-
విధేయత… ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఏనాడో ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు వెనక్కి తీసుకున్నావు; ఇచ్చిన హృదయాన్నీ వెనక్కి తీసుకున్నావు- నేను దానికి కూడా పోనీమని ఊరుకోవాలి. నాడు ప్రేమ ఊపిరులూదినచోట, నేడు గర్వము నశించింది; తొలుత గొలుసు తెగిపోకుండా ఉండడానికీ, తర్వాత, తెగిన లంకెలు కలిపి ఉంచడానికీ నేను ఎంతో ప్రయత్నించాను గాని, ప్రయోజనం లేదు. పూర్వంలా నీ స్నేహాన్ని పరిపూర్ణంగా నేను పునరుద్ధరించలేక పోవచ్చు, నీ నుండి తీసుకున్న హృదయం ఇకనుండి ఎల్లకాలమూ నా స్వంతమే. ఏ పశ్చాత్తాపభావనా నిన్నిక స్పృశించదు,…
-
శాంతికిరణపు వెలుగులో… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, బ్రిటిషు కవయిత్రి
ప్రభూ! నా జీవితం ఆహ్లాదకరమైన రాజమార్గంలా ఉండాలని నిన్ను అభ్యర్థించను; ఆ భారంలో లవలేశమైనా నిన్ను భరించమని కోరను; నా పాదాలక్రింద ఎప్పుడూ పువ్వులు విరియాలని నిన్ను అడుగను; వెగటుపుట్టేంత తియ్యగా ఉండే జీవితంలోని విషాదమూ, చేసే గాయాలూ నాకు బాగా అనుభవమే. ప్రభూ! పరమాత్మా! నేను నిన్ను కోరుకునేదొక్కటే: శరీరంలో శక్తి సన్నగిల్లనీ, హృదయం రక్తమోడనీ శాంతికిరణపు వెలుగులో నేను సరియైన దారిలో నడవగలిగేలా అనుగ్రహించు! ప్రభూ! ఇక్కడ నీ పరిపూర్ణమైన వెలుగులు ప్రసరించాలని కూడా…
-
ధూళి… డొరతీ ఏండర్సన్
ధూళి అంటే ఏమిటి? భస్మమైన ప్రేమ, రంగువెలిసిన ఉత్తరాలు, వాడిపోయిన పువ్వులు, జీవంలేని చేతిలోంచి రాలిపడ్డ గులాబిరేకులు సాలీళ్ళూ, గబ్బిలాలూ, పాడుబడిన ఇళ్ళూ, కూలుతున్న దుర్గాలూ, కాలగర్భంలో కలిసిపోయిన వీరసైనికుల రథచక్రాల జాడలు. అంతేనా? ఓహ్! ధూళంటే వెలుగూ, కేరింతలూ సర్కస్సులూ, విలాసమైన గొడుగులూ, ఒళ్ళుచక్కదిద్దుకుంటున్న పావురాలూ రాదారి దాపునే విహరిస్తున్న ప్రేమజంటలూ ఎండలో రోడ్డుమీద తడబడుతూ నడిచే చిరుగుపాతల తాగుబోతులూ. ధూళంటే సుమధురమైన పొదరిళ్ళలో చిక్కిన రంగుల ఇంద్రధనుసు వలలు. ఈ ధూళే, నక్షత్రాల మిరిమిట్లు…
-
మృత్యువు కనికరిస్తే … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మృత్యువు కనికరించి, మళ్ళీ ప్రాణం పోసుకోకపోతే ఏదో ఒక పరిమళభరితమైన నిశీధిని మనిద్దరం భూమిమీదకి దిగి ఈ రహదారి వంపులన్నీ తిరిగి ఈ సముద్రతీరం చేరుకుంటాం; ఈ శ్వేతసౌగంధిక కుసుమాలనే మరొకమారు ఆఘ్రాణిస్తాం. ఏ చీకటిరాత్రిలోనో, తరంగశృతులతో మారుమోగే ఈ తీరాలకి అనవరతం లీలగా వినిపించే ఈ కడలి ఘోష వినడానికి వస్తాం; ఎటుచూచినా సన్నగా జాలువారే చుక్కలకాంతిలో ఒక గంట గడిపి ఆనందంతో పరవశిస్తాం. మనకేమిటి? మృతులు స్వతంత్రులుగదా! . సారా టీజ్డేల్ (August 8,…
-
పొద్దుపొడుపు వేళ… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
కొందరు మగాళ్ళు, ఒక పుస్తకాల షాపుని దాటి పోలేరు. (ఓ ఇల్లాలా, మనసు రాయి చేసుకో, జీవితకాలం నిరీక్షించు) కొందరు మగాళ్ళు చెత్త ఆటలు ఆడకుండా ఉండలేరు. (“ఏదీ చీకటిపడే వేళకు రానూ?” అన్నాడు, అప్పుడే సూర్యోదయం కావస్తోంది) కొందరు మగాళ్ళు పానశాలను దాటి రాలేరు. (నిరీక్షించు, ఎదురుచూడు… చివరకు అదే మిగులుతుంది) కొందరు మగాళ్ళు అందమైన స్త్రీని దాటి పోలేరు. (భగవంతుడా! అలాంటి వాళ్ళని నాదగ్గరకు పంపకు) కొందరు మగాళ్ళు గాల్ఫ్ మైదానం దాటి రాలేరు. (పుస్తకం చదువు,…
-
కల… ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నా రోదనకి విలువ లేదు నువ్వు నవ్వితే, నేను పట్టించుకోను. అలా ఆలోచించడం నా తెలివితక్కువలా కనిపించవచ్చు కానీ, నువ్వక్కడ ఉన్నావన్న భావన ఎంతో బాగుంటుంది. ప్రియతమా! నిద్రలో నేను మేలుకున్నట్టు కలగన్నాను… భయపెట్టే,తెల్లని వెన్నెల అలా నేలమీద పాకురుతూ వచ్చింది…ఎక్కడో, ఏ మూలనో కిటికీ ఓరగా ఉంది… అది కిర్రు మంది. చిత్రం! గాలికి కొట్టుకుందేమో అనుకుందికి గాలే లేదు! నాకు చాలా భయమేసింది. నీకోసం చూశాను. నీ అనునయంకోసం చెయ్యి చాచేను… కానీ…
-
అహః ప్రవాహం … కేథరీన్ టఫెరీలో అమెరికను
మూడు గంటలు, ఆమె నే నెరిగిన గది ఒక్కొక్కటీ మారుతూ తుడవడం గమనిస్తాను మగతనిద్రలోనే కళ్ళముందు ఏవో బొమ్మలు కదలాడుతుంటే, ఆ చీపురు చప్పుడు వింటాను. అది ఆకుల గలలా ఉంటుంది కాగితాల రెపరెపలా ఉంటుంది జాచినచేతులతో చెల్లాచెదరుచేసే మంచులానూ; మూలన కుంపటి పేట్టే నిట్టూర్పు వినిపిస్తుంది దానితో పాటే ఆమె నిట్టూర్పూ వినిపిస్తుంది ఆమె చేతిలోని అడక లయాన్వితంగా నడుపుతూనే. అది నన్ను ఈ నేలమీంచి, ఈ ద్వారంలోంచి ఆలా సముద్రం మీదకి నడుపుకుంటూ పోతోంది.…
-
స్వీట్ ఛారియట్ అంత్యక్రియల సంఘం ప్రకటన… మెరిలీన్ టేలర్, అమెరికను
[ముందుగా ఊహించినట్టు సమాధులలో ఖాళీజాగా కొరత కారణంగా ఒక సరికొత్త సేవ అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇందులోని ప్రత్యేకత వ్యక్తుల భౌతిక అవశేషాలను జాగ్రత్తగా ఒక అంతరిక్ష నాళికలో ప్రోదిచేసి, భద్రపరచి చివరకు భూకక్ష్యలో శాశ్వతంగా ఉండేటట్టు ప్రవేశపెట్టడం…. డిస్కవర్ మేగజీన్ ] *** మిత్రమా! మేము మా సామర్థ్యాన్ని మించి పనిచేస్తున్నాం. ఇక మేము మీ సమాధికై పచ్చని పచ్చిక స్థలాన్ని కేటాయించలేము. ఖాళీ జాగా అలభ్యం. మా ఖాతాదారులకు వినతి: బదులుగా, మీరు మీ చితా…
-
చిన్న ఓడ … ఏలన్ సల్లివాన్, అమెరికను
సొగసైన తీరానికి వీడ్కోలు చెప్పి, చుక్కాని నిలకడజేసి జోరుగా తెప్ప వెళుతుంటే, అందులో అటూ ఇటూ తిరగడం ఇష్టంగా ఉండేది. తక్కిన ఓడసరంగులకు హుషారుగా చెయ్యి ఊపుతుండే వాడిని. అన్నిటిలోకీ నాది ఎప్పుడూ వేగంగా పోయేదని గర్వించే వాడిని. దాని పక్కలని చిన్నచిన్న అలలు తడుతూ పాడే జోలపాటలు వినడానికి అనువుగా “చుక్కలబల్ల” దగ్గర ఒదిగి పడుకోడం ఇష్టం; పెను గాలికో, వడి అలలకో అది దిశమారుతున్నప్పుడు వాడ కిటికీల్లోంచి చూడడం, సముద్రకాకుల అరుపులు వినడం ఇష్టం.…
-
మనిషికి యంత్రాల నివాళి… ఎలీషియా స్టాలింగ్స్, అమెరికను కవయిత్రి
ఆ మొరటుచేతుల వెచ్చదనాన్నిపుడు కోల్పోయాం, వాళ్ళ వేళ్లకంటుకున్న చముర్లూ, దులపడానికి ప్రయత్నించినపుడు రేగొట్టిన దుమ్మూ, మనల్ని నిందిస్తూ తిట్టే బండబూతులూ లేవిపుడు. మనం చెడిపోయినపుడు కుక్కల్ని తన్నినట్లు కాళ్ళతో తన్నేవాళ్ళు, అయినా మనం ఎన్నడూ మూలగలేదు. పళ్ళు బిగించి ఓర్చుకున్నాం. అటువంటు వాడి వేడి తిట్లు తినడం, మనల్ని కుక్కల్లా చూడడమే ఒక పెద్ద సమ్మానంగా భావించుకున్నాం. మనం అర్థాంతరంగా ఆగినపుడు వాళ్లు మనల్ని బ్రతిమాలుతూ, ఇష్టంలేని ప్రియురాలిని ప్రార్థించినట్టు గొంతుక బొంగురుపోయేలా “రా! ఈ ఒక్కసారికీ…