అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఏప్రిల్ 26, 2019

    ఈ భూమ్మీద అందరూ… అలెగ్జాండర్ బ్లోక్, రష్యను కవి

    . ఈ భూమ్మీద అందరూ గతిస్తారు… నీ యవ్వనం, నీ తల్లిదండ్రులూ; నీ భార్య నిన్ను వంచించవచ్చు, నీ ఆప్తమిత్రుడు నిన్ను విడిచిపోవచ్చు, కానీ, ధృవందగ్గర అద్దంలాంటి ఈ నేలనీ చూస్తూ ఒక అలౌకికమైన ఆనందాన్ని అనుభవించడం ఎలాగో నేర్చుకో. నీ దోనెలోకి నువ్వు ఎక్కు, మంచుగోడల మధ్యనుండి దూరానకనిపిస్తున్న ధృవానికి సాగిపో; నీ వాళ్ళు నిన్నెలా ప్రేమించేరో, ఎలా పోరాడేరో, ఏమి సాధించేరో, ఎలా మరణించేరో, ఒక్కొక్కటే మరిచిపో; నిరంతరం నిన్ను బాధించే కష్టాల చిఠ్ఠా…

  • ఏప్రిల్ 26, 2019

    చిన్నిపెట్టె… వాస్కో పోపా, సెర్బియన్ కవి

    చిన్నిపెట్టె… వాస్కో పోపా, సెర్బియన్ కవి

    ఇక్కడ “చిన్ని పెట్టె” ఒక ప్రతీక. అది మనిషి జ్ఞాపకాలకీ, మెదడుకీ కూడా సంకేతం కావొచ్చు. ఇలా సున్నితంగా ప్రారంభమైన జీవితం, దృశ్య, శ్రవణాది ఇంద్రియాల అనుభూతుల్నీ, వాటి జ్ఞాపకాలను పోగుచేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇంత చిన్నదీ, ప్రపంచం గురించి అవగాహన చేసుకుంటూ, ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకోగలిగేలా ఎదిగిపోతుంది. ఈ జ్ఞాపకాలని ఇతరులతో పంచుకుంటుంది. వయసు మీరినపుడు అందులో కొన్ని పోగొట్టుకుంటుంది. నిజానికి ఎవరికైనా, జీవితమంతా అనుభూతుల, జ్ఞాపకాల భరిణ. అందుకే వాటిని పదిలంగా కాచుకోవాలని చెబుతున్నాడు కవి.…

  • ఏప్రిల్ 25, 2019

    ఇక్కడ మనం జీవచ్ఛవాల్లా పడుంటాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఇంగ్లీషు కవి

    . మనం జీవించదలుచుకోలేదు కాబట్టి, మనం పుట్టిన గడ్డకి మచ్చతెస్తూ, జీవచ్ఛవాల్లా ఇక్కడ పడుంటాం. నిజం చెప్పాలంటే, జీవితంలో పోగొట్టుకోడానికి ఏమీ లేదు. కానీ యువత అలా అనుకోదు, మేము యువకులం కదా! . ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936 ఇంగ్లీష్ కవి . Here Dead We Lie . Here dead we lie Because we did not choose To live and…

  • ఏప్రిల్ 22, 2019

    పిల్లలూ, మెల్లమెల్లగా మీరు గడపదాటి పోతున్నప్పుడు… ల్యూసియస్ ఫ్యూరియస్, అమెరికను కవి

    పిల్లలూ, మీరు అంచెలంచెలుగా గడపదాటుతున్నప్పుడు — ఒకటో తరగతి… తర్వాత కాలేజీ… తర్వాత మీ స్వంత ఇల్లూ, తర్వాత బహుశా పెళ్ళి—, ఇన్నాళ్ళూ భద్రంగా దాచిన ఈ నాలుగుగోడల్నీ ప్రేమతో గుర్తుంచుకుంటారనుకుంటాను, ఈ ఏటవాలు పసుపుపచ్చ పైన్-చూరిల్లూ, ఇక్కడ మీ రనుభవించిన వెచ్చదనమూ- వాటిని మీరు జీవితంలో అవవలసినదానికి అవరోధాలుగా కాక నిరంతరం విశాలమవుతున్న ఈ ప్రపంచాన్ని ఎదుర్కోడానికి బలమైన గాలి తోడుగా ప్రయాణమైన మీ జీవననౌకల్ని క్షేమంగా ఉంచిన ఓడరేవులుగా తలచుకుంటారనుకుంటాను. నిజమే! లోకంలో చెడ్డ…

  • ఏప్రిల్ 21, 2019

    ప్రజాస్వామ్యం… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి

    ప్రజాస్వామ్యం… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి

    ప్రజాస్వామ్యం  భయంద్వారా, రాజీద్వారా, ఈ రోజు కాదు, ఈ ఏడు కాదు ఏనాటికీ  సాధించబడదు.  నా రెండు కాళ్ళ మీద  నిలబడడానికీ, కాసింత నేల కొనుక్కుందికీ అవతలివ్యక్తికి ఎంతహక్కుందో నాకూ అంతే హక్కు ఉంది.  దేని సమయం దానికి కావాలి అని అందరూ అనడం విని విని  విసిగెత్తిపోయింది.  రేపన్నది, మరో రోజు  నేను చచ్చిన తర్వాత  నాకు స్వాతంత్య్రం అవసరం లేదు. రేపటి రొట్టితిని ఈ రోజు బ్రతుకలేను. స్వాతంత్య్రం గొప్ప అవసరంలో పాతిన బలమైన…

  • ఏప్రిల్ 20, 2019

    ఛైర్మన్ టామ్ తో ఏమన్నాడు?… బాసిల్ బంటింగ్, బ్రిటిషు కవి

    కవిత్వం రాస్తావా? అది ఖాళీగా ఉన్నప్పుడు చేసె వ్యాసంగం. నేను బొమ్మ ట్రెయిన్లు నడుపుతాను. ఆ “షా” ని చూడు. అతను పావురాలు పెంచుతాడు. కవిత్వం పనేమీ కాదు. ఒక్క చెమటచుక్క కారదు. దానికెవడూ డబ్బులివ్వడు. అంతకంటే నువ్వు సబ్బులకి ప్రచారం చెయ్యడం మెరుగు. కళ, అంటే సంగీతం; లేదా నాటకం, The Desert Song సంగీత రూపకంలో నాన్సీ కోరస్ లో పాడింది తెలుసా. ఏమిటీ? వారానికి 12 పౌండ్లు కావాలా… నీకు పెళ్ళయింది. అవునా.…

  • ఏప్రిల్ 19, 2019

    Before You Embark upon a Search… Mahesh, Telugu Poet

      Ah! At last, I could make out.   I was sitting blissfully under the shade of a tree. With lays of unseen birds Sweet scent of flowers,  A cool breeze, leaves turned upon me, and A train of travellers criss-crossing And the tales of adventures they shared.    never for once my mind turned towards…

  • ఏప్రిల్ 18, 2019

    ఒక జ్ఞాపకం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    ఒక జ్ఞాపకం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    బాగా అలసిపోయాం, ఎంతో ఉల్లాసంగా ఉన్నాం, రేయల్లా తెప్పమీద రేవుని అటూ ఇటూ దాటుతూనే ఉన్నాం. రాత్రి నిర్మలంగా, ప్రకాశంగా ఉంది, ఆ చోటు గుర్రాలశాల వాసనేసింది; మేజాకి చేరబడి, చలిమంటకేసి చూస్తూ కూచున్నాం, కొండకొమ్మున ఆరుబయట ఆకాశం క్రింద వెన్నెట్లో పడుక్కున్నాం; గాలి ఈలలు వేస్తూనే ఉంది,అంతలోనే సూర్యోదయం కాజొచ్చింది. బాగా అలసిపోయాం, ఎంతో ఉల్లాసంగా ఉన్నాం, రేయల్లా తెప్పమీద రేవుని అటూ ఇటూ దాటుతూనే ఉన్నాం. నువ్వో ఆపిలు తిన్నావు, నేనో నేరేడుపండు తిన్నాను,…

  • ఏప్రిల్ 17, 2019

    సంగీత స్తుతి… రైనర్ మారియా రిల్కే, బొహీమియన్-ఆస్ట్రియన్ కవి

    సంగీతం: శిల్పాల ఊపిరి. బహుశా చిత్రాల మౌనం. భాష ఏదైనా దాని శబ్దసర్వస్వమంతా ఆ పొలిమేర దాటలేదు. ఓహ్! మర్త్యహృదయాల స్పందనలపై కాలం నిలుకడ. సంగీతమా! ఈ అనుభూతులెవరికోసమని? ఈ అనుభూతుల్ని ఎలా పరివర్తిద్దామని? … శ్రవణదృశ్యాలుగా రూపుదిద్దడానికా? ఓ అపరిచిత సంగీతమా… నీ హృదయాంతరం మా ఆత్మ జనితం. మా అంతరాంతర కుహరసీమ ఛేదించుకుని, త్రోవచేసుకు బయటపడి మమల్ని ముంచెత్తుతుంది. మా అంతరంతరాలలోని తావు ఎదురుగా సాక్షాత్కరించడం, ఎంత పవిత్రమైన ప్రస్థానం! చేజాపుదూరంలో, గాలికి అవతలి…

  • ఏప్రిల్ 16, 2019

    భరతవాక్యం … బాసిల్ బంటింగ్, బ్రిటిషు కవి

    జీవిత చరమాంకంలోకి వచ్చిన వాళ్ళకి మిగిలేది తమజీవితం గురించిన పునశ్చరణ, మూల్యాంకనం చేసుకోవడమూను. ఎక్కువ శాతం అందులో సంతృప్తికంటే అసంతృప్తే ఉంటుంది. అందుకే (వ్యక్తిగత ప్రమాణాలననుసరించి) ఎవరికి వారు జీవితంలో సఫలత సాధించిన వారి గురించి వినడానికి ఇష్టపడతారు. ఇక్కడ “నిశ” చీకటి గాని రాత్రి గాని కాదు. మృత్యువు; మదిర … అమృతసేవనానికి అర్రులుజాచడం. ఎవరు ఎన్ని సాధించినా సాధించకపోయినా, లేక సాధించామనో సాధించలేకపోయామనో అనుకున్నా, వాళ్ళగురించి ఏదీ మిగలదు. వాళ్ళు పోగొట్టుకున్నదీ లేదు. మిగిల్చిపోయిందీ…

←మునుపటి పుట
1 … 37 38 39 40 41 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు