-
మృత్యుల్లేఖము … వాల్టర్ డి ల మేర్
. ఆర్య నిదురించునిచట సౌందర్య రాశి లలితపద, నిరతహృదయోల్లాసి యామె, “మాపు సీమ”ను లావణ్య రూపు రేఖ కీరుగలవారు లేరు నా ఎరుక మేర. . వాయు సొబగులు, రూపలావణ్య మడగు యెంత అపురూప మెంత దురంతమైన కాలగతియంతె! ఎవరు వాక్కొనగ గలరు మిత్తి ఎంతటిపోడుముల్ మట్టిగలుపు! . వాల్టర్ డి ల మేర్ (25 April 1873 – 22 June 1956) ఇంగ్లీషు కవీ, నాటకకర్తా, కథా రచయితా అయిన వాల్టర్ డి ల మేర్ తన…
-
నేనంటే అంత ఇష్టమా? … వాల్ట్ విట్మన్
. నేనంటే అంత ఇష్టపడుతున్నది నువ్వేనా? అయితే ముందుగా నా హెచ్చరిక: నేను నువ్వూహిస్తున్నదాని కంటే భిన్నంగా ఉంటాను. ఏమాత్రం సందేహం లేదు. నాలో నువ్వు ఆశించిన వ్యక్తి లభిస్తాడనుకుంటున్నావా? నువ్వు నన్ను ప్రేమించినంత మాత్రాన్న, నేను నీ ప్రేమికుడిగా మారడం అంత సులభమనుకుంటున్నావా? నా స్నేహం నిష్కల్మషమైనదనీ, సంతృప్తినిస్తుందనీ అనుకుంటున్నావా? నేను నమ్మదగినవ్యక్తిగా, విశ్వాసపాత్రుడిగా అగుపిస్తున్నానా? నా ఈ మృదు స్వభావమూ ఒర్పూ వంటి ప్రచ్ఛన్న వేషాలు దాటి నా నిజస్వభావాన్ని ఊహించలేకపోతున్నావా? నువ్వు ఆవేశంతోగాక,…
-
పాటా – బాణమూ … HW లాంగ్ ఫెలో. అమెరికను కవి
. నేను గాలిలోకి ఒక బాణం విసిరా అదెక్కడో పడిపోయుంటుంది; తెలీదు ఎందుకంటే, అదెంత జోరుగా దూసుకెళ్ళిందంటే దాని వేగాన్ని నా కళ్ళు అనుసరించలేక పోయాయి నేను గాలిలోకి ఒక పాట ఆలపించేను. అదికూడా ఎక్కడో పడిపోయింది; తెలీదు. అంత చురుకైన కళ్ళెవడికున్నాయి గనక పాట వేగంతో దృష్టి మరలించడానికి? చాలా చాలా కాలం తర్వాత, విరిగిపోకుండా సింధూరవృక్షానికి గుచ్చుకుని ఆ బాణం దొరికింది. మొదటినుండి చివరిదాకా పొల్లుపోకుండా ఆ పాట నా మిత్రుడి గళంలో మారుమ్రోగడం విన్నాను. .…
-
వాలిన పిట్ట … ఎమిలీ డికిన్సన్
. నే నడిచే దారిలోకి ఒక పిట్ట వచ్చి వాలింది దాన్ని నే చూసేనని గమనించలేదది వానపాముని పట్టి, రెండుముక్కలుచేసి, దాన్ని అలాగే ఆరగించింది పచ్చిగా . ఒక గడ్డిపరక అంచునుండి జారబోతున్న మంచుబిందువులు తాగింది పేడపురుగును చూసి, దారి ఇస్తూ, పక్కకి గెంతుకుంటూ తప్పుకుంది. . గబగబా నాలుగుదిక్కులూ చూస్తున్న భీతిచెందిన దాని కళ్ళు భయపడి చెదిరిన పూసల్లా ఉన్నాయి. దాని మొఖ్మలు తలను ఒకసారి విదిలించింది . భయంగా అప్రమత్తంగా ఉన్నదానికి నేనో రొట్టెముక్క…
-
శరద్గీతి … సరోజినీ నాయుడు
బాధాతప్త హృదిపై నవనీతపులేపనం లా, నల్లమబ్బు అంచున, గుంకుతోంది పొద్దు. అటు బంగారువన్నె వరికంకుల రెపరెపలు ఇటు కొమ్మలలో పడుచు, పండుటాకుల గలగలలు ఎక్కడో, మబ్బుతెరలలో వెర్రిగాలి అలజడులు . అదిగో విననీండి! గాలిలో నా పేరు తేలి వస్తోంది. చిలిపిగాలి ఎవరిగొంతునూ అనుకరించటం లేదు గద? అలసిపోయిన నా మనసు ఒంటరిగ దిగులుతో నిండి ఉంది. అది కన్న కలలు ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి నేను మాత్రం మిగిలి చేసేదేముంది? . సరోజినీ నాయుడు (13 ఫిబ్రవరి 1879…
-
ఒక వింత సత్యం… మాయా ఏంజెలో
. సాహసానికి సగమెరుకై, సంతోషానికి బహిష్కృతులమై ఏకాంతపునత్తగుల్లలోకి ముడుచుకుపోయే మనల్ని “ప్రేమ” తన పవిత్రమైన గర్భగుడి వీడి ఈ సంకెలలనుండి విముక్తుల్ని చేసి జీవితాన్ని అనుగ్రహించేదాకా అలాగే ఉంటాం. . మనకే గనక ధైర్యం ఉంటే,ప్రేమ ఈ పిరికిదనపు సంకెలలని అవలీలగా త్రెంపేస్తుంది. . మన సర్వస్వాన్నీ, మనం కాగల (మార్పుచెందగల) సకలాన్నీ దానికి మూల్యంగా చెల్లించుకోవాలి. ఆశ్చర్యకరమూ, సాహసోపేతమైన సత్యం ఏమిటంటే మనల్ని విముక్తుల్ని చెయ్యగలిగినది… అదొక్కటే! . ఇటువంటి ఆశ్చర్యకరమూ, సాహసోపేతమైన అయిన సత్యాన్ని…
-
మబ్బులూ, సముద్రకెరటాలూ … రవీంద్రనాథ్ టాగోర్
. అమ్మా! మబ్బుల్లో దాగున్న పిల్లలు నన్ను పిలుస్తారే “ఉదయం అయింది మొదలు చీకటిపడేదాకా ఆడుకుందాం. బంగారురంగు సూర్యోదయం తోటీ, వెండిబిళ్లలాంటి చంద్రుడుతోటీ ఆడుకుందాం” అంటారే. అప్పుడు నే నడుగుతాను, “మరలాగయితే, అక్కడికి చేరుకునేదెలా?” అని. వాళ్లంటారు గదా, “ఏముందీ, భూమిఅంచుకి వచ్చి, రెండుచేతులూ ఆకసం వైపు చేతులు జాచితే నువ్వలా మబ్బుల్లోకి తేలిపోతావు.” అని. “మా అమ్మ నాకోసం ఇంటిదగ్గర ఎదురుచూస్తుంటుంది. అమ్మని ఇంటిదగ్గర వొదిలేసి ఎలా రావడం?” అంటానే. అప్పుడు వాళ్లు నవ్వుకుంటూ, తేలిపోతూ…
-
మబ్బులు … జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి
. మబ్బుల్ని వర్ణించాలంటే అబ్బో, నేను తొందరగా మాటాడవలసిందే, లేకపోతే, అవి లిప్తపాటులో వాటి ఆవతారాల్ని మార్చేస్తాయి. ఒకసారి ధరించిన రంగు, రూపు, తీరు, క్రమం మరోసారి అనుకరించమన్నా అనుకరించకపోడమే వాటి ప్రత్యేకత జ్ఞాపకాలు మోసుకెళ్ళవలసిన బాదరబందీ లేదేమో అవి వాస్తవాలమీంచి అలవోకగా తేలి పోతుంటాయి అయినా, అవి దేనికి సాక్షిగా నిలబడగలవు గనుక? ఏదైనా జరిగిందంటే చాలు, ఇట్టే చెల్లాచెదరైపోతుంటాయి మబ్బుల్తో పోల్చి చూస్తే జీవితమే గట్టిపునాది మీద స్థిరంగాఉంది; శాశ్వతంగా అనొచ్చేమో మబ్బుల్ని మినహాయిస్తే,…
-
రాకుమారి ఘనకార్యం … ఆస్కార్ వైల్డ్
. నిశ్చలాంబువులలో సప్త తారకలు నిర్మలాకాశంలో సప్త ఋషులు రాకుమారికి సప్తవ్యసనాఘాతాలు గుండెలోతులలో గుర్తుగా మిగులు ఆమె పాదాల చెంత ఎర్రగులాబులు (ఆమె ప్రాభాతవర్ణపు కురులలోనూ ఎర్రగులాబులే) అరే, ఆమె హృదయమూ, లేనడుముల సంగమంలోనూ ఎర్రగులాబులు దాగున్నాయి!. ఆ రెల్లు పొదల్లో, పరివేల్లములపై చచ్చిపరున్న యోధుడు అందంగా ఉన్నాడు. మృష్టాన్నం దొరికిన ఆనందంలో చిరుచేపలు తెగ సంబరపడుతున్నాయి ఆ కుర్రాడు దీర్ఘనిద్రలోనూ ముచ్చటగా ఉన్నాడు (స్వర్ణాంబరాలెప్పుడూ మృత్యువుకి ఎరలేగదా!) అదిగో ఆకసంలోకి చూడు, కాకోలాలు నల్లగా, చీకటంత…
-
జాబిలిలో విదూషకుడు … డిలన్ థామస్
ఒక అద్భుతమైన గులాబీ రేకులు గాలికి ఎగురుతున్నట్లు నా కన్నీటి చుక్కలు గాలిలో ప్రశాంతంగా తేలిపోతున్నై. గుర్తుతెలియని గగనాల హిమశిఖరాల అంతరం నుండి నా దుఃఖం ప్రవహిస్తోంది. . నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నేలమీద కాలు మోపానా అదంతా ఛిన్నాభిన్నమైపోతుంది. ఒకపక్క విచారమూ, మరోపక్క ఆనందంగానూ ఉంటుంది మాంచి కల చెదిరి అప్పుడే తెలివొచ్చేసినట్లు. . డిలన్ థామస్ ఈ కవిత అనేకానేక వ్యాఖ్యానాలు చెయ్యడానికి అవకాశమున్న కవిత. చంద్రుడు ఉత్ప్రేక్షలకు ఎప్పుడూ తరగని గని. చంద్రుడిలో…