-
A Ditty at Dawn … K. Godavari Sarma.
. I don’t think it’s an intelligent bargain To trade-off Larynx for silence. The moment my ears are awake to the Summer’s day The sweet tweeting birds Encourage me to become a poet. Kindling the fire in my gullet And shutting my mouth I continue to recline idling on the bed. Words would be cooking…
-
కవులు … జాయిస్ కిల్మర్, అమెరికను కవి
. జేగంటలు విస్మృతిలోపడ్డపుడు, అవి శిధిల దివ్య స్థలాలపై పారాడిన చిరుగాలి మోసుకొచ్చినా, నిష్ప్రయోజనమే. . అంతరాంతరాల్లో అమృతాశనముపై కాంక్షలేని వాని ప్రవచనం అంతకంటే నిష్ఫలం. . భగవదేచ్ఛకులోబడని మన లొల్లాయిపదాలు, ఊపిరితోపాటు పెదాలు దాటి వచ్చిన తక్షణమే లయిస్తాయి. . మరణాన్ని చవిచూడనివారు జీవితాన్ని చవిచూడలేరు. . విధివ్రాతకు కట్టుబడగలిగినవారుమాత్రమే, సంకీర్తనను చెయ్యగలరు. . జాయిస్ కిల్మర్ (December 6, 1886 – July 30, 1918) ప్రముఖ అమెరికను కవి, సాహిత్య విమర్శకుడు, విలేఖరి,…
-
ఒక కళ … ఎలిజబెత్ బిషప్
. పోగొట్టుకోడం ఒక కళ. దానిలో ప్రావీణ్యం సంపాదించడం పెద్ద కష్టమేం కాదు; చాలా వస్తువులు అసలు పోగొట్టుకోడానికే ఉన్నాయేమోన్నట్టుంటాయి. కనుక, అవి పోగొట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదమేం జరిగిపోదు. . రోజూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉండు. ఇంటితాళాలు పోగొట్టుకుని తర్వాత ఒక గంటసేపు గాభరాపడడానికి అలవాటుపడిపో, పోగొట్టుకునే కళలో ప్రావీణ్యం సంపాదించడమంత కష్టమేం కాదు. . తర్వాత అంతకంటే విలువైనవి పోగొట్టుకోడం, తొందరగా పోగొట్టుకోడం సాధన చెయ్యి; నువ్వెళ్ళవలసిన ప్రదేశాలూ, వూరు పేరూ, మరిచిపోతుండు.…
-
Melancholy Strain… Kopparthy
. Night has progressed long, and Sleep flowed out of the eyelids. It’s vaguely aching. A streak of pain, A strand-like pain, As though a metallic armour is pricking somewhere within… . It is aching… Neither there’s any good reason, nor anybody responsible; Just that… a freaky irrational pain, Not a whit less Not a…
-
స్వేఛ్ఛాగానం … ఏలిస్ మిలిగన్, ఐరిష్ కవయిత్రి
. సరోవరాలకు నిలయమైన ఉదయపూర్ లో నే నోరోజు గాలి తోడుగా వ్యాహ్యాళికి బయలుదేరాను. అంతలో ఎవరో చెవిలో ఊదినట్టు ఒక పాట నా మదిలో మెదిలింది. కాని ఆ స్వరం ఇక్కడ నే చూసిన ఏ మానవమాత్రుడిదీ కాదు, గాలిలాగే, మనిషికూడా అగోచరం. . కొండలకు నెలవైన తిరుపతిలో, పర్వతారోహణ చేస్తూ శిఖరాగ్రం చేరుకునేటప్పటికి దుముకుతూ గెంతివస్తున్న సెలయేరొకటి కనిపించింది సంతోషం పట్టలేక ఆనందంతో కేకలేస్తూ. నేను శిఖరం నుండి క్రిందికి మైదానం వంకా, నీటిపాయల…
-
ప్రత్యుపకారం … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
. తుఫాను భీకరంగా గర్జిస్తోంది. తెలిమంచు కురవడం అప్పుడే మొదలయ్యింది. అలసిన పాదాలతో ఒక చిన్ని దేవదూత రెక్కలల్లార్చుకుంటూ వీధిలో నడుస్తోంది. . చంద్రుడు దాగున్నాడు. ఏ తారకా కాంతివంతముగా లేదు. కనుక ఆ రాత్రికి తను స్వర్గం చేరలేనట్లే. ఎందుకంటే కిరణాలే దేవదూతలకు స్వర్గానికి నిచ్చెనలు. . ప్రతి కిటికీ దగ్గరా తనకింత ఆశ్రయమిమ్మని అర్థించింది. కానీ, ప్రయోజనం లేకపోయింది… “చూడు చూడు, వర్షం ఎంత దబదబా కురుస్తోందో” అన్నాయవి. . తను వెక్కి వెక్కి…
-
అసూయ … Adelaide Anne Procter
. అతనెప్పుడూ ముందే; అదృష్టం అతని ముఖంలో తొణికిసలాడేది. నేను సంవత్సరాలతరబడి కష్టపడితే, అతను అవలీలగా విజయం సాధించగలిగే వాడు. మేం పరుగు పందెం వేసుకునే వాళ్ళం; నాకాళ్ళు రక్తాలోడేవి, అతను పందెం గెలిచేవాడు. . అతను ఎన్ని విజయాలు సాధించినా అతన్ని ఒక్కలాగే ఆదరించేరు; నా పేలవమైన ఒకే ఒక్క విజయానికి నాకెదురైనవి పరిహాసమూ, నిందా. మేం ఇద్దరం తప్పుచేస్తే, అతని మీద జాలిపడేవారు, నాకు మాత్రం అవమానమే. . నేను ఇంకా చీకటిలోనే కొట్టుమిట్టాడుతున్నాను,…
-
Swish of a Sword … K. Geetha
. Isn’t trying to speak about poetry As difficult as to wake up one feigning sleep? It’s unfathomable how densely poets compact poetic spirit in time, but As they recollect it incessantly, It must overwhelm the listener like a high tide. “Chalam’s “Savitri”, perhaps, has come to life Not out of his pen, but out…
-
మృత్యువా, గర్వపడకు! … జాన్ డన్.
(This translation is dedicated to Sri Ghantasala Venkateswara Rao, the IMMORTAL Singer, on his 89th Birth Anniversary) . ఓ మృత్యువా, గర్వపడకు! ఎవరో కొందరు నిన్ను మహాశక్తిశాలివనీ, భయంకరమైన దానివనీ అన్నారని. నీ కంత శక్తులేం లేవు. . నువ్వెవర్నో కొందర్ని గెలిచేనని ఊహించేసుకుంటున్నావుగానీ, వాళ్ళేం మరణించలేదు. ఓసి పిచ్చి దానా! అంతెందుకు, నువ్వు నన్నే గెలవలేవు! . విశ్రాంతిలోనూ, నిద్రలోనూ కూడా మనుషులు మరణించినట్టే ఉంటారు. కనుక, వాటితర్వాత…
-
స్నేహం— హెన్రీ డేవిడ్ థొరో
. నేనో క్షణం ప్రేమను గురించి ఆలోచిస్తాను, అలా ఆలోచిస్తుంటే, అదొక లోకంలా, అమృతాశనంలా, భూమినీ – స్వర్గాన్నీ దగ్గరచేసే వారథిలా కనిపిస్తుంది. . అది నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్నిస్తుందని తెలుసు గాని, ఎందుకో, ఎలాగో చెప్పమంటే మాత్రం నా తరం కాదు, చచ్చినా చెప్పలేను. . నేను నా నేస్తాన్ని అడగాలనుకుంటాను అదెలాఉంటుందో… తీరా సమయం వచ్చేవేళకి అన్నిటికంటే నాకు ప్రేమే ఎంతో మనోహరంగా ఉంటుంది. దాంతో నేను మూగనైపోతాను. . నిజం తెలుసుకోగలిగితే, ప్రేమ…