-
అజ్ఞాత పౌరుడు… ఆడెన్, ఇంగ్లీషు-అమెరికను కవి
గణాంకశాఖ లెక్కల ప్రకారం అతని మీద ఏ రకమైన చట్టపరమైన అభియోగాలూ లేవు. అతని నడవడి మీద అందరి అభిప్రాయాలూ ఒక్కలాగే ఉన్నాయి అంటే, పాతమాటే అయినా ఇప్పటి అర్థంలో ఋషిలాంటి వాడు ఎందుకంటే అతను ఏ పని చేసినా సమాజహితం కోసమే చేశాడు. యుద్ధం సమయంలో మినహాయించి, అతను పదవీ విరమణ చేసేదాకా అతను ఒక కర్మాగారంలో పనిచేశాడు, మధ్యలో తీసేసిన దాఖలాలు లేవు. అతని యజమానులు, ఫడ్జ్ మోటార్స్ కంపెనీ, ని సంతృప్తి పరచాడు.…
-
నీ శకం ముగిసింది… లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి
నీ శకం ముగిసింది, ఇక నీ కీర్తి ప్రారంభమైంది. ఈ దేశవాసులు గీతాలు రచిస్తారు తమ ప్రియతమ పుత్రుడు సాధించిన ఘనకార్యాలూ, గెలిచిన యుద్ధాలూ, నిలబెట్టిన స్వాతంత్య్రమూ, గెలిచిన పోరాటాలనూ స్మరించుకుంటూ! నువ్వు నేల రాలి, మేము స్వేచ్ఛగా మిగిలినా నీకు మరణం ఎంతమాత్రం లేదు; నీ శరీరంనుండి వెల్లువై పెల్లుబికిన రక్తం ఈ నేలలో ఇంకడానికి ఇష్టపడక, మా రక్తనాళాల్లో తిరిగి ప్రవహిస్తూంది నీ ఆత్మ మా ఊపిరులున్నంతవరకు శాశ్వతం! నీ నామస్మరణే తక్కిన వీరసైనికులని…
-
నిష్క్రమిస్తున్న అతిథి… జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ, అమెరికను కవి
జీవితమూ, ప్రేమా ఎంత మనసుపడే ఆతిథేయులు! కాలవిలంబన చేస్తూనే వెనుతిరిగాను. ఇంత వయసుమీరిన తర్వాత కూడా అవి నాపై తమ ఉత్కృష్టమైన సత్కారాలలో ఏ లోపం రానియ్యనందుకు ఎంతో ఆనందం వేసింది. అందుకని, లోపలి సంతోషం ముఖంలో కనిపిస్తుండగా ఎంతో కృతజ్ఞతా భావంతో ఆగి వాటి చేతులు రెండూ మెత్తగా ఒత్తుతూ అన్నాను: “కృతజ్ఞుణ్ణి! సమయం చక్కగా గడిచింది. సెలవు!” . జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ (October 7, 1849 – July 22, 1916)…
-
కొత్తలోకానికి పయనం … లాయిడ్ మిఫ్లిన్, అమెరికను కవి
తారకాసముదయం మధ్యనెక్కడో మేఘాలపై నిలుచున్నాము మేము. అక్కడ నెలకొన్న నిశ్శబ్ద ఏకాంతత, తేజోమయమైన అతని శిరసుచుట్టూ వీణానాదమై నినదించగా, ఒక దేవదూత చేతులెత్తి ఒక్కొక్క చుక్కనీ చూపిస్తూ ఇలా అన్నాడు: “ఇక్కడున్న ఈ లక్షల నక్షత్రాలలో ఏ ప్రపంచానికి మిమ్మల్ని నన్ను ఎగరేసుకు పొమ్మంటారు?” అని. … నేను చనిపోయి అప్పటికి ఎక్కువ సమయం కాలేదు… “ఒక్క సారి నన్ను ఈ విశాల విశ్వాన్ని పరికించనీయండి. నిర్ణయం తీసుకోబోయే ముందు నన్ను ఆలోచించుకోనీయండి … అవునూ, అక్కడ…
-
సంతోషహృదయము… జాన్ వాన్స్ చీనీ, అమెరికను కవి
సూర్యుడి రథచక్రాలు తోలే సారథి సైతం వాటిని పగటిపూట మాత్రమే శాసించగలడు; అంతకంటే, నిత్యం చిన్న చిన్న పనులు చేస్తూ వినయంతో ఒదుక్కుని ఉండడమే ఉత్తమం. ఎంత కీర్తి వహించిన కత్తికైనా తుప్పు పట్టక మానదు కిరీటంకూడా చివరకి మట్టిలో కప్పబడిపోతుంది; కాలం తనచేత్తో క్రిందకి లాగి విసరలేనంత ఎత్తుకి తమ పేరుని నిలబెట్టగలిగిన వాళ్ళింకా పుట్టలేదు. సంతోషంగా కొట్టుకుంటున్న గుండె ఏదైనా ఉందంటే అది, దైనందిన జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కుని తక్కినదంతా భగవంతునిమీద భారం వేసి…
-
నేను లెక్కచెయ్యను… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

నేను మరణించి, ఏప్రిల్ నెల వర్షానికి తడిసిన తమ కురులతో చెట్లు నా మీద వాలినపుడు, గుండె పగిలి నువ్వుకూడా నా మీద వాలితే వాలవచ్చు అయినా, నేను లక్ష్య పెట్టను. గుబురుగా పెరిగిన కొమ్మలతో వర్షానికి వంగిన చెట్లకున్నంత ప్రశాంతంగా ఉంటాను నేను. అంతేకాదు. నువ్వు ఇప్పుడున్న దాని కంటే మౌనంగా, ఉదాసీనంగా ఉంటాను నేను. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . I…
-
అమ్మ… థెరెసా హెల్బర్న్, అమెరికను కవయిత్రి

నా కవితల్లో ఇష్టమైన వారి నెందరినో కీర్తించాను; కానీ, ఈ జీవితమంతా ఆమెకే చెందే అమ్మ బొమ్మ ముందు మాత్రం ఒట్టి చేతులతో నిలుచున్నాను. బహుశా, పక్వానికి వచ్చిన వయసులో ఆమెగూర్చి చెప్పని విషయాలు చెప్పే అవకాశం కలుగవచ్చు; ఇప్పుడు కాదు; అయినా, మనుషులెప్పుడూ తాము తినే అన్నం మీద కవిత రాయలేదు. . థెరెసా హెల్బర్న్ 12 Jan 1887 – 18 Aug 1959 అమెరికను కవయిత్రి . . Mother I have…
-
ఇంగ్లీషు కవి T E ఎర్ప్ మూడు కవితలు
1. మరోమార్గం… . నేను సుమారుగా ఇరవై ఏళ్ళనించి పుస్తకాలు చదువుతూ ఉన్నాను; అందరూ ఎక్కడ నవ్వితే, నేనూ అక్కడ నవ్వేను ఎక్కడ ఏడిస్తే , నేనూ అక్కడ ఏడిచేను. జీవితం ఇన్నాళ్ళూ అరిగిపోయినదారిలోనే ప్రయాణించింది. నా అంతట నేను మరోదారి వెతుక్కుంటాను. 2. ప్రేమ కవిత . ఏం చెప్పమంటావు?! నేను నీలో ఒక భాగాన్నైపోయాను. అందులో మరీ దౌర్భాగ్యం ఏమిటంటే వెనక మగాళ్ళు చేసే పొగడ్తలు వింటూ…
-
అందం అంటే ఏమిటి?… గోవింద కృష్ణ చెత్తూర్, భారతీయ కవి

నశ్వరమైన ఈ శరీరంలో అతి సూక్ష్మ భాగాన్ని అదెంత చిన్నదైనా, సజీవంగా ఉంచే … ఒక సంకేతం; ఒక సరసు మీదా, రాతిగుట్టమీదా అకస్మాత్తుగా సమానంగా పడే అద్భుతమైన … ఆవేశ లేశము, నిద్రిస్తున్న దైవత్వాన్ని నిద్రమేల్కొలిపి జరిగినదీ, జరుగనున్నదీ గుర్తుచేస్తూ భరించలేని గుండె గాయాలను మాన్పి సాంత్వన నిచ్చే … ప్రతీక, ఒక జ్ఞాపిక; అంతేనా? పాటలో, ప్రేమలో, చిన్నపిల్లల కళ్ళలో క్షణక్షణమూ కొత్తగా మనకి మనం చేసుకునే ప్రమాణం, విశాలగగనం మీదా, రోదించే సముద్రం…
-
మరణానంతర ప్రార్థన… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

ప్రియతమా! నేను మరణించిన తర్వాత నన్ను అనుసరించడానికి ప్రయత్నించవద్దు. ఇపుడు నా మనసు, నా సమాధి ప్రక్కన మొలిచిన చెట్టుమీది ఎర్రని లేచివుళ్ళలా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ నా ప్రశాంతతని పాడుచెయ్యవద్దు. నీకు నా మీద నిజంగా కనికరం ఉంటే రాత్రి నా కోసం ఇలా ప్రార్థన చెయ్యి: “నేను అన్నిటినీ క్షమించేను; విచారంలో మునిగి, ఏమీ చెయ్యలేకున్నాను; వెలుగుల్ని చుట్టుకుని, ఉరుముల్ని తురుముకున్న ప్రియా, నువ్వుకూడా నన్ను క్షమించు.” . డొరతీ పార్కర్ August…