అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 12, 2019

    జీవిత సంగ్రహం… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

    బ్లేడ్లు … నొప్పి పెడతాయి నదులు …తడిగా ఉంటాయి ఆమ్లాలు …మరకలు చేస్తాయి మాదకద్రవ్యాలు …ఒళ్ళునొప్పిచేస్తాయి తుపాకులు …చట్టవిరుద్ధం ఉరితాళ్ళు …తెగిపోతాయి గాస్ వాసన… భరించలేం దానికంటే నువ్వు బ్రతకడమే మెరుగు. . డొరతీ పార్కర్ August 22, 1893 – June 7, 1967 అమెరికను కవయిత్రి     Resumé . Razors pain you; Rivers are damp; Acids stain you; And drugs cause cramp. ….. ….. (deliberately…

  • ఫిబ్రవరి 12, 2019

    తన దృష్టిలోపం మీద… జార్జ్ లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి

    తన దృష్టిలోపం మీద… జార్జ్  లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి

    నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, అవిచ్ఛిన్నమైన వెలుగుపుంజమొకటి కాలక్రమంలోనన్నావహించింది, అది సమస్త వస్తువుల్నీ విశ్లేషించి విశ్లేషించి కడకు, నా ముందు వర్ణ,రూపరహితమైన వస్తువుగా నిలబెట్టేది,కేవల భావనగా. జనప్రవాహంతో పొరలిప్రవహించే మౌలికమైన దివారాత్రాలు కూడా ప్రాభాతసమయాన అరుణోదయానికి ఎదురుచూస్తూ చిక్కగా, స్థిరంగా, నిలకడగా కనిపించే ఉషః కాంతిలా మారిపోయేవి. నాకు ఒక్కటంటే ఒక్కటైనా మనిషిముఖం చూడగలిగితేబాగుణ్ణనిపించేది. నాకు తెలియకుండానే, చేత్తోపట్టుకోడం తప్ప మరేమీచెయ్యలేని ఆ మూసిన విజ్ఞానసర్వస్వ సంపుటాలలోంచి చిన్నచిన్న పక్షులూ, వెన్నెల చందమామలూ ఎగిరిపోయేవి. మంచికో చెడుకో,…

  • ఫిబ్రవరి 6, 2019

    వలస పిచ్చుక… ఛార్లెట్ స్మిత్ ఇంగ్లీషు కవయిత్రి

    వలస పిచ్చుక… ఛార్లెట్ స్మిత్ ఇంగ్లీషు కవయిత్రి

    Image Courtesy: https://www.birdlife.org/worldwide/news/spring-alive-swallows-spring . పోడుమీద ముళ్ళచెట్టు పచ్చగా పూసింది గట్లమీద వెరోనికలు నీలంగా నవ్వుతున్నాయి ఓక్ చెట్లు పూతకొచ్చాయి, వాటిక్రింద త్వరలో తెల్లని హాదార్న్ ఘుమఘుమలాడుతూ మే నెలలకి రజతహారాన్ని వేయబోతోంది. మధుమాసం కుదురుకున్నాక వచ్చే అతిథి స్వాలో (వలస పిచ్చుక*) కూడా చివరకి విచ్చేసింది. సరిగ్గా సూర్యుడు గ్రుంకే వేళ, పికాలు రాగాలందుకునే వేళ, తుర్రుమనుకుంటూ శరవేగంతో రెక్కలార్చుకుని నాముందునుండి పరిగెడితే ఒకసారి పలకరించేను. ఓ వేసవి అతిథీ! నీకు స్వాగతం! రా, నా రెల్లుపాక…

  • ఫిబ్రవరి 4, 2019

    స్త్రీల యాతన… మేరీ కోలియర్, ఇంగ్లీషు కవయిత్రి

    స్త్రీల యాతన… మేరీ కోలియర్, ఇంగ్లీషు కవయిత్రి

    Stephen Duck “Threshers’ Labour అని 1730లో ఒక కవిత రాసేడు. అందులో అతను గ్రామీణ స్త్రీలు ఎలా పనిలేకుండా కూచుంటారో చెబుతూ, పని తాలూకు ఔన్నత్యాన్ని ప్రబోధిస్తూ రాసేడు. ఈ రకమైన బోధనాత్మకమైన ప్రక్రియకి Georgic అని పేరు. ఈ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా Hesiod (750 BC) తన Works and Days అన్నకవిత వ్రాసేడు. దానిని అతని తర్వాత Virgil ప్రచారంలోకి తీసుకువచ్చేడు. ప్రకృతివర్ణనలు ఉండడం వలన పైకి ఈ కవితలు గ్రామీణ చిత్రాల్లా…

  • జనవరి 31, 2019

    బిడ్డ పుట్టినపుడు … లూయీ అంటర్ మేయర్, అమెరికనుకవి

    ఓ పిల్లవాడా! గెలుపు కేకలు వేసుకుంటూ, జీవన రణరంగంలోకి నీ పాదాలను మోపావు ఏ తగవులూ లేనిచోటునుండి… పోరాటస్థలికి ఏ సంశయాలూ లేనిచోటునుండి …సందేహాలలోకి. యవ్వనమనే పేలవమైన కవచాన్ని తొడుక్కుని కుర్రవాడా! లెక్కలేనన్ని యుద్ధాలలో పాల్గొనాలి, ప్రేమబావుటా ఎగరేసి లోకాల్ని గెలవాలంటే, నిరసనగళమనే కరవాలమూ, సత్యమనే డాలూ తోడుండాలి. లోకంలోని నిరాశానిస్పృహలు నీచుట్టూ ఎగసిపడుతుంటాయి; అపజయాలకి నువ్వు లోనై, దారికోసం తడుముకుంటావు. నీ ఆవేశం, అవలక్షణమని నిను నిందించేస్థాయిలో ఉండాలి నిరాశాజనకమైన భవిష్యత్తుకి, నువ్వు ఆశల ఊపిరులూదాలి.…

  • జనవరి 30, 2019

    ప్రియతమా! నువ్వు ఆశ్చర్యపోకు… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

    ప్రియతమా! నా పెదాలు మౌనంగా ఉన్నాయని నువ్వు ఆశ్చర్యపోకు, ఏ కొత్తభాష నేర్చుకోవాలన్నా కొంత సమయం పడుతుంది. తొలిసారి ఈ వేళ్ళు ప్రేమవీణియ మీటినపుడు నా గళమూ, నా మనసూ ఒక శృతిలో లేవు. పాడిన పాటలన్నీ ఎప్పుడూ ఆనంద రుతాలే. గులాబి దండల సంతోష హేలల రూపంలో ప్రేమ; సంగీతంలా,గాఢానురక్తిని అతి సరళమైన స్వరాల్లో నినదిస్తూ పలికించలేని అశక్తులవి. ఇంతవరకు మౌనంగా ఉన్న నా పెదాలు ధైర్యంగా పలకగల కొత్త నుడికారాన్ని వెతుకుతున్నాయి నీనుండి పొందిన…

  • జనవరి 25, 2019

    వనాంతర ప్రశాంతత… వెండెల్ బెరీ, అమెరికను కవి

    ప్రపంచం పట్ల నాలో నిరాశ పేరుకున్నప్పుడూ, నా, నా బిడ్డల భవిష్యత్తును గూర్చి చింతతో చిరుసవ్వడికే రాత్రివేళ మెలకువ వచ్చినప్పుడూ, తన జాతసౌందర్యంతో నీటిమీద తేలియాడే మగబాతునీ, ఉదరపోషణ చేసుకునే కొంగనీ వీక్షించడానికి సరస్సు దగ్గరకిపోయి విశ్రమిస్తాను. రాబోయే బాధని ముందుగా ఊహించుకుని తమజీవితాలు శోకమయం చేసుకోని వన్యజీవుల ప్రశాంతత నన్నావహిస్తుంది. నిశ్చలమైన నీటి సన్నిధిలో నిలబడతాను. నా శిరసుపై దివాంధాలైన నక్షత్రాలు తమ ప్రకాశంతో నాకై నిరీక్షించడాన్ని గుర్తిస్తాను. కాసేపు, ప్రకృతి అవ్యాజప్రేమలో తరిస్తాను… స్వేఛ్ఛాజీవినై.…

  • జనవరి 23, 2019

    నాకూ వివేకం ఉంది… మారియో ఆంద్రాదే, బ్రెజీలియన్ కవి

    నేను నా రోజులు లెక్కెట్టుకున్నాను. నేను ఇప్పటివరకు బ్రతికినదానికంటే ఇక బ్రతకడానికి ఎక్కువరోజులు లేవని గ్రహించాను.   ఎక్కువ మిఠాయిలు దొరికిన పిల్లాడిలా ఉంది నా పరిస్థితి మొదట్లో సంతోషంతో ఆబగా తినేస్తాడు కానీ, ఇక అట్టే లేవని గ్రహించిన తర్వాత ప్రతి మిఠాయినీ తీవ్రంగా అనుభూతిచెందుతూ తింటాడు. ఇక అంతూపొంతులేని సమావేశాలకి నాకు తీరికలేదు అక్కడ ఏదీ జరగదని తెలిసినా చట్టాలూ, నిబంధనలూ, విధివిధానాలూ అంతర్గత నియంత్రణలూ మొదలైనవి చర్చిస్తూనే ఉంటారు. ఇక నాకు అసంగతంగా…

  • జనవరి 22, 2019

    రాబర్ట్ బ్లూమ్ ఫీల్డ్ స్మృతిలో… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి

    రాబర్ట్  బ్లూమ్ ఫీల్డ్ స్మృతిలో… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి

    Robert Bloomfield (3 December 1766 – 19 August 1823) Was a self-educated English working-class poet, admired by Stephen Duck, Mary Collier and John Clare.   Image Courtesy: http://etc.usf.edu/clipart/32000/32088/bloomfield_32088.htm నిరాడంబరంగా కమ్మని గీతాలాలపించుకునే గాయకమణీ ఈనాటి మిరిమిట్లుగొలిపే ఆడంబరాలు నీకు నచ్చవు. సహజమైన ప్రకృతిదృశ్యాలూ, పొలాలూ, మేఘమాలికలూ తరులూ, శ్రమజీవులైన తేనెటీగలూ లలితలలితమైన తమరాగాలతో నీపాటకి సంగీతాన్ని సమకూరుస్తాయి. ప్రకృతే నిన్ను అక్కునజేర్చుకుంది; మంది గుర్తించక పోతే పోనీ.…

  • జనవరి 20, 2019

    ఈ లోకంతో మనం అతిగా ప్రవర్తిస్తున్నాం… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

    వర్డ్స్ వర్త్ ప్రముఖ ప్రకృతి కవి. పారిశ్రామిక విప్లవం మనుషులలో తీసుకువచ్చిన భౌతికవాదానికి… అంటే ప్రకృతిని తన ఉనికికి మూలకారణమైన చేతన శక్తిగా కాక, తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగించే వనరుగా చూడడం అతనికి నచ్చదు. ఈ భౌతిక సుఖాలవేటలో పడిన మనిషి దృశ్యమాన జగత్తులోని అందాలకి పరవశించి తన హృదయాన్ని ఉన్నతంగా చేసుకోగలిగే అవకాశాన్ని కోల్పోతున్నాడని అతని ఆరోపణ. ఈ కవితలో “మనిషి తన తెలివితేటలని, జీవితాన్ని డబ్బుసంపాదనకి పణం పెట్టి, తను భాగమైన ఈ అనంతప్రకృతిని…

←మునుపటి పుట
1 … 40 41 42 43 44 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు