-
మన వారసత్వం… జోసెఫ్ ప్లంకెట్, ఐరిష్ కవి
రాజ సంతతికి అనూచానంగా వస్తున్న వారసత్వం: తొలి రాజవీరుల పిల్లలూ, వాళ్ళ పిల్లల పిల్లలూ ఘనకార్యాలు సాధించడం ద్వారానూ, గొప్పవస్తువులు నిర్మించడం ద్వారానూ వాళ్ళ కలలను నిజం చేసారు. పోరాటాలు ఏసిన ఆ చేతులు, పురాతన విషాదాంత నాటకాలలో చిరస్థాయిగా నిలిచిన గుండెకోతలు సూర్యచంద్రులున్నంతకాలం కొనసాగిస్తూనే ఉన్నాయి వాళ్ళ వారసుల తలలు అధికారానికి తలవంచవు. వాళ్ల చేతులు ఇప్పటికీ, వాళ్ళ తాతముత్తాతల అస్థికలను దాచిన ఈ మట్టిని పరిరక్షిస్తూనే ఉన్నాయి. తమ ప్రజల భవిషత్తు కోసం వాళ్ళ…
-
కొడుక్కి ఆశీస్సులతో… థామస్ మెక్డొనా, ఐరిష్ కవి
భగవంతుడు నీకు సందేహించనవసరంలేని బలాన్నీ, స్పష్టంగా దర్శించగల శక్తినీ ఇచ్చుగాక. పోరాటాలెప్పుడూ ఒక లక్ష్యంకోసమే స్వాతంత్య్రంకోసం చేసే పోరాటం సుదీర్ఘం, అది నువ్వు నీ ఆగ్రహం, పోరాటంద్వారా సాధించడమే నా జీవితానికి కొనసాగింపు. కానీ, సెయింట్ సిసీలియా విందురోజున పుట్టిన నీవంటి బుజ్జి పాపాయికి నే నిపుడు నీ వయసుకి తగిన రీతిలో లౌకిక ఆనందాలు కలగాలని ఆలపించాలి. అతి సాధారణమైనవి: నీ బాల్యం, నీ కౌమారం ఏ ఒడిదుడుకులూ లేకుండా ధైర్యంతో అమాయకత్వంతో, సత్యసంధతతో సాగాలని.…
-
ఒక పల్లవి… పెడ్రైక్ పియర్స్, ఐరిష్ కవి
నా తలపున ఒక పల్లవి మెరిసింది మహరాజుకీ, సైనికునికీ నా ప్రేయసికొక పల్లవి రాసాను రాజులకే రాజు, చిరకాలపు మృత్యువుకి. ఓ మిత్తీ! నీ మృత్తికాగృహపు చీకటి నల్లదనపుజిగి పట్టపగటి వెలుతురుకంటే ప్రకాశవంతంగా ఉంది. నీ ఇంటి స్తబ్దత, అనంతమైన నీరవత పావురాల సంగీతంకంటే ఇంపుగా ఉంది. . పెడ్రైక్ పియర్స్ (10 November 1879 – 3 May 1916) ఐరిష్ కవి, గేలిక్ నుండి అనువాదం: జోసెఫ్ కాంప్ బెల్ A Rann .…
-
ప్రతిధ్వని… ఛార్లెట్ బెకర్
నా ప్రియుడు కడసారి వీడ్కోలు చెప్పాడు, దుఃఖమూ కన్నీళ్ళూ లేకుండా బహుశా, మేము ఇద్దరం ఇన్నాళ్ళూ కలిసి తిరిగి గడిపిన ఆనందక్షణాలు గుర్తుచేసుకున్నాడేమో?! కానీ, పెదవిమీద ఆ నిర్లిప్తపు చిన్న చిరునవ్వు— ఎన్ని చెప్పు, ఎన్ని ఏడుపులూ అందులోని విషాదానికి సాటి రావు ఎంతో బాధేసింది! తెరిచిన తలుపులనుండి బయటకి వెళ్ళాడు రెక్క తెగిన పక్షిలా… నెమ్మదిగా … నిరాశగా… నిట్టూరుస్తూ . అతను ఎక్కడికెళ్ళాడో నే చెప్పలేను గానీ తెల్లవారీదాకా అతని నవ్వు నాకు వినిపిస్తూనే ఉంది.…
-
మారణహోమం… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
Maple in Autumn శరత్కాలం ఆ లోయని వరదలా కమ్ముకుంది— సీసపు గుళ్ళలా చినుకులు టపటపా రాలుతున్నాయి ఫర్ చెట్లు అటూ ఇటూ బాధతో మూలుగుతూ కదుల్తున్నాయి నేలంతా గాయపడ్డ మేపిల్ చెట్ల రక్తపు మరకలే. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ అమెరికను Carnage . Over the valley swept the Autumn flood— In showers of leaden bullets fell the rain; the firs moved to and…
-
ఎపిక్యూర్… అబ్రహామ్ కౌలీ. ఇంగ్లీషు కవి
మీ పాత్రని ఎర్రని మధువుతో నింపండి తలకట్టున గులాబుల దండ ధరించండి మధువూ, గులాబుల్లా మనం నవ్వుతూ కాసేపు హాయిగా ఆనందంగా గడుపుదాం. గులాబుల కిరీటాన్ని ధరించిన మనం “జహీజ్”(1) రాజమకుటాన్నైనా తలదన్నుదాం ఈ రోజు మనది; మనం దేనికి భయపడాలి? ఈ రోజు మనది; అది మనచేతిలోనే ఉంది. దాన్ని సాదరంగా చూద్దాం. కనీసం మనతోనే ఉండిపోవాలని కోరుకునేలా చేద్దాం. పనులన్నీ కట్టిపెట్టండి, దుఃఖాన్ని తరిమేయండి రే పన్నది సుఖపడడం తెలిసినవాళ్లకే. . అబ్రహామ్ కౌలీ…
-
ప్రేమ ఒక జ్వాల… జార్జి మేరియోన్ మెక్లీలన్, అమెరికను కవి
ప్రేమ అతి పవిత్రంగా జ్వలించే ఒక జ్వాల దాని పాల బడిన వ్యక్తిని తీయని కోరికతో నింపుతుంది. ఒకసారి ప్రేమ వేడి నిట్టూర్పులకు శరీరం ఎరయైతే నాటినుండి ఆ గుండె మరణించేదాకా మండే “మూస”యే ప్రేమే జీవితం అను; అది పొరపాటు కాదను, అది పరమానందానికి పర్యాయపదం అను, నీకు తోచింది ఏదైనా “ఇదీ ప్రేమ” అను ఎన్నిసార్లైనా కానీ, గుండెకి తెలుసు… ప్రేమంటే ఒక వేదన అని. . జార్జి మేరియోన్ మెక్లీలన్ (1860- 1934)…
-
చెయ్యడానికి ఏమీ లేదు… జేమ్స్ ఎఫ్రైమ్ మెగర్ట్, అమెరికను కవి
పొలాలన్నీ పంటతో బరువెక్కి ఉన్నాయి కూలీలు సరిపడినంతమంది లేరు అయినా సోమరిపోతులు అంటున్నారు: “చెయ్యడానికి ఏమీ లే”దని. జైళ్ళు క్రిక్కిరిసి ఉన్నాయి ఆదివారం ప్రార్థనా తరగతులకు హాజరు అంతంతమాత్రం; ఐనా మనం “చెయ్యడానికి ఏమీ లే”దని అంటున్నాం. తాగుబోతులు మరణిస్తూనే ఉన్నారు— వాళ్లు మన పిల్లలే అన్నది నిజం తల్లులు చేతులుకట్టుకు నిలబడి ఉన్నారు “చెయ్యడానికి ఏమీ లేక”. అవిశ్వాసులు మరణిస్తున్నారు. వాళ్ల రక్తం మీ మీద చిందుతోంది. మిరందరూ ఎలా ఉండగలుగుతున్నారు “చెయ్యడానికి ఏమీ లే”దని? …
-
నేను నమ్మకం వీడను… డేనియల్ వెబ్స్టర్ డేవిస్, అమెరికను కవి
ఈ పరీక్షలన్నీ నాకే ఎందుకు వస్తాయో తెలీదు కష్టాలన్నీ గుంపుగా ఒకదానివెనక ఒకటి వస్తాయెందుకో నాకు భగవంతుని లీలలు అర్థం కావు , నా సుఖాలెందుకు చిరకాలముండవో నా ఆశలన్నీ ఎందుకు త్వరలోనే మట్టిపాలవుతాయో అయినా, నేను నమ్మకాన్ని విడవను. ఆశల ఆకాసం మీద ఎప్పుడూ దట్టమైన నీలినీడలే తారాడతాయి ఈ ప్రపంచం నిండా దుఃఖమే నిండి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ప్రశాంతతతో, అతను చేసిన కమ్మని వాగ్దానాన్నే నమ్ముతాను ఎన్నడూ మాట తప్పని ఆ చెయ్యిని…
-
చావుపుట్టుకలు… జేమ్స్ ఎడ్విన్ కాంప్ బెల్, అమెరికను కవి

మట్టిలోకి ఒక బీజం నాటబడుతుంది గుండెల్నిపిండుతూ అంతరాల్లోంచి ఒకపాట బయటకొస్తుంది ముత్యపుచిప్పలోంచి ఒక ముత్యం బయట పడుతుంది పంజరంనుండి ఒక పక్షి బయటకు ఎగిరిపోతుంది, శరీరంనుండి, ఒక ఆత్మకూడా! విత్తనం మహావృక్షంగా ఎదుగుతుంది విశాలవిశ్వమంతా ఆ పాటని పాడుకుంటుంది కంఠహారంలో ఆ ముత్యం మరింత అందంగా మెరుస్తుంది పక్షి మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలోకి ఎగసిపోతుంది మృత్యువు ఒక సగం, జీవితం మరొక సగం, ఆ రెండూ కలిసి పూర్ణత్వాన్ని కలిగిస్తాయి. . జేమ్స్ ఎడ్విన్ కాంప్ బెల్…