అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఆగస్ట్ 15, 2017

    ప్రియతమా!ఇప్పుడు నిన్ను మరిచిపోగలను… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి

    ప్రియతమా! నిన్నిపుడు మరిచిపోగలను. కనుక ఆ మిగిలిన ఒక్క రోజూ, నెలా, సంవత్సరమూ నేను మరణించేలోగా, మరిచిపోయేలోగా, ఎడబాటయేలోగా ఉన్న సమయాన్ని ఎంతవీలయితే అంతబాగా గడుపు. దానితో సరి. ఆపై శాశ్వతంగా ఒకరిఊసు ఒకరికి ఉండదు. ముందే అన్నట్టు నిన్ను క్రమంగా మరిచిపోతాను. కానీ ఇప్పుడు నువ్వు నీ అందమైన అబద్ధంతో బ్రతిమాలబోతే నా అలవాటైన ఒట్టుతో ప్రతిఘటిస్తాను. నిజానికి ప్రేమ చిరకాలం కొనసాగితే బాగుణ్ణని నాకూ ఉంది ఒట్లుకూడా అంతబలహీనంగా ఉండకపోతే బాగుణ్ణనీ ఉంది కానీ…

  • ఆగస్ట్ 14, 2017

    మినర్వా జోన్స్… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి

    1915 లో Spoon River Anthology అన్న పేరుతో Edgar Lee Masters సంకలనం ప్రచురించి ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఆయన స్వంత ఊరుకి దగ్గరగా ప్రవహిస్తున్న Spoon River పేరుతో ఒక నగరాన్ని కల్పనచేసి, ఆ నగర ప్రజలలో 212 మంది మృతులు తమ జీవితాలగురించి తామే చెబుతున్నట్టుగా 244 సంఘటనలను ప్రస్తావిస్తూ కవితలు వ్రాసాడు. అమెరికను నగరాల గురించి, పల్లెల గురించి ప్రజలలో ఉన్న కొన్ని భ్రమలని తొలగింపజెయ్యడమే ఈ సంకలనం ముఖ్యోద్దేశం.…

  • ఆగస్ట్ 13, 2017

    నేను నిన్ను ప్రేమించేను గనుక… A E హౌజ్మన్, ఇంగ్లీషు కవి

    మగవాడు తన అహాన్ని అథిగమించి ప్రకటించేంతగా నిన్ను ప్రేమించేను గనుక, నీకు చిరాకు కలిగించింది; ఆ ఆలోచన విడిచిపెడతానని నీకు మాటిచ్చేను. మనిద్దరం పెడసరంగా, ఏ స్పందనలూ లేకుండా  విడిపోయాము … భూఖండాలు మారిపోయాము. “నన్ను మరిచిపో, శలవు,” అన్నావు నువ్వు. “ఫర్వాలేదు, మరిచిపోగలను,” అన్నాను నేను. భవిష్యత్తులో, నువ్వు ఈ “తెల్ల పూల”తో నిండిన శ్మశానపు దిబ్బలమీంచి వేళ్ళే సందర్భం కుదిరితే, ఈ మూడాకుల గరికలో ఏ పొడవాటి పువ్వూ నిన్ను పలకరించి ఆశ్చర్యపరచకపోతే, “ఈ…

  • ఆగస్ట్ 12, 2017

    పల్లెటూరిసంతలో… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

    మనిషికి వివేకము గొప్ప వరం. మనిషిని తక్కిన జంతువులతో వేరుచేయగల సాధనం అదే. కానీ, మనిషి తన వివేకాన్ని కాకుండా తన నమ్మకాలమీద ఎక్కువ ఆధారపడతాడు. అవి ఒంటికన్నువి. అంటే, నమ్మకాలు కొన్ని కోణాల్ని మాత్రమే చూపించగలవు. అయినా మనిషి ఆ ఒంటికన్ను నమ్మకాలకే, తన వివేకాన్ని బానిసగా చేసి ప్రవర్తిస్తాడని చాలా చమత్కారంగా చెప్పిన కవిత *** మొన్న జరిగిన ఒక పల్లెటూరి సంతలో ఒక మరుగుజ్జు ఒక మహాకాయుణ్ణి రుమాలువంటి ఎర్రని తాడుతో నడిపించూకుంటూ…

  • ఆగస్ట్ 10, 2017

    హైలా సెలయేరు… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను

    జూన్ నెలకి మా సెలయేటి పరుగూ, సంగీతమూ పల్చబడతాయి ఆ తర్వాత దాని కోసం ఎంత గాలించినా, ఎక్కడో భూగర్భంలో కనీ కనిపించకుండా పారడమో (హైలా తనతో బాటే నెలరోజుల క్రిందటివరకూ మంచులో గంటలుకొట్టుకుంటూ పరిగెత్తే బళ్ళలా పొగమంచులో నినదించిన పాదప, జీవజాలాన్ని తీసుకుపోతుంది) లేదా దాని నీళ్ళు పలచబడుతున్న కొద్దీ పెరిగిన కలుపుమొక్కలతో నిండి, గాలికి ఇట్టే కొట్టుకుపోయే బలహీన మొక్కలతో మలుపువరకూ సాగుతుంది. ఇప్పుడు ఆ సెలయేటి గర్భంలో రంగు వెలసిన కాగితంలా ఎండుటాకులు…

  • ఆగస్ట్ 8, 2017

    నవంబరు నెల… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

    ఎక్కడ గులాబి ఉందో అక్కడ పిల్లతెమ్మెర ఉంది ఎక్కడ చక్కని గడ్ది ఉందో అక్కడ మంచుసోన ఉంది ఇక దొంతరదొంతరలుగా మేఘమాలికలు అంతుదొరకని వినీల విహాయస వీధుల్లో “లార్క్” తోపాటు విహరిస్తూనే ఉన్నాయి. చెయ్యి ఎక్కడ ఉందో అక్కడ వేడి లేదు జుత్తు ఎక్కడ ఉందో అక్కడ పసిడివెలుగు లేదు ఏకాకిగా, దెయ్యంలా ముళ్ళపొదలక్రింద ప్రతి ముఖం ప్రేతకళ సంతరించుకుని ఉంది ఎక్కడ మాటవినవస్తోందో, అక్కడ చలిగాలి వీస్తోంది నాగుండె ఎక్కడ ఉందో అక్కడ కన్నీరే కన్నీరు…

  • ఆగస్ట్ 7, 2017

    అనుసరణీయాలు… మైకేల్ యూంగ్, అమెరికను

    రహదారి రద్దీ, జనసందోహం, ఒడ్డుకి దూసుకొస్తున్న కెరటం ఆ మాటకొస్తే ఉధృతంగా ఎగసి చప్పున చల్లారేదేదైనా, ముందు మెల్లగా ప్రారంభమై తర్వాత సమసిపోతుంది, ప్రతిక్షణాన్నీ, అది తీసుకువచ్చే సందర్భాల్నీ మరిచిపోతూ… ఉదాహరణకి గాలి మేఘాల్ని తోసుకుపోతుంది, మేఘాలు రోజుని, రాత్రి పోతూ పోతూ సూర్యుణ్ణి ఆహ్వానిస్తుంది, జీవితమంత కల, ఒక్క క్షణంలో గడిచిపోతుంది, ఇందులో ఏదీ పొగడ్తలనీ, తెగడ్తలనీ ఆశించి క్షణం ఆగదు, కంటికి దొరికినంత చేదుకుని, చెయ్యి ఇవ్వగలిగినది ఇవ్వండి… దానితో సరి … ఈ…

  • ఆగస్ట్ 6, 2017

    వార్షిక ఆదాయాలు… గ్రెగ్ విలియమ్ సన్, అమెరికను కవి

    ఈ పద్యంలో చెప్పిన కుర్రాడు ఎవరో కాదు: నేనూ, మీరూ, మనమందరమూను. అకస్మాత్తుగా మనకి తెలియని ఏదో చోటునుండి అదృష్టం కలిసివచ్చి లాభపడాలని అంతరాంతరాల్లో ఆశపడుతూ ఉండే మన మనఃప్రవృత్తిని బాగా పట్టిచూపించిన వ్యంగ్య కవిత ఇది. *** డబ్బు చెట్లకి కాస్తే అప్పుడెంత ఆనందంగా ఉంటుంది! పిల్లలు డబ్బులో పొర్లుతారు తండ్రులు ఊడ్చి తెచ్చి పడేస్తుంటారు. చెట్లకొమ్మల్లో ఉన్న పెట్టుబడులు పెద్ద లాభాలు ఆర్జిస్తుంటాయి చెట్లు సంపదని అలా రాలుస్తుంటే మనదగ్గరా తగలేయగలిగినంత డబ్బుంటుంది ఐనప్పటికీ…

  • ఆగస్ట్ 5, 2017

    ఆగ్రహ గీతం … గెయిల్ వైట్, అమెరికను కవయిత్రి

    నేను న్యూ మెక్సికోగుండా కారు నడుపుకుంటూ వెళుతున్నాను మాటవరసకి, ఎదురుగా అస్తమసూర్యుడి అందాలు చూసుకుంటూ. కానీ నేను శాంతా ఫే చేరుకునే లోపు, ఇదిగో ఓ అపరిచితుడా, నువ్వు కనిపిస్తున్నావు, నీ పెద్ద బుర్రతో, టన్ను బరువున్న SVVతో, బంగారు రంగు అస్తమసూర్యుడి గురించి పట్టించుకోకుండా. 99 శాతం ఖచ్చితంగా చెప్పగలను … నువ్వు సెల్ ఫోనులో మాటాడుతున్నావని… ఏమనుకోపోతే దాన్ని పక్కనబెడతావా? నేను బయట భోజనం చేస్తున్నాను…అలసిన మెదడుకణాలు ఏకశృతిలోకి రావడానికి ఉత్తమమార్గం చేపలకూర తింటూ, మెర్లోట్…

  • ఆగస్ట్ 4, 2017

    బేరసారాలు … డెబోరా వారెన్, అమెరికను కవయిత్రి

    నాకు ఒక ధనికుడి కథ తెలుసును: గాయాలనుండో, ప్లేగునుండో, అమ్మవారో, లేక కుష్టువ్యాధో… ఏదో రోగంతో మంచం పట్టో, మృత్యుముఖంలోకి వెళ్లినపుడో అతనొక ప్రమాణం చేసుకున్నాడు: భగవంతుడే గనక తన మొర ఆలకించి తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, అతను అతని కృతజ్ఞతను ప్రకటించడానికి బ్రహ్మాండమైన శిలలతో ఒక అద్భుతమైన చర్చి కట్టిస్తానని. నా సంగతీ అంతే. నేనుకూడా దేముడితో నాకునచ్చినట్టు బేరసారాలు కొనసాగిస్తాను (అయితే, ఇక్కడ దేముడంటే నా ఉద్దేశ్యం నేనే). ఇలా అనుకుంటుంటాను: “ఓ…

←మునుపటి పుట
1 … 56 57 58 59 60 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు