-
విరహగీతి… రిచర్డ్ ఓ మూర్, అమెరికను కవి
ఓ ప్రభాతమా!నేను చాలా దీనావస్థలో ఉన్నాను. బహుశా నేను ఏ హీనద్రవ్యంతోనో చెయ్యబడి ఉంటాను తుత్తునాగం, సీసం లాంటివి. నేను పక్కమీంచి లేవను. నా మనసు విషాదంతో నిండిపోయింది నీ బంగారు మెరుగు ఆశ్వాదించడానికి. మనసు క్రుంగిపోయి, అంతా రసహీనంగా కనిపిస్తోంది. సంజ వెలుగా, తక్షణం ఇక్కడనుండి పో! నీ వెలుగు నీదగ్గరే ఉంచుకో! . రిచర్డ్ ఓ మూర్ (February 26, 1920 – March 25, 2015) అమెరికను కవి . . Aubade .…
-
ఏడ్నా సెంట్ విన్సెంట్ మిలే సమాధి దగ్గర… సామ్యూల్ మినాష్, అమెరికను కవి
ఇక్కడ పాతిన అస్థికలశలో నీ చితాభశ్మము నాకు జీవితం పట్ల మితిలేని ప్రేమ రగిల్చింది. ఒకప్రక్క కొవ్వొత్తి కరిగిపోతోంది. మిత్రుడూ- శత్రువూ కొవ్వూ- వత్తీ పరిధుల్ని దాటి చీకటి శాశ్వతం. . సామ్యూల్ మినాష్ (September 16, 1925 – August 22, 2011) అమెరికను కవి . Edna St. Vincent Millay (February 22, 1892 – October 19, 1950) was an American poet and playwright. She received the…
-
విశీర్ణశయ్య… జోషువా మెహిగన్ అమెరికను కవి
ఎలాగైతేనేం చివరకి,ఆ జీర్ణమయిన శయ్యనుండి ధవళవస్త్రధారులు తనభర్త శవాన్ని బయటకి తీసుకుపోతుంటే, కళ్ళప్పగించి చూడటం తప్ప ఆమెకు ఏమీ చెయ్యడం చాతకాలేదు. ఆమె తనలో తాను, కర్మకాండ అంత ఆర్భాటంగా జరిగినపుడు తన స్నేహితులంత మంచివారెక్కడా ఉండరని అనుకుంది. కర్మకాండ జరుగుతున్నంత సేపూ చేష్టలుడిగి చూడటం తప్ప ఆమె వేరే ఏమీ చెయ్యలేకపోయింది. ఏడాది పాటు అతనికై శోకించింది. భవిష్యత్తు గూర్చిన దిగులు తొలగిన తర్వాత, ఆమెకు తన సామర్థ్యం మీద దిగులు పట్టుకుంది. ఎలాగోలా పక్కమీంచి…
-
ప్రార్థన… హెన్రీ డేవిడ్ థరో, అమెరికను కవి
శక్తిసంపన్నుడవైన ప్రభూ! నన్ను నేను నిరాశపరచుకోకుండా జీవించగలగడాన్ని మించి ఏ తుచ్ఛ సంపదలూ కోరుకోను, నా చేతల్లో, ఇప్పుడు ఈ కంటితో స్పష్టంగా ఏ ఎత్తులైతే చూడగలుగుతున్నానో, ఆ ఎత్తులకి ఎదగగలిగేలా ఆశీర్వదించు. ఆ చేతల విలువ, అది నీ కటాక్షఫలితమే గనుక, నీవు ఏ ప్రత్యేకత నాకు ప్రసాదించావో అది నా మిత్రుల ఊహకి అందనివిషయం గనుక,వాళ్ళు దానిని ఎలా నిర్వచించినా, విలువకట్టినా, వాళ్లని నేను నిరుత్సాహపరచినా, పరచనీ. అశక్తమైన ఈ చెయ్యి, నా ప్రగాఢమైన…
-
ఋతువు గడిచిపోయేక… కేట్ లైట్ , అమెరికను కవయిత్రి
ఇప్పుడు నాతో ఏమీ మాటాడొద్దు; నా మానాన్న నన్నుండనీ. మనం మన బాధల్లో, నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం, కనుక సముద్రంలో మునిగిన ప్రేమికుల్ని గాలమేసిపట్టి తిరిగి కలుపుతున్నాను. వాళ్ళ గుండెల్లోంచి బాకులు పైకి తీసి, గాయాలకి కుట్లుకుడుతున్నాను ఎవరు ఎవరిని ప్రేమించారో స్పష్టం చేస్తున్నాను. ఇక్కడనుండి పో! ఇప్పుడేమీ మాటాడకు; నన్ను నా మానాన్న వదిలెయ్. నేను పువ్వుల్నీ, మందుల్నీ, శృతిమార్చి వేణువుల్నీ పంపిణీచేస్తున్నాను; హేమంతంలోకూరుకుపోయిన వసంతాన్ని బయటకి లాగి ఉత్తరాలు తిరగరాస్తున్నాను సముద్రంలో మునిగిన ప్రేమికుల్ని…
-
నల్లకాకి… పాల్ లేక్, అమెరికను కవి
తెల్లవారుతూనే, మా కిటికీ ప్రక్కన తుప్పుపట్టిన గొట్టం చేసే చప్పుడు లాంటి చప్పుడువిని లేచాము. తెరలు తొలగించి లేతవెలుగులో డాగ్ హౌస్ వైపు చూడబోతే పక్కింటి వాళ్ళ పిల్లిమీద ఒక నల్లకాకి ఎంత గట్టిగా అరుస్తోందంటే, క్షణకాలం, ఈ పక్షులు ఎగిరి పారిపోవాలన్న ఉపాయాన్ని మరిచిపోయి, బదులుగా, ముక్కు ముందుకి సూదిగా చాపి మాటకిమాట గట్టిగా, ప్రతిధ్వనించేలా ఎందుకు అరుస్తున్నాయనిపించింది. తర్వాత దానికి అసలు కారణం తెలిసింది: కంచెకి దగ్గరలో, పువ్వులులేని డేఫొడిల్స్ కొమ్మల మధ్య పల్చని…
-
చేతికి అంటిన ఆనవాళ్ళు … లెన్ క్రిసాక్, అమెరికను కవి
ఇది మనకి బాగా పరిచయమైన సాయంసంధ్యా చిత్రంతో పాటు, ప్రకృతిలోని ఒక సంఘటనని చమత్కారంగా కవితలోకి మలుచుకోవడంలో కవి ప్రతిభ కనిపిస్తుంది. మా మిత్రుడు శ్రీ యెరికలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు (సమవర్తి పేరుతో ఈమాటలో పద్యాలు వ్రాస్తుంటారు) ఒక సందర్భంలో రాత్రి ప్రకృతిని వర్ణించి వర్ణించి, ముగింపుగా, దానికి “ప్రాతః సూర్యదీపాంజలి” సమర్పిస్తున్నానని సూర్యోదయాన్ని పేర్కొంటూ ముగిస్తారు. అది గుర్తొచ్చింది ఈ కవిత చదవగానే. *** నేల చదునుచెయ్యడం పూర్తయి, కోసినగడ్డి బస్తాకెత్తి గట్టుమీదపెట్టి, నొప్పెడుతున్న వీపుని…
-
కవులకి సలహా… ఎక్స్. జె. కెన్నెడీ, అమెరికను కవి
మీ కుబుసాన్ని విడిచిపెట్టండి! ఒక ముఖాన్ని ఎత్తుకురండి! … చాలభవిష్యత్తుంటుంది. ప్రాటియస్ కన్నా చిత్రంగా … వేషాలు మారుస్తుండండి. చాలామంది గాఢమైన అనుభవాలూ కష్టాలూ ఎదురైనప్పుడు పూర్తిగా మారిపోతారు. ఏ కొద్దిమందో ఎప్పుడూ ఉన్నట్టే ఉంటారు. . ఎక్స్. జె. కెన్నెడీ జననం 21 ఆగష్టు 1929 అమెరికను కవి, విమర్శకుడు. . The Devil’s Advice to Poets Molt that skin! Lift that face!—you’ll go far. Grow like Proteus yet…
-
గులాబుల్లో ఏముంది?… ఏ ఎమ్ జస్టర్, అమెరికను కవి
శతాబ్దాలతరబడి అనుకూలమైన పరంపరాభివృద్ధి వలన గులాబులు బాగా ముద్దుచేసి పెంచబడిన జాతిగా మారేయి. వాటి ఆకర్షణ నిజానికి భ్రాంతి. వాటి బలహీనమైన దళాలు అడవిలో పెరగడానికి పనికి రావు వాటిలో నిర్దిష్టంగా కనిపించని అనురూప్యత సన్నగా బలహీనంగా కనిపించే రీతీ వైకల్యాన్నికూడా ప్రశంసించేలా చేస్తాయి. రోడ్డువార చిక్కగా దట్టంగా అల్లుకుని విరిసే పూలగుత్తులు ఇంతకంటే మెరుగు నేనయితే, తమంత తాము నిలబడలేక పాచిపట్టిన చెట్ల ముళ్ళని సైతం హత్తుకుని ఎగబాకే లతల్ని ఇష్టపడతాను అవి వాటిని పీడకలలంత…