-
పచ్చికమీద మేనువాల్చినపుడు… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి

ఈ మధ్య నాకు ఇట్టే నిద్ర వచ్చేస్తోంది… ఓ మధ్యాహ్నం ఇలాగే నిద్రలోకి జారుకున్నాను మంచి ఎండలో, హమ్మింగ బర్డ్ చెట్ల నీడన …కానీ, వెంటనే తెలివి వచ్చేసింది. చాలా త్వరగానూ, వణుకుతూనూ, మేలుకున్నాను. కళ్లమీద సూర్యుడి తీవ్రతకీ, ఎండ వేడికీ.కలలో నే పడుక్కున్న చోట అంతా చీకటిగా ఉండేది.రేపు నేను సమాధిలో పడుకోబోయే చోటూ చీకటే. ఆర్చిబాల్డ్ మెక్లీష్(May 7, 1892 – April 20, 1982) అమెరికను కవి. Dozing on the LawnI fall asleep…
-
అల్లర్లు … ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి

నా జీవితకాలంలో ఈ నగరం తగలడిపోవడం రెండుసార్లు చూశాను. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం అన్నీ అయిపోయాక రాజకీయనాయకులు రంగం మీద కనిపించడం, వ్యవస్థలోని లోపాలు ఏకరవుపెట్టి దానిని మార్చడానికి పేదలకి అనుకూలంగా కొత్త చర్యలు చేపట్టాలని వాదించడం. మొదటిసారి ఏ మార్పులూ జరగలేదు. ఈ సారీ ఏ మార్పులూ జరగబోవు. బీదలు బీదలుగానే కొనసాగుతారు నిరుద్యోగులు నిరుద్యోగులుగానే కొనసాగుతారు. ఇల్లులేనివాళ్ళు ఇల్లులేనివాళ్ళుగానే మిగులుతారు. కానీ రాజకీయనాయకులుమాత్రంభూమ్మీద బాగా బలిసి, చక్కగా హాయిగా బ్రతుకుతారు..ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ August…
-
Relief… Manasa Chamarti, Telugu, Indian
O Vault of Heaven! When you sizzle all of a sudden With a streak of lightning Or, when I rattle feverishly To find expression to an idea What a turmoil it is! But when Once you melt down to drops… And I flow into a poem… What a relief of tranquility! . Manasa Chamarti Telugu…
-
ప్రాపంచిక సుఖాలకి వీడ్కోలు… ఏన్ కిలిగ్రూ, ఇంగ్లీషు కవయిత్రి
నశ్వరమైన సుఖాల్లారా! మీకు వీడ్కోలు బంగారు పూతపూసిన మిధ్యలు మీరు, తళుకులీనే బొమ్మలు చాలకాలం నా మనసు వశంచేసుకుని దారితప్పించారు రిక్తభక్ష్యాలతో నా కడుపునింపారు. చాలు! ఇక మీరు నా మనసుని పూర్వంలా మోసగించలేరు. ఎందుకంటే, ఇథాకా రాజు యులిస్సిస్ ని మోసగించిన మాయా సంగీతం మీరు వినిపించినా దృఢనిశ్చయంతో నా మనసునీ, నా కోరికలని అతన్ని వాడ స్తంభానికి కట్టినదానికంటే గట్టిగా నా వివేకానికి బంధించుకుంటాను. అపుడు, మీ మంత్రతంత్రాలు నా చెవి సోకినా అతనిలాగే,…
-
మనిషి – సింప్లాన్ మహాపర్వతం… మాగ్జీం గోర్కీ
ఎప్పుడూ మంచుతోకప్పబడి ఉండే మహాపర్వతాల మధ్య ఆ స్వచ్ఛమైన సరస్సు ఉంది. ఆ కనుమలమధ్య దట్టమైన ఉద్యానవనాలు నీటి అంచుదాకా పరుచుకున్నాయి. ఒడ్డునున్న తెల్లటి ఇళ్ళు, నిర్మలమైన నీటిలో పంచదార బిళ్ళల్లా ప్రతిఫలిస్తున్నాయి. పరిసరాలంతటా నిద్రిస్తున్న పిల్లవాడి ప్రశాంతత పరుచుకుంది. ఉదయం కావొచ్చింది. కొండలవాలులోని తోటలనుండి విరుస్తున్న పువ్వులపరిమళం సన్నగా తేలుతూ నాలుగుచెరగులా వ్యాపిస్తోంది. అప్పుడే సూర్యుడు ఉదయించాడు. చెట్ల ఆకులకీ, పూరేకులకీ ఇంకా వదల్లేక అంటిపెట్టుకున్న మంచు మెరుస్తోంది. ఆ ప్రశాంతమైన పర్వతప్రాంతంలోంచి, రాళ్ళతో వేసినదే…
-
అనుభవశాలి … డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
22nd August is 125th Birth Anniversary of Dorothy Parker వయసులో ఉన్నపుడు బలిష్ఠంగా, ధైర్యంగా ఉండేదాన్ని, ఓహ్, ఆ రోజుల్లో … తప్పు తప్పే, ఒప్పు ఒప్పే! నా రెక్కలు విప్పుకుని, నా జెండా ఎగురేసుకుంటూ ప్రపంచంలోని అన్యాయాన్ని సరిదిద్దడానికి పరిగెత్తేను. “ఒరేయ్ కుక్కల్లారా, దమ్ముంటే వచ్చి పోరాడండి!” అనేదాన్ని అయ్యో చావడానికి ఒక్కబ్రతుకే ఉందని విలపించేదాన్ని. ఇప్పుడు వయసు వాటారింది. మంచీ చెడూ పిచ్చిగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. ఇప్పుడు ప్రశాంతంగా కూచుని…
-
బాధాసఖుడు… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, అమెరికను కవయిత్రి
“బాధ దానంతట అదే పోతుందిలే, భవిష్యత్తులో మంచిరోజులకై కలగను, ఈ వేళ సంగతి మరిచిపో,” అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఆమెకు చెప్పొద్దు. మీకు చెప్పాలనిపిస్తే, బాధ వృధాగా పోదని ఆమెకి చెప్పండి; అది నేర్పే గుణపాఠం వల్ల కలిగే లాభం అది కలిగించే నొప్పికి పదిరెట్లు ఎక్కువని చెప్పండి. ఎప్పటిలాగే పాతమాటలతో ఊరడించకండి: “త్వరలోనే అది మరిచిపోతుందిలే”- అని. కటువైన సత్యం, నిజమే, అది విచారించవలసిన విషయమే; ఆమెకు ‘వేరే విషయాలపై మనసుపోనీ, కొత్త…
-
ఆ వయసుకి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఈ రాత్రి నా కళ్ళు మూసుకుని ఒక చిత్రమైన ఊరేగింపు నా కళ్ళముందునుండి పోవడం గమనిస్తాను… నీ ముఖాన్ని నేను అప్పటికింకా చూడకముందు రోజులు ఎంతో ఆశలహేలతో నా ముందునుండి నడిచిపోతుంటాయి; అవును! సిగ్గూ, సున్నితమైన మనసున్నరోజులు తరలిపోతాయి కన్నీటిపొరతో ఏమీ కనిపించకపోయినా నృత్యంచేసే నర్తకిలా అలా రోజులు గడచిపోయినా, గడచిన ప్రతిరోజూ నన్ను నీ సన్నిధికి చేరుస్తోందని తెలుసుకోలేకపోయాను; ఆ త్రోవలు చాలా ఇరుకుగా ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ప్రతీదారీ నన్ను నీ హృదయాసమీపానికే చేర్చింది……
-
మనమేం చేయ్యగలం?… చార్ల్స్ బ్యుకోవ్స్కీ , అమెరికను కవి
మహా అయితే మానవత్వంలో ఉన్నదేమిటి కాస్తంత మార్దవత్వం తప్ప. కాసింత అవగాహన, అప్పుడప్పుడు సాహసోపేతమైన పనులు. కానీ స్థూలంగా చూసినపుడు అది ఏ మాత్రం సరుకులేని శూన్యమైన గోళాకారపు ముద్ద. నిద్రలో మునిగిన భీకరమైన జంతువులాంటిదది. దాన్ని ఎవరూ ఒకపట్టాన నిద్రలేపలేరు. పొరపాటున నిద్రలేపినా, అది స్వార్థం, హత్యలూ, అన్యాయమైన తీర్పులూ క్రౌర్యం ప్రదర్శించడంలోనూ మాత్రమే బాగా పనిచేస్తుంది. ఇలాంటి మానవత్వంతో మనకేమిటి ఉపయోగం? ఏమీ లేదు. ఎంత వీలయితే అంత దానికి దూరంగా ఉండడం మంచిది.…
-
మరణాన్ని ముందే పసిగట్టిన ఐరిష్ వైమానిక సైనికుడు … విలియమ్ బట్లర్ యేట్స్, ఐరిష్ కవి
నాకు తెలుసు ఆ మేఘాల్లో ఎక్కడో నేను మృత్యువుని కలుసుకుంటానని; నేను యుద్ధం చేస్తున్నవారిపట్ల ద్వేషమూ లేదు, నేను పరిరక్షిస్తున్న వారి పట్ల నాకు ప్రేమా లేదు; నా జన్మభూమి కిల్టార్టన్ క్రాస్ నా ప్రజలు కిల్టార్టన్ కి చెందిన నిరుపేదలు, యుద్ధం ముగిసేక వాళ్ళకి కొత్తగా వచ్చే నష్టమూ లేదు వాళ్ళ జీవితాలు మునపటికంటే ఆనందంగా ఉండేదీ లేదు. ఏ చట్టమూ, ఏ కర్తవ్యమూ, నన్ను పోరాడమనలేదు, ఏ రాజకీయ నాయకులూ, ప్రజల జేజేలూ ప్రేరేపించలేదు…