అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 18, 2018

    కలలు

    Originally posted on తెలుగు కథలు పద్యాలు: కలలు చాలా పెంకివి… చిన్నపిల్లల్లా… కథలోని రాజకుమారుడు అన్ని వీధులూ వదిలి ఏడో వీధికే నడిచినట్టు ఎప్పుడూ వద్దన్నవైపుకే పరిగెడతాయి… అలసి మేనువాల్చాలని ఇలా కుర్చీలో చేరబడతానా మనవరాల్లా ఒళ్ళోవాలి మెడ బిగించి, ఎలామూస్తాయో గాని, ఇట్టే కళ్ళుమూస్తాయి. రెండు రెప్పల్నీ రెక్కల్లాజాచి చెప్పలేనిలోకాలకు తీసుకుపోతాయి. మయుణ్ణి మించినమాయలాడులు కలలు. వాటికిలొంగని వాళ్ళూ, భంగపడనివాళ్ళూ ఉండరు. జీవితపు ఎడారిలో నిరాశాలదాహార్తి తీర్చే ఒయాసిస్సులు అసాధ్యమైన పనులు సుసాధ్యమయేది ఈ…

  • మార్చి 17, 2018

    అవిశ్వాసం… ఆల్బెర్టో పిమెంటా, పోర్చుగల్

    పూర్వం రోజుల్లో పళ్ళూ కాయధాన్యాలూ పూలమొక్కలూ, చేపలూ అమ్ముకునే వ్యాపారులు సంతలోని గుడారాల్లో తమ వస్తువులు పరుచుకుని నిర్భయంగా ఒకరికొకరు వ్యాపారం బాగుండాలని ఆకాంక్షలు అందించుకునే వారు. . ఇప్పుడందరూ ఆ సంప్రదాయం పాటించడం లేదు కానీ వాళ్ళందరికీ తెలుసు తమ మనుగడ ఒకరిమీద ఇంకొకరికి ఉండే విశ్వాసం మీద ఆధారపడిందని. . ఇప్పుడు ప్రతి శనివారం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం మానేశారు. వాళ్ళ కళ్ళల్లో అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ మధ్య తిరుగుతూ…

  • మార్చి 16, 2018

    ఆశావాదికి … ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

    Wall Paper Courtesy: http://www.modafinilsale.com/beautiful-sunset-wallpapers.html  నీ జీవితం నాకెప్పుడూ ఒక అందమైన సూర్యాస్తమయంలా కనిపిస్తుంది:- ఆకాశంలో వేలాడే ప్రతి పేలవమైన మేఘశకలాన్నీ నీ రసవాద నైపుణి ఒక అద్భుతమైన మణిగా మార్చివేస్తుంది; వాటినుండి వెలువడే రంగురంగుల కిరణాలు నినుదర్శించేవారికి నయనానందం కలుగజేస్తాయి. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 1866- 1925 అమెరికను కవయిత్రి To an Optimist Thy life like some fair sunset ever seems:- Each dull grey cloud thy subtle…

  • మార్చి 15, 2018

    అలనాటి నా ప్రేయసి…జేమ్స్ విట్ కూంబ్ రైలీ, అమెరికను కవి

    సాయంత్రంవేళ ఒంటరిగా కూచుని ఫోటో ఆల్బమ్ తిరగేస్తూ, అందులో కనిపించిన మిత్రుల ముఖాలు చూసి వాళ్ళ గురించి దీర్ఘంగా ఆలోచించినట్టు నా ఆలోచనల ఎండుటాకులు చెల్లాచెదురుచేస్తున్నాను వాటి నీడల అమరికలో చిరునవ్వులు చిందించే అలనాటి నా ప్రేయసి ఛాయలు కనుగొనేదాకా. నా కళ్ళలో పడుతున్న తీక్ష్ణమైన వెలుగు తగ్గించడానికి, దానిని తగ్గిస్తే లాంతరులోని దీపం ఆశ్చర్యంగా నా వంక రెప్పలు కొట్టుకుంటూ చూస్తోంది; పొగతోపాటు మాయమవడానికి పొగాకుకి బంధం వేస్తోందేమోనన్నట్టున్న నా నిట్టూర్పుతప్ప, చడీచప్పుడు లేకుండా నేను…

  • మార్చి 14, 2018

    అమ్మ కాని అమ్మ … గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి

    గర్భస్రావాలు మిమ్మల్ని ఒకంతట మరిచిపోనివ్వవు. మీ కడుపున పడి, భూమ్మీదపడని పిల్లలు మీకు గుర్తుంటారు, ఆ చిన్న తడి మాంసపు ముద్దలు జుత్తు ఉండీ, లేకనో, ఎన్నడూ ఊపిరికి నోచుకోని ఆ పాటగాళ్ళూ, పనివాళ్ళూ. మీరు ఎన్నడూ వాళ్లని నిర్లక్ష్యం చెయ్యలేరు, కొట్టలేరు వాళ్ళకి మిఠాయిలు కొనీ, మరోలా నోరు మూయించలేరు. చీకుతున్న బొటనవేలు నోట్లోంచి పక్కకి తప్పించలేరు వాళ్ళని భయపెట్టే దయ్యాలనీ భూతాల్ని పారద్రోలనూ లేరు. ప్రేమగా నిట్టూరుస్తూ వాళ్ళని విడిచిపెట్టనూ లేరు కంటితో చూసి…

  • మార్చి 13, 2018

    స్త్రీ-పురుషుల మానసిక స్థితి… డొరతీ పార్కర్, అమెరికను

    స్త్రీ ఒక పురుషుడినే భర్తగా కోరుకుంటుంది మగవాడికి ఎప్పుడూ కొత్తదనం కావాలి. స్త్రీకి ప్రేమే వెలుగూ, వెన్నెలా; మగాడు సరదాలు తీర్చుకునే మార్గాలు వేవేలు స్త్రీ తన భర్తతోనే జీవిస్తుంది ఒకటినుండి పది లెక్కపెట్టు… మగాడికి విసుగేస్తుంది. వెరసి, ఈ సారాంశము గ్రహించేక ఇందులో ఇక ఏమి మంచి జరుగనుంది ? . డొరతీ పార్కర్ 22nd Aug- 6 Jun 1967 అమెరికను కవయిత్రి . General Review of the Sex Situation .…

  • మార్చి 12, 2018

    కొన్ని రోజులు … కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి

    కొన్ని రోజులు నా ఆలోచనలు తమలోతాము ముడుచుకుపోతాయి చలికి ముడుచుకుపోయినట్టు, నీరసంగా, కళ్ళుమూసుకుని నా మనసులోని మోడుబారిన చేట్లమీంచి చినుకులు చుక్క చుక్కగా కారుతున్నట్టు వేలాడుతూ. మరికొన్ని రోజులు అవి మెరుస్తూ తేలిపోతుంటాయి గాలిలో స్వేచ్చగా రెక్కవిచ్చి మరీ ఎగురుతాయి సున్నితమైన వాటి రెక్కల తాకిడికి అంటిన బంగరు ధూళి నా కురుల్లో మెరుస్తుంది. . కార్ల్ విల్సన్ బేకర్ (1878–1960) అమెరికను కవయిత్రి   Some Days . Some days my thoughts are…

  • మార్చి 10, 2018

    పూ రేకలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    జీవితం ఒక ప్రవాహం. దానిమీద మన హృదయపుష్పపు రేకలను ఒకటొకటిగా తెంపుతూ విడిచిపెడుతుంటాము; వాటి గమ్యం మన కలలో మరుగైపోయినా అవి మన కనుచూపుమేరవరకు తేలుతూ కనిపిస్తాయి. ఆనందంగా సాగే వాటి ప్రయాణపు తొలి అడుగులు మాత్రమే మనం చూడగలం. వాటిపై ఆశలబరువును మోపుతూ, ఆనందంతో ఎరుపెక్కి మనం గులాబీ తొలి రేకలను విరజిమ్ముతాం; అవి ఎంతవరకు విస్తరిస్తాయో, చివరకి అవి ఎలా వినియోగపడతాయో మనకెన్నడూ తెలియదు. ఆ అనంత ప్రవాహం వాటిని పక్కకి నెట్టివేస్తుంది, ఒక్కొక్కటీ…

  • మార్చి 7, 2018

    చిత్రకారుడు… ఫిల్లిస్ వీట్లీ, అమెరికను కవయిత్రి

    లారా అగుపించగానే, పాపం, ఎపెలీజ్* తన కళ్ళు నొప్పెడుతున్నాయనీ, ఆ వెలుగుకి కళ్ళు చికిలించి చూడవలసి వస్తోందనీ ఆరోపించేడు. ఆమె అందం అతన్ని పూర్తిగా గ్రుడ్డివాణ్ణి చేస్తుందేమోనన్న భయంతో అతను తన కుంచెల్నీ, రంగుల పలకనీ పక్కనపెట్టేశాడు. కానీ అందాల ఏన్ రాగానే, అతనికి చూపు తిరిగొచ్చింది రంగుల్నీ కుంచెల్నీ క్రమపద్ధతిలో అమర్చేడు. ఆ చిత్రకారుడు తన ప్రవృత్తిలో మునిగిపోయాడు అంటే!బాధా, గుడ్డితనం, అన్నవి తలపులోకి రాకుండా ఎప్పటిలా గీతలు చకచకా సాగిపోతున్నాయి … ఆ శ్యామల…

  • మార్చి 6, 2018

    ఈ నేలపై తారకలు శాశ్వతం … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    భూమి తనలో తాను తిరిగిన ప్రతి రోజూ… మనం ప్రేమించిన ఇల్లూ, ఇష్టపడిన వీధీ కనుమరుగైనా… ఈ నేలపై తారకలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి శరత్కాలపు విషువత్ నాటి రాత్రి మనకి తెలిసిన రెండు చుక్కలు, సరిగ్గా అర్థరాత్రి వేళ ఆకసంలో ఉచ్చస్థితికి చేరుకుంటాయి; జడత్వం గాఢమౌతుంది ఈ నేలపై తారకలు శాశ్వతంగా ఉంటాయి మనం నిద్రలోకి జారుకున్నా, తారకలు మాత్రం శాశ్వతం. . . సారా టీజ్డేల్ (8 August 1884 – 29 January…

←మునుపటి పుట
1 … 49 50 51 52 53 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు