-
తపర్తులోకి మంచుసోనలా మరొకసారి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

మరొకసారి నా తపర్తుజీవితంలోకి మంచుసోనలా ఎడారిలో నీటిచెలమమీంచి వీచే పిల్లగాలిలా చల్లని, కమ్మని నీటిబుగ్గమీద బుడగల జడిలా నీ గురించి, మోసకారి తలపొకటి పొడచూపుతుంది నా ఉత్సాహాన్ని హరించడానికి; మళ్ళీ ఎప్పటిలాగే నీ అలవిమాలిన ప్రేమకై ఆశలు పెంచుకుంటాను; అదొక పెద్ద ఇసుకతిన్నె అని నేను ఎన్నడో గ్రహించినా అక్కడ ఎప్పుడూ ఏ లేచిగురూ మొలవలేదని ఎరిగినా. మరొకసారి, తెలివిమాలినదానినై గాలిలో కదిలే నీ రంగురంగుల భ్రాంతిమదరూపం వెంటబడతాను. వెక్కివెక్కి ఏడుస్తూ, తిట్టుకుంటూ, పడుతూ లేస్తూ దిక్కుమాలి,…
-
నిజమైన ఉపవాస దీక్ష… రాబర్ట్ హెర్రింగ్, ఇంగ్లీషు కవి

వంటగది శుభ్రంచేసుకుని సామాన్ల జాబితా కుదించి మాంసం,తినుబండారాలను తగ్గించడమా ఉపవాసదీక్ష అంటే? మాంసపు రుచులు విడిచిపెట్టి కంచాన్ని చేపలతో నింపడమా? లేక, కొన్నాళ్ళు తిండి మానేసి, కండకోల్పోయి చర్మంవేలాడేలా సుక్కి నీరసంతో తలవాల్చుకుని విచారించడమా? ఎంతమాత్రం కాదు! నీ కంచంలోని అన్నమూ, మాంసమూ ఆకొన్న మరొక జీవికి అందించడం ఉపవాసమంటే. అక్కరలేని మతవివాదాలనుండి ఏనాటివో, తరగని చర్చలనుండి వాటివల్ల కలిగే ద్వేషాన్నుండి జీవితాన్ని త్రుంచి విముక్తంచెయ్యడం. విచారమగ్నమైన హృదయంతో భోజనసామగ్రికి బదులు చేసే పాపాల్ని తగ్గించుకోవడం ఉపవాసదీక్షవహించడం అంటే!…
-
శ్రామికుడు… విలియం డేవిస్ గేలహార్, అమెరికను కవి
ఊఁ , తలెత్తుకు నిటారుగా నిలబడు! నువ్వు నీ దేవునికి ప్రతిరూపానివి! అంతకంటే ఏంకావాలి? దైనందిన జీవన సంఘర్షణలో మొక్కవోకుండా నిలబడే గుండెధైర్యమూ, ఎవరికీ తీసిపోని నిర్మల, దయార్ద్రహృదయమూ నీకున్నాయి! ఏం చెప్పను? ఈ మానవసమూహంలో తిరుగాడే అందరిలాగే నువ్వూ నిజాయితీ పరుడివే; ఏ మహత్తర ప్రణాళికతో సృష్టికి పొద్దుపొడిచిందో ఆ లక్ష్యసాధనలో ఈ ప్రాణికోటిలో ప్రతిఒక్కరిలా నువ్వూ అందులో భాగస్వామివే. నీకు శత్రువు ఎవరు? ఉన్నత పదవిలో ఉన్నవాడా? ధనవంతులలో అగ్రగణ్యుడా? లేక నీ వంక…
-
ధర్మం ఎప్పుడూ గెలవాలి… ఫ్రెడెరిక్ విలియం ఫేబర్, ఇంగ్లీషు కవి

ఇది దేముడి గురించి చెప్పినా, ఇది అందరి విశ్వాసాలకూ వర్తిస్తుంది. విశ్వాసం అంటే మనకు చెదురుమదురుగా అన్ని విషయాలపట్లా ఉండే నమ్మకం కాదు. మనజీవన మార్గాన్ని నిర్ణయించుకుని మార్గదర్శకాలుగా ఎంచుకుని ఆచరిస్తున్న కొన్ని విలువలు, నమ్మకాలపై మనకు ఉండే అచంచలమైన విశ్వాసం. ప్రకృతి ఎంత చిత్రమైనదీ, ఎంత పెంకిదీ అంటే, మనవిశ్వాసాలనూ ఎప్పుడూ పరీక్షకు పెడుతూ, మనం ఓడిపోయినప్పుడల్లా, మన నమ్మకాలకి వ్యతిరేకంగా ఉన్నదే నిజమేమో, మనం పొరబడ్డామేమో అనుకుని మన బలహీన క్షణాల్లో మన ప్రస్తుత…
-
నే చెప్పలేదూ?… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి

నే చెప్పలేదూ… ఇకపై పాపాలు చెయ్యనని? ప్రభూ, నువ్వే సాక్షివి, చేశాను; అంతే కాదు, ఇంకా చేస్తూనే ఉన్నాను. నా తప్పుల్ని దాచ శక్యం కాదు. ఏం చెయ్యను? మళ్ళీ ప్రమాణంచేసి మాట తప్పనా? ప్రమాణం చెయ్యడం కేవలం వృధా ప్రయాస. నాలోని మంచి చెడుని అదుపుచెయ్యలేకపోతోంది; ఈ ప్రయత్నం తప్పకుండా విఫలమౌతుంది. ఓహో! ఎందుకు అలా అనుకుంటావు? నీకు భగవంతుడు ఎంతటి ఆత్మనిగ్రహాన్ని ప్రసాదించేడో నీకు తెలియదు, తిరిగి ఒట్టుపెట్టుకో, నువ్వు చివరిదాకా నిలబడగలిగితే దేముడు…
-
రకరకాల మనసులు…. రిఛర్డ్ చెనో ట్రెంచ్ , ఇంగ్లీషు కవి
. ఆకాశం నిర్మలంగా ఉండి చూడడానికి ప్రకాశవంతంగా ఉన్నా, కొందరు గొణుగుతారు అంతనిర్మలంగా ఉన్న నీలాకాశంలోనూ ఎక్కడో నల్లని మరక కనిపించిందంటూ; కొందరికి వారి చీకటిముసిరినజీవితాలలో భగవంతుని అనుగ్రహం ఒక్కసారి కలిగినా, ఒక్క వెలుగురేక తొంగిచూచినా చాలు, హృదయం కృతజ్ఞతాపూర్వక ప్రేమభావనతో నిండిపోతుంది. రాజప్రాసాదాలలోని హృదయాలు అసంతృప్తితో, అహమికతో అడుగుతుంటాయి జీవితం ఎందుకింత నిస్సారంగా ఉండి ఏ మంచీ ఎందుకు జరగడం లేదని. నిరుపేద గుడిసెలలోని మనసులు ప్రేమ వారిజీవితాలని ఎలా ఆదుకుందో (అసలా ప్రేమకు అలసట…
-
కొవ్వొత్తి … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
. నా కొవ్వొత్తి రెండు వైపులా మండుతోంది అది ఈ రాత్రల్లా వెలగకపోవచ్చు కానీ, నా శత్రులారా! ఓ నా మిత్రులారా! అది వెలిగినంతసేపూ అద్భుతమైన కాంతినిస్తుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, ( 22 February 1892 – 19 October 1950) అమెరికను కవయిత్రి . . First Fig . My Candle burns at both ends; It will not last the night; But, ah, my…
-
సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

. నాలోని యోగీ, భోగీ రాత్రీ పగలూ పోట్లాడుకుంటూ ఉంటారు. సమ ఉజ్జీలేమో, అతి జాగ్రత్తగా, లొంగకుండా ఒకర్నొకరు తిట్టుకుంటూ నాకు ఒకపక్క చెమట్లు పట్టేస్తుంటే సూర్యోదయం మొదలు చీకటిపడేదాకా కొట్టుకుంటారు. రాత్రయినదగ్గరనుండీ పోరాటం మళ్ళీ ప్రారంభం. పొద్దుపొడుస్తుంటే వణుక్కుంటూ వాళ్ళని గమనిస్తాను. ఈసారి ఒకరి అంతు రెండోవాళ్ళు చూసేదాకా కొట్టుకుంటారు. ఎవరు జయిస్తారన్నది నేను పట్టించుకోను. ఏవరు గెలిచినా, చివరికొచ్చేసరికి ఓడిపోయేదాన్ని నేనే! . సారా టీజ్డేల్ (8 August 1884 – 29 January…
-
పోగొట్టుకున్న నేల… ఈవన్ బోలాండ్, సమకాలీన ఐరిష్ కవయిత్రి

. నా కిద్దరు ఆడపిల్లలున్నారు. నేను ఈ జన్మకి కోరుకున్నది ఆ ఇద్దరినే. బహుశా నేను అంతకుమించి కోరుకోలేదేమో! . హాఁ! నేను చారెడు జాగా కూడా కోరుకున్నాను: ఎప్పుడూ ఎవరిపని వారు చేసుకోగలిగే వాతావరణమున్న దీవి, చుట్టూ కొండలమధ్య ఒక నగరం, ఒక జీవ నది … ఉన్న చోట. ఆ నేల నాదని చెప్పుకోగలగాలి. నా స్వంతం. అక్షరాలా నా తాత్పర్యం అదే. వాళ్ళు పెద్దవాళ్ళయిపోయి దూరాభారాన ఉన్నారు. ఇప్పుడు జ్ఞాపకాలే వలస పోతున్నాయి.…
-
“ఎవరక్కడ?… రూమీ, పెర్షియన్ కవి

. “ఎవరక్కడ?” అని అతనడిగేడు “మీ విధేయుడైన సేవకుడిని,” అన్నాను నేను. “ఈక్కడ నీకేం పని?” అడిగేడతను. “ప్రభూ! మిమ్మల్ని దర్శించుకోడానికి వచ్చేను,” అన్నాను నేను. “ఎన్నాళ్లని ఇలా తిరుగుతూ ఉంటావు?” అని అడిగేడతను. “స్వామీ! మీరు ఇక చాలు అనేదాకా,” అన్నాను నేను. “ఎన్నాళ్లని ఇలా మంటలో సలసల్కాగుతావు?” “నేను పరిశుద్ధుడను అయేదాకా!” అన్నాను నేను. అని, “ప్రభూ! ప్రేమమీద ప్రమాణం చేసి చెబుతున్నా, నేను ప్రేమ కోసం నా హోదానీ, నా సంపదనీ వదులుకున్నాను,”…