-
మనసే నా సామ్రాజ్యం …ఎడ్వర్డ్ డైయర్, ఇంగ్లీషు కవి
. మనసే నా సామ్రాజ్యం. అక్కడ నాకు ఎంత మహదానందం దొరుకుతుందంటే… దాతలు కనికరించడం వల్లనో, లేక స్వతస్సిద్ధంగానో సృష్టిలో లభించే ఆనందాలన్నీ దాని ముందు దిగదుడుపే. అందరూ కోరుకునేవే నేను కోరుకున్నప్పటికీ నా మనసు అలాంటివి అడక్కూడదని నిషేధిస్తుంది. రాజుల ఆడంబరాలూ, అంతులేని సంపదలూ… యుద్ధంలో జయించడానికి సైన్యాలూ… నా బాధలు ఉపశమించడానికి కపటోపాయాలూ… కళ్ళ తనివి తీరడానికి అందమైన ఆకృతులూ… వీటి వేటికీ నే బానిసని కాలేను. కావలసినవన్నీ నామనసు నాకిస్తుంటే, ఎందుకవి? బాగా…
-
ప్రేమా – నవ్వూ … రాబర్ట్ బర్న్స్ స్కాటిష్ మహా కవి.
నువ్వు నవ్వితే ప్రపంచం నీతో నవ్వుతుంది; నువ్వుఏడిస్తే, నువ్వొక్కడివే ఏడవాలి; ఈ పురాతనమైన నేల సంతోషం ఎరువుతెచ్చుకోవాలి ఎందుకంటే, దానికి చాలినన్ని దుఃఖాలు దానికి ఉన్నాయి; గొంతెత్తి పాడిచూడు, కొండలు ప్రతిధ్వనిస్తాయి, అదే నిట్టూర్పు విడిచి చూడు, గాలిలో కలిసిపోతుంది. ప్రతిధ్వనికూడా, ఆనందాన్ని సంతోషంగా నినదిస్తుంది ఆలనాపాలనా చెప్పాలంటేనే, నోరుమెదపదు. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఉంటారు స్నేహితులు మెండు; అదే దుఃఖిస్తూ ఉండు, ఒక్కడు ఓదార్చేవాడుండడు; మధురమైన మదిరని పంచుతాను అను, వద్దనేవాడుండడు; కన్నీళ్ళు దిగమింగుకోవాల్సివస్తే, ఒట్టుకి ఒక్కడుండడు…
-
ఓ నావికుడా! నా నాయకుడా! … వాల్ట్ వ్హిట్మన్
ఓ నావికుడా! నా నాయకుడా! మన భయంకర ప్రయాణం ముగిసింది. మన ఓడ ప్రతి ప్రమాదాన్నీ తట్టుకుని నిలబడింది, మనం లక్ష్యాన్ని సాధించగలిగాం అదిగో, రేవు సమీపిస్తోంది, గంటలు వినబడుతున్నై ప్రజలు ఉత్సాహంతో ఉరకలువేస్తున్నారు, సాహసయాత్రముగించిన ఈ నౌక నిలకడగా లంగరు వేస్తుంటే అందరికళ్ళూ దాని మీదే, మౌనంగా, విచారంగా… అయ్యో నా హృదయమా! హృదయమా! హృదయమా! నా నాయకుడు ఈ డెక్ మీద రాలిపోయాడు… శరీరం చల్లబడి, నిశ్చైతన్యమై రక్తం బొట్లు బొట్లుగా కారుతూనే ఉంది.…
-
Absurd Painting … Praveena Kolli
. It’s a medley of colours smeared of ideas, ensconced in the inmost layers of the mind, hanging on to the tip of the brush for long and dropped and splattered in a dream. Who knows If the infinities at the centres of circles and emotional upsurges in the haphazard strokes betoken lust or infatuation…
-
నిరాశతో ముఖాముఖీ… థామస్ హార్డీ,ఆంగ్ల కవి
. చీకటిపడేవేళకి నన్ను నేను చూసుకునేసరికి నిస్సారమైన ఊషరక్షేత్రంలో ఉన్నాను. నల్లని ఆ చిత్తడినేల ఏ రూపురేఖలులేకుండా రూపుగట్టిన విషాదంలా కనిపించింది. “ఇదికూడా నా జీవితంలానే ఉంది, చీకటి పుట్టలా.” అనుకున్నాను నేను. “దురదృష్టం వెన్నాడి చవుడు పడిపోయింది…. ఎటుచూసినా వెలుగురేక కనబడదు” తలెత్తి ఒకసారి ఆకాశం లోకి చూసేసరికి, అక్కడి వర్ణవ్యంజనము నన్నాకట్టుకుంది. మెరుగంచుల కారుమబ్బులు చూసేక అనిపించింది: చూడాలేగాని, బహుశా సాంత్వన అన్నిచోట్లా దొరుకుతుందని.” ఒక వక్ర బుద్ధి, నిర్దాక్షిణ్యంగా మంచిని చెడుగ వ్యాఖ్యానించినపుడు కలిగే…
-
అనగా అనగా ఒకప్పుడు … గాబ్రియేల్ ఒకారా, నైజీరియన్ కవి
(నా ఈ 400వ టపా సందర్భంగా సాహితీ మిత్రులకీ, నా బ్లాగు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అపూర్వమైన కవిత అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 1975 ప్రాంతాల్లో The Hindu లో ఒక సారి చదివాను. అప్పటినుండీ ఇది నా మనసులో నాటుకు పోయింది. అప్పట్లో అంత సాహిత్యవ్యాసంగం లేకపోవడంవల్ల కవి పేరూ గుర్తు పెట్టుకోలేదు, కవితా గుర్తులేదు. ఆఫ్రికన్ కవి అని తెలుసు. అందులో “సందర్భానికి తగ్గ ముఖాలు” అన్న విషయం లీలా మాత్రంగా…
-
వదనం … ఫాతిమా అల్ మతార్, సమకాలీన కువైటీ కవి
Listen to the Poem in Fatima Al Matar’s Voice: http://www.youtube.com/watch?feature=player_embedded&v=DRkKmkFfhk0 ఓ నా వదనమా! నువ్వూ నేనూ ఎలా పెరిగాము! నిన్ను నాకో ముసుగులా వాడడం ఎంత త్వరగా నేర్చుకున్నానో అంత త్వరగా నువ్వు నీ బుగ్గల నునులేతదనం విడిచావు విశాలమైన కన్నుల్లో అమాయకత్వాన్ని కూడా విడిచిపెట్టావు వదనమా! నీ వెనక దాక్కోడం ఎంత హాయిగా ఉంటుందో! నిన్ను నా వయసుని మోయనియ్యడం ఎంత తేలికగా ఉంటుందో! నా పిచ్చి పిచ్చి ఆలోచనల్నీ, ప్రతి…
-
వంశప్రతిష్టలూ- అధికారముద్రలూ… జేమ్స్ షర్లీ, ఇంగ్లీషు నాటక కర్త.
మన వంశప్రతిష్టలూ, అధికారముద్రలూ ఎంతగొప్పవైనా అవికేవలం ఛాయామాత్రమే, అల్పమైనవే. విధినితప్పించుకోగల కవచం ఏదీ లేదు. మృత్యువు తన శీతలహస్తాన్ని మహరాజులమీదనైనా వెయ్యగలదు. రాజదండాలూ, అపురూపమైన కిరీటాలూ నేలకు ఒరిగిపోవలసిందే. పలుగు పారలతో మట్టిలోకప్పబడి అన్నిటితో సరిసమానంగా దొర్లవలసిందే . కొంతమంది శౌర్యవంతులు కదనరంగంలో శతృసంహారంచేసి కొత్తచరిత్ర లిఖించవచ్చు. అయినా, వాళ్ళ భుజబలాలు లొంగవలసిందే. కొంతకాలం ఎదిరించవచ్చేమోగాని ముందో వెనకో విధికి దాసోహమనక తప్పదు. రక్తహీనులై, మృత్యువుకి తలవంచినపుడు, వాళ్ల ఊపిరి కూడా సమర్పించవలసిందే. . నీ నుదిటిమీది…
-
డడింగ్స్టన్ … రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
కాకుల కా, కా, లతో పక్షుల కిలకిలలతో ఈ చిట్టడవి సన్నటి ఈ నీరెండలో ఆహ్లాదంగా ఉంది. దూరాన చర్చిలోనుండి ప్రార్థన తేలివస్తోంది కాని వాళ్ళు చిత్తమొచ్చినరీతిలో అది పాడుతున్నారు మేఘాలసందులలోనుండి జాలువారుతున్న బంగారు కిరణాలు సరసుమీది నునుతరగలపై తళతళలాడుతున్నాయి ఈ శిలలు కూడా ఒకదానికొకటి తమసామీప్యతకు సంతసిస్తున్నట్టు కనిపిస్తున్నాయి మరొకసారి నా మనసు ఉప్పొంగి ఉరకలేస్తూ ఆనందంతో పరవశిస్తోంది వెలుగునీడలు చేతి వేళ్లలా నా స్వరతంత్రులను మీటుతున్నాయి ప్రియతమా! నా ఊహగతాన్ని చిత్రిస్తోంది… క్రిందటిసారి నువ్వు…
-
ష్రాప్ షైర్ పచ్చని కొండలమీద రైల్లో …ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్
ష్రాప్ షైర్ పచ్చని కొండలలోనుండి రైలు పరిగెడుతోంది, ఆకాశపుటంచుల్నీ, ఊరు రూపురేఖలనీ మారుస్తూ; దూరంగా ఒక కొండశిఖరం కనుమరుగై, వెనక్కి మరలి పోయింది; ఎత్తుగా పొడుచుకొచ్చిన “క్లీ” కొండ కొన పశ్చిమదిక్కున నిర్మానుష్యమైనలోయలో కలిసిపోయింది నా చెయ్యి ఖాళీగా నా ముణుకుమీద ఉంది. నొప్పితో ఆ చెయ్యి ముణుకుమీద అలా ఉంది. ఆరోజు ఉదయం, ఊరు సగందాటేలోపు ఎన్ని నిజాయితీపరుల చేతులు దాన్ని తాకేయంటే అది మణికట్టునుండి ఊడిపోతుందేమోననిపించింది. నేనన్నాను: ఓ నా హస్తమా! మనం మనకు…