అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 2, 2018

    అఖండ ప్రార్థన… జేమ్స్ విట్ కూంబ్ రైలీ, అమెరికను

    ఓ ప్రభూ! కరుణామయా! దయావార్నిధీ! నేను ఇష్టపడే వారినందరినీ ఈ రోజు నీ కటాక్షవీక్షణలతో చూడు! వాళ్ళ హృదయాలని పట్టిపీడించే అలసటని తొలగించు! గాలిని తూర్పారబెడుతున్నట్టు ఎగిరే నీ దూతల రెక్కల రెపరెపల జాడల్లో వాళ్లకి కావలసిన అవసరాలూ తీర్చు! బాధాతప్తహృదయులందరికీ బాధలనుండి విముక్తి కలిగించు. తిరిగి వాళ్ళ పెదాలపై చిరునవ్వులు వరదెత్తనీ! లేమితో అలమటించే దీనులకు ప్రభూ! ఈ రోజు నా సొత్తైన అనంతమైన సంతృప్తి సంపదని పంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను! . జేమ్స్ విట్ కూంబ్…

  • మే 31, 2018

    నువ్వు పక్షిలా బ్రతుకు … విక్టర్ హ్యూగో, ఫ్రెంచి కవి

    నువ్వు పక్షిలా బ్రతుకు. ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ విశ్రాంతికి చెట్టుకొమ్మ మీద వాలినపుడు అల్పమైన దాని బరువుకే కాలి క్రింద కొమ్మ విరగబోతున్నా అది పాడుతూనే ఉంటుంది తనకి రెక్కలున్నాయన్న ధైర్యంతో! . విక్టర్ హ్యూగో 26 February 1802 – 22 May 1885 ఫ్రెంచి కవి, నాటకకర్త, నవలా కారుడు . Be Like the Bird . Be like the bird, who Halting in his flight On limb…

  • మే 30, 2018

    ప్రతిధ్వని… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

    “ఎవరది పిలిచింది?” అన్నాన్నేను. నా మాటలు ఊసులాడుతున్న వనసీమలలోంచి, ఇటూ అటూ పోతూ పిట్టల్ని గాభరాపెట్టేయి “ఎవరది పిలిచింది? ఎవరది పిలిచింది?” అంటూ. చిటారుకొమ్మలనున్న ఆకులు ఎండలో గలగలలాడాయి ఎండకాగిన పొడిగాలి నా అరుపుని సన్నగా మోసుకుపోయింది: పచ్చదనం మద్య తొంగి చూస్తున్న కళ్ళూ, నీడలోనున్నవీ కదలకుండా పడున్న డొంకలోని గొంతులు నన్ను వెక్కిరించడానికి నే నేమంటే తిరిగి అదే అంటున్నాయి. నా కన్నీళ్ళలోంచి ఒక్క సారి అరిచేను: “ఎవడికి ఖాతరు?” అని; గాలి ఒక్కసారి పల్చబడింది:…

  • మే 29, 2018

    చిరునవ్వు- రౌల్ ఫొలేరో, ఫ్రెంచి రచయిత

    చిరునవ్వుకి కాణీ ఖర్చులేదు, కానీ చాలా ప్రసాదిస్తుంది. దానికి కొన్ని లిప్తలు పడుతుంది కానీ దాని ప్రభావం శాశ్వతం. అది లేకుండా బ్రతకగలిగిన ధనవంతులెవరూ ఉండరు, దాన్ని ఇవ్వడం వలన పేదవాళ్ళయిపోయేవారెవరూ ఉండరు. అది ఇచ్చేవాళ్ళని పేదవాళ్ళని చెయ్యకుండానే పుచ్చుకునే వాళ్ళని ధనవంతుల్ని చేస్తుంది— అది ఇంటిలో వెలుగు సృష్టిస్తుంది- వ్యాపారంలో మంచిపేరు సంపాదిస్తుంది అన్ని విషమ సమస్యలకీ విరుగుడుగా పనిచేస్తుంది. అయినప్పటికీ, దాన్నెవడూ యాచించలేడు, అరువు తీసుకో లేడు, దొంగిలించలేడు, ఎందుకంటే, అది అయాచితంగా ఇస్తేనే…

  • మే 27, 2018

    నేను మళ్ళీ ఈ త్రోవలో రాను… అజ్ఞాత కవి

    [కాకతాళీయంగా మనకి ఈ మనుజ జన్మ వచ్చిందనీ, మనకున్న జీవితం ఒకటేననీ, మంచి అన్నది ఏది చేద్దామనుకున్నా దాన్ని వాయిదా వెయ్యకుండా ఒంట్లో శక్తీ, మనసులో తలపూ ఉన్నప్పుడే ఆచరించాలనీ సున్నితంగా చెప్పిన కవిత] ఈ బాధామయ ప్రపంచం లోంచి, ఒకే ఒక్కసారి నేను నడిచిపోతాను. ఎవరికయినా మంచి చెయ్యాలన్నా బాధపడుతున్న ఏ సాటిమానవుడిపట్లనైనా కరుణ చూపించాలన్నా నాకు ఒంట్లో శక్తి ఉన్నప్పుడే చెయ్యనీండి. వాయిదా వెయ్యడానికి లాభం లేదు. ఎందుకంటే నాకు స్పష్టంగా తెలుసు ఈ…

  • మే 24, 2018

    నీతి శాస్త్రం.. లిండా పాస్టన్, అమెరికను కవయిత్రి

    [లిండా పాస్టన్ నైతికత విలువలకి సంబంధించి ఒక చక్కని ప్రశ్న తీసుకుని, బాల్యంలో నైతిక విలువలు అర్థంచేసుకోవడం ఎంత సంక్లిష్టమో, నైతికతమీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం ఎంత కష్టమో సూచిస్తుంది. అంతే కాదు, ఆ వయసులో కళాత్మకత కంటే, జీవితంవైపే ఎక్కువ మొగ్గు ఉంటుందని సూచిస్తుంది. పాఠకులు దీన్ని ఇంకా నిశితంగా విశ్లేషించుకోవచ్చు.] చిన్నప్పుడు మాకు నైతికశాస్త్రం పాఠాలు చెబుతున్నప్పుడు ప్రతి ఏడూ శరత్తులో మా ఉపాధ్యాయురాలు ఈ ప్రశ్న అడుగుతుండేవారు: ఒకవేళ ఏదైనా ఒక మ్యూజియంలో…

  • మే 23, 2018

    దిష్టిబొమ్మ … మైకేల్ ఫ్రాంక్లిన్

    ఒక రోజు పొలంలో ఒక దిష్టిబొమ్మ నిలబెట్టి ఉంది పచ్చగడ్డి కూరేరు ఎండుగడ్డి కూరేరు అది రాజమార్గంలో పోతున్న మనుషుల్ని చూస్తోంది కాని ఒక్కమాట మాటాడితే ఒట్టు అది చాలా సంగతులు చూసింది, కాని ఒకటీ వినలేదు దానికి రాత్రి లేదు పగలు లేదు దానికి ఏమీ లేకపోవడంతో, ఏదీ అక్కరలేకపోవడంతో ఒక్క మాటన్నా మాటాడలేదు. ఒక నల్లని ఎలుక ఒక గూడు పెట్టుకుంది ఎంత బుజ్జిగా ఉందో ఎంత నల్లగ ఉందో పాపం టామ్ కి ఉన్న…

  • మే 6, 2018

    అది సాధ్యమే… అజ్ఞాత కవి

    ఎవడైతే “అది సాధ్యం కాదు” అని అంటాడో వాడు జీవితంలోని సౌందర్యాన్ని కోల్పోతునట్టే. అతను గర్వంగా ఒక ప్రక్క నిలబడి అందరూ చేసే ప్రయత్నాలన్నిటినీ ఆక్షేపిస్తుంటాడు. వాడికే గనక మానవజాతి చరిత్ర సమస్తాన్నీ తుడిచిపెట్టే శక్తి ఉండి ఉంటే, మనకి ఈ నాడు రేడియోలు, మోటారు కార్లు వీధుల్లో విద్యుద్దీపాల కాంతులూ ఉండేవి కావు; టెలిఫోన్లూ, తంతివార్తలూ లేక మన రాతియుగంలో ఉన్నట్టే జీవించే వాళ్లం. “అది సాధ్యపడదు” అని చెప్పేవాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తే ప్రపంచం ఎప్పుడో…

  • మే 5, 2018

    జూన్ నెలలో ఒక రాత్రి… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

    సూర్యుడెప్పుడో అస్తమించాడు నక్షత్రాలు ఒక్కటొకటిగా మిణుకుమంటున్నాయి చెట్లగుబురుల్లో పిట్టలు ఇంకా రాగాలాపనలు అందుకోలేదు. అక్కడొక కోయిల ఇక్కడ ఒక రెండు పాలపిట్టలూ దూరాన్నుండి ఎగసివస్తున్న సుడిగాలి పక్కనే పారుతున్న సెలయేటి పాట ఒక్కసారిగా దిగంతాలవరకూ సాగుతూ రోదసిని ముంచెత్తుతున్న కోయిల పాట… ఇవన్నీ ఉంటే ఎవడయ్యా ఇటువంటి జూన్ రాత్రిలో ఆడంబరంగా లండను పోయేది? మారువేషాలతో ఆటలాడేది? అంత మెత్తని వెన్నలాంటి అర్థచంద్రుడూ ఇంత ఖర్చులేని ఆనందాలూ దొరుకుతుంటే? అందులో ఇంత చక్కని రాతిరి? . విలియమ్…

  • మే 4, 2018

    రూబీ బ్రౌన్… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి

    ఆమె యవ్వనవతి, అందగత్తె ఆమె శరీరాన్ని నులివెచ్చన చేసే సూర్యరశ్మిలా కొద్దిగా బంగారు మెరుపు ఉంది ఆమెలో. కానీ, ఆమె నల్లజాతి యువతి కావడంతో ‘మేవిల్లే ‘ లో ఆమెకి చోటు లేదు ఆమె మనసులో జ్వలిస్తూ స్వచ్ఛమైన జ్వాలలా పైకి ఎగసిపడే ఆనందానికి అవకాశాలూ లేవు. ఒక రోజు మిసెస్ లాథామ్ ఇంటి వెనక పెరట్లో గిన్నెలు తోముకుంటూ, తనని తాను రెండు ప్రశ్నలు వేసుకుంది ఆ రెండింటి సారాంశమూ సుమారుగా ఇది: తెల్లజాతి స్త్రీ…

←మునుపటి పుట
1 … 45 46 47 48 49 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు