-
అది పైకి చెప్పే మాట కాదు … సారా టీజ్డేల్
అది పైకి చెప్పే మాట కాదు. కొన్ని మాటలే బయటకి వస్తాయి; అది కళ్లల్లో ప్రతిఫలించేదీ కాదు, తల అవనతం చెయ్యడమూ కాదు, పదిలపరచుకోవలసినవెన్నో ఉన్న హృదయపు సడిలేని అలజడి కేవలం జ్ఞాపకాలు కలతపరచే కలతనిద్ర. . సారా టీజ్డేల్ . It is not a word . It is not a word spoken, Few words are said; Nor even a look of the eyes Nor a…
-
యుధ్ధాన్ని మొదట ఎవడు కనిపెట్టేడోగాని వాడు పరమ పాపిష్టివాడు…క్రిష్టఫర్ మార్లో.
[ఒక పిరికిపంద అయిన రాజు చేత ఈ మాటలు మాట్లాడించినా, ఇందులో సత్యం ఉంది. పాతరోజుల్లో రాజ్యాలకోసమే యుధ్ధాలూ అల్లకల్లోలాలూ జరిగితే, ఇప్పుడు ముఖ్యమంత్రిపదవినిలబెట్టుకుందికీ (లేదా పట్టుకుందికీ) ఒక పక్క, ప్రపంచస్థాయిలో భౌగోళికంగా, ఆర్థికంగా, తమ సామ్రాజ్యధిపత్యం, నిలబెట్టుకుందికి వేరొకపక్కా నిత్యమూ యుధ్ధాలూ, అల్లకల్లోలాలు జరుగుతున్నై. మధ్యలో ఎంతమంది అమాయకులు బలయిపోతున్నారో వాళ్ళకి తెలీదు. బుష్ జూనియర్ లాంటి వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే వీళ్ళందరూ Collateral Damages. అంటే తప్పించుకోలేని నష్టం ట. మూర్ఖులచేతిలో రాజ్యాధిపత్యం ఉంటే…
-
చాలు, ఇక శోకించకు! … జాన్ ఫ్లెచర్.
[ఆంగ్ల సాహిత్యం లో బ్యూమాంట్(Beaumont), ఫ్లెచర్ (Fletcher) లది పేరుపడ్ద జంట. ఒకరి పేరుతో రెండవవారి పేరు విడదీయరానంతగా కలిసిపోయిన జంట నాటక రచయితలు వీరిద్దరూ. వాళ్ళిద్దరి హాస్యరసప్రధానమైన Comedy లు అప్పటికీ ఇప్పటికీ మనోరంజకంగా నిలిచిఉన్నాయి. ఒక్క పిసరు ఫ్లెచర్ లొ కవిత్వపు పాలు ఎక్కువ. కొన్ని నాటకాలలో ఎవరు ఏభాగం రాసేరో చెప్పలేనంత బాగా కలిసిపోయాయి వాళ్ల భావనలూ, భాషా. చిత్రమేమిటంటే, ఫ్లెచర్ షేక్స్పియర్ తో కూడా కలిసి నాటకాలు రాసిన దాఖలాలున్నాయి ముఖ్యంగా Henry…
-
నిర్మల నిశీధి… వాల్ట్ వ్హిట్మన్
[ఈ కవితలో చమత్కారాన్ని గమనించండి. ఏదో శలవులువచ్చి ఉపాధ్యాయుడు ‘హమ్మయ్య ‘ అని ఊపిరిపీల్చుకుని ఏ వేసవి శలవులకో మనసును సిధ్ధపడమని కోరుతున్నట్లు ఒక ప్రక్క కనిపిస్తూనే, కవి రెండోప్రక్క, జీవితచరమాంకంలో మృత్యువుకి సిధ్ధపడమని మనసుని హెచ్చరిస్తున్నాడు.] . ఓ నా ప్రాణమా! రోజు చెరిగిపోయింది. పాఠం పూర్తయిపోయింది. పుస్తకాలకి దూరంగా… కళాభినివేశాలకి దూరంగా… మాటలు లేని ప్రపంచంలోకి ఇక స్వేచ్ఛగా ఎగిరిపోయే సమయమాసన్నమైంది… ఇక నువ్వమితంగా ప్రేమించే విషయాలైన రాత్రినీ, నిద్రనీ, నక్షత్రాలనీ నిశ్శబ్దంగా పరిశీలిస్తూ…
-
సానెట్ CXVI … Shakespeare
[Marriage అన్న మాటకి పెళ్ళి/ వివాహం అన్న లౌకిక మైన అర్థాలే గాక, అంతకంటె ఉదాత్తమైన ‘కలయిక’ అన్న తాత్త్విక భావన ఉంది. ఈ కలయిక శారీరకమైనదేగాక, మానసికమైనది. ఇక్కడ అభిప్రాయాల కలబోత తర్వాత ఏకీకరణ ఉంటుంది. కలిసి ప్రవహించడం ఉంటుంది. అంతేగాని ఒకరి అభిప్రాయం ఎల్లప్పుడూ చెల్లాలన్న పట్టుదల, one-upmanship ల గొడవ కాదు. అది ఒక అపూర్వమైన స్నేహం. స్నేహం అంటే నెయ్యి అని అర్థం ఉంది. అది వేడికి కరుగుతుంది, చల్లదనానికి గడ్డకడుతుంది.…
-
గొల్లపదం … జాన్ బన్యన్
[జాన్ బన్యన్ ఒక అతిపేద కుటుంబం నుండి వచ్చి (అతని తండ్రి పాత్రలకు మాట్లు వేస్తూ బతికేవాడట. తనుకూడ అదేవృత్తికొంతకాలం కొనసాగించేడు). అతని సవతితల్లి పోరు భరించలేక 16వ ఏట ఇల్లు వదలి వెళ్ళిపోయి అన్ని రకాల చెడు అలవాట్లకు బానిసై, తన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకున్నా, తను పెళ్ళిచేసుకున్న ఒక అనాధ స్త్రీ తండ్రి ఆమెకు వారసత్వంగా ఇచ్చిన రెండే రెండు పుస్తకాలు Plain Man’s Pathway to Heaven by Arthur Dent; Practice…
-
మిడత – కీచురాయి … జాన్ కీట్స్
వర్డ్స్ వర్త్ అతన్ని తీసిపారేసినా, అతని Endymionకి వచ్చిన కువిమర్శకి తట్టుకోలేక Here lies one whose name is writ in water అన్న మాటలు పేరులేని తన స్మృతిఫలకం మీద రాయమని చెప్పినా, తర్వాతితరం కవులు, ముఖ్యంగా లే హంట్ (Leigh Hunt), మాత్యూ ఆర్నాల్డ్ (Mathew Arnold) వంటి వాళ్ళు అతని కవిత్వ ప్రతిభ గుర్తించడమే గాక, రెండు దశాబ్దాలు తిరగకముందే, రొమాంటిక్ మూవ్ మెంట్ కి ఆద్యులుగా పేరువహించిన వర్డ్స్ వర్త్,…
-
శాశ్వతనిద్రలోకి నెమ్మదిగా జారుకోవద్దు … డిలన్ థామస్
[డిలన్ థామస్ పై గ్రామర్ స్కూల్ టీచర్ గా పనిచేసిన అతని తండ్రి ప్రభావం చాలా ఉంది. భాషపట్లా, సాహిత్యం పట్లా అతనికి అబ్బిన అభిమానం అతనిదగ్గరనుండి వచ్చినదే. 1945 లో మృత్యుముఖంలో ఉన్న తండ్రిని ఉద్దేశించి ఈ కవిత రాసినట్టు అతని స్నేహితురాలికి రాసిన ఉత్తరం ద్వారా తెలుస్తున్నా, దీన్ని అతని మరణానంతరం (16 Dec 1952) గాని ప్రచురించలేదు. ఇది చాలా గొప్ప ప్రేరణనిచ్చే కవిత. మనిషి ఎటువంటి జీవితాన్ని గడిపినా, మృత్యువు విషయం…
-
కిటికీ పక్క గొంతుకలు … సర్ ఫిలిప్ సిడ్నీ
(కవిత్వమన్నా, స్నేహానికిప్రాణంపెట్టడమన్నా, ఉత్తమమైనశీలాన్ని అలవరచుకోవడమన్నా, చనిపోతున్నపుడుకూడా మానవీయవిలువలకి జీవితాన్నిఅంకితంచేసి ఉదాత్తంగా వ్యవహరించడమన్నా, సర్ ఫిలిప్ సిడ్నీ నుండి ఈ కాలపు కవులు నేర్చుకోవగలిగినది చాలా ఉంది. ఇంగ్లీషు కవీ, రాజసేవకుడూ, సైనికుడూ అయిన సర్ ఫిలిప్ సిడ్నీది ఉదాత్తమైన వ్యక్తిత్వం. అతని అపురూపమైన వ్యక్తిత్వానికి చిహ్నంగా ఒక కథ బహుళ ప్రచారం లో ఉంది. తన స్నేహితుడికోసం యుధ్ధానికి వెళ్ళిన సిడ్నీ, గాయపడి పడిపోయి, దాహ దాహం అంటుంటే, ఎవరో తాగడానికి నీళ్ళు తీసుకు వచ్చి అతనికి…
-
మౌన ప్రేమికుడు … సర్ వాల్టర్ రాలీ (1552–1618)
. ఓ నా హృదయ రాణీ! నీ ప్రేమను అర్థించపోయినంత మాత్రంచేత గాయపడలేదనుకుని అచ్చమైన ప్రేమలోని మౌనాన్ని తప్పుగా అర్థంచేసుకోకు…. . ప్రేమలో మౌనం, మాటలు చెప్పగలిగినదానికంటే ఎక్కువ బాధని వ్యక్తపరుస్తుంది. నీకు తెలుసుకదా, ముష్టివాడు మూగవాడుకూడ అయితే వాడిమీద మరింత జాలి చూపించాలని. . నా మనోహరీ! నా నిజమైన ప్రేమని, చెప్పలేకున్నా, తప్పుగా అర్థం చేసుకోకు; ఎవడు తనగాయాన్ని దాచుకుని, కనికరంకోసం ప్రాకులాడడో, వాడే ఎక్కువ బాధ అనుభవిస్తాడు. . సర్ వాల్టర్ రాలీ…