-
మార్తా… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి
“అనగా అనగా ఒక ఊళ్ళో…” అలా ఎన్ని సార్లు ప్రారంభించి మార్తా మాకందరికీ ఆ చిలకపచ్చని కోనలో ఎన్ని కథలు చెప్పేదో. ఆమెవి చాలా స్వచ్ఛమైన గోధుమవన్నె కళ్ళు మీరు గాని వాటిని అలా చూస్తూ ఉంటే అసలు ఆ కథలన్నీ ఆ కళ్ళు తమ కలల ప్రశాంతతతో చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె తన సన్నని రెండు చేతులతో తనముణుకులని బంధించినట్టు కూచునేది; మేము మాత్రం మా రెండు చేతులమీదా వెనక్కి వాలి ఆమె వంకే అలా…
-
ఉత్తరాలు రానపుడు… గెరీ కేంబ్రిడ్జ్, స్కాటిష్ కవి
నేను జీవితాన్ని ఎంచుకోకతప్పదు, ఇక్కడ నువ్వింత నిర్లక్ష్యంగా ఉంటూ, రహస్యాలేవీ లేనపుడు … నువ్వు స్టాండుమీదనుండి కొవ్వొత్తి తీసుకుని చీకటి గదుల్లోంచి దీపంలేని స్నానాలగదిలోకి నడుచుకుంటూ పోతావు అక్కడ మనిద్దరం మధ్యయుగంనాటి అద్భుతకథలోలా జంటగా వేడినీటి స్నానం చేస్తాం, ఊసులాడుకుంటూ సువాసనలు వెదజల్లే ఆవిరిలో స్నానంచేస్తున్నామన్న స్పృహతోనూ… బయట దట్టంగాకురుస్తున్న రాత్రివర్షానికీ, గీపెడుతున్న తుఫానుగాలికీ దూరంగా. అన్నిగంటలు కలిసి ఉండడంలో సంతృప్తి పరచడానికి ఏదీ మిగిలి లేదు; మనిద్దరం కలుషాలు వీడి, శాంతిపడి, పొడిబారి, సుగంధభరితమైన శరీరాలతో…
-
తక్కినవాళ్ళు… డేవిడ్ బెర్మన్… అమెరికను కవి
కొందరికి సాహిత్యంలో జీవిత లక్ష్యం దొరుకుతుంది కొందరికి లలిత కళలలో, ఎవరికి వారికి అది మనసులోనే దొరుకుతుందన్న నమ్మికకి కొందరు అంకితమౌతారు. కొందరికి మదిరలో ఆనందం దొరుకుతుంది కొందరికి మగువలో కొందరికి జీవితంలో వెలుగెన్నడూ దొరకదు వాళ్ళు చీకటితోనే సర్దుకుపోతారు. మనం వాళ్ళగురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళెప్పుడూ దుఃఖంలో మునిగి ఉన్నట్టు ఊహించుకోవచ్చు; కానీ, అది నిజం కాదు; వాళ్ళకి కనిపించని ఆ వెలుగు వాళ్ళెన్నడూ కోరుకున్నది కాదు. . డేవిడ్ బెర్మన్ జననం 4 జనవరి 1967…
-
శాంతశీలి సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి
ఒక చిన్నగుట్టమీద ఒంటరిగా నిశ్శబ్దంగా ఉన్న శాంతశీలియైన ఒక సాలీడుని అది దానిపరిసరాల్లోని ఖాళీజాగాలని ఎలా వాడుకుందికి ప్రయత్నిస్తుందో గమనించేను. అది ముందుగా దానిపొట్టలోంచి ఒక సన్నని దారాన్ని తీసి దూకింది, అక్కడినుండి అలసటలేకుండా దారాన్ని తీస్తూ అల్లుతూనే ఉంది… పరీవ్యాప్తమైన, ఎల్లలులేని రోదసిచే చుట్టుముట్టబడి నిర్లిప్తంగా నిలబడ్డ ఓ నా మనసా! నిరంతరం ఆలోచిస్తూ, కనిపిస్తున్న గోళాలచలనాన్ని అర్థంచేసుకుందికి సాహసంతో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ, విడిచిపెడుతూ, చివరకి నీకు నచ్చిన సిద్ధాంతం దొరికేక, నిరాధారమైన ఆలోచనల వంతెన…
-
స్థూలంగా చూసినపుడు … లార్డ్ టెన్నిసన్, ఇంగ్లీషు కవి
ప్రేమలో, ప్రేమ నిజంగా ప్రేమ అయి, ఆ ప్రేమ మనదైనపుడు విశ్వాసమూ, విశ్వాసఘాతమూ సమ ఉజ్జీలు ఎన్నడూ కాలేవు; స్థూలంగా చూసినపుడు అన్నిచోట్లా విశ్వాసఘాతం అంటే, అపనమ్మకమే. వీణలో ఎక్కడో అతి చిన్న బీట, క్రమక్రమంగా దానిలోని సంగీతాన్ని హరిస్తూ, క్రమంగా వ్యాపిస్తూ వ్యాపిస్తూ,దాన్ని పూర్తిగా మూగబోయేట్టు చేస్తుంది. అలాగే, ప్రేమిక మదివీణియలోని చిన్న బీట లేదా ఏరినపండ్లమధ్య కనిపించని ఒక చిన్న ముల్లు, లోలోపలే కుళ్ళిపోయి దానిచుట్టూ బూజుపేరుకునేలా చేస్తుంది ఇక అది దాచుకుందికి పనికి…
-
అసత్యం… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
ఓ ఆత్మా! ఈ శరీరపు అతిథీ! ఫో! ఎవ్వరూ మెచ్చని ఈ పని చేసిపెట్టు; అత్యుత్తమమైన వాటిని ఎంచుకోడానికి వెనుకాడకు; సత్యమొక్కటే నీకు అనుమతి పత్రం. ఫో! ఫో! నాకు మరణం ఆసన్నమయింది. పోయి లోకం చేసే తప్పులు … తప్పులని చెప్పు! రాజాస్థానికి పోయి అది కుళ్ళిన కట్టెలా వెలుగుతోందని చెప్పు; చర్చికి పోయి అది మంచేదో చెబుతుంది గాని, ఏ మంచీ చెయ్యదని చెప్పు. చర్చిగాని, రాజసభగాని వాదిస్తే, వాళ్ల సమాధానాలు నిర్ద్వంద్వంగా ఖండించు.…
-
సత్యదర్శనము… కొవెంట్రీ పాట్ మోర్, ఇంగ్లీషు కవి
ఒక వ్యర్థ కవి, నూటికొక్కడు తనపరిసరాల్ని పరికిస్తాడు, కానీ, తక్కినపుడు అతని అవగాహనకి అందనంత సౌందర్యవంతంగా ఉండే సృష్టి, అతనికి కుకవి హాస్యం కంటే పేలవంగా కనిపిస్తుంది. ప్రేమ ప్రతి వ్యక్తినీ జీవితంలో ఒక్కసారి మేల్కొలుపుతుంది; మనిషి తన బరువైన కనులెత్తి, పరికిస్తాడు; ఆహ్! ఒక సౌందర్యవంతమైన పేజీ బోధించలేనిదేమున్నది! దాన్ని ఆనందంతో చదువుతారు, మళ్ళీ పుస్తకం మూసేస్తారు. కొన్ని కృతజ్ఞతలూ, కొన్ని దూషణలూ గడచిన తర్వాత, చాలమంది అన్నీ మరిచిపోతారు, కానీ, ఎలా చూసినా, గుర్తుపెట్టుకోలేని…
-
రసగీతి… విలియం ఓల్డిస్ , ఇంగ్లండు
క్షణం తీరికలేక, కుతూహలంతో, దాహంతో తిరిగే ఓ ఈగా, నేను తాగుతున్నట్టుగానే, నెమ్మదిగా ఈ పానీయం తాగు; నా కప్పు మీదకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను, నువ్వు దీన్ని తాగగలిగితే, సొక్కి సోలు; నీ జీవితంనుండి పొందగలిగినంత పొందు, జీవితం చాలా క్షణికం, త్వరగా కరిగిపోతుంది. నీదీ నాదీ ఒక్క తీరే, కాలం త్వరగా అస్తమదిక్కుకి పరిగెడుతుంది; నీది ఒక్క వసంతమే, నాదీ అంతకంటే ఎక్కువేం కాదు, కాకపొతే అది మూడు ఇరవైల వసంతాలు తిరుగుతుంది; ఆ…
-
ప్రకృతి… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
నిద్రపుచ్చడానికి … సగం ఇష్టంగా, సగం అయిష్టంగా నేలమీద తను ఆడుకుంటూన్న వస్తువులనన్నీ నేలమీదే వదిలేసి, అయినా తెరిచిఉన్న తలుపులోంచి వాటిని చూస్తూ, పూర్తిగా ఊరడింపూలేక, వాటికి బదులు ఇస్తానన్నవి అంతకంటే మంచివైనా సంతోషం కలిగిస్తాయన్న హామీ లేక, బాధపడే చిన్న పిల్లాడిని ఆ రోజుకి ఆటముగిసేక ప్రేమగా లాలిస్తూ చెయ్యిపట్టుకుని లాక్కువెళ్ళే పిచ్చితల్లిలా ప్రకృతికూడా మనతో సంచరిస్తుంది, మన ఆటవస్తువుల్ని ఒక్కటొక్కటిగా లాక్కుంటూ, మనల్ని చెయ్యిపట్టుకుని మన విశ్రాంతి స్థలానికి నెమ్మదిగా నడిపించి తీసుకుపోతుంది కళ్ళమొయ్యా…
-
నూత్న మహావిగ్రహం… ఎమ్మా లాజరస్, అమెరికను కవయిత్రి
అద్భుతమైన ఈ కవిత అమెరికా దేశపు నాయకత్వం 20 వశతాబ్దం మొదలు వరకూ పాటించిన ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. చిత్రంగా అదే దేశపు నేటి నాయకుల ఆకాంక్షలూ, అభిప్రాయాలూ దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో సాగుతున్నాయి. ఫ్రెంచి ప్రజల సౌహార్ద్ర సూచకంగా అమెరికనులకు బహూకరించబడిన ఈ రాగితో చేసిన విగ్రహాన్ని గుస్తావ్ ఈఫెల్ నిర్మించగా, అక్టోబరు 28, 1886 న జాతికి అంకితం చెయ్యబడింది. కవయిత్రి మరణించిన 15 సంవత్సరాలకు, 2003 లో Statue of Liberty పదపీఠాన…