అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 5, 2020

    గ్రంథాలయం… రాబర్ట్ సదే, ఇంగ్లీషు కవి

    గ్రంథాలయం… రాబర్ట్ సదే, ఇంగ్లీషు కవి

    నేను మృతుల్లో ఒకడిగా ఉండే రోజులు గతించాయి ఇప్పుడు నే నెటుచూసినా నా దృష్టి యాదృచ్చికంగా దేనిమీద పడినా నా కంటికి గతంలోని మేథావులు కనిపిస్తున్నారు. ఎన్నడూ నన్ను తిరస్కరించని స్నేహితులు వాళ్ళు ప్రతిరోజూ నేను సంభాషించేది వాళ్లతోనే. నా ఆనందం వాళ్లతో పంచుకోవడం ఇష్టం, నా బాధలకి ఉపశాంతి కోరేదీ వాళ్ళ దగ్గరే; నేను వాళ్లకి ఎంత ఋణపడి ఉన్నానో నాకు అర్థమై, అనుభూతి చెందుతున్న కొద్దీ కృతజ్ఞతా భావంతో నిండిన కన్నీళ్ళతో నా చెంపలు…

  • జనవరి 4, 2020

    తెంచుకున్న స్నేహం… ST కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

    పాపం! వాళ్ళు చిన్నప్పటినుండీ స్నేహితులు, కానీ, పుకార్లు పుట్టించే నాలుకలు సత్యాన్ని విషపూరితం చేస్తాయి: స్వర్గంలో తప్ప భూమ్మీద శాశ్వతత్వం దేనికీ లేదు. జీవితం కంటకప్రాయం; యవ్వనం నిరుపయోగం; మనం ప్రేమించిన వాళ్లమీద రగులుతున్న కోపం పిచ్చెత్తించేలా, బుర్రలో పనిచేస్తూనే ఉంటుంది. రోలండ్ కీ సర్ లియొలైన్ కీ, ఇది నా ఊహ, అది తీరే ఒక సందర్భం తటస్థించింది. ఇద్దరూ తమ ఆరోప్రాణంలా ఉండే రెండో వారిని చెప్పరాని అవమానకరమైన దూషణలు చేసుకున్నారు. ఇద్దరూ మరెన్నడూ…

  • జనవరి 3, 2020

    మనోకామన… అబ్రహామ్ కౌలీ, ఇంగ్లీషు కవి

    మనోకామన… అబ్రహామ్ కౌలీ, ఇంగ్లీషు కవి

    ప్రభూ! నాకీ వరాన్నొక్కటీ ప్రసాదించు! నా సంపద పరులు ఈర్ష్యపడనంత చిన్నదిగా, చీదరించుకోనంత ఎక్కువగా ఉండేట్టు చూడు. నేను సాధించబోయే ఏ గొప్పపనులవల్లనో కాకుండా, కేవలం నా మంచితనంవల్ల నాకు కాసింత గౌరవం దక్కాలి. చెడ్డపేరుకంటే ఏ గుర్తింపూ లేకపోవడం మెరుగు పుకార్లు మరణానికి దారిచూపిస్తాయి. నాకు మనుషుల పరిచయాలు ప్రసాదించు, అది కేవలం సంఖ్య మీద ఆధారపడకుండా, నా స్నేహితులను నే నెంచుకునేట్టుగా ఉండాలి. నా వ్యాపారం కాకుండా, పుస్తకాలు రాత్రి కొవ్వొత్తిని వెలిగించాలి అలాగే,…

  • జనవరి 2, 2020

    సంతృప్తి… రాబర్ట్ గ్రీన్, ఇంగ్లీషు కవి

    సంతృప్తిని ప్రతిఫలించే ఏ ఆలోచనైనా అందంగా ఉంటుంది! ప్రశాంతంగా ఉండగలిగే మనసు మహరాజుకన్నా సంపన్నమైనది! ఏ వంతలూ లేకుండా నిద్రపోగలిగే రాత్రులే దివ్యమైన రాత్రులు! పేదరికం కోపంగా నుదుట ముడివేసి చూసే భాగ్యాన్ని ధిక్కరిస్తుంది అటువంటి సంతృప్తి, అటువంటి మనసు, అటువంటి నిద్ర, పరమసౌఖ్యం యాచకులకి తప్ప యువరాజులకి సైతం తరచు దొరికేది కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతతనిండిన విశ్రాంతి నివ్వగలిగిన ఇల్లూ, అటు గర్వాన్నీ, ఇటూ ఆందోళననీ కలిగించని కుటీరమూ, తన పరిసరాలకి తగినట్టుగా జీవించడానికి సరిపోయే…

  • జనవరి 1, 2020

    మరణం అనివార్యమైతే… క్లాడ్ మెకే, జమైకన్ కవి

    మరణం అనివార్యమైతే… క్లాడ్ మెకే, జమైకన్ కవి

    మరణం అనివార్యమైనపుడు, మనం పందుల్లా చావొద్దు. వాళ్ళు మనల్ని హేళనచేస్తూ, పిచ్చికుక్కల్లా, ఆకలిగొన్న వేటకుక్కల్లా నాల్గుపక్కలా చుట్టుముట్టి ఏ లజ్జాకరమైన చోటుకో, పందులదొడ్లోకో వెంటతరుమినపుడు, శాపగ్రస్తుల్లా మనం చావొద్దు. మరణం అనివార్యం అయినపుడు, మనం చిందించిన పవిత్రరక్తం వృధాపోనివ్వకుండా, ఉదాత్తంగా మరణిద్దాం; అపుడు, మనం మరణించినా, మనం ఎదిరించిన దుర్మార్గులు తప్పనిసరిగా మనల్ని గౌరవించవలసి వస్తుంది. ఓ నా బంధులారా! మనం మన శతృవుని సమిష్ఠిగా ఎదుర్కోవాలి! సంఖ్యాబలంలో సాటి రాకున్నా ధైర్యంలో వాళ్లకి దీటని చూపించాలి,…

  • డిసెంబర్ 31, 2019

    కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

    I WISH ALL MY FRIENDS A VERY HAPPY AND PROSPEROUS NEW YEAR 2020 MAY THIS YEAR USHER IN NEW FRIENDSHIPS, SOOTHE OLD PAINS, FULFILL YOUR DREAMS AND INSPIRE YOU TO ASPIRE FOR MORE. ఇప్పటికే వేలసార్లు చెప్పి, చెప్పకుండా మిగిలినదేముందని నూతన సంవత్సరంలో కొత్తగా కవితలో చెప్పడానికి? కొత్త సంవత్సరాలు వస్తూంటాయి, పాతవి వెళుతూంటాయి, మనం కలగంటామని తెలుసు, అయినా ఎన్నో కలలు కంటాం.…

  • డిసెంబర్ 26, 2019

    రాత్రి తలెత్తే ప్రశ్నలు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

    అసలు ఈ ఆకాశం ఎందుకు? నెత్తిమీద ఉరుములు ఎవరు రేపెడతారు? ఆ ఫెళఫెళమనే శబ్దం ఎవరు చేస్తారు? దేవతలు నిద్రలో పక్కమిదనుండి క్రిందకి దొర్లిపోతారా? వాళ్ళ ఆటబొమ్మలన్నిటినీ పగలగొడుతున్నారా? సూర్యుడు ఎందుకు అంత త్వరగా క్రిందకి దిగిపోతాడు? రాత్రిపూట మేఘాలెందుకు ఆకలితో అప్పుడే ఉదయిస్తున్న చంద్రుణ్ణీ, చంద్రుడిచుట్టూ ఉన్న గుడినీ మింగడానికి అన్నట్టుగా నెమ్మదిగా పాకురుతుంటాయి? అందరూ చెప్పుకుంటున్నట్టు చుక్కలమధ్య ఎలుగుబంటి ఉంటుందా? అలాగైతే, అది పచ్చికబయళ్ళ కడ్డంగా కట్టిన దళ్ళు దూకి పాలపుంతని తాగెయ్యదా? రాలిన…

  • డిసెంబర్ 26, 2019

    బహిష్కృతుడు… క్లాడ్ మెకే, జమైకన్ కవి

    మా తాతముత్తాతలు పుట్టిన … చీకటి,  అనామకపు ప్రదేశాలకి ఎలాగైనా వెళ్ళాలని తనువులోఇరుక్కున్న నా ఆత్మ ఉవ్విళ్ళూరుతోంది. పెదాలు పేనుతున్న మాటల్ని, ఎప్పుడూ వినకున్నా, అనుభూతిస్తున్నాను. నా మనసు ఎన్నడో మరిచిపోయిన అడవి పాటలు పాడుతోంది. నేను మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళకపోతే నాకు ప్రశాంతత లేదు, కానీ, ఈ పడమటి దేశాలు నాకో వెల నిర్ణయించాయి, పరిచయంలేని వాళ్ల దేవుళ్ళకు నేను మొక్కినా నాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్న ఆశ లేదు. “నా”దన్నదాన్ని దేన్నో నేను…

  • డిసెంబర్ 24, 2019

    కాలపరిభ్రమణం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి

    Merry Christmas to all my Christian Friends నరికిన చెట్టు కాలక్రమంలో తిరిగి చిగురించగలదు; పూర్తిగా మోడులైపోయిన మొక్కలు పూలు పళ్ళూ కాయవచ్చు; యమబాధ అనుభవించే మనిషికికూడా ఉపశాంతి లభిస్తుంది; బొత్తిగా ఎండిపోయిన నేలసైతం చినుకులుపడి తడిపీల్చుకుంటుంది; మంచి చెడులు దొర్లుతూ వస్తాయి, అదృష్టం యాదృచ్చికంగా మారుతుంది, కష్టాలనుండి సుఖానికీ, మంచిరోజులనుండి గడ్దురోజులకీ. అదృష్టమహాసాగరం ఎప్పుడూ పొర్లిప్రవహించదు అది ఆటులో ఉనప్పుడే మేళ్ళు చేసిపోతుంది; దాని ఆటుపోటులు రెండూ ఒక్కగతిలోనే నడుస్తాయి దాని మగ్గం నాజూకు,…

  • డిసెంబర్ 19, 2019

    చిత్రమైన కలయికలు- 1… హెరాల్డ్ మన్రో, ఇంగ్లీషు కవి

    ఎవరైనా తాము చూస్తుండగా ఒక మట్టి పెల్ల లేచి నాలుగుపక్కలా నడుస్తూ, ఊపిరి తీస్తూ, మాటాడుతూ, ప్రేమిస్తుంటే భయంతో ఎంత గజగజలాడిపోతారు? ఎంత ఆశ్చర్యంతో “నువ్వు కదలగలుగుతున్నావా?” అని ఎగబీల్చుతారు? కనుకనే, మనిషి నడవడం చూస్తున్నప్పుడు ఎప్పుడూ అనుకుంటుంటాను: ఓ ధరిత్రీ! నువ్విది ఎలా సాధించగలిగేవు? నీ శక్తి ఎంతని? నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే,నిర్మొహమాటంగా చెబుతున్నా, నాకు ఇది ఎంతమాత్రం నమ్మబుద్ధి కావటం లేదు. . హెరాల్డ్ మన్రో (14 March 1879 – 16…

←మునుపటి పుట
1 … 22 23 24 25 26 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు