అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • అక్టోబర్ 1, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 4 వ భాగం

    ద్వితీయాంకం దృశ్యం 4 బాహుదా, భద్రద,  రాజు      [ ఈ దృశ్యంలో రాజు చాలసేపటివరకు చెట్టు వెనకే దాగి ఉంటాడు] బాహుదా: నాకెందుకో నేరం చేసిన భావన కలుగుతోంది. భద్రద: ఏం? ఎందుకని? ఏమిచేసావని? బా: నా తండ్రి ప్రతి చిన్న విషయానికీ తల్లడిల్లిపోతుంటాడు. చిన్న నీడను చూసినా ఎంత జడుసుకుంటున్నారో చూస్తున్నావు గదా! అతను వెళుతున్నప్పుడు చూసావు కదా, కళ్ళు ఎంత ఆర్ద్రమైపోయాయో!  అంత కరుణాళువైన నా తండ్రికి –ఆ కుర్ర వాడి గురించి, అదే,…

  • సెప్టెంబర్ 29, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 3 వ భాగం

    అంకం 2  దృశ్యం 3 (త్రిభుల, బాహుదా, కొంత సమయం గడిచిన తర్వాత భద్రద) త్రి:  తల్లీ! (ఆమెను గుండెకు అదుముకుంటాడు… ఆనందాతిరేకంతో) ఏవీ! నీ చేతులు నా మెడచుట్టూ వెయ్యి.  దగ్గరగా రా తల్లీ!   అబ్బ! ఈరోజు ఎంత ఆనందంగా ఉంది. నీ దగ్గర అంతా ఆనందమే! నాకు మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్లుంది.    (త్రిభుల ఆమెను తదేకంగా చూస్తుంటాడు) రోజురోజుకీ నీ అందం ద్విగుణీకృతం అవుతోంది బాహుదా! అంతా బాగుంది కదా!  నీకు ఏ కష్టం…

  • సెప్టెంబర్ 29, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 2 వ భాగం

    ద్వితీయాంకం  దృశ్యం 2 త్రిభుల  (ఏకాంతంలో) [సుల్తాన్ కనుమరుగవనిచ్చి,  ప్రహారీ గోడ తలుపు నెమ్మదిగా తెరుస్తాడు. ఆదుర్దాతో నాలుగు దిక్కులూ పరిశీలించి, కప్పనుండి తాళం  తొందరగా తీసి, లోపలికి వెళ్ళి మళ్ళీతాళం వేసుకుంటాడు. విచారవదనంతో అన్యమనస్కుడై అడుగులు వేస్తుంటాడు] ఆ ముదుసలి నన్ను శపించాడు.  అతను మాటలాడుతున్నప్పుడు కూడా నేను అతన్ని అనుకరించి అవహేళన చేశాను.  పాపం శమించుగాక! నా పెదాలే నవ్వాయి. అతని విషాదం నా గుండెను తాకింది.  నిజంగా శాపగ్రస్తుడే.  (నాపరాయి పలక మీద…

  • సెప్టెంబర్ 28, 2010

    రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం, 1వ భాగం

    ద్వితీయాంకం  దృశ్యం 1 [ బుస్సీ గారి భవంతి. ఎక్కడా జనసంచారం కనిపించదు. ఆ భవంతికి కుడిప్రక్కగా చూడచక్కని ఒక ఇల్లు.  పెద్ద ప్రహారీ గోడ.  ముందు విశాలమైన ఖాళీ స్థలం.  ఖాళీ స్థలంలో రకరకాల వృక్షాలు. కూర్చునేందుకు ఒక నాపరాయి పలక.  ప్రహారీ గోడకు  వీధిలోకి తెరుచుకుంటూ తలుపు.  ప్రహారీ గోడమీదనుండి డాబా- క్రింద అందమైన “ఆర్చ్”లు. మేదమీద గదినుండి డాబా మీదకు తెరురుచుకున్న తలుపు.  డాబా నుండి క్రిందకు ఒక ప్రక్కగా మెట్లు. బుస్సీగారి…

  • సెప్టెంబర్ 26, 2010

    రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 5వ భాగం

    (రంగస్థలి రెండు భాగాలుగా విడివడి “తెర వెనుక”  జరిగే విషయాలన్నీ  ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. ) ప్రథమాంకము   దృశ్యం 5 (రాజు, త్రిభుల, కాశ్యప, వేలరీ, తదితరులు) వేలరీ: నామాట వినవలసిందే! నన్ను వద్దని శాసించే వారెవ్వరు? రాజు: ( తేరుకుని) ఓహ్! మీరా, వేలరీ! వే: అవును, నేనే! (రాజు కోపంతో అతని మీదకు వెళ్లబోతుండగా త్రిభుల అడ్డుకుంటాడు) త్రి: ప్రభూ! అతనితో సంభాషించడానికి  నాకు అనుజ్ఞ ఇవ్వండి. (నాటక ఫక్కీలో నిల్చుని వేలరీతో) స్వామీ! ఒకప్పుడు తమరే…

  • సెప్టెంబర్ 26, 2010

    రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 4 వ భాగం

    ప్రథమాంకము            దృశ్యం 4 [ఫ్రాన్సిస్,  త్రిభుల ప్రవేశం) త్రి: రాజసభకు మేధావులా? ఇంతకంటే దారుణం ఇంకెక్కడా ఉండదు. ఫ్రా: అయితే పోయి చెప్పుకో.  మా సోదరి సలహా మండలిని మేధావులతో  నింపాలని యోచిస్తున్నది. త్రి: ఇది మనలో  మన మాట. నేను మీ కంటే తక్కువ తాగేనని ఒప్పుకుంటారు గదా.  కాబట్టి మనిద్దరిలో  నాకు ఈ విషయం  అన్ని కోణాలూ, రూపాలూ, వర్ణాలూ చర్చించి, నిర్ణయించే అధికారం ఉంది. నాకు ఒక ఆధిక్యత ఉంది. అట్టే మాటాడితే…

  • సెప్టెంబర్ 25, 2010

    రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 3 వ భాగం

    ప్రథమాంకం  దృశ్యం 3 (ముందుగా గద్దే, పార్థివన్, విస్సు, మరువీచి ప్రవేశిస్తారు.  తర్వాత నెమ్మదిగా పెన్న, కాశ్యప ప్రవేసిస్తారు. ఒకరికొకరు అభివాదం చేసుకుంటారు) పెన్న: ఉదాత్త మిత్రవర్యులారా!మీకొక కొత్త విషయం చెప్పబోతున్నాను. లేదు. ముందుగా మీ మేధాశక్తికి పరీక్ష. మీకొక చిక్కు ప్రశ్న. మీరే ఊహించండి. అనూహ్యమూ,   అద్భుతమూ, ఐన ఒక ప్రేమ కథ.   తల్చుకుంటే నవ్వొస్తుంది. జరగడానికి అవకాశంలేనిది…. గద్దే: ( కుతూహలం ఆపుకోలేక) ఏమిటది? మరువీచి: తమకేమి కావాలో? పెన్న: మరువీచీ! నే చెబుతున్నా…

  • సెప్టెంబర్ 24, 2010

    రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 2 వ భాగం

    ప్రథమాంకము — దృశ్యం 2 [ఫ్రాన్సిస్, త్రిభుల, గద్దే, ఇతర ప్రముఖులు ప్రవేశం. అందరూ చక్కని ఆహార్యంలో  ఉంటారు. త్రిభుల మాత్రం విదూషకుడి వేషధారణలో. ఫ్రాన్సిస్ అక్కడున్న స్త్రీలను మెచ్చుకోడానికి వెళుతుంటాడు.] లాతూరు: శ్రీమతి ఇందిర ఈరోజు దేవకాంతల్ని సైతం మైమరపిస్తోంది. గద్దే: నాకు అర్బుద, వినీల జంట నక్షత్రాల్లా కనిపిస్తున్నారు. ఫ్రాన్సిస్: కానీ, శ్రీమతి కాశ్యప  ముగ్గుర్నీ తలదన్నేట్టుగా ఉంది. గ: (శ్రీ కాశ్యపను చూపిస్తూ- అతను ఫ్రాన్సులోని నలుగురు మహాకాయులలో ఒకడని గుర్తుచేస్తూ) కాస్త…

  • సెప్టెంబర్ 23, 2010

    రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 1 వ భాగం

     ఉపోద్ఘాతం: 19 వ శతాబ్దపు ఉత్తమ కవి, నవలాకారుడు, నాటక రచయితలలో  ఫ్రాన్సుకు చెందిన విక్టర్ హ్యూగో  ఒకరు.  అలెగ్జాండరు  డ్యూమాస్ కు సమకాలికుడైన హ్యూగో, తన 16వ ఏటనే అన్నదమ్ములతో రచనలు ప్రారంభించి,  ప్రాన్సులో  “రొమాంటిక్ మూవ్ మెంట్ ” కు నాయకత్వం వహించేడు.  మొదటి ప్రదర్శనలోనే  హంసపాదు  ఎదుర్కొన్న ఈ నాటకం,  మలి ప్రదర్శనకు నోచుకోలేదు.  కాని అచ్చులో ఈ నాటకం బాగా విజయవంతమయింది. ఇది నిజ సంఘటనలు ఆధారంగా చేసుకుని వ్రాయలేదని చెప్పినా, ఇందులో  రాచరికపు వ్యవస్థలో జరిగే అకృత్యాలు కళ్ళకు కట్టినట్టు చూపించడంతో దీన్ని పూర్తిగా బహిష్కరించడమే గాక, అతనుకూడా 20 సంవత్సరాలపాటు దేశ బహిష్క్రుతుడయ్యాడు. ఈ సమయం లోనే అతని అత్యున్నత మైన రచనలు వచ్చాయి. ( please visit https://en.wikipedia.org/wiki/Le_roi_s’amuse)  ఈ నాటకంలో ప్రత్యేకత  ఇందులోని…

  • సెప్టెంబర్ 19, 2010

    నీ జ్ఞాపకాలు…Shernaz Wadia, Indian Poet

    ఇక నుండీ నన్ను వివశను చేసే నీ చిరునవ్వూ, చూడు, అలా నవ్వితే చిన్నగా సొట్టలు పడే నీ బుగ్గలూ, బుంగ మూతీ, కనుమరుగే కదా! చుట్టూ ఉన్న రణగొణధ్వనిని కూడా ఛేదించుకుని, రహస్యంగా నా చెవుల్లో నెమ్మదిగా ఊసులాడి నా ఏకాంతపు విషాదాశ్రువులు తుడిచి నన్నూరడించే నీ కమనీయ కంఠధ్వని, ఉహూ, ఇక ఎన్నటికీ దొరకదు కదా!! ఇంద్రజాలం చేసే నీ కర స్పర్శ అందనంతదూరమైనా, నీ లాలనలో ఎంత మహిమ ఉందంటే, చిత్రంగా నా…

←మునుపటి పుట
1 … 253 254 255 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు