-
గడియారాలన్నీ ఆపేయండి…WH ఆడెన్. ఇంగ్లీష్-అమెరికను కవి
గడియారాలన్నీ ఆపేయండి. టెలిఫోన్లు మోగనివ్వకండి కుక్క అరవకుండా రసాలూరే బొమిక ఒకటి ఇవ్వండి పియానోలు మూసి, అట్టే చప్పుడుచెయ్యకుండా డోలు వాయిస్తూ శవపేటిక బయటకు తీసుకురండి, దుఃఖితులంతా వెనక నడవండి. . విమానాలు రోదిస్తూ నెత్తిమీద ఆకాశంలోచక్కర్లు కొట్టనీండి అలా తిరుగుతూ, అతని మరణ వార్తని గాలిలో లిఖించనీండి స్వేచ్ఛాపావురాల తెల్లని మెడలకు నల్లని సిల్కురిబ్బన్లు ముడివెయ్యండి రాకపోకలునియంత్రించే పోలీసుల్ని నల్ల చెయిజోళ్లు తొడుక్కోమనండి . అతనే నాకు తూరుపు, పడమర, ఉత్తరం, దక్షిణం అపరాహ్ణమైనా,…
-
ప్రయాస… వీరన్ కుట్టీ, మలయాళ కవి.
ఈ నీడ, ముందుకీ వెనక్కీ నడయాడుతూ తనరూపాన్ని పెంచుకుంటూ, కుంచించుకుంటూ పోవడం అదేదో కాలక్షేపానికి ఆడే వినోదక్రీడ కాదు. . అది, తను ఎల్లకాలమూ ఒకరి పాదాలక్రిందే పొర్లుతూ తన ఉనికి కోల్పోతున్నందుకు పడే దుఃఖాన్ని మరిచిపోడానికి చేసే ప్రయాస… . వీరన్ కుట్టీ, మలయాళ కవి . Veeran Kutty is a Lecturer at Government College, Madapally, Kerala. . The Effort . This is no trivial pastime, This…
-
కథలుగా చెప్పుకునే అడ్డంకులు… జాన్ మాంటగే, ఐరిష్ కవి.
. మనిద్దరి మధ్యా కథలుగా చెప్పుకునే అడ్డంకులన్నీ ఉన్నాయి ఊహకందని సుదీర్ఘమైన మైదానమూ… భయభ్రాంతుల్ని చేసే కొండల వరుసలూ… రాత్రల్లా విడువకుండా విసరికొడుతూ శాక్రమెంటోనీ, శాన్ జోక్విన్ నీ ముంచెత్తి రివ్వున ఈదురుగాలులతో తేలియాడిన హేమంతపు వానా… . పగలల్లా నిరీక్షిస్తూనే ఉన్నాను, స్టేషనుకీ, బారుకీ మధ్య భయం భయంగా తిరుగాడుతూ. మధ్యలో ఇంకో రైలు వెళ్ళడం చూసాను శాన్ ఫ్రాన్సిస్కో చీఫో, గోల్డెన్ గేటో తెలీదు గాని ముందుకి పొడుచుకొచ్చిన చక్రాలంట నీళ్ళుధారాపాతంగా కారుతూ… .…
-
సొంపులో ఉన్న సొగసు … Ben Jonson
. ఎప్పుడూ అలంకరించుకుని ఎప్పుడూ నీటుగా తయారై, పౌడరు రాసుకుని, సెంటు పూసుకుని, కళగా ఏదో విందుభోజనానికి వెళుతున్నట్టుంటావు. కళల అంతరార్థం గ్రహించశక్యంకాదనుకో! కానీ, సుందరీ! అంతా బాగుంటుందనీ, అంతా మంచేననీ అనుకోనవసరం లేదు. . ఏదీ ఒక సారి ఇటు చూడు, నీ ముఖం చూడనీ ఆ పొందికలోనే సౌందర్యం ఉంది! వేలాడుతున్న బట్టలూ, రేగిపోయిన జుత్తూ వంటి నిర్లక్ష్యం … కళలో చేసే ప్రయోగాలకంటే ఎక్కువగా నా దృష్టి ఆకర్హిస్తుంది. నిజమే. అయితే అది…
-
పొరపాట్లలో ఆనందం … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషుకవి.
. ధరించిన ఉడుపులలో తమాషా తికమకలు, మనలో రగిగించే కొంత కొంటెతనం . మన ఏకాగ్రతని భగ్నం చేసే భుజాలు దిగిపోయిన వస్త్రాలు . అక్కడక్కడ తప్పిపోయిన లేసు ఎర్రని జాకెట్టుకి కలిగించే ఆకర్షణ . మరిచిపోయిన ముంజేతి చొక్కామడతకి అటూ ఇటూ ఊగే అక్కడకట్టిన రిబ్బన్లు . గాలికి రెపరెపలాడే పరికిణీలో, చూసితీరాల్సిన జయకేతనపు విసురులు . నాగరికత ఉట్టిపడే నెక్ టై కట్టిన అతనే అశ్రధ్ధగా వదిలేసిన షూ లేసు . ఏ లోపంలేకుండా…
-
The Fifth Wall… Kalpana Rentala, Indian
(ఇది నా 500వ టపా. నేను ప్రారంభించినపుడుగాని, తర్వాతగాని ఇంతదూరం వస్తానని, రాగలనని అనుకోలేదు. చిత్రంగా, చదువుతున్నకొద్దీ చదవనివి ఎన్ని ఉన్నాయో తెలుస్తూ, కొత్తకొత్త మెరుపులతో, మలుపులతో కవిత్వమూ, కథలూ, ఉపన్యాసాలూ, వ్యాసాలూ, గీతాలూ ఒకటేమిటి అన్ని రకాల సాహిత్య ప్రక్రియలూ (ఒక్క నవల మినహాయిస్తే, ఎందుకంటే నాకు నవల చదవగలిగే ఓర్పూ, ఏకాగ్రతా లేవు) మనసుకి చెప్పలేనంత సంతృప్తిని కలిగిస్తున్నాయి. సాహిత్యం అదనంగా చాలా మంది మిత్రులని నాకు పరిచయం చేసింది కూడా. అందుకు నేను…
-
ఎనిమిదో గంట … ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఇంగ్లీషు కవి
. అతను నిలబడి వింటున్నాడు ఉదయపుహడావుడిలో ఉండే నగరానికి చర్చి గోపుర గడియారం ప్రతి పావుగంటకీ కొట్టే గంటలు… ఒకటి, రెండు, మూడు, నాలుగు బజారుకీ, ఇతరచోట్లకీ అది వాళ్లందరినీ తరుముతోంది. . చేతులు వెనక్కి విరిచికట్టి, ఉరితాడు బిగించి, అతని చివరిక్షణం ఆసన్నమవుతుంటే ఆ గంటలు అతను లెక్కపెడుతూ తన దురదృష్టాన్ని నిందించుకుంటున్నాడు; చర్చి గోపుర గడియారం తనశక్తినంతా కూడదీసుకుని… గంటకొట్టింది. . ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, 26 March 1859 – 30 April 1936…
-
పోలికలు … కాల్పెట్ట నారాయణన్, మలయాళ కవి
మొదటిసారి మా యింటికి వచ్చిన స్నేహితుడు గోడమీది నా పాత ఫొటో చూసి “మీ తమ్ముడా?” అని అడిగేడు. అడిగి మళ్ళీ, “అవును! మీ తమ్ముడే. అవే చూపులూ అదే చెదిరిపోయిన జుత్తూ కళ్ళుమాత్రం అంతలోతుగా లేవు. తీపి జ్ఞాపకాలు అంత త్వరగా విడిచిపెట్టవు. నీకంటే బాగా కనిపిస్తున్నాడు” అన్నాడు నా మిత్రుడు. ఆత్మవిశ్వాసం అతను పనులన్నీ చకచకా చెయ్యగలిగేట్టు చేసింది. అతనికి బంధుప్రీతి ఎక్కువే. ఏకాంతంలోకూడా అతనెన్నడూ ఒంటరిగా ఉండలేదు. మరొకసారి దీక్షగా ఫొటోలోకి పరికించి…
-
A Wintry Dawn … Vinnakota Ravi Sankar , Indian Poet
(A Happy Halloween to all friends for whom it matters) . Bright is the sunshine yet, there is little warmth in it. It seems even the Sun shivers under the cold. The pleasure of seeing the night off doesn’t last a wee longer. The day looks like the sorceress Cold has only donned new…
-
అద్దం.. Spike Milligan, English-Irish Poet
ఆమని మొలక లాంటి లేతపిల్ల ఆనందంతో తనకురులు దువ్వుకుంటోంది. అద్దం “నువ్వు చాలా అందవికారంగా ఉన్నావు,” అంది. అయితేనేం, ఆమె పెదవులమీద గువ్వలాంటి రహస్యపు చిరుదరహాస సౌందర్యం నాట్యం చేస్తోంది… ఎందుకంటే, పొద్దున్నే ఆ అంధబాలుడు “నువ్వు చాలా అందంగా ఉన్నావు” అని అనలేదూ? . స్పైక్ మిలిగన్, ఇంగ్లీషు-ఐరిష్ కవీ, రచయితా, సంగీతకారుడూ, నటుడూ, నాటకకర్తా. ఈ కవితలోని సౌందర్యం: యవ్వనప్రాదుర్భావంలో అందరికీ తెలియకుండానే ప్రేమభావనలు అంకురిస్తాయి. అవి అందచందాలతో నిమిత్తం లేనివి. నిజానికి అందం…