అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 2, 2017

    ఇక నీకు ఎండ బాధలేదు… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

    ఇక నీకు ఎండ బాధలేదు… ఎంత గజగజ వణికించినా చలి బాధా లేదు; నువ్వు ఈ లోకంలో వచ్చిన పని పూర్తిచేసుకుని ఇంటిముఖం పట్టేవు, తగిన వేతనం అందుకున్నావు; అందమైన, డబ్బున్న మగపిల్లలైనా ఆడపిల్లలైనా, బీదా బిక్కీ అనాధల్లా ఒకరోజు మట్టిలో కలవవలసిందే. గొప్ప అధికారుల కోపం నిను భయపెట్టదు; నిరంకుశుల బాధల పరిధి దాటిపోయావు; ఇక కూడూ గుడ్డా గురించి ఆలోచించే పని లేదు; నీకు చెట్టుకీ, రెల్లుగడ్డికీ మధ్య భేదం లేదు; మహరాజయినా, మేధావైనా,…

  • సెప్టెంబర్ 1, 2017

    సత్యం ఉత్కృష్టమైనది … కొవెంట్రీ పాట్ మోర్, ఇంగ్లీషు కవి

    మహానగరానికి దూరంగా,సూదిగా ఎత్తుగా ఉన్న శిఖరాల క్రింద సందడిగా ఉంటూనే మనసుకి ప్రశాంతతనిచ్చే ఈ సముద్రతీరాన రోజుకి రెండుసార్లు పెద్దకెరటాలతో (High Tide) ఏ లక్ష్యమూ లేకుండా, ఉత్సాహంతో వచ్చిపోయే సముద్రాన్ని చూడడానికి నేను వచ్చి కూచుంటుంటాను. నేను లేకపోయినంత మాత్రాన్న లోకవ్యవహారం ఆగిపోదు; దాని లక్ష్యం నెరవేరిన తర్వాత అసత్యం కూడా మురిగిపోతుంది. కానీ సత్యం మాత్రం చాలా ఉత్కృష్టమైనది… దాని ఉనికిని ఇతరులు పట్టించుకున్నా లేకున్నా, అశ్రాంతంగా కొనసాగుతూనే ఉంటుంది. . కొవెంట్రీ పాట్…

  • ఆగస్ట్ 31, 2017

    మంచు పలకలు … H W లాంగ్ ఫెలో, అమెరికను

    మోడువారి, నగ్నంగా ఉన్న అటవీ సీమల మీంచి కోతల తర్వాత ఉపేక్షించబడిన పంటభూములమీంచి గాలి గుండె లోతుల్లోంచి, దాని మొయిలు ఉడుపుల కదలికలలలోంచి, నిశ్శబ్దంగా, నెమ్మదిగా, మెత్తగా మంచు జాలువారుతోంది. చిత్రమైన ఆకారాలు ధరించే ఈ మేఘాలు అకస్మాత్తుగా దివ్యాకృతుల్లో కనిపించినా, పాలిపోయిన వదనంతో కలతచెందిన మనసు తన తప్పిదాలను ఒప్పుకుని మన్నించమని వేడుకుంటుంటే ఉద్విగ్నమైన ఆకాశ శకలం తన మనసులోని బాధను వ్యక్తం చేస్తుంది. ఈ కవిత గాలి అంతరంగ వ్యధ మౌనంగా సడిలేని శబ్దవర్ణాలతో…

  • ఆగస్ట్ 30, 2017

    నానావర్ణ సౌందర్యం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి

                                                                                                Trout                …

  • ఆగస్ట్ 29, 2017

    ప్రేమ… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి

    ప్రేమ నాకు స్వాగతం పలికింది, కానీ నా మనసు వెనక్కి లాగింది నా మురికినీ, చేసిన పాపాలనీ తలుచుకుని. కానీ చురుకు చూపులుగల ప్రేమ నేను లోపలికి అడుగుపెట్టిన తర్వాత నేను వెనుకాడడం ఇట్టే గ్రహించి నన్ను తనకి దగ్గరగా తీసుకుంది, మధురమైన స్వరంతో నాకేమిటి కావాలో అడిగింది. “ఇక్కడికి రా దగిన అతిథులెలా ఉంటారో చూద్దామని,” అన్నాను ప్రేమ, “వేరెవరో ఎందుకు నువ్వే ఆ అతిథివి,” అంది. “నేనా? నావంటి నిర్దయుడూ, కృతఘ్నుడూనా? ప్రభూ! అది…

  • ఆగస్ట్ 28, 2017

    ప్రార్థన … లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

    ప్రభూ! ఈ బ్రతుకు జీవచ్ఛవం లాంటిదైనప్పటికీ మేమేమి చేస్తున్నామో మాకు అవగాహనలేకపోయినప్పటికీ మేము పురిలేని సన్నని దారంవంటి నమ్మకాలతో బ్రతుకుతున్నప్పటికీ పోరాడి ఓడిపోవడానికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించు. ఎప్పుడైనా తిరగబడగలిగితే నన్ను తిరగబడనీ నన్ను భక్తుడికంటే సాహసికుడిని చెయ్యి నన్ను అన్నిటికీ అతి సులభంగా సంతృప్తిపడేలా చెయ్యకు నన్ను ఎప్పుడూ సందేహాలతో తేలియాడేలా అనుగ్రహించు. దృశ్యాలచుట్టూ పరివేష్టితమైన అందాన్నీ ఆశ్చర్యకరమైన విషయాలనీ చూడగలిగే కన్నులివ్వు కానీ అన్ని వేళలా పంకిలాలనీ అందులోనే పుట్టి నశించేవాటినీ చూడగలిగేట్టు చెయ్యి.…

  • ఆగస్ట్ 27, 2017

    జమీందారు తోట … ఎడ్వర్డ్ థామస్, ఇంగ్లీషు కవి

    రాయిలాంటి మట్టికూడా కొద్దిగా మెత్తబడింది, రెండుప్రక్కలా ప్రవహిస్తున్న పిల్లకాలువలతో కంచెల్లో కదలాడుతున్న పూలతో రోడ్డు తళతళలాడుతోంది. ఎండకాస్తున్నప్పటికీ నేల తనమానాన తాను నిద్ర తీస్తోంది. ఏనాటిదో ఈ జమీందారు తోటనీ, చర్చినీ, దానికి ఎదురుగా వయసులో, ఎత్తులో సమానంగా ఉన్న యూ-చెట్టునీ చూసేదాకా వాలుగా పడుతున్న కిరణాల్ని మామూలుగా అయితే లెక్కపెట్టేవాడిని కాదు అవి ఫిబ్రవరి నెల సౌందర్యంలో ఒక భాగంగా అనుకుని ఉండే వాడిని. ఆ చర్చీ, ఆ యూ-చెట్టూ, జమీందారు తోటా ఆదివారం మధ్యాహ్నపు…

  • ఆగస్ట్ 26, 2017

    కర్తవ్యం… సారా టీజ్డేల్, అమెరికను కయిత్రి

    వెర్రివాడా! పనికిమాలిన చేతులతో గాలిని చెదరగొట్టడానికి ప్రయత్నించకు— జరగవలసిన పొరపాటు జరిగిపోయింది; బీజం పడింది. చేసిన నేరం స్థిరమైపోయింది. ఇప్పుడు నీ కర్తవ్యం చేసిన పొరపాట్ల వలలోనుండి చేసిన దుష్కార్యాల అల్లికలోనుండి ఒక రాగాన్ని సృష్టించగలవేమో చూడడం. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . Duty Fool, do not beat the air With miserable hands— The wrong is done, the…

  • ఆగస్ట్ 17, 2017

    అనైతికం … ఎజ్రా పౌండ్, అమెరికను కవి

    మనం ప్రేమకోసం, తీరుబడికోసం అర్థిస్తాం మిగతావి ఏవీ అర్రులుజాచేంత గొప్పవి కావు నేను చాలా దేశాలు తిరిగినా జీవితంలో ప్రత్యేకత ఏదీ కనిపించలేదు. గులాబిరేకలు వాడికృశిస్తేనేం నేను నా ఇష్టమైనది ఆరగిస్తాను హంగేరీలో ఘనకార్యాలు చేసేకంటే అందరి నమ్మకాలూ దాటి ముందుకెళతాను. . ఎజ్రా పౌండ్ (30 October 1885 – 1 November 1972) అమెరికను కవి. . An Immorality . Sing we for love and idleness, Naught else is…

  • ఆగస్ట్ 16, 2017

    యువకుడూ- ఆయుధాలూ…. విల్ఫ్రెడ్ ఓవెన్, ఇంగ్లీషు కవి

    ఆ కుర్రాడిని తుపాకి బాయ్ నెట్ కత్తిని అలా చేత్తో రాస్తూ అది ఎంత చల్లగా ఉందో, ఎంత రాక్తదాహంతో పదునుగా ఉందో వెర్రివాడి చేతిలో రాయిలా, అసూయతో పచ్చబారిందో, మాంసానికి అలమటిస్తూ సన్నగా తీర్చబడిందో తెలుసుకోనీండి. యువకుల గుండెల్లో ఒదగాలని తపించే, మొండి, విచక్షణ ఎరుగని సీసపుగుళ్ళని ఇచ్చి లాలనగా నిమరనీండి లేదా వాళ్ళకి పదునైన జింకు గుళ్ళని సరఫరా చెయ్యండి అవి దుఃఖమూ, మృత్యువంత పదునుగా ఉండాలి. అతని దంతాలు ఆపిలుపండు కొరుకుతూ ఆనందంగా…

←మునుపటి పుట
1 … 55 56 57 58 59 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు