అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 27, 2019

    ఆటు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    ఆటు…  ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    నీ ప్రేమ నానుండి మరలింది కనుక నాకు నా మనఃస్థితి తెలుస్తోందిలే: అదొక తీరంనుండి సముద్రంలోకి చొచ్చుకొచ్చిన బండరాయి, దానిమీద ఒక చిన్న గుంత; అందులో, ఎగసినకెరటాలనుండి జారిపోగా మిగిలిన నీటితో ఏర్పడిన చిన్న మడుగు. ఆ గోర్వెచ్చని నీరు ఎండకీ, గాలికీ మెల్లమెల్లగా హరించుకుపోతుంటుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (22 ఫిబ్రవరి 1892 – 19 అక్టోబరు 1950) అమెరికను కవయిత్రి . Ebb . I know what my heart…

  • ఫిబ్రవరి 25, 2019

    మండువేసవిలో ఒక సూర్యోదయం… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి

    మండువేసవిలో  ఒక సూర్యోదయం… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి

    ఓ ఆకాశమా! విపుల వైశ్వానర స్వరూపమా! విను! బ్రహ్మాండమైన సూర్యగోళపు గర్జనలు వినిపించకపోవచ్చు నేమో గానీ, అవి వినలేనంత భీకర శబ్దాలు; వెలుగునే వేడెక్కించగలవవి. ఓ మహానుభావా! సూర్యుడా! మా ఆత్మలని వెలిగించు, కోరికలు రగిలించు… మా ఆత్మలకి ప్రేరణనివ్వు! మేము ఈ చీకటిని చాలా కాలమై ప్రేమిస్తున్నాం. ఈ చీకటికి చితి రగిలించి, వెలుగుని మరింత ప్రజ్వలనం చెయ్యి. ఎంతగా అంటే ఆ వేడిలో నిస్తేజమైన ఈ రోజులు రగిలి, ఆ సెగలలో సుషుప్తిలో మునిగి…

  • ఫిబ్రవరి 24, 2019

    Sri Visakhapatnam Kanaka Mahalaksmi… Munipalle Raju, Telugu, Indian

    Sri Visakhapatnam Kanaka Mahalaksmi… Munipalle Raju, Telugu, Indian

    On the eve of First Death Anniversary of Sri Munipalle Raju garu I had been working in Visakhapatnam for long, but I never occasioned to walk the steps of the Simhachalam Temple or visit the village Goddess, Sri Kanaka Mahalakshmi. My aunt had changed it all that with her recent visit.  Getting down from the…

  • ఫిబ్రవరి 22, 2019

    చిత్రం… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

    చిత్రం… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

    ఊపిరి తీయనివీ, కంటి చూపు లేనివీ, వాటికే మరణం లేకపోవడం ఏమిటి?! చైతన్యం ఎరుగని ఒక బండరాయికీ, పిసరంత నేలకీ శాశ్వతత్వం అనుగ్రహించబడటం ఏమిటి?! ఒక ధూళికణం, ఒక మట్టి బెడ్డ భగవంతుడి అపురూపమైన వరానికి నోచుకుంటాయి. దారి పక్కన పడుండే గులకరాయికి చావు లేదు. మన తాత ముత్తాతలు కోసిన గడ్డి పరకలు ఇప్పుడు వాళ్ళ సమాధులమీద మొలుస్తున్నాయి. కనీ కనిపించకుండా ప్రవహించే పిల్లకాలువలు అనవరతంగా ప్రవహిస్తూ ఎండిపోతుంటాయి. పేలవంగా, నిశ్చలంగా పడి ఉండే ఇసకరేణువులకి…

  • ఫిబ్రవరి 18, 2019

    కేవలం ఒక సామాన్య సైనికుడు … లారెన్స్ వెయిన్ కోర్ట్, కెనేడియన్ కవి

    కేవలం ఒక సామాన్య సైనికుడు … లారెన్స్ వెయిన్ కోర్ట్, కెనేడియన్ కవి

    . అతను బాన పొట్టతో, జుత్తు రాలిపోతూ త్వరగా ముసలివాడైపోయాడు అతను మందిచుట్టూ చేరి, గతాన్ని కథలు కథలుగా చెప్పేవాడు… అతను పాల్గొన్న యుద్ధాలగురించీ, అతని సాహసకృత్యాలగురించీ, సాటి సైనికులతోఆటు సాధించిన విజయాలగురించీ, అందులో అందరూ వీరులే. అప్పుడప్పుడు అతని చుట్టుప్రక్కలవాళ్ళకి అవి హాస్యాస్పదంగా కనిపించేవి కానీ అతనితో పనిచేసినవాళ్లందరూ వినేవారు అతనేం మాటాడుతున్నాడో తెలుసు గనుక ఇకనుంచి మనం అతని కథలు వినలేము, కారణం బిల్ చచ్చిపోయాడు ప్రపంచం ఒక సైనికుని మరణం వల్ల కొంత నష్టపోయింది. అతని…

  • ఫిబ్రవరి 17, 2019

    బట్టలుతికిన రోజు …జూలియా వార్డ్ హోవ్, అమెరికను కవయిత్రి

    బట్టలుతికిన రోజు …జూలియా వార్డ్ హోవ్, అమెరికను కవయిత్రి

    బట్టలారవేసిన తీగ … కుటుంబంలో ప్రేమకీ, సేవకీ ఒక రుద్రాక్షమాల వంటిది; తల్లి ప్రేమించే ప్రతి చిన్న దేవదూత దుస్తులూ అక్కడ మనకి దర్శనం ఇస్తాయి. ఆమె పెరటిలో ఆలోచనలలో మునిగి దండెం మీద ఒక్కొక్కబట్టా ఆరవేస్తున్నప్పుడు ప్రతి బట్టనీ ఒక రుద్రాక్షపూసగా పరిగణిస్తుందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. అపరిచితవ్యక్తినైన నేను అటువైపుగా పోతూ ఆ ఇంటికీ, దుస్తులకీ ఒక అంజలి ఘటిస్తాను ప్రేమపూర్వకమైన శ్రమకీ, ప్రార్థనకీ గల దగ్గరపోలిక మదిలో మెదలినపుడు పెదాలపై చిరునవ్వు మెరుస్తుంది. . జూలియా…

  • ఫిబ్రవరి 16, 2019

    ఎలా? … షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి…

    ఎలా? … షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి…

    నిన్న రాత్రి, అలా ఆలోచిస్తూ విశ్రమిస్తుంటే, కొన్ని ‘ఎలా?” అన్న భయాలు నా చెవిలో దూరి రాత్రల్లా గెంతులేస్తూ, పండగ చేసుకుంటూ వాటి పాత పల్లవి “ఎలా? ఎలా?” ని అందుకున్నాయి: స్కూలో నేను సరిగా మాటాడలేకపోతే ఎలా? వాళ్ళు ఈత కొలను మూసెస్తే ఎలా? ఒకవేళ ఎవరైనా నన్ను చితక్కొట్టెస్తే ఎలా? నా కప్పులో ఎవరైనా విషం కలిపితే ఎలా? ఒకవేళ నేను ఏడవడం మొదలెడితే ఎలా? ఒకవేళ నాకు రోగం వచ్చి చచ్చిపోతే ఎలా?…

  • ఫిబ్రవరి 15, 2019

    కాలం… హెన్రీ వాన్ డైక్, అమెరికను

    కాలం… హెన్రీ వాన్ డైక్, అమెరికను

    కాలం ఎదురుచూసే వారికి బహునెమ్మదిగా గడుస్తుంది భయపడే వారికి మరీ తొందరగా గడిచిపోతుంది శోకించేవారికి ఎంతకీ తరగదు ఆనందంతో గంతులేసేవాళ్లకి ఇట్టే పరిగెడుతుంది కానీ ప్రేమికులకి అసలు దాని ఉనికే తెలీదు. . హెన్రీ వాన్ డైక్ Jr. (November 10, 1852 – April 10, 1933) అమెరికను కవి Henry Van Dyke Jr.   Time is… . Time is Too slow for those who wait, Too Swift…

  • ఫిబ్రవరి 14, 2019

    నాకు నక్షత్రగతులు తెలుసు, కానీ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    నాకు నక్షత్రగతులు తెలుసు, కానీ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    నాకు పేరు పేరునా నక్షత్రాలు తెలుసు ఆల్డెబరాన్ (రోహిణి), ఆల్టేర్ (శ్రవణం) … విశాలమైన నీలాకాశపు నెచ్చెన అవి ఎలా ఎక్కుతాయో కూడా తెలుసును. వాళ్ళు చూసే చూపులనుబట్టి మగవాళ్ళ రహస్యాలు పసిగట్టగలను వారి వింత వింత, చీకటి ఆలోచనలు బాధకలిగించడంతో పాటు జాగ్రత్తనీ బోధించాయి. కానీ నీ కళ్ళే నా ఊహకి అందటం లేదు, అవి పదే పదే పిలుస్తున్నట్టు అనిపిస్తున్నా… నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలీదు అలాగని, అసలు ప్రేమించటం లేదనీ చెప్పలేను.…

  • ఫిబ్రవరి 13, 2019

    వివేచనల కావల… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవి

    వివేచనల కావల… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవి

    ఇది మంచీ అది చెడూ అన్న వివేచనల కావల ఒక సీమ ఉంది. నిన్నక్కడ కలుసుకుంటాను. అక్కడ పచ్చిక మీద ఆత్మ విశ్రమించినపుడు మనసంతా నిండుగా ఉండి మాటాడబుద్ధి వెయ్యదు. ఆలోచనలూ, భాష, చివరకి ఒకరినికరు పలకరించుకునే మాటలకు కూడా ఏమీ అర్థం కనిపించదు. . జలాలుద్దీన్ రూమీ పెర్షియను కవి 13 వ శతాబ్దం   Out Beyond Ideas … . Out beyond ideas of wrongdoing and right doing, there…

←మునుపటి పుట
1 … 39 40 41 42 43 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు