అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 5, 2019

    పొద్దు పోయింది… తూ-ఫూ, చీనీ కవి

    పొద్దు పోయింది… తూ-ఫూ, చీనీ కవి

    ఆలమందలూ, జీవాలూ ఎప్పుడో ఇల్లు చేరాయి,పసులదొడ్డి ద్వారాలు మూయబడ్డాయి. స్పష్టమైన ఈ రేయి, తోటకి దూరంగా పర్వతాలమీదా నదులమీదా గాలి ఎగరగొట్టినట్టు చంద్రుడు పైకి లేస్తున్నాడు. ఎత్తైన, నల్లని చీకటి కొండగుహల్లోంచి సెలయేళ్ళు పలచగా జారుతున్నాయి, కొండ అంచున పచ్చిక మీద మంచు మెల్లగా పేరుకుంటోంది. లాంతరు వెలుగున నా జుత్తు ఇంకా తెల్లగా మెరుస్తోంది. పదే పదే అదృష్టాన్ని సూచిస్తూ దీపం ఎగుస్తోంది… ఎందుకో? . తూ- ఫూ 712- 770 చీనీ కవి .…

  • జూన్ 3, 2019

    కల… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    కల… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    ప్రియతమా! నేను రోదించినా ఎవరూ పట్టించుకోరు నువ్వు దానికి నవ్వినా నేను దానికి బాధపడను. అలా అనుకోడం తెలివితక్కువగా కనిపించవచ్చు కానీ, నువ్వున్నావన్నది గొప్ప ధైర్యాన్నిస్తుంది. ప్రియతమా!నేను నిద్రలో మేల్కొన్నట్టు కలగన్నాను నేలమీద, తెల్లగా పిండారబోసినట్టున్న వెన్నెల చేతితో తాకాను; కానీ ఎక్కడో దూరంగా వదులుగా ఉన్న కిటికీ ఒకటి కిర్రుమని చప్పుడైంది గాలికి ఊగుతూ… కానీ గాలి వీచిన జాడలేదు, నాకు భయంవేసి నీ వైపు చూశాను నీ భరోసాకోసం చెయ్యి జాచేను కానీ, నువ్వక్కడలేవు!…

  • జూన్ 2, 2019

    నాకు ఒంట్లో బాగులేదు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

    నాకు ఒంట్లో బాగులేదు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

    “ఇవాళ నేను బడికి వెళ్ళలేను” అంది పెగ్గీ ఏన్ మెకే. నాకు మశూచిసోకిందో, గవదబిళ్ళలు లేచాయో అక్కడక్కడగాట్లూ, దద్దుర్లూ, ఎర్రగా పొక్కులూ ఉన్నాయి. నా నోరు తడిగానూ, గొంతు పొడారిపోతూనూ ఉంది నాకు కుడికన్ను కనిపించడం లేదు. నా టాన్సిల్స్ బండరాయిల్లా తయారయ్యాయి నేను లెక్కెట్టేను పదహారు అమ్మవారుపోసిన పొక్కులున్నాయి ఇదిగో, దీనితో కలిపి పదిహేడు నా ముఖం నీకు పచ్చగా కనిపించటం లేదూ? నా కాలుకి దెబ్బతగిలింది, కళ్ళు వాచిపోయాయి… బహుశా అప్పుడే ఫ్లూ జ్వరం…

  • జూన్ 1, 2019

    కవితలు రాస్తున్నకొద్దీ… ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి

    కవితలు రాస్తున్నకొద్దీ… ఛార్ల్స్  బ్యుకోవ్స్కీ, అమెరికను కవి

    రాసిన కవితల సంఖ్య వేలలోకి వెళ్తున్నకొద్దీ నీకు అర్థం అవుతుంది నువ్వు చెప్పుకోదగ్గంత రాయలేదని. చివరకి వానా, ఎండా, రోడ్డుమీదవాహనాలూ, రాత్రుళ్ళూ పగళ్ళూ, ముఖాలూ కవితావస్తువులౌతాయి. వాటిని భరించడం కంటే విడిచిపెట్టడం ఉత్తమం. రేడియోలో ఎవరిదో పియానో వాద్యం వినిపిస్తుంటే మరో కవిత రాస్తున్నాను. గొప్పకవులు రాసింది చాలా తక్కువ చెత్తకవులు మరీ ఎక్కువ రాసేరు. . చార్ల్స్ బ్యుకోవ్స్కీ August 16, 1920 – March 9, 1994 అమెరికను కవి As The Poems…

  • మే 31, 2019

    జారిపోతున్న క్షణాలు… జార్జి లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి

    జారిపోతున్న క్షణాలు… జార్జి లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి

    నా జీవితాన్ని తిరిగి జీవించే అవకాశం వస్తే మరిన్ని తప్పులు చెయ్యడానికి రెండవసారి ప్రయత్నిస్తాను. పరిపూర్ణంగా దోషరహితంగా ఉండడానికి ప్రయత్నించను. ఏ ఒత్తిడీలేకుండా తీరుబాటుగా ఉంటాను, ఇప్పటికంటే సంతృప్తిగా ఉంటాను. నిజానికి అతి తక్కువ విషయాలని ప్రాధాన్యత ఇస్తాను ఇప్పటికంటే తక్కువ పరిశుభ్రంగా ఉంటాను ఎక్కువ తెగువచూపిస్తాను ఎక్కువ ప్రయాణాలు చేస్తాను ఎక్కువ సూర్యాస్తమయాలు చూస్తాను ఎక్కువ కొండలెక్కుతాను ఎక్కువ నదుల్లో ఈదుతాను ఇప్పటివరకు చూడని ఎన్నో ప్రదేశాలు చూస్తాను ఎక్కువ ఐస్ క్రీం తిని, తక్కువ…

  • మే 30, 2019

    సానెట్ 21- ఏదీ, మరొకసారి, ఇంకొకసారి చెప్పు?… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి

    సానెట్ 21- ఏదీ, మరొకసారి, ఇంకొకసారి చెప్పు?… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి

    ఈ కవిత చదువుతుంటే, పాపయ్య శాస్త్రి గారి పద్యం “ఏది మరొక్కమారు హృదయేశ్వర! గుండెలు పుల్కరింపగా ఊదగదోయి, ఊదగదవోయి….” గుర్తుకు వస్తుంది. ‘పునరుక్తి’ దోషంకాదంటూ చక్కని ఉపమానంతో సమర్థిస్తుంది కవయిత్రి ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ఈ కవితలో. హృదయగతమైన సుకుమార భావనలు దేశకాలావధులకి అతీతమైనవని అనడానికి మరొక్క ఋజువు. . ఏదీ, మరొకసారి చెప్పు, మళ్ళీ ఇంకొకసారి చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని! పదేపదిసార్లు పలికిన ఈ మాటలు నువ్వన్నట్టు అవి నాకు కోకిలపాటలా వినిపించినా, ఒక్కటి గుర్తుంచుకో!…

  • మే 29, 2019

    ఊహలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    ఊహలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    నీ మాటలు నాలో ఎంతో సానుభూతి రేకెత్తించినా నాకు నీతో మాటాడాలనిపించటం లేదు. నా తనువులో మౌనంగా దాగిన మధురగీతికలన్నీ మేల్కొని సంగీతమై నినదిస్తున్నాయి. నువ్వు నిష్క్రమించినపుడు ఈ సున్నితమైన తంత్రులన్నిటినీ అకస్మాత్తుగా ఎవరో నిర్దాక్షిణ్యంగా, సులభంగా త్రెంచిపారేసినట్టనిపిస్తుంది. వద్దు, ఇంకేం మాటాడవద్దు; బదులుగా, మనిద్దరం ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మౌనాన్ని అక్కునచేర్చుకుందాం. నలుపెక్కుతున్న మేఘాలని చూసి తుఫాను రాకడని ఊహించినట్టు మన మాటలనుబట్టి ఇతరులు మన ఆంతర్యాన్ని పసిగట్టవచ్చు. నామట్టుకు నాకు, ఏ రోజైనా మనం…

  • మే 28, 2019

    పొద్దుపొడిచేవేళ… యాహియా లబాబిడి, ఈజిప్టు కవి

    ప్రతి వస్తువూ ఉన్నచోటనే కట్టుబడినట్టు పడుండవలసిన స్థితికి విసుగెత్తి, అసంకల్పితంగా ఆయా వస్తువులు కిర్రుమన్నట్టూ, కుర్చీలు చేతులు బారజాపుకు వొళ్ళు విరుచుకున్నట్టూ మేజాలు కాళ్ళనీ, అలమరలు వెన్నునీ విరుచుకుంటున్నాయేమో ననిపించే సమయాలు కొన్ని ఉంటాయి … మనుషులుకూడా, పనిచేసేచోటనో, ప్రేమలోనో అంతరాంతరాల్లో తమ అభిప్రాయాలు ఖండాలు జరిగినంత ఖచ్చితంగా, నెమ్మదిగా తామే పోల్చుకోలేనంతగా మారుతున్నపుడు ఏదో ఒకటి ఒళ్ళు విరుచుకునో, అరిచో, వాటిని ఒకసారి పునరావలోకనంచేసుకునేట్టు చేస్తుంది. అశాంతినిండిన ఒకానొక సుప్రభాతవేళ, తెలిసో తెలియకో ఓరవాకిలిగా విడిచిన…

  • మే 27, 2019

    ఈ బొమ్మ ఏమై ఉంటుంది?… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

    ఒక పాత బొమ్మలో చిన్న ముక్క రోడ్డుమీద పడి ఉంది. ఒక పాత బొమ్మలో చిన్న ముక్క వానలో తడుస్తూంది. అది అలవాటుగా షూ వేసుకునే స్త్రీ తొడుక్కున్న కోటుకి ఉండే నీలిరంగు బొత్తాము కావచ్చు. అది magic bean గాని ఒక మహారాణి గారు ధరించిన ఎర్రని మొకమలు వస్త్రంమీది మడత కావొచ్చు, లేదా, Snow White కి సవతి తల్లి ఇచ్చిన ఏపిలును ఆమె కొరికినపుడు పడిన పంటి గాటు కావొచ్చు. అది ఒక…

  • మే 25, 2019

    సామూహిక అభ్యర్థన … ప్రీమో లెవీ, ఇటాలియన్ కవి

    సామూహిక అభ్యర్థన … ప్రీమో లెవీ, ఇటాలియన్ కవి

    మీ మీ ఇళ్ళలో భద్రంగా, వెచ్చగా గుమ్మటంలా ఉంటూ సాయంత్రం ఇంటికి రాగానే నవ్వుముఖాలూ, వేడివేడి భోజనం ఎదురుచూసే మీరు ఒకసారి ఆలోచించండి కేవలం ఒక రోట్టెముక్క కోసం బురద కొట్టుకునేలా చాకిరీచేస్తున్నా మనశ్శాంతి అన్నది ఎరుగక, అవును, కాదు అన్న ఒక నిర్ణయానికి బలి అయే ఇతనూ ఒక మనిషిబ్రతుకే? శుభ్రమైన తలకట్టుగాని, పేరుగాని లేక ఉన్నా గుర్తుపెట్టుకునే శక్తి లేక శీతకాలంలోని కప్పలా కళ్ళు శూన్యంలోకిచూస్తూ, గర్భంవట్టిపోయి అలమటించే ఈమెదీ ఒక ఆడబ్రతుకే? ఇన్నాళ్ళబట్టీ…

←మునుపటి పుట
1 … 34 35 36 37 38 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు