బాగా మొగమాటపడుతూ, మర్యాదగా, నవ్వుతూ మాటాడేడు; “హేమంతం అడుగుపెట్టినదగ్గరనుండీ నేను ఆ అడవిలోనే ఉంటున్నాను, నాలుగునెలలై ఉంటుంది; మీరన్నది నిజం, చాలారోజులయింది.” గతంలో అతని దాయాదుల్ని ఇరవైమంది దాకా హతమార్చేడు,…
-
నవజాత శిశువుకి… లూయీ అంటర్ మేయర్, ఆమెరికను కవి
జీవితమనే కదనరంగానికి ఇదిగో బిడ్డా, నువ్వు ఏతెంచేవు, విజయ సూచకంగా అరుచుకుంటూ, కానీ, ఒక సంఘర్షణ నుండి మరొక సంఘర్షణ లోకి తమస్సీమలనుండి, సందేహాలలోకి అడుగిడుతునావు. వయసనే సున్నితమైన కవచాన్ని ధరించి, బిడ్డా, నువ్వు అనేక యుద్ధాలలో పాల్గొనాలి, నిరసనలే నీ కృపాణాలుగా, సత్యమే నీ డాలుగా, తారామండలాలను జయించడానికి ప్రేమే నీ పతాకం కావాలి. నీ చుట్టూ ప్రపంచంలోని నిరాశానిస్పృహలు అలముకుంటాయి, ఒకోసారి పరాజయం పాలై, దారివెతుక్కోవలసి వస్తుంది. తప్పటడుగులువేస్తున్నవారికి, నువ్వు ప్రేరణవి కా; నిరాశాతప్తమైన…
-
ఏడిల్ స్ట్రాప్… ఎడ్వర్ద్ థామస్, ఇంగ్లీషు కవి
అవును … ఏడిల్ స్ట్రాప్… ఆ ఊరుపేరు నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఒకరోజు మధ్యాహ్నం మంచి ఎండవేళలో ఆ ఊర్లో రైలు ఆగింది అకస్మాత్తుగా; అవి జూన్ నెల చివరిరోజులు. అక్కడ చెట్లూ, చెట్లనానుకున్న లతలూ, పచ్చికా, వనసంపదా, గడ్డివాములూ… సమస్తమూ ఆకాసంలో వెల్లగా వేలాడే బొల్లిమేఘాల్లా నిశ్చలంగా, వేటిమట్టుకు అవి ఉన్నాయి. ఒక్క నిముషంపాటు దగ్గరలోనే ఒక నల్లని పక్షి కుయ్యగానే, చిత్రంగా దానికి ప్రతిస్పందన అన్నట్టు దూరంగా ఆక్స్ ఫర్డ్ షీర్, గ్లాస్టర్…
-
ప్రేమ అందిన తర్వాత… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇక అందులో ఏమాత్రం గారడీ కనిపించదు, అందరూ కలుసుకున్నట్టే మనమూ కలుసుకుంటాము నువ్వు, నేను ఆశ్చర్యపొయేపనులు చెయ్యవు నేను, నువ్వు ఆశ్చర్యపోయేలా ఉండను. నువ్వు పవనానివి, నేను సముద్రాన్ని, రెండింటిలో ఏ గొప్పదనమూ కనిపించదు. నేను సముద్రపొడ్డున ఉన్న నీటిగుంటలా అశాంతితో జీవిస్తుంటాను. నిజమే, నీటిగుంటకి తుఫానులతాకిడి ఉండదు పెద్ద అలలనుండి దానికి విశ్రాంతి ఉంటుంది. కానీ, దానికున్న ప్రశాంతతకి సముద్రం కంటే కల్లోలంగా ఉంటుంది. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January…