అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 12, 2019

    అపార్థం… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

    పగటికి ప్రేమగా, అపురూపంగా చూసే హృదయ ముందనీ రాత్రి ఏమీపట్టనట్టు, మౌనంగా ఉంటుందని అందరూ అంటారు కానీ, నేను చాలా సార్లు రాత్రి వెళ్లిపోయిన తర్వాత ఆమె కన్నీటి బిందువులు పువ్వులమీదా, గడ్డిమీదా చూశాను. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి .   Misunderstood .  Day has a kindly, loving heart, they say While night is made…

  • సెప్టెంబర్ 11, 2019

    రష్యను నర్తకి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

    ఈ కవితలో lighted wood అన్న పదం మీద ఉపయోగించిన శ్లేష గమనించదగ్గది. ఒకటి చెక్కలతో చేసిన రంగస్థలాన్ని సూచిస్తే, రెండవది చప్పుడులేకుండా చిరుగాలికి లాస్యంచేస్తూ మండుతున్న కట్టె అయి ఉండొచ్చునని నా అభిప్రాయం.  మీరు గమనించి ఉంటే, బాగా ఎండిన కట్టెమీది మంట ఒక్కోసారి మండుతున్నంతమేరా కట్టెను తాకీ తాకనట్టు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అంటే, ఒక నృత్యం కవయిత్రికి అద్భుతమైన మరొక నృత్యాన్ని గుర్తుకు తెచ్చిందన్నమాట.   ఎరుపురెక్కల మంట, బాగా వెలుగులున్న…

  • సెప్టెంబర్ 11, 2019

    అభిజ్ఞప్రేయసి… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

    ఓ ప్రకృతీ! నీ ముందు కాళ్ళపై మోకరిల్లే వారిని నువ్వు పతితుడవా? పావనుడవా? అని ప్రశ్నించకు. వా డెవరైనా నిన్ను మనసారా ప్రేమిస్తాడు. అతనికున్న సంగీత, చిత్రకళా నైపుణ్యాలను కోపంలోనూ, ఆనందంలోనూ నువ్వు చిందించే శతసహస్రసౌందర్యావస్థలనీ ఆరాధిస్తాడు. అతను నీ పాదాలచెంతనే మోకరిల్లి ఉండగా అతని స్తోత్రసుగంధాలు రోదసి అంతా వ్యాపిస్తాయి. పాపం, మనశ్శాంతికి ప్రాకులాడే ఈ మానవాత్మని నీ అభిజ్ఞతతో ఎంతకీ సంతృప్తి చెందక నువ్వు విసిగిస్తే, నీమీది మునపటి నమ్మకాల్నీ, విస్వాసాల్నీ విడిచిపెట్టి సులభంగా…

  • సెప్టెంబర్ 9, 2019

    ఒంటరి జాబిలి

    అసూయ చెందిన ఆమె చెలికాడు మరలిపోయాడు; ఒంటరితనంతో, భయాలతో సతమతమౌతూ చివరకి సముద్రాన్ని ఆశ్రయించింది జాబిలి. ఆ పరాయి గుండెమీద అపురూపమైన తన కన్నీళ్ళని ఒలకబోసుకుంటోంది. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి . The Lonely Moon   Her envious kin turn from her; sore oppressed With loneliness and fears, She seeks the sea, and…

  • సెప్టెంబర్ 4, 2019

    మనవి… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    మనవి… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    విరివిగా వాడడంవల్ల అరిగి అరిగి, నీ చేతికి అలవాటై, నీ అవసరానికి తగినట్టు మలచబడిన పనిముట్టునవాలనీ, నీ సేవకై నన్ను అలవోకగా వినియోగించుకోమనీ నా వినతి. నిగనిగలాడే నీ జీవితపు రంగురంగుల కలనేత వస్త్రంలో నన్నొక గుర్తింపులేని దారపుపోగుగా మసలనీ; ఆ రంగురంగులమిశ్రమంలో నేనూ ఒక కణాన్నై దాగి, చిరకాలం ఆ రంగుల్ని స్ఫుటంగా ప్రతిఫలిస్తాను. నీ పగటికలల్లో నేనూ విహరించాలని నా ఆకాంక్ష, మొయిలుదారులలో నువ్వు పరుచుకున్న మెట్ల అంచున, దివ్యమైన వెన్నెల ప్రవాహపు పరవళ్ళలో…

  • ఆగస్ట్ 23, 2019

    ముఖాలు… కేథరీన్ సావేజ్ బ్రాజ్మన్, అమెరికను కవి

    బ్రిటిష్ మ్యూజియం లో ఈజిప్టునుండి ఇక్కడికి ప్రయాణంచేసి, మ్యూజియంలో రాతిమీద, కర్రమీద శాశ్వతంగా చిత్రించబడ్డ పురాతన మానవకళేబరాల్ని చూడడానికి వచ్చి అలవాటుగా కిటికీలోంచి మృదువుగా ప్రవహిస్తున్న నగరదృశ్యాన్ని ఒంటరిగా పరికిస్తున్నాను. శీతకాలమైనా ఎండ చురుక్కుమంటోంది. వసారాలో పావురాలు అటూఇటూ ఎగురుతూ రెక్కలతో ఆకాశంవంక గుడ్లప్పగించి చూస్తూ విశ్రాంతి లేకుండా ప్రాంగణాన్ని శుభ్రంచేస్తున్నాయి. లోపలికి ప్రవేశించి, సంప్రదాయంగా కనిపిస్తున్న మేధావుల్నీ, జపనీస్ యాత్రికులప్రవాహాన్ని తప్పుకుని, టిక్కట్టుతీసుకుని, బారులుతీరిన సుందర చైతన్య మానవప్రవాహాన్ని దాటి, అక్కడ అడుగుపెట్టడానికి మృత్యువుసైతం క్షణకాలం…

  • ఆగస్ట్ 22, 2019

    (ఐరిష్) ద్వీపకల్పం… సీమస్ హీనీ, ఐరిష్ కవి

    కవీ! నీకు చెప్పడానికి ఏమీ లేనపుడు, ఒకరోజు రోజల్లా ఈ ద్వీపకల్పం చుట్టూ కారులో తిరిగి రా. ఆకాశం నీకు రాజమార్గంలా ఎదురుగా ఎత్తుగా కనిపిస్తుంది కానీ ఎక్కడా గమ్యం గుర్తులుండవు గనుక ఆగే పని లేదు. కానీ, ఏ క్షణంలోనైనా జారి దొర్లిపోవచ్చన్న భయంతో నడుపు. చీకటిపడేసరికి, దిగంతాలు సముద్రాన్నీ కొండల్నీ మింగేస్తాయి, దున్నిన పొలం, పక్కనే సున్నంకొట్టిన భవనాన్ని మింగేస్తుంది నువ్వు ఎలాగూ చీకట్లోనే కారు నడపవలసి వస్తుంది. ఇప్పుడు ఒకసారి మెరిసే సముద్రతీరాన్నీ,…

  • ఆగస్ట్ 18, 2019

    నిండుచంద్రుడు… తూ ఫూ, చీనీ కవి

    నిండుచంద్రుడు… తూ ఫూ, చీనీ కవి

    గోపురం మీద… ఒంటరిగా, రెండురెట్లు కనిపిస్తున్న చంద్రుడు. రాత్రి నిండిన ఇళ్ళ వరుసలుదాటి, చల్లగా తగిలే నది కెరటాలమీద నిలకడలేని వర్ణమిశ్రమాన్ని నలుదిక్కులా వెదజల్లుతున్నాడు. అల్లికచాపలమీద చూస్తే పట్టువలకంటే మిన్నగా మెరుస్తున్నాడు. ఆచ్ఛాదనలేని కొండ శిఖరాలు; అంతటా నిశ్శబ్దం. ఉన్న నాలుగు చుక్కలమధ్యనుండీ అడుగుతడబడకుండా తేలిపోతున్నాడు. నా తాతలనాటి తోటలో పైన్, లవంగ చెట్లు బాగా పెరిగాయి. ఎటుచూసినా వెలుగు వరద. ఏకకాలంలో, పదివేల చదరపుమైళ్ల మేరా దాని కాంతిలో మునిగిపోయింది. . తూ-ఫూ (712- 770)…

  • ఆగస్ట్ 15, 2019

    శిలగా మరణించాను… రూమీ, పెర్షియన్ కవి

    నేను శిలగా మరణించేను కానీ మొక్కనై తిరిగి మొలకెత్తాను నేను చెట్టుగా మరణించేను కానీ జంతువుగా తిరిగి పుట్టేను. నేను జంతువుగా మరణించేను కానీ మనిషిగా తిరిగి జన్మించేను. భయం దేనికి? మరణంలో పోగొట్టుకున్నదేమిటిట? . రూమీ 13 వ శతాబ్దం పెర్షియన్ సూఫీ కవి   . . A Stone I died . A stone I died and rose again a plant; A plant I died and…

  • ఆగస్ట్ 14, 2019

    గుప్పెడు మట్టి… హెన్రీ లూయీ వివియన్ డెరోజియో, భారతీయ (బెంగాలీ) కవి

    అప్పటికి ఆకాశం లేతనీలిరంగు సంతరించుకుంది గగన మండలం మీదకి సూర్యుడు ఇంకా అడుగుపెట్టలేదు. చిటారుకొమ్మమీద కోయిల గొంతెత్తి ప్రభాతగీతమాలపిస్తోంది, చిక్కని ఆకుపచ్చని ప్రకృతి సువాసనలతో గుబాళిస్తోంది. జూలియన్, నేనూ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ నేల గర్వించే గొప్ప వ్యక్తి సమాధి దగ్గర ఆగేము. శిలాఫలకం అతని పేరూ, వయసూ, ఘనతా ప్రకటిస్తోంది. అతను సాధించిన ఘనకార్యాలకీ, అతనిమీద కురిపించిన ప్రశంసల జల్లుకీ నాకు నోటమాట రాలేదు, నాకు తెలియకుండానే అతని సాధనకీ, జీవిత విస్తృతికీ నాలో…

←మునుపటి పుట
1 … 29 30 31 32 33 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు