అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఏప్రిల్ 1, 2018

    పల్లె పదాలు… సరీజినీ నాయుడు, భారతీయ కవయిత్రి

    నా దుత్తలు నింపుకున్నా, చాలాదూరం మోసుకుపోవాలి తోడులేని సుదీర్ఘమైన ఒంటరి దారి, కానీ ఈ ఓడ సరంగు పాట నన్నెందుకు బులిపిస్తోంది? దారికి అడ్డంపడి నన్నెందుకు ముందుకి పోనివ్వదు? అయ్యో అప్పుడే చీకటిపడిపోతోంది. ష్! వినండి. ఏమిటది? తెల్లకొంగ పిలుపా? లేక, గుడ్లగూబ అరుపా? దారి చూపించడానికి మసక వెన్నెలైనా లేదు ఈ చీకట్లో న న్నేపురుగైనా కరిస్తే? లేక ఏ భూతమో నన్ను మొడితే? రామా! హే రామా! నేను చచ్చిపోతాను! మా సోదరుడు గొణుగుతాడు…

  • మార్చి 30, 2018

    కామన… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి

    ఒంటిగా ఉయ్యాలలూగెడివాడా! నీదేమిటో తెలిసిన స్వామీ! ఓ సర్వజ్ఞుడా, ఊయలనుండి పాడెదాకా రక్షంచు, ప్రభూ, నన్ను రక్షించు! ఈ ప్రపంచపు వ్యామోహాలనుండీ ఇక్కడి విపత్తులనుండీ మేము నిరంతరం తపించి కృశించే తీవ్ర ఆవేదనలనుండీ, మృత్యువంత బరువైనదీ సమాధి అంత చల్లనిదీ అయిన మా లోలోపలికి చొచ్చుకుపోయి మమ్ము వివశుల్ని చేసే జడత్వం నుండి కాపాడు, మహప్రభో, కాపాడు! ఆప్తమిత్రుడు ‘గర్వం’  పక్కన తోడుగా నడుస్తుంటే ఈ ఆత్మ నిష్కల్మషమౌతున్నకొద్దీ భగవంతుని దరిదాపులోకూడా కనలేదో, ఈ ఆత్మ ఎత్తు…

  • మార్చి 29, 2018

    ఆఖరి ఆకు… అలెగ్జాండర్ పూష్కిన్, రష్యను కవి

    నా బ్రతుకు కోరికల పరిధి దాటింది నా వ్యామోహాలుతలుచుకుంటే విసుగేస్తోంది; శూన్యహృదయ జనితాలైన దుఃఖాలొక్కటే చివరకి మిగిలేది. నా అధికార తీరాలపై విధి రేపే క్రూరమైన తుఫానుల నీడలో నా తుది ఘడియకోసం ఎదురుచూస్తూ దుఃఖభరితమైన ఒంటరి బతుకు ఈడుస్తున్నాను. ఆవిధంగా, శీతగాలి ఊళలేస్తూ చలితో కోతపెడుతుంటే ఆఖరిఆకు మాత్రమే మిగిలి మోడుబారిన కొమ్మ … గజగజా వణుకుతోంది. . అలెగ్జాండర్ పూష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను కవి .…

  • మార్చి 28, 2018

    పోలికలు… విలా సైబర్ట్ కేథర్, అమెరికను కవయిత్రి

    (రోము నగరం లో కేపిటాల్ లో ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తి అర్థాకృతి శిల్పాన్ని చూసి) *** ప్రతి వంపులోనూ మృదుత్వం… చింతలతో నిండిన తల ఒకింత వాలి… సుఖాలపట్ల విముఖత, బాధ్యతలపట్ల తిరస్కారం, అసంతృప్తితో తెరువనిరాకరించిన కనులు. అతని ముఖంలో కనిపించే ఏహ్యభావం తప్ప జీవితంలో అనుభవించిన సుఖదుఃఖాలగురించి ఏ ఆచూకీ విడిచిపెట్టకుండా గతించిన ఈ యువకుని శిల్పం ప్రక్కన కూర్చోడానికి నేను తరచు వస్తుంటాను. ఆ ఇంటివారందరి ఆశల ప్రోవు, ఆరాధించే సోదరుడు, బంగారంలాంటి…

  • మార్చి 25, 2018

    సంశయాత్మ … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి

    ఈ పిచ్చుకలు ఎక్కడికి వలస పోయాయి? కొంపదీసి ఏ చీకటి తుఫాను తీరాలలోనో తడిసి వణుకుతూ మరణించలేదు గద! ఈ పూలు ఎందుకు వాడిపోవాలి? ఓ సంశయాత్మా! కన్నీటి వర్షాన్ని లెక్కచేయకుండా ఈ చలిపీఠాలలో ఎందుకు బందీలై ఉండాలి? ఒకవంక నీ పెదాలపై చిరునవ్వు మొలిపించడానికి శీతగాలులు వీచుతుంటే తెల్లపిల్లిలాంటి మెత్తని మంచుక్రింద అవి కేవలం నిద్రిస్తున్నాయి ఇన్నాళ్ళూ సూర్యుడు తన కిరణాల్ని దాచుకున్నాడు ఓ నా పిరికి మనసా! ఈ ప్రపంచాన్ని నైరాశ్యపు ఋతువు విడిచిపెట్టదా?…

  • మార్చి 24, 2018

    అజరామరము … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి

    చాలా విషయాలు అసలెన్నడూ జరగకపోవచ్చు;                                                                ఇది మాత్రం తప్పక జరిగి తీరుతుంది”… ఫిలిప్ లార్కిన్ *** నా మరణం గురించిన సత్యం నాకు తెలుసు ఈ లోకం తప్ప వేరెక్కడా నాకు పునరుజ్జీవనం లేదు.…

  • మార్చి 23, 2018

    మడుగు…. లయొనెల్ ఆబ్రహామ్స్, దక్షిణాఫ్రికా

    నే నెక్కడ లోతుగా ఉంటానో మీరు కనిపెట్టవచ్చు అదంతా బురదమాటు రహస్యం. నా ఉపరితలంపై పరుచుకుంది సువిశాలమైన నీలాకాశం . లయొనెల్  ఆబ్రహామ్స్ 1928–2004 దక్షిణాఫ్రికా . Pool Where I’m deepest you may discern a few muddy secrets. My surface contains the whole open sky.  . Lionel Abraham 1928–2004 South African Poet Poem Courtesy: http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/5380/10/Lionel-Abrahams

  • మార్చి 22, 2018

    కవిత్వ పరిచయం… బిల్లీ కాలిన్స్, అమెరికను

    వాళ్లని ఒక కవితని తీసుకోమని చెబుతాను. తీసుకుని, దాన్ని ఒక రంగుటద్దాన్ని చూసినట్టు వెలుతురుకి ఎదురుగా నిలపమని చెబుతాను. లేకుంటే, దాని గూటికి చెవి ఒగ్గి వినమంటాను. లేదా, కవితలోకి ఒక ఎలుకని జార్చి అది బయటకి ఎలా వస్తుందో గమనించమంటాను. కవిత చీకటి గదిలోకి ప్రవేశించి దీపపు స్విచ్చి ఎక్కడుందో గోడలు తడవమని చెబుతాను. కవిత ఉపరితలం మీద నీటిమీద స్కీయింగ్ చేసినట్టు నడుస్తూ ఒడ్డునున్న కవిపేరుకి చెయ్యి ఊపమని చెబుతాను. కానీ, ఇన్ని చెప్పినా,…

  • మార్చి 20, 2018

    కెరటాలమీద పడవ… విలియమ్ ఎలరీ చానింగ్, అమెరికను

    తెల్లని మంచు పెల్లలపై గాలి విడిచిపెట్టిన వంకర అడుగు జాడల్లా ఎగిసి మెలితిరిగిన కెరటం అదాటున విరగబడినచోట అలతోపాటు వంపులు తిరుగుతూ, మన పడవ కెరటాలపై అలవోకగా సాగుతుంది. పద! పద! నీటిపుట్టపై నిలువెత్తు త్రోవ అదిగో! పెనుగాలి రానుంది, తెరచాపలెత్తు… గాలినుండే మనము ఉత్సాహం దొరికించుకోవాలి మనసు దిటవుగా ఉంటే, ఎంత నల్లటిమేఘమైనా తలవంచుతుంది గాలి ఊళలకి మనం భయపడేది లేదు! . విలియమ్ ఎలరీ చానింగ్ (November 29, 1818 – December 23,…

  • మార్చి 19, 2018

    మగాళ్ళు… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

    నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినందుకు వాళ్ళు నిన్ను “వేగుచుక్క”వని పొగుడుతారు. అదే సుకుమార భావనతో వాళ్ళని తిరిగి మన్నిస్తే వాళ్ళు, నీ గురించి వేరే అర్థాలు తీస్తారు; వాళ్లకి రూఢిగా, చింతలేని నీ పొందు దొరికిందా వాళ్ళు నిన్ను అన్నిరకాలుగానూ మార్చడానికి ప్రయత్నిస్తారు. నీ నడతమీద, అవేశాలమీదా ఆంక్షలు పెడతారు వాళ్ళు నిన్ను నువ్వుకాని వేరే వ్యక్తిగా మార్చివేస్తారు. నువ్వు నడిచేరీతిలో నిన్ను నడవనివ్వరు వాళ్ళు తమప్రభావం చూపించి అన్నీ నేర్పుతారు. వాళ్ళు పూర్వం పొగిడినవే, అయినా,…

←మునుపటి పుట
1 … 48 49 50 51 52 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు