-
నన్ను మరిచిపో వద్దు … అజ్ఞాత కవి
. మీరు రోజు గడుపుతూ ఆలోచనలో ములిగిపోయినా నన్ను మరిచిపో వద్దు. నేను యుధ్ధం చేసేను. చేస్తూ గాయపడ్డాను. నన్ను మరిచిపోవద్దు. ఋణం తీర్చుకోలేని ప్రాణత్యాగాలవల్ల స్వాతంత్ర్యం వచ్చింది. నన్ను మరిచిపోవద్దు. మీ పిల్లలకి బోధించినపుడల్లా గతాన్ని గుర్తుంచుకోమనండి. నన్ను మరిచిపోవద్దు. మీరు బాధలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నా నన్ను మరిచిపోవద్దు. నేను తూటా పేలడం విన్నాను. అయినా, వెన్నిచ్చి పారిపోలేదు. నన్ను మరిచిపోవద్దు. నేనొక దేశభక్తుడిని ఈ రోజు మీ సాయం నాకు కావాలి. నన్ను…
-
కొడుక్కి అమ్మ ఉత్తరం … లాంగ్స్టన్ హ్యూజ్
. ఒరే, నాన్నా! నీకో విషయం చెప్పాలి: నా జీవితం ఏమీ బంగారు మెట్లెక్కినంత సాఫీగా గడిచిపోవడంలేదు. అన్నీ కర్రమెట్లే. చాలాచోట్ల మేకులు దిగి ఉన్నాయి. మెట్లకి పెచ్చులూడిపోయాయి. చెక్కలు అక్కడక్కడ కన్నాలు కూడపడ్డాయి. దానిమీద తివాచీ చిరిగిపోయి కొన్ని చోట్ల బోసిగా కూడా ఉంది అయినా, ఆగకుండా ఎక్కుతూనే ఉన్నాను. మధ్యలో మార్గాయాసం తీర్చుకుంటున్నాను. అవరోధాలొచ్చినపుడు దిశమార్చుకుంటున్నాను, ఒక్కోసారి ఎక్కడా వెలుతురుకనరానప్పుడు, చీకట్లోనే గుడ్డిగా ప్రయాణిస్తున్నాను. కాబట్టి, నాన్నా, నువ్వెన్నడూ వెనకడుగెయ్యడానికి ప్రయత్నించకు. మెట్లమీదే చతికిలబడిపోకు…
-
అమర సైనికుడు … రాబర్ట్ ఫ్రాస్ట్
. మంచుకురిసినా, తుప్పు పట్టినా, నేలలోకి దిగింది దిగినట్టుగా మట్టిలో దూసుకెళ్ళిన పదునుతోనే ఉండిపోయిన పైకితియ్యని కత్తిలాంటి వాడు అతను. మనం ప్రపంచాన్ని ఎంత పరికించి చూచినా అతను ప్రాణాలర్పించడానికి తగ్గ ఉదాత్తలక్ష్యం కనిపించదు కారణం, సామాన్యజనం లాగ, మనమూ హ్రస్వదృష్టులమే భూమికి పరిమితమైన మన ఆలోచనల్లాగే మన అస్త్రాలు కూడా ఎంతో ఎత్తుకు ఎగరలేవని మరిచిపోతాం. అవి రాలిపోయి, పచ్చికను చీల్చుకుని భూతలాన్ని తాకి, ధ్వంశమైపోతాయి. మనం శిలాఫలకాలపై శాశ్వతమైన కీర్తిప్రతిష్ఠలకోసం అల్లాడేట్టు చేస్తాయి. కానీ,…
-
అక్కసు … ఫ్రాంక్ ఒహారా
. నాకు చాలా విషయాల గురించి తెలుసు. ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను. ఎంత ఎక్కువంటే, ఇక నా బుర్రపట్టనంత. ఇవతలవాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవడం, వాళ్ళు ఏమిటి చేస్తుంటున్నారో తెలుసుకోవాలనే బలహీనతే నన్ను నిలబెడుతోంది. దాని విలువేమిటో నాకు తెలియదంటే గొప్ప చికాకు తెప్పిస్తుంది. వాళ్ళకి దాని విలువేమిటో నాకు తెలుసు. అందుకే నాకు అసహ్యం . ఫ్రాంక్ ఒహారా (మార్చి 27, 1926 – జులై 25, 1966 ) అమెరికను రచయితా, కవీ, విమర్శకుడూ…
-
సగటు మనిషి … రాబర్ట్ విలియం సర్విస్
మేధావిననే అపోహలు లేని అతి సాధారణ…. సగటు మనిషిని నేను జాగ్రత్తగా, ఉన్న కొద్దిపాటి లోకజ్ఞానంతో, ఒక సుఖప్రదమైన జీవితానికి ప్రణాళిక వేసుకుంటాను అందరూ చేసే పనులూ నేను చేస్తాను అందరూ మాటాడే మాటలే నేనూ మాటాడుతుంటాను; పొద్దున్న వార్తాపత్రిక చదువుతూ ఈ రోజు సమస్యలేమిటో తెలుసుకుంటాను నా జీవితం నిస్సారమనీ, మరీ సామాన్యమనీ నువ్వనుకోవడం సహజం. అయితే నేం? నా దృష్టిలో, నేను నా జాతికి ప్రతినిధిని. నా పేరు అందరికీ సర్వనామంగా…
-
ఔష్విజ్ … లేయాన్ ఫెలిపె స్పానిష్ కవి.
. ప్రపంచంలోని యూదులందరికీ… నా స్నేహితులారా (నా తోబుట్టువులారా), నరకాన్ని వర్ణించిన కవులు దాంతే, బ్లేక్, రింబో లని నెమ్మదిగా మాటాడనీండి… మౌనంగా ఉండనీండి! ఇవాళ, ఈ భూమ్మీద నివసిస్తున్న వాడెవడికైనా, నరకం అంటే ఏమిటో వాళ్ళముగ్గురి కంటే ఎక్కువ తెలుసు. దాంతే ఒక భగవద్దత్తమైన ప్రతిభకల వాయులీన విద్వాంసుడని నాకు తెలుసు. ఓహ్! అతనొక గొప్ప కళాప్రపూర్ణుడు. . కానీ, ఇప్పుడు తల్లి దండ్రులనుండి దూరం చెయ్యబడి అక్కడ ఔష్విజ్ శ్మశానవాటికలో ఒక్కడూ, ఒంటరిగా నిలబడి,…
-
ఆవేదన … ఆస్కార్ వైల్డ్
. విశాలమైన బంగారపు పాతరలు సంపాదించి తుఫానుల వలన భయం గాని అడవిలో చెట్లు కూలుతున్న చింతగానీ లేని ఎవరికైనా జీవితం సాఫీగా సాగితే సాగనీ . ఆకలితో అలమటించిన రోజుల వేదనగాని బాధలూ కన్నీళ్లతో తలపండిన తండ్రిగాని ఏకాంతంలో దుఃఖాశృవులు రాల్చే తల్లిగాని ఎరుగక ఎవరికైనా జీవితం సాఫీగా సాగితే సాగనీ. . కానీ, అలయించే కష్టాల,పోరాటాల బాటలో కాళ్ళరిగినా, ఎంత జీవనవిషాదంలోనైనా దేవునికి చేరువగా నిచ్చెనలు వేసేవారికి మాత్రం జీవితం సాఫీగా సాగిపోవాలి . ఆస్కార్…
-
నష్టపరిహారం … సారా టీజ్డేల్
. శీతకాలపు రాత్రి క్షణికమైనాసరే, మనోజ్ఞంగా, వెలుగుతూ రాలిపోయే ఉల్కలా గుండెలోనే కొట్టుకులాడే, సుమధురమైన గీతం ఒక్కటి రాయగలిగితే చాలా సంతోషిస్తాను… బాధామయమైన జీవితం లో మార్పులేకపోయినా మనసు అలసినా, దేహం ఆర్తితో తపించినా విరిగినరెక్కలతోనే గంటలతరబడి ఎగరవలసివచ్చినా ఒంటరిగా మిగిలిపోయినా! . Compensation . I should be glad of loneliness And hours that go on broken wings, A thirsty body, a tired heart And the unchanging…
-
నేనొక తలెత్తుకుని జీవించగల ఏకాకిని … హెన్రీ డేవిడ్ థొరో.
. నేను తలెత్తుకుని బ్రతకగల ఏకాకిగా సృష్టించబడ్డాను. నాలో దమ్ముంది. నా దృష్టి నిర్మలంగానే ఉంటుంది; నా జీవితం ఎన్నడూ నిరుత్సాహంగా ఉండదు. కేంద్రానికి అన్నిబిందువులూ దగ్గరే. (భగవంతునికి అందరూ సమదూరమే). ఈ క్షణానికి నేనే రాజుని. కాలమా! నువ్వు నాకు ప్రతికూలించదలుచుకున్నా, అనుకోని ఆఘాతాలు కలిగించదలుచుకున్నా ఫర్వాలేదు. జీవిత సారాన్ని తీసుకో. కానీ, హృదయం మాత్రం నాకు విడిచిపెట్టు. . హెన్రీ డేవిడ్ థొరో (జులై 12, 1817 – మే 6, 1862) [19వ శతాబ్దపు…
-
అది సాధ్యమా? … సర్ థామస్ వైయట్
. అది సాధ్యమా? అంత తీవ్ర వాగ్వివాదం, అంత నిశితంగా, అంత వాడిగా, అంత జోరుగా, జరిగింది ఆలస్యంగా ప్రారంభమైనా అంత తొందరగా ముగిసిందా? అది సాధ్యమా? అది సాధ్యమా? అంత దుర్మార్గమైన ఆలోచన, అంత క్షణికావేశము, అంతతొందరగా తగ్గిపోయిందా, ప్రేమనుండి ద్వేషానికి, ద్వేషం నుండి జాలిపడడానికీ మారిందా? అది సాధ్యమా? అది సాధ్యమా? ఆ గుండెలోనే ఒకసారి ప్రశాంతంగానూ, మరోసారి కల్లోలంగానూ మారిపోగల వైరుధ్యాలున్న మనసు ఉండడం… అది నిజంగా సాధ్యమేనా? అది సాధ్యమేనా? ఎంతమాత్రం…