అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 30, 2020

    మితభాషికి నిర్లక్ష్యం అంటగడతారు… భర్తృహరి, సంస్కృతకవి

    మితభాషికి నిర్లక్ష్యాన్నీ, భక్తితో ప్రవర్తించే వానికి కపటత్వాన్నీ నిర్మల మనస్కునికి వంచననీ వీరునికి క్రూరత్వాన్నీ లోకాన్ని త్యజించినవానికి శత్రుత్వాన్నీ సరససంభాషికి  నక్కవినయాలనీ హుందాగా ఉండేవ్యక్తికి అహంకారాన్నీ, మంచి వక్తకి వాచాలత్వాన్నీ విశ్వాసంగా ఉండేవారికి వ్యక్తిత్వలేమినీ  లోకం ఆపాదిస్తూనే ఉంటుంది. దుర్బుద్ధితో ఆలోచించే వారి దూషణని తప్పించుకోగల సుగుణం లోకంలో, అసలు, ఉందా?  . భర్తృహరి   సంస్కృత కవి   Apathy is Ascribed to the Modest Man . Apathy is ascribed to…

  • జనవరి 29, 2020

    తనివి … లూ చీ, చీనీ కవి

    రచయిత అనుభూతించే ఆనందం పూర్వం ఋషు లనుభవించినదే. నిరాకారంనుండి ఆకార మావిర్భవిస్తుంది; నిశ్శబ్దం నుండి కవి పాట పుట్టిస్తాడు. ఒక గజం పొడవు పట్టుదారంలో అనంతమైన రోదసి దాగి ఉంది; భాష గుండె మూలలనుండి పెల్లుబికే వరద ప్రవాహం. ప్రతీకల వలల వలయాలు యథేచ్ఛగా విశాలంగా విరజిమ్మి ఉన్నవి. ఆలోచనలు మరింతలోతుగా అధ్యయనంచేస్తున్నవి. లెక్కలేనన్ని పూల, అరవిరిసినమొగ్గల నెత్తావులు కవి వెదజల్లుతున్నాడు పిల్లగాలులు నవ్వుతూ ఉత్ప్రేక్షిస్తున్నాయి: వ్రాయు కుంచియల వనభూమినుండి మేఘాలు మింటిదారి నధిరోహిస్తున్నాయి. . లూ…

  • జనవరి 28, 2020

    పదాలపొందిక… లూ చీ, చీనీ కవి

    కవి తన ఆలోచనలని సొగసైన పదాలలోకి ఒడుపుగా ఒదిగిస్తున్నప్పుడు ప్రకృతిలో కనిపించే అనేకానేక ఆకారాలవలె సాహిత్యంకూడ అనేక రూపాలు, శైలులు సంతరించుకుంటుంది. కనుక కనులకింపైన చిత్రంలోని ఐదు రంగుల వలె ఐదు ధ్వని* స్థాయిలను అంచెలంచెలుగా వాడుకోవాలి. వాటి రాకపోకలు ఒక నిర్దిష్టక్రమంలో లేకపోయినా తారస్థాయిని అందుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా మీకు స్థాయీభేదాల క్రమం, తేడాల మౌలిక లక్షణాలు పట్టుబడితే పంటకాలువల్లో పరిగెత్తే నదిలా మీ ఆలోచనలూ పరిగెడతాయి. కానీ, మీరు ఉపయోగించే పదాల గతి…

  • జనవరి 27, 2020

    పనలమీద ప్రయాణం … లూ చీ, చీనీ కవి

    ఒక్కోసారి మీ రచన రసభరితమైన ఆలోచనల సమాహారమైనప్పటికీ అవి ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ ఇతివృత్తాన్ని మరుగుపరచవచ్చు. మీరు శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత అధిరోహించగల వేరు చోటు ఉండదు. మీరు రాసినదాన్ని ఇంకా మెరుగుపరచాలని ప్రయత్నిస్తే అది తరుగుతుంది. సరియైన సందర్భంలో వాడిన అద్భుతమైన పదబంధం, రచనపై కొరడాఝళిపించి గుఱ్ఱంలా దౌడుతీయిస్తుంది. తక్కిన పదాలన్నీ ఉండవలసిన చోట ఉన్నప్పటికీ పాలుపోసుకున్న చేను రాజనాలకై ఎదురుచూసినట్టు ఎదురుచూస్తాయి. కొరడా ఎప్పుడైనా చెడుకంటే మంచే ఎక్కువ చేస్తుంది. ఒకసారి సరిగా దిద్దిన తర్వాత,…

  • జనవరి 26, 2020

    ఉదాత్త స్వభావము… బెన్ జాన్సన్ , ఇంగ్లీషు కవి

    చెట్టులా ఏపుగా బలంగా పెరగడం మనిషిని మెరుగైనవాడిగా చెయ్యదు; ఓక్ చెట్టులా మూడు వందల ఏళ్ళు బ్రతికినా అంతే. చివరకి ఎండి, నిస్సారమై, బోడి మానై, రాలి ముక్కలవాల్సిందే. లిల్లీపువ్వు జీవితం ఒకరోజే వేసవిలో బహుసుందరంగా ఉంటుంది. పగలుపూచినది రాత్రికి వాడి, రాలిపోవచ్చు.  ఐతేనేం, మన రోజంతటినీ దేదీప్యమానం చేసే పువ్వు అది. మనం సౌందర్యాన్ని చిన్నచిన్న మోతాదుల్లోనే చూస్తాం. చిన్న చిన్న ప్రమాణాల్లోనే జీవితం పరిపూర్ణమై ఉంటుంది. . బెన్ జాన్సన్ (11 June 1572…

  • జనవరి 25, 2020

    విధి ఒక దయలేని కుమ్మరి… భర్తృహరి, సంస్కృత కవి

    నాకు ఈ సంకలనంలో బాగా నచ్చిన విషయం భర్తృహరిని (ఇంకా, అమర సింహుడు మొదలుగా సంస్కృత కవుల్ని, చాలమంది చీనీ కవుల్ని) ఇంగ్లీషులోకి ఎంతో అందంగా అనువాదం చెయ్యడం. . విధి ఒక నిపుణుడైన, దయలేని కుమ్మరి. మిత్రమా! ఆరాటాల సారెను బలంగా తిప్పి వదలి దురదృష్టమనే పనిముట్టు అందుకుంటుంది ఆకారాన్ని దిద్దడానికి. నా హృదయమనే రేగడిమట్టిని ఇపుడది పిసికి మర్దించి సాగదీసి తన సారెమీద ఉంచి గట్టిగా ఒక తిప్పు తిప్పింది. న న్నేవిధి మలచ…

  • జనవరి 24, 2020

    నే నొక పల్లెటూరివాడిని … హాన్ షాన్, చీనీ కవి

    నే నొక పల్లెటూరిలో నివసిస్తున్నాను. అక్కడ అందరూ నన్ను సాటిలేనివాడినని పొగుడుతూ ఉంటారు. కానీ, నిన్న నగరానికి వెళ్ళాను అందుకు భిన్నంగా, ఇక్కడ “కుక్కలు” ఎగాదిగా చూడ్డం ప్రారంభించేయి. నా పంట్లాము మరీ బిగుతుగా ఉందని కొందరంటే మరికొందరు నా చొక్కా మరీ పొడుగ్గా ఉందన్నారు. ఎవరైనా ఈ డేగకళ్ళను తప్పించగలిగితే బాగుణ్ణు చిన్నారి పిచ్చుకలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తలెత్తుకు తిరగ గలుగుతాయి. . హాన్ షాన్, చీనీ కవి   C 680 – 760 Chinese…

  • జనవరి 22, 2020

    భట్రాజులుంటారు జాగ్రత్త… సిడియాస్, గ్రీకు శిల్పి

    ఈ కవిత చదివేక, ఈ మధ్య ఆంధ్రలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు ఒకరు తన నాయకునికి విధేయత ప్రకటిస్తూ, భగవంతుడు చనిపోమంటే, తన నాయకుని తండ్రి పొందిన మరణంవంటి మరణాన్ని కోరుకుంటాను అని ప్రకటించడం గుర్తొచ్చింది. . అతి ముఖస్తుతిచేసే వాళ్ళుంటారు. జాగ్రత్త. వాళ్ళు, సింహానికి ఎదురుగా నిలబడి అది ఆకలితో అలమటిస్తోందేమోననన్న ఆలోచనకే భయంతో వణుకుతూ చస్తారు. . సిడియాస్ క్రీ. పూ. 4 వ శతాబ్దం. గ్రీకు శిల్పి . Beware . Beware. …

  • జనవరి 21, 2020

    Nongtongpaw… ఛార్లెస్ డిబ్డిన్, ఇంగ్లీషు గీత రచయిత

    నా చిన్నతనంలో బొత్తిగా సంస్కృతం చదువుకోని అల్లుడిని, పండగకి అత్తవారింటికి వచ్చినపుడు ఆటపట్టిస్తూ చేసిన గందరగోళం గురించి ఒక చిన్న నాటకం పాఠ్యభాగంలో ఉండేది. అలాగే, ఈ “Nongtongpaw” కూడా. Jonathan Swift, Alexander Pope కీ మిత్రుడైన John Arbuthnot తొలిసారిగా, United Kingdom నీ మరీ ముఖ్యంగా ఇంగ్లాండుని ఆటపట్టిస్తూ సృష్టించిన రాజకీయ వ్యంగ్య పాత్ర John Bull.  ఈ John Bull కి ఒకసారి ఫ్రాన్సు చూడాలన్న కోరిక కలిగింది. అక్కడ అతనికి…

  • జనవరి 20, 2020

    ఎలిజబెత్ మహరాణి స్మృతిలో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి

    మనిషి సంక్షిప్తంగా ఏమి చెప్పగలడో వినాలనుందా? అయితే, పఠితా! నిలు, నిలు! ఎంత అందం మట్టిలో కలవగలదో అంత అందమూ ఈ రాతికింద మట్టిలో కలిసి పోయి ఉంది. అది జీవితానికిచ్చినదానికంటే ఎక్కువ పాలు శీలానికి తననితాను ధారపోసుకుంది. ఆమెలో మచ్చుకి ఏదైనా లోపం కనిపిస్తే దాన్ని ఈ సమాధిలోనే విడిచిపెట్టండి. ఆ అందానికి ఉన్నది ఒక్కటే పేరు: ఎలిజబెత్ శరీరాన్ని మృత్యువుతో శయనించనీయండి. మృతిలోకూడా ఆజ్ఞనీయగల సమర్థురాలు ఆమె పేరుకి జీవించి ఉన్నప్పటికంటే.  శలవు! .…

←మునుపటి పుట
1 … 20 21 22 23 24 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు