అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • డిసెంబర్ 7, 2019

    పిచ్చి ఆశ … అడా ఐజాక్స్ మెన్కెన్, అమెరికను కవయిత్రి

    ఓ పిచ్చి, తెలివితక్కువ మనసా! నీ జీవితాశయాలనన్నిటినీ దూరంగా, మసక మసక మొయిలు సింహాసనము మీద పెట్టుకుని, ప్రేక్షకుల చప్పట్లకోసం, తెలిపొద్దు పొగమంచుతో దారాలు పేనుకుంటూ పైకి లాగుతున్నావు కానీ, జాగ్రత్త! ఆ దారి పొడవునా ఎదురయ్యేది ప్రేతవస్త్రాలే; ఎంత ధైర్యవంతుడైనా, వాటిని దాటాలనుకుంటే మాత్రం దారి మధ్యలో మృత్యువునో, హిమపాతాన్నో ఎదుర్కోవడం తధ్యం. ఓ పిచ్చి మనసా! ఏళ్ళు గతించిపోతున్నా నీ పారవశ్యపు దృక్కులు ఇంకా ఆ ఒక్క తారకమీదే. దాని వెచ్చని కాంతి పుంజాలు…

  • డిసెంబర్ 6, 2019

    మెట్లమీది గడియారం… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి

    ఆ పల్లె వీధికి చివరన కొద్దిదూరంలో ఎప్పటిదో తాతలనాటి భవంతి ఉండేది దాని పాడుబడ్ద ముందు పెరడులో పొడుగాటి పోప్లార్ చెట్లు నీడలు పరుస్తుండేవి చావడి మధ్యలో, తనున్నచోటునుండి పాత గోడగడియారం అందరికీ హెచ్చరిస్తుండేది: “శాశ్వతత్వం… క్షణికం! క్షణికమే… శాశ్వతం!” అని. మెట్లకి సగం ఎత్తులో ఉండేదది గట్టి ఓకుచెట్టు కవచంలోంచి చేతులు చాచి పిలుస్తున్నట్టుండేది తన ఆచ్ఛాదనలోంచి బిక్షువు ఛాతీపై శిలువ విక్షేపించి నిట్టూర్చినట్టు! రుద్ధకంఠంతో దారిపోయేవారందరితో చెప్పేది: “శాశ్వతత్వం… క్షణికం! క్షణికమే… శాశ్వతం!” అని. పగటిపూట…

  • డిసెంబర్ 4, 2019

    నన్ను స్వతంత్రదేశంలో సమాధిచెయ్యండి… ఫ్రాన్సెస్ ఎలెన్ వాట్కిన్స్ హార్పర్, అమెరికను కవయిత్రి

     ఎత్తైన కొండశిఖరం మీదనో, సమతలపు బయలులోనో మీకు ఎక్కడ వీలయితే అక్కడ నన్ను సమాధి చేయండి భూమ్మీద అది ఎంత సామాన్యమైన సమాధి అయినా ఫర్వా లేదు కానీ, మనుషులు బానిసలుగా ఉండే ఏ నేలమీదా సమాధి చెయ్యొద్దు. నా సమాధి చుట్టూ భయం భయంగా నడిచే బానిస అడుగులు వినిపిస్తే నాకు ప్రశాంతత ఉండదు; నా నిశ్శబ్దపు సమాధిమీద అతని నీడ కనిపించినా ఆ చోటు నాకు భయంకరంగా, బాధాకరంగా ఉంటుంది. అమ్మకానికి నిర్దాక్షిణ్యంగా, మందలుగా…

  • డిసెంబర్ 3, 2019

    నాకు స్వేచ్ఛ వస్తుంది!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను కవి

    నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను. లోకం నన్ను చూసి నవ్వితే నా కేమిటి లక్ష్యం? దాని నవ్వులూ, ఈసడింపులూ అన్నీ ఒకటే నాకు ఇపుడు, డబ్బున్నదన్న దాని అహంకారాన్ని కాలితో నలిపి పారెస్తా, కిరీటాలూ, వాటిని ధరించే శిరస్సులూ రెంటికీ విలువివ్వను. అబ్బ! మానవాళి ఎలా వాటిని భరించగలుగుతోంది? నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను. నాకు స్వాతంత్య్రమేమిటని లోకం నవ్వినా, ఇక నేను స్వేచ్ఛాజీవిని. దాని వెకిలినవ్వుల్ని చూసి నవ్వుకుంటా, దాని…

  • డిసెంబర్ 2, 2019

    అవిశ్వాసి అని ముద్ర వేయండి!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను

    మీరు నేర్చిన, నమ్మిన సిద్ధాంతాలను వినడానికీ, నమ్మడానికీ ఇష్టపడని వ్యక్తి ఎవరైనా ఎదురైతే అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి! మీరు కట్టిన దైవమందిరాల్లో పూజచెయ్యడానికి నిరాకరించినా, మీ మీ పుణ్యదినాల్లో జరిపే విందులకి హాజరుకాకపోయినా, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. పాపుల్నీ, పేదల్నీ, బాధితులనీ, చూసినపుడు అతని మనసు కరుణతో పొంగిపొరలవచ్చు గాక, అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి! చిరకాలంనుండీ జరుగుతున్న మంచికీ చెడ్డకీ మధ్య యుద్ధంలో అతను ఎప్పుడూ మంచి పక్షాన్నే నిలబడితే నిలబడుగాక,…

  • డిసెంబర్ 1, 2019

    నన్ను చావనీయండి, బ్రతిమాలుకుంటా… జార్జ్ మోజెస్ హార్టన్, అమెరికను కవి

    నన్ను చావనీయండి, మృత్యువుకి భయపడానికి బదులు, నా కథ ముగిసినందుకు ఆనంద పడనీయండి, నా చివరి ఊపిరి నన్ను విడిచిపోగానే ప్రాభాత వసంత వేళ కూసే కోకిలలా పాడుతూ నిష్క్రమించనీయండి. మృత్యువంటే ఏ భయం లేకుండా పోనివ్వండి, నన్నిక ఏ యమశిక్షలూ భయపెట్టలేవు, నా తలక్రింద విశ్వాసపు దిండుతో, శిధిలమయే శరీరం పట్ల తిరస్కారంతో నన్ను హాయిగా ఆలపిస్తూ వెళ్ళిపోనీయండి. నా శౌర్య పతకాలను ప్రదర్శిస్తూ నన్నొక వీరపుత్రుడిలా మరణించనీయండి; సమాధి అన్న ఆలోచనకే భయపడడమా? ఎన్నటికీ…

  • నవంబర్ 30, 2019

    ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి, ప్రభూ… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

    ప్రభూ, ఈ ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి నేను నా చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను.  ఒకసారి గుఱ్ఱాలసంగతి చూడు… త్వరగా! అది సరిపోతుంది. నన్ను స్థిరంగా ఉండేవైపు కూర్చోబెట్టు అప్పుడు నేను పడిపోతే అవకాశం ఉండదు. మనం ఇప్పుడు కడపటి తీర్పు వినడానికి పోవాలి అది నా అభిమతమూ, నీ అభిమతమూ.    నాకు వాలు ఎక్కువున్నా ఫర్వాలేదు సముద్రతీరమైనా ఫర్వా లేదు ఎడతెగని పరుగుపందెంలో చిక్కుకున్నా నా ఇష్టమూ, నీ అభీష్టం కొద్దీ ఇన్నాళ్ళూ బ్రతికిన నా…

  • నవంబర్ 29, 2019

    జీవితమంటే ?… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి

    జీవితమంటే ?… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి

    అసలు జీవితమంటే ఏమిటి? నడుస్తున్న ఇసుకగడియారం సూర్యుడికి దూరంగా జరుగుతున్న వేకువ పొగమంచు. క్షణం తీరికలేకుండా కోలాహలంగా పదే పదే వచ్చే కల. దాని గడువు ఎంత? ఒక్క విశ్రాంతి క్షణం, ఆలోచనా లేశం. అదిచ్చే ఆనందం? ప్రవాహంలోని నీటి బుడగ. దాన్ని అందుకుందికి పడే ఆరాటంలో అదీ శూన్యమైపోతుంది. ఆశ అంటే ఏమిటి? హాయినిచ్చే ప్రాభాతపు పిల్లగాలి. దాని హొయలుతో పచ్చికబయళ్ళమీది తెలిమంచు హరిస్తుంది ప్రతిపూలగుత్తినుండీ దాని రత్నాలను త్రెంచి, మాయమౌతుంది. నిరాశల ముళ్ళకొనలను దాచే…

  • నవంబర్ 28, 2019

    ఆనవాలు పట్టడం… రోజర్ మెగోఫ్ , ఇంగ్లీషు కవి

    మీరు ఇతను స్టీఫెనే అంటారు. అలా అయితే నేను నిజమో కాదో రూఢి చేసుకోవాలి. నా జాగ్రత్తలో నేనుండడం ఎప్పుడైనా మంచిదే కదా! చూశారా! ఇక్కడే పప్పులో కాలు వేశారు. జుత్తు చూస్తున్నారు గదా, ఇది నల్లగా ఉంది. స్టీఫెన్ జుత్తు తెల్లగా ఉంటుంది… ఏమిటీ? ఏమయిందీ? విస్ఫోటనం జరిగిందా? అలా అయితే నల్లగా మాడిపోతుంది. నా మతి మండినట్టే ఉంది. నా బుర్రకి ముందే తట్టి ఉండాలి. సరే, మిగతావి పరీక్షిద్దాం. ఆ ముఖం, ఆ…

  • నవంబర్ 27, 2019

    రోజులు… వికీ ఫీవర్, ఇంగ్లీషు కవయిత్రి

    అవి మనదగ్గరికి కడగని సీసాల్లా ఖాళీగా, మురికిగా వస్తాయి. వాటి అంచులకి ‘నిన్న’ మసకగా పొరలా కమ్మి ఉంటుంది. మనం వాటిని ఉంచుకోలేం. మన బాధ్యత వాటిని నింపి వెనక్కి పంపెయ్యడమే. దానికి కూలి ఏమీ ఉండదు. దానికి ప్రతిఫలం: చేసిన పనే. అంతే! దీన్ని మనం ప్రశ్నిస్తే వాచీల్లా గుండ్రటి ముఖాల్తో వాళ్లు కోపంతో అరుస్తారు. పోనీ అద్దం పగులగొడదామని అనుకుంటే మనల్ని మనమే గాయపరచుకుంటాం. రోజుల్లో ఏమీ మార్పు ఉండదు. అవి పొద్దు పొడుస్తూనే…

←మునుపటి పుట
1 … 24 25 26 27 28 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు