అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 12, 2011

    వృధ్ధ విరాగి … ఎమిలీ బ్రాంటి

    Image Courtesy: http://1.bp.blogspot.com Listen to the Poem here:  The Old Stoic . సంపదలు విలువైనవిగా భావించను, ప్రేమ? ఆ మాటంటేనే నాకు నవ్వొస్తుంది, కీర్తి కాంక్ష ఒక కల ఉదయమవుతూనే కరిగిపోతుంది . నేను ప్రార్థించడమంటూ జరిగితే నా పెదాలమీద కదిలే మాటలు ఒకటే: నా మనసు నా అధీనంలో వదిలీ నాకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించు! . అవును. నా రోజులు తొందరగా లక్ష్యాన్ని సమీపిస్తున్నకొద్దీ,  జీవనం లోనూ, మరణం లోనూ, నే…

  • నవంబర్ 11, 2011

    జీవితం … ఛార్లెట్ బ్రాంటి

    Image Courtesy: http://www.goodlightscraps.com . నా మాట నమ్ము! జీవితం పండితులు చెప్పినంత పీడకల కాదు. సాధారణంగా, ఉదయాన్నే చినుకులు పలకరిస్తే, అది, రోజంతా ఆహ్లాదకరంగా ఉండడాన్నిసూచిస్తుంది . అప్పుడప్పుడు చింతల మేఘాలు ఆవరిస్తుంటాయి, కానీ, అవి తాత్కాలికం. ఒక జల్లు గులాబీమొగ్గలను వికసింపజెయ్యగలిగినపుడు, అవి రాలిపోతే బాధపడటం దేనికి? . జీవితపుటానంద ఘడియలు, హాయిగా, తెలియకుండా దొర్లిపోతాయి. కృతజ్ఞతతో, సంతోషంతో వాటిని  అనుభవించు యథాతథంగా . అప్పుడప్పుడు మృత్యువు మధ్యలో చొరబడి మనలో మంచివాళ్ళని ఎత్తుకుపోతేనేం?…

  • నవంబర్ 10, 2011

    ఇంతేనా… ఏన్ బ్రాంటి (Anne Bronte)

      . ఓ దైవమా! జీవితం నాకు చూపగలిగింది ఇంతే అయినపుడు, వేదనాభరితమైన నా నుదిటిని, సేదదీర్చే నీ చల్లని చెయ్యి తాకనపుడు . ఇంతకంటే కాంతివంతంగా ఈ ఆశాదీపము జ్వలించలేనపుడు నేను బ్రహ్మానందాన్ని కేవలం కలగంటూ, శోకమయ జీవితంలోకి కళ్ళు తెరవవలసివచ్చినప్పుడు . అన్ని సుఖాలూ సెలవుతీసుకున్నాక, సాంత్వననిచ్చే స్నేహంకూడా కనుమరుగవుతున్నప్పుడు నేను ప్రేమకై తిరుగాడుతుంటే  ఎప్పుడూ అది అందనంతదూరంలోనే ఉన్నప్పుడు . ఇతరుల ఆదేశాలకు బానిసలా బ్రతుకుతూ, తిరిగే తిరుగుడుకీ, పడే పాటుకీ ఫలితం…

  • నవంబర్ 9, 2011

    చెట్లు … జాయిస్ కిల్మర్

    . చెట్టుకంటే అందమైన కవిత ఎక్కడైనా ఉంటుందని నేననుకోను . పుడమితల్లి వెల్లువల స్తన్యానికి ఆకొన్న నోటిని ఆబగా అదిమే …చెట్టు . ప్రతిరోజూ దేవుని దర్శిస్తూ, తన పత్రహస్తాలను మోడ్చి ప్రార్థించే … చెట్టు . మండు వేసవిలో చెండులా తనతలలో గొరవంక గూళ్లను ధరించే… చెట్టు . గుండెలపై మంచు గువ్వలా వాలే … చెట్టు వర్షధారలలో మమేకమైన … చెట్టు . కవితకేముంది… నాలాంటి  మూర్ఖుడెవడైనా రాయగలడు, కానీ, చెట్టుని మాత్రం ఒక్క…

  • నవంబర్ 8, 2011

    నీ ముక్కు ముఖమ్మీదే ఉన్నందుకు సంతోషించు… జాక్ ప్రెలుస్కీ

    . నీ ముక్కు నీ ముఖం మీద ఉన్నందుకు సంతోషించు, ఇంకెక్కడో అతకబడకుండా. ఎందుకంటే, అది ఉన్నచోట కాకుండా ఇంకోచోట ఉండి ఉంటే, నీ ముక్కుని నువ్వే చాలా అసహ్యించుకోవచ్చు . మాటవరసకి, నీ కుదురైన ముక్కు కాలివేళ్ల మధ్య ఉందనుకుందాం. ఖచ్చితంగా అది చూడ్డానికి  అస్సలు బాగుండదు. మీదుమిక్కిలి, నీ కాళ్ళు నువ్వు వాసనచూడాల్సి వస్తుంది . అదే నెత్తిమీద అతికించి ఉందనుకుందాం. అప్పుడది చూడ్డానికి మహాభయంకరంగా  ఉంటుంది. నీ వెంట్రుకలు నిత్యం దాన్ని గిలిగింతలుపెడుతుంటే,…

  • నవంబర్ 7, 2011

    జరుగబోయే యుధ్ధం … విల్ప్రెడ్ ఓవెన్

                  .        చనిపోయే దాకా అక్కడ కలిసే తిరిగేము,        అతనితో చాలా స్నేహంగా, సరదాగాఉన్నాం.        కూచున్నాం, కలిసే భోజనంచేసేం.        మా చేతుల్లోంచి కంచాలు తుళ్ళగొట్టినపుడు మన్నించేము.        అతని చిక్కని, పచ్చని ఊపిరి పొగలను పీల్చేము.        .        మా కళ్ళు ఏడ్చినా, మా ధైర్యం సడలలేదు.        మా మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తే, మేం అతని మీద ఫిరంగుల్ని వర్షించేము.           అతను గొంతెత్తి పాడినపుడు…

  • నవంబర్ 6, 2011

    రెక్కతొడిగిన ఆశ … ఎమిలీ డికిన్సన్

    . ఆశ ఒక రెక్కతొడిగిన పిట్ట… అది మనసు చివురులమీద వాలి  నిర్విరామంగా రాగం తీస్తూనే ఉంటుంది పదాల్లేని పదం ఏదో. . మలయమారుతంలో అది మరీ కమ్మగా వినిపిస్తుంది తుఫాను ఎంతభీకరంగా ఉన్నా, ఎంతోమందిని నులివెచ్చగా ఉంచగలిగినందుకు ఆ చిన్ని పిట్ట సిగ్గులుపోతుంది . ఆ రాగం అత్యంత శీతల ప్రదేశాల్లో విన్నాను వినూత్న సాగరాలమీద విన్నాను కానీ,  ఎంత విషమ పరిస్థితుల్లోనూ  నా ‘కిది’ కావాలని అది నన్నెన్నడూ కోరలేదు. .   ఎమిలీ…

  • నవంబర్ 5, 2011

    కనువిప్పు… రాబర్ట్ ప్రాస్ట్

    . పరిహాసాలూ, పరాచికాల మాటున మనం మనకొక జాగా చేసుకుంటాం ఎవరికీ దొరకకుండా… కానీ ఉద్వేగభరితమైన గుండెచప్పుళ్ళు ఊరుకోవే, మనల్ని ఎవడో ఒకడు కనిపెట్టెసే దాకా. . విచారమేమిటంటే, చివరికి మనమే బహిర్గతం చేసుకుంటాం, మన మిత్రుడు మనల్ని పోల్చుకునేలా (అలా అని మనం అంటాం) . దాగుడు మూతలాడుకునే  పిల్లల దగ్గరనుండి, కనిపించకుండా దాక్కునే దేవుడివరకూ ఇదంతే ఎవరికీ కనపడకుండా దాక్కునేవారందరూ ఎప్పుడో ఒకప్పుడు తామెక్కడున్నారో బయటపడవలసిందే. . రాబర్ట్ ప్రాస్ట్ . Revelation . …

  • నవంబర్ 4, 2011

    సమాధి మృత్తికలు … జాన్ మెక్రీ, కెనెడియన్ కవి

    . సమాధి మృత్తికలపై  వరుస మీద వరుస కావిరంగు సుమాలు పూస్తున్నై మా ఉనికి తెలపడానికి; పైన ఆకాశంలో భరతపక్షులు పాడుకుంటూ ఎగురుతున్నాయి క్రింది తుపాకుల గౌరవవందనంలో వినిపించకపోయినా . మేమిపుడు విగతజీవులం. అయితేనేం? మొన్నటివరకూ బ్రతుకు రుచి ఎరిగినవాళ్ళం; సూర్యోదయం చూసేం, అస్తమయసంధ్య కని పరవశించేం; ప్రేమించి, ప్రేమింపబడిన వాళ్లం. ఇప్పుడీ అశ్రాంతవిడుదులలో విశ్రాంతితీసుకుంటున్నాం . శతృవుపై పోరాటాన్ని కొనసాగించండి. మా వాలుతున్నచేతులతో అందిస్తున్న దివిటీలను అందుకోండి; వాటిని నిలబెట్టే పూచీ ఇక మీదే; మాటతప్పేరో, మేము…

  • నవంబర్ 3, 2011

    బతుకు పాట … లాంగ్ ఫెలో

    . నాకు చెప్పకు, నీ శోకగీతికలతో, జీవితమొక శూన్యపు కల అని! చైతన్యవంతం కాని ఆత్మ, మృతిచెందినట్టే లెఖ్ఖ. యదార్థానికి, వస్తువులు కనిపించినతీరులో ఉండవు. . జీవితం సత్యం. జీవితం వాస్తవం! గోరీ కాదు దాని గమ్యం మట్టిలోంచి పుట్టినది మట్టిలో కలిసిపోతుందన్నది ఆత్మకు వర్తించదు. . సుఖభోగమో, విషాదమో మన మార్గమూ, విధిలిఖిత చరమావధీ కావు. ప్రతి ఉదయమూ, మనం నిన్నటికంటె ముందు ఉండేలా అడుగెయ్యడమే! . కళ చూస్తే అనంతం… కాలమా! పరిగెడుతోంది, మన…

←మునుపటి పుట
1 … 238 239 240 241 242 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు