-
పొద్దుపొడుపు… H W లాంగ్ ఫెలో, అమెరికను కవి
సముద్రం మీంచి చిరుగాలి ఎగిసింది; “ఓ మంచు తెరలారా, నాకు దారి ఇవ్వండి,” ఓడలవంక చూస్తూ ఎలుగెత్తి, “నావికులారా! తెరచాపలెత్తండి! రాత్రి ముగిసింది!” దూరాననున్న నేలమీదకి పరిగెత్తి అరిచింది, “ఊఁ! ఊఁ! లేవండి తెల్లవారింది” అడవిదారులంటపరిగెత్తి “ఎలుగెత్తు! నీ ఆకుల జండాలన్నీ రెపరెపలాడించు!” అది వడ్రంగిపిట్ట ముడుచుకున్న రెక్కలు సవరిస్తూ “ఓ పిట్టా! లే! లే! నీ రాగం అందుకో!” పొలాలపక్కన కళ్ళాలకి పోయి, “ఓ, కోడి పుంజూ! నీ బాకా ఊదు. తెల్లారబోతోంది!” బాగా పండిన…
-
నా మతం… హోవర్డ్ ఆర్నాల్డ్ వాల్టర్, అమెరికను కవి
నేను నిజాయితీగా ఉంటాను, నన్ను నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు గనుక; నేను నిర్మలంగా ఉంటాను, నేనంటే పట్టించుకునేవారు ఉన్నారు గనుక; నేను దృఢంగా ఉంటాను, బాధపడటానికి మున్ముందు చాలా ఉంది గనుక; నేను ధైర్యంగా ఉంటాను, సాహసంతో ఎదిరించవలసింది ఉంది గనుక; నేను అందరికీ మిత్రుడుగా ఉంటాను … శత్రువుకీ, స్నేహితులు లేనివాళ్ళకీ; నేను అందరికీ అన్నీ ఇస్తూ, ఇచ్చిన విషయం మరిచిపోతాను , నేను వినయంగా ఉంటాను, నా బలహీనతలు నాకు తెలుసు గనుక; నేను…
-
జీవితంలో అతిముఖ్యమైన విషయం… గ్రెన్ విల్ క్లీజర్, కెనేడియన్ అమెరికను కవి
నీకు ఏదో ఒక విషయం చెబుదామనిపించి అది చెబితే విచారించవలసి వస్తుందనీ తెలిసి, లేదా, ఒక అవమానం తీవ్రంగా పరిగణించి, అది అంత త్వరగా మరిచిపోలేననుకున్నప్పుడు అదే సరియైన తరుణం, నీ విచారాన్ని అణుచుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యడానికి, ఎందుకంటే, మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే మన చెడు ఆలోచనలన్నీ అణగారిపోతాయి. కోపం తెచ్చుకోవడం చాలా సుళువు ఒకరు మనని మోసగించినపుడూ, ఎదిరించినపుడూ; మనం కోరిన కోరికలు నెరవేర్చనపుడు చిటపటలాడుతూ, నిరుత్సాహపడడం సహజం; కానీ, మన…
-
బట్టలారవేసుకునే దండెం… చార్లెట్ డ్రూయిట్ కోల్
చేతిలో చెయ్యివేసుకుని ఒక వరుసలో గెంతుతాయి ఇటూ అటూ, ముందుకీ వెనక్కీ, దండెం మీద బట్టలు తప్! తపా తప్! అంటూ గాలికి కొట్టుకుంటాయి మంచుసోనలాంటి తెల్లనైన రెపరెపలాడే శాల్తీలు బెదురుతున్న గుర్రాల్లా దుముకుతూ యెగిసిపడుతుంటాయి జానపదకథల్లో మంత్రగత్తెల్లా వెర్రిగా గెంతుతుంటాయి ముందుకి గుండ్రంగా, వెనక డొల్లగా అవి ఆహ్లాదకరమైన మార్చి పిల్లగాలికి వణుకుతూ, దాటుతుంటాయి. ఒకటి అలా పిచ్చిగా గెంతడం చూశాను అది విడిపించుకునే దాకా తెగ గింజుకోవడం. అంతే, దండానికున్న క్లిప్పుల్ని వాటిమానాన వాటిని…
-
ఈ రోజు ఎంత బాగుంది? … డగ్లస్ మలోష్, అమెరికను కవి
నిజమే! ఈ ప్రపంచం కష్టాలమయం అవి లేవని నే ననలేదు. దేవుడా!నాకు చాలినన్ని కష్టాలున్నాయి, మొరపెట్టుకుందికి రెండింతల కారణాలు. వర్షాలూ, తుఫానులూ చిరాకు పెట్టేవి ఆకాశం ఎప్పుడూ మేఘావృతమై ఉండేది నా మార్గం నిండా ముళ్ళూ ముళ్ళకంపలూ నిండి ఉన్నాయి అయితేనేం, ఈ రోజు బాగులేదూ? ఎప్పుడూ ఏడుస్తూ కూచుంటే లాభమేమిటి? బాధలు ఇంకా కొనసాగించడం తప్ప? ఎప్పుడూ గతాన్ని మనసులో పెట్టుకుని చింతిస్తే లాభమేమిటి? ఎవరికి వాళ్ళ బాధలుంటాయి సుఖాలూ కష్టాలతో పలచబడుతూనే ఉంటాయి జీవితం,…
-
రెండు పిల్లి పిల్లలు… జేన్ టేలర్, ఇంగ్లీషు కవయిత్రి
రెండు పిల్లి పిల్లల మధ్య ఒక తుఫానురాత్రి ప్రారంభిమైన తగవులాట పెరిగి, కొట్టుకునేదాకా వచ్చింది. ఒకదాని దగ్గర ఎలక ఉంది రెండోదాని దగ్గర లేదు, అసలీ తగవంతటికీ మూలకారణం అదే! “ఆ ఎలుక నా క్కావాలి,” అంది రెండింటిలో పెద్దది “నీకు ఎలక కావాలేం? అదెలా జరుగుతుందో చూద్దాం!” “ఆ ఎలక నెలాగైనా తీసుకుంటాను,” అంది ‘తాబేలు డిప్ప’ అని, ఉమ్ముతూ, గీకుతూ దాని చెల్లెలుమీద దూకింది. నే చెప్పినదంతా ఆ రాత్రి తుఫాను రాకముందు…
-
కాలవిహంగము… సరీజినీ నాయుడు, భారతీయ కవయిత్రి
ఓ కాల విహంగమా! ఫలభరితమైన నీ పొదరింటినుండి నువ్వు ఏ రాగాలను ఆలపిస్తున్నావు? జీవితంలోని ఆనందం, గొప్పతనం గురించా, పదునైన దుఃఖాలూ, తీవ్రమైన వివాదాలగురించా? హుషారైన వాసంత గీతాలనా; రానున్న భవిష్యత్తు గురించి బంగారు కలలనా, రేపటిఉదయానికి వేచిఉండగల ఆశగురించా? ప్రాభాత వేళల పరిమళభరితమైన తెమ్మెరలగురించా మనుషులు మరణమని పిలిచే మార్మిక నిశ్శబ్దంగురించా? ఓ కాలవిహంగమా! నీ గొంతులో అవిరళంగా మారే నీ శృతుల గమకాలను ఎక్కడ నేర్చావో చెప్పవూ? ప్రతిధ్వనించే అడవులలోనా, విరిగిపడే అలలలోనా ఆనందంతో…
-
ఒక కుర్రాడి ఆలోచనలు… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
ఏడు గంటలకి నేను నిద్రకి ఉపక్రమించేటపుడు నా బుర్రలో ఎన్నో బొమ్మలు తారాడుతుంటాయి: పెద్ద పెద్ద భవనాలూ, వాటిని చుట్టుముడుతూ మహాసర్పాలూ వింత వింత గారడీలు చెయ్యగల పండ్లు పండే తోటలూ, దుర్గాల్లో బందీలు చెయ్యబడీ, లేదా, మాయాలతాగృహాల్లో దారితప్పిన అందమైన రాకుమార్తెలూ… ఒక సాహసిక ఆశ్వికుడు సెలయేటిలో స్వారీచేస్తూ పోతుంటే నా కలల్లో ఆ దారంతా స్పష్టంగా కనిపిస్తుంది నేను ఏడు గంటలకి నిద్రకి ఉపక్రమించేటపుడు. నేను ఏడు గంటలకి నిద్రలేచే సరికి నేను వెతుకుతున్న…
-
గడపలు… కేల్ యంగ్ రైస్, అమెరికను కవి
ప్రతి క్షణం ఒక ద్వారం, ప్రతి రోజూ, గంటా, ప్రతి ఏడూ జరిగినవీ, జరగబోయేవీ అన్నీ అందులోంచే మాయమౌతాయి. వాటిలోంచే ఈ సృష్టి అంతా, సచేతనంగానో, అచేతనంగానో జీవితమనే అద్భుతంనుండి మృత్యువనే రహస్యం వరకూ జారుకుంటాయి. ప్రతి క్షణమూ ఒక కవాటము, అది అగోచరంగా ఆహ్వానిస్తుంది విషాదం కలిగించే దుఃఖాల్నీ, ఎదురౌతున్న సౌఖ్యాల్నీ వెగటుపుట్టేదాకా మనం వాటిలోంచి ఆవేశంగా ప్రవేశించి, శాంతితో బయటకు వస్తాము మధ్యనున్నదంతా ప్రయాసా, పారవశ్యం, చివరకి విముక్తీ. ప్రతి క్షణమూ ఒక ప్రవేశద్వారం…
-
నువ్వు నన్నెప్పుడైనా ప్రేమించదలుచుకుంటే… అజ్ఞాత కవయిత్రి
నువ్వెప్పుడైనా నన్ను ప్రేమించదలుచుకుంటే, అదేదో ఇప్ప్పుడే ప్రేమించు; నిజమైనప్రేమనుండి వెలువడే తీయని, సున్నితమైన భావనలన్నీ నాకు తెలిసేలా, నేను బ్రతికున్నప్పుడే నన్ను ప్రేమించు; నేను చనిపోయేదాకా ఎదురుచూడకు, చల్లని పాలరాతిపలకలమీద రసాత్మకమైన వెచ్చని ప్రేమ కావ్యాలు చెక్కడానికి. నీకు నా గురించి మధురభావనలుంటే, అవి నా చెవిలో ఎందుకు చెప్పకూడదు? నీకు తెలీదూ అది నన్ను ఎంత ఆనందంగా ఉండగలనో అంత ఆనందంగా ఉంచుతుందని? నేను నిద్రించేదాకా నిరీక్షిస్తే, ఇక నేను ఎన్నడూ నిద్రలేవకపోవచ్చు, మనిద్దరి మధ్యా…