-
1979లో బ్రూక్లిన్… జడ్సన్ జెరోమ్, అమెరికను కవి
ఓ వ్హిట్మన్! ఈ రోజుల్లో నువ్వు జీవించి ఉండాల్సింది బ్రూక్లిన్ సబ్వేలలో ప్రయాణిస్తూనో, కేబ్ లలో వెళుతూనో; గాయాలని మాన్చే ప్రయత్నంకాకుండా, మా జీవితాలను చేదుగా చేసిన గాయాలపై ఎండిన పొక్కులు తొలగిస్తూ. నువ్వెరిగిన ఆరోగ్యవంతులైన కార్మికులు ఇప్పుడు కార్ఖానాల్లో వంటింట్లో, ఆఫీసుల్లో, ప్రయోగశాలల్లో ఒదుక్కుని బ్రతుకుతున్నారు. ఇక్కడి కాంక్రీటు గోడల మధ్య బిక్కుబిక్కు మంటున్న వాళ్ళ హృదయాలు నీ ప్రేమలో కొంత ధైర్యాన్ని పుంజుకోవచ్చునేమో! ఓ వాల్ట్! అన్ని చీకటి ప్రదేశాల్లోకీ ఏ సంకోచాలూ లేకుండా…
-
చాలారోజుల తర్వాత కలిసినపుడు… జెఫ్ హోల్ట్, అమెరికను కవి
ఆ రోజుల్లో అయితే ప్లాస్టిక్ మెనూ కార్డులమీద కెచప్ మరకలూ, నలిగిపోయిన పేపర్ మ్యాట్ లమీద ఇంకిపోయిన నీటి డాగులూ బాధపెట్టి ఉండేవి కావు. కానీ అదెప్పటి మాట. పదేళ్ళు గడిచిపోయాయి మేం పెదాలు తుడుచుకుంటూ మాటాడుకుంటున్నాం. మా జీవితాల్ని సంగ్రహంగా, గానుగెద్దుజీవితాలని తేల్చుకుని, వెర్రి నవ్వులవెనుక దాచుకున్నాం. లిప్ స్టిక్ అంటుకున్న అతని కాఫీ కప్పు మార్చాలి. అతనికి అర్థం కాని జోకు చెప్పలేక నేను సతమతమౌతున్నాను, అతను తన కారు గురించి చెబుతున్న గొప్పలు…
-
ఆగష్టులో కాలిఫోర్నియా కొండలు… డేనా జోయ్ యె, అమెరికను కవి
మంచి ఎండవేళ ఎవరైనా ఈ కొండల్ని ఎక్కుతూ కాలిక్రింద నలుగుతున్న కలుపుమొక్కల్నీ, ధూళినీ తిట్టుకుంటూ చిరాకుపడుతున్నారంటే, నీడనివ్వడానికి మరినాలుగు చెట్లుంటే బాగుణ్ణని కోరుకుంటారంటే నేను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా తూరుపువైపు వాళ్ళు వేసవిలో పల్చబడిపోయిన ప్రకృతినీ ఎండి వంకరతిరిగిన నల్ల ఎల్మ్ చెట్లూ, ఓక్ పొదలూ తుప్పలతో ఆగష్టునెలకే హరించుకుపోయిన హరితాన్ని చూసి అసహ్యించుకుంటారు ఒంటికీ, బట్టలకీ తగులుకొంటున్న ముళ్ళ చెట్లూ, పొదలూ, ఏట్రింతలూ తప్పించుకు నడిచే వాళ్ళకి, అవి కలుపుమొక్కలే అని తెలిసినా ఈ మొక్కలకీ,…
-
పదవీ విరమణచేస్తున్న గ్రద్ద … రాబర్ట్ ప్రాన్సిస్ , అమెరికను కవి
అందరూ అనుకుంటున్నారు గ్రద్ద గ్రద్దగా ఉండి విసిగెత్తిపోయిందనీ దాని రెక్కలు మార్చుకోవాలనుకుంటోందనీ అంతగా రాజసం లేని మరో పక్షికి మాటవరసకి, సీగల్ ని, పదవి అప్పగించి తను తప్పుకోవాలనుకుంటోందని. హంసలలోనూ, కొంగలలోనూ, బాతులలోనూ అదే పుకారు వ్యాపించింది, దాని అధికార హోదా ఏ మాత్రం నచ్చక, అది నమ్మశక్యంకని కారణమనుకోండి వీలయితే కేవలం ఒక పక్షిగానే ఉండిపోయి పదవి విరమించి ప్రశాంతంగా ఉండాలనుకుంటోందని. ఒక పుకారు వ్యాప్తిలో ఉంది గ్రద్ద రాష్ట్రీయ చిహ్నంగా అధికారముద్రలో తన స్థనాన్నీ…
-
పురికొసను పోలిన క్రూరత్వం … చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను
[గమనిక: వ్యవహారంలో జనపనారతో పేనిన తాడుని కూడా పురికొస అంటారు. కానీ, ఇక్కడ అదికాదు. విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో అచ్చం సాలీడుని పోలి, కుట్టినపుడు మనిషికి విషం ఎక్కే పురుగుని పురికొస అంటారు.] . మంచి మధ్యాహ్న వేళ వాళ్ళు నిన్ను యురోపులో ఏ కాఫీ హోటల్లోనైనా ముందువరుస టేబిళ్ళదగ్గర కూచో నివ్వరు. నువ్వుగాని అలా కూచున్నావో ఎవడో ఒకడు పక్కనుండి వాహనం నడుపుకుంటూ వచ్చి నీ గొంతులో, సబ్ మెషీన్ గన్ తో తూటాలు దించి…
-
జ్ఞాపకం… సుజేన్ డోయిల్, అమెరికను కవయిత్రి
(మాత్యూ డోయిల్ జేకోబస్ కి) . ఒకరోజు నేను నిన్ను మీ అమ్మపక్కనుండి ఎత్తుకొచ్చాను (ఆ సారవంతమైన ఉప్పుటేరు ఎంత ఉత్సాహంగా ఉందో నీకు గుర్తుండదు) అక్కడికి నెత్తళ్ళు (మిన్నోలు) కెరటాలతోపాటే కొట్టుకొచ్చాయి ఉక్కపోతగా ఉన్న ఆ చోట, మేము ఊపిరాడక తెగ కష్టపడ్డాము. నీకప్పటికి ఇంకా నాలుగు నిండలేదు, నాకు వయసుపైబడి (నీకు గుర్తుండదు గాని నువ్వు గుర్తుపెట్టుకోవాలి) నేను మమకారంతో కొట్టుకుంటున్నాను. “ఇక్కడ ఈదకూడదు” అని రాసి ఉండడం చదివేను; అయినా నిన్ను ఈదడానికి…
-
ప్రభాత స్తుతి… డిక్ డేవిస్, ఇంగ్లీషు కవి
ఈ కవిత మయూర మహాకవి వ్రాసిన సూర్య శతకంలో మొట్టమొదటిశ్లోకాన్ని గుర్తుకు తెస్తోంది: జంభారాతీభకుంభోద్భవమివ దధతః సాంద్ర సింధూర రేణుమ్ రక్తాస్సిక్తా ఇవౌఘైరుదయగిరితటీ ధాతుధారా ద్రవస్య ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచే వారుణావో విభూత్యై భూయాసుర్భాసయంతో భువన మభినవా భానవో భానవీయాః (ప్రాన్నగమునుండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఇంద్రుడి ఐరావతం నుండి వస్తున్న సింధూర రేణువుల్లాగా, ఉదయగిరులపైనున్న గైరికాది ధాతువుల ప్రవాహంచే తడిసి ఎర్రనైనట్టుగానూ, అదే సమయంలో పూర్తిగా విచ్చుకుంటున్న ఎర్రకలువలనుండి ఎగసి వస్తున్న పుప్పొడికాంతులతోనూ కలిసి మనోహరంగా…
-
అశ్రద్ధచేసిన పూలతోట… రాబర్ట్ క్రాఫర్డ్, స్కాటిష్ కవి
ఆగష్టునెల వచ్చేసరికి నిర్లక్ష్యపుచాయలు గమనించాను ఇపుడు సెప్టెంబరులో నాకు నైరాశ్యం వచ్చేస్తోంది; తుప్పుపడుతున్న పనిముట్లు, మాయమవుతున్న వరుసలు, ఈ ప్రయత్నమంతా తాత్కాలికమని చెప్పకనే చెబుతున్నాయి ఆశావహంగా ప్రారంభమైన కార్యాచరణ ముగింపుకి వచ్చేసింది ఇప్పుడిది రాబోయే చెడురోజులను సూచించే కాకిమూకలకీ, ఏది పడితే అది మొలవడానికి అనుకూలంగా ఎన్నడు తయారవుతుందా అని ఎదురుచూసే కలుపుమొక్కలకీ నెలవు; ఈ చక్కని పూలవనాన్ని బీడువారేలా నిర్లక్ష్యం చేసిన తోటమాలి ఎవరై ఉంటాడు? నాకు తెలుసని అనుకుంటాను? కొందర్ని కలిసేను కూడా: అతను…
-
సహ- అనుభూతి … టీ. ఎస్. ఏలియట్ , ఇంగ్లీషు కవి
కాలం ఎంత అనంతమో, వ్యధాభరితక్షణాలుకూడా అంతే శాశ్వతమని మనం తెలుసుకుంటాము. కానీ, ఈ ఎరుక, మన స్వానుభవంలో కంటే, ఇతరుల మనోవ్యధలతో సహ అనుభూతి ద్వారా ఎక్కువ సాథ్యపడుతుంది. కారణం మన గతం మన చేష్టలవల్ల ప్రభావితమౌతుంది; కానీ ఇతరుల వేదనని ఆ క్షణంలో ఏ షరతులకూ లోబడకుండా అనుభూతి చెందడమే గాదు, సంతాపప్రకటన తర్వాతకూడా అది సమసిపోదు. మనుషులు మారతారు; చిరునవ్వులు మొలకెత్తుతాయి; కానీ వేదన శాశ్వతంగా నిలుస్తుంది. . టీ. ఎస్. ఏలియట్ …