-
పొడి రాత్రులు… ఫ్రెడెరిక్ టర్నర్, అమెరికను కవి
పాపం! ఆ చంటివాడు బాల్యానికి ప్రతీకలా ఉన్నాడు అతని ‘పక్క’ అడవిజంతువు అవాసంలా కంపుకొడుతోంది అతని శరీరం ఒక అలా నిద్రిస్తుంటే, అమాయకత్వం అతనిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతని కలల్ల్ని కబ్జా చేస్తే అతనికి అన్యాయం చేసినవాళ్లమవుతాం! ఆ పరాయీకరణనీ, వింతవింత సున్నపురాయంత తెల్లని తీరాల్నీ, పేరులేని అందమైన ప్రదేశాలనీ, అతని విశృంఖలమైన కలనీ మృదుస్పర్శతో తోసిపుచ్చగలమా? ఈ మధ్యనే అతను మంగలిషాపులో కుర్చీలో కూచున్నాడు పెద్దవ్యాపారస్థుడిలా ఠీవిగా, దర్జాగా. అతను నవ్విన నవ్వు ఎంత విచిత్రంగా…
-
ఏలిస్ స్మృతిలో… కేథరీన్ టఫెరీలో, అమెరికను కవయిత్రి
ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట నువ్వున్నావని ఎప్పుడూ అనుకుంటుంటాను; ఎప్పుడో ఒకరోజు మళ్ళీ మనిద్దరం తప్పకుండా కలుసుకుంటామనీ ఎన్నో ఏళ్ళు గడిచిపోయిన తర్వాత హాయిగా తిరిగివచ్చిన హీరోల్లా, మనిద్దరం మన సాహసగాథలు కలబోసుకుంటామనీ భావించేదాన్ని. మనిద్దరం కలిసి కుస్తీపట్లు పడుతూ “ఈలియడ్” చదివి అప్పుడే 12 ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యం కాకుంది, అది ట్రోజన్ యుద్ధం జరిగిన సమయంకంటే ఎక్కువ, ఆ తర్వాత ఒడిస్సస్ చేసిన సాహసయాత్రలకన్నా తక్కువ. మీ అమ్మగారు నువ్వు లేవని చెప్పిన తర్వాత…
-
స్థానికురాలు… మెరిలీన్ టేలర్, అమెరికను కవయిత్రి
టోక్యోలోనో, లేదా, నాగసాకీ లోనో మీకు “మీ విధేయురాలి” ఫోటో కనిపించవచ్చు గెరాల్డ్ ఫొర్డ్ ప్రెసిడెంటుగా ఉన్న తొలిరోజుల్లో మిల్వాకీ లోని వోల్స్కీ టావెర్న్ దగ్గర తీయించుకున్నదది. నేను పొట్టి నిక్కరూ, కాటన్ టీ-షర్టూ వేసుకుని(గులాబిరంగు టై వెలిసి ఆకుపచ్చగా మారుతోంది) బహుశా జేమ్స్ డీన్ కి బాగా నచ్చే విధంగా, ఒంటిమీద చిరుగుపడ్డ స్వెట్టరుతో ఉంటాను. నా వెనకే ఒక పర్యాటకుల బస్సు ఒకటి ఆగి ఉంది జపానునుండి యాత్రికులు తలుపు తెరుచుకుని బయటకి దూకారు…
-
ఒక చిన్న సందు… ఏలన్ సల్లివాన్, అమెరికను కవి
విను! హడావుడిగా వేసిన రోడ్డుమీద పాంకోళ్ల టకటక ఇంకా వినిపిస్తూనే ఉంది. ఒక చాకలి స్త్రీ శ్రమ మరవడానికి పదం పాడుకుంటోంది ఇద్దరు అల్లరి పిల్లలు జాక్స్ ఆట ఆడుతూ తగువులాడుకుంటున్నారు. కనిపించని ఘంట ఎక్కడో ఆగష్టులోని ఓ రోజుముగిసిందనడానికి సూచికగా మోగుతోంది. అయినా, అన్నీ ఉన్నచోటే ఉన్నాయి. ఈ కిటికీతలుపులు ఎన్నడూ కొట్టుకోవు ఈ పిల్లలెప్పుడూ ఇంటిముంగిట తెలుపునలుపు గీతలు దాటిపోరు. మేఘాలు పోతూపోతూ ఒక చినుకు రాల్చడమో, లేదా అస్తమసూర్యుడి వెలుగులకి వాటి బుగ్గలు…
-
తమార్ కి ఓదార్పు… ఎలీషియా స్టాలింగ్స్, అమెరికను కవయి
(ఒక పురాతనమైన మట్టిపాత్రని పగులగొట్టినందుకు) . తమార్! నేనేమీ పురావస్తుశాస్త్రజ్ఞుడిని కాదు నాకు ఆ మట్టయినా, ఈ మట్టయినా ఒక్కటే. కానీ, ఇన్ని వేల సంవత్సరాలు భూకంపాలనీ, వరదల్నీ, యుద్ధాలనీ తట్టుకుని నిలబడాలంటే, దాన్లో ఏదో గొప్పదనం ఉండాలి. కానీ, చివరకి అది నీచేతిలో పగిలిపోయింది. గురుత్వాకర్షణశక్తి వల్లో, లేదా నీ చేతిలో రాసిపెట్టి ఉండో… నాకేమనిపిస్తుందంటే, అది ఇన్నాళ్ళూ ఆ భూమి పొరల్లో ఇన్ని యుగాలుగా నిరీక్షించి ఉండకపోతే, నీ వేలికొసల సంగీతానికి, బహుశా నీ…
-
లలితమైన ప్రకంపనలు… జాన్ ష్రైబర్, అమెరికను కవి
ఆ జంత్రవాద్యం స్పష్టమైన ధ్వని తరంగాలు విడిచిపెడుతుంది అవి త్వరగా లయమైపోతాయి. అవి ఆశ్చర్యమగ్నమైన మనసుని అకస్మాత్తుగా ముంచెత్తి కనుమరుగయే ప్రేమలాంటివి. ఆ శబ్దానికి స్వరమిచ్చే చేతులు మరొక స్థాయిలో తిరిగి ప్రాణం పోస్తే, మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకున్న ఎంపిక క్షణాలు గడుస్తున్నా మారకుండా స్థిరంగా ఉంటుంది. నేను నిన్న నీకు నా ప్రేమ వ్యక్తపరిచినపుడు మామూలుగా ఆ కథ అక్కడితో అంతమైపోయి ఉండేది. కానీ, నా ప్రేమకి నువ్వు సమాధానం ఇచ్చి నేను దాన్ని మరిచిపోలేకుండా…
-
మనలో మన మాట… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి
ఎవరన్నారు ఈ పిల్లల్ని ఎగిరిపోనివ్వాలని? ఈ పిల్లలు మన పేగుతో ముడిపడినవాళ్ళు వాళ్లకి మన అవసరం ఉంటుంది, చివరకి ఎగిరిపోనివ్వడమేనా? (నేను ఈ మాటలు అనవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు) ఋతువులన్నీ సంగీతంలోని స్వరాల్లా క్రమంతప్పకుండా వచ్చిపోయే ఈ ఇంటి చెట్టుకి దగ్గరలోనే … ఏ కొమ్మమీదో గూడుకట్టుకుంటే, ఏమిటిట నష్టం? ఈ-ఉత్తరాలనీ, పుట్టినరోజు కార్డులనీ, ఫోన్లనీ ఎప్పుడూ మనం రొట్టె తునకలే ఎందుకు ఏరుకోవాలి? తక్కినవాళ్లందరూ వాళ్ళపిల్లలతో హాయిగా ఉంటే మనమెందుకు ఇట్టే గడిచిపోయే శలవులతో…
-
వెడల్పైన కుంచె … ఆల్ఫ్రెడ్ నికోల్, అమెరికను కవి
శీతకాలం పొద్దు తిరిగిన సాయం వేళ తెల్లని భవనాలకి శ్రామికులు తెలుపు రంగులు పూస్తుంటే, వాళ్ళ నిచ్చెనల నీడలు, ముసురుకుంటున్న చీకట్లని కలుసుకుందికి గోడలు ఎగబ్రాకుతున్నాయి. . ఆల్ఫ్రెడ్ నికోల్ జననం: 1956 అమెరికను కవి. Photo Courtesy: https://www.alfrednicol.com/ Wide Brush (Vanity of vanities, says the Preacher; all is vanity. Eccl. 12:8) Late afternoon, in the slant winter light, Where men are painting…
-
మరణించిన కవి… టిమొతీ మర్ఫీ , అమెరికను కవి
ఎలాగైతేనేం చివరకి, అతని జీర్ణకుటీరం నుండి త్రోవ తిన్నగా స్వర్గానికి పోతుంది గడియపెట్టబడిన స్వర్గపు పెరటిద్వారం దగ్గర దేవతలు కొన్ని వేలమంది అర్హత పరీక్షిస్తూ అదేమిటో, కొందరిని అల్పమైన కవితకే స్వర్గంలోకి అనుమతిస్తారు. . టిమొతీ మర్ఫీ జననం 1951 అమెరికను . . The Dead Poet At last the path runs straight from his hovel to the skies and the bolted postern gate of the Western Paradise…
-
When You Become an Introvert… Vijay Koganti, Telugu, Indian
Sometimes, every cumulus Turns a blind eye to you; and No new dawn Hugs you in its warm embrace. No downy touch Shall be within your each To call you back from slipping into The abysses of your inmost self. It’s the same trail of fragrance That you greet every day,…