అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 28, 2012

    నిష్క్రమిస్తున్న అతిథి … జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ, అమెరికను కవి

    జీవితమూ, ప్రేమా ఎంత మనోరంజకులైన గృహస్థులు! నేను ఎంతో అయిష్టంగా, అయినా సంతోషంగానే మరలుతున్నాను. ఈ చరమ ఘడియలలో కూడా వాళ్ళ ఉదాత్తమైన అతిథిమర్యాదలలో నాకు ఏమాత్రం లోటు రానీయలేదు. కనుక ఆనందం నిండిన ముఖంతో నిండు కృతజ్ఞతతో వాళ్ళ చేతులు నా చేతిలోకి తీసుకుని ఒత్తుతూ, “మనం చాలా చక్కని సమయం గడపగలిగాం. ఎంతో కృతజ్ఞుడిని, శుభరాత్రి,” అని చెప్పడానికి ఇంకా వేచి ఉన్నాను. . జేమ్స్  వ్హిట్ కూంబ్ రైలీ October 7, 1849…

  • నవంబర్ 27, 2012

    మంచు మనిషి … వేలెస్ స్టీవెన్స్, అమెరికను కవి

    గడ్డకట్టించే చలిగురించీ, పైన్ చెట్టుకొమ్మలమీద పేరుకున్న మంచు గురించీ అవగాహనకావాలంటే, శీతాకాలం గురించి తెలియాలి; అంతే కాదు, జూనిపర్ లు మంచులో మత్తుగాతూలడం చూడాలన్నా జనవరి సూర్యుడి వెలుగులో దూరంగా స్ప్రూస్ చెట్ల నిగనిగలు చూడాలన్నా చాలాకాలం చలిలో మగ్గి ఉండి ఉండాలి; శీతగాలికోతపెట్టేహోరు అయితే చెప్పనలవికాదు. ఆ ప్రదేశాన్నంతా ఆవరించి, ఉన్న ఆ నాలుగు ఆకుల చప్పుడుతప్ప వేరుచప్పుడు అక్కడవినబడదు; ఆ దిగంబర ప్రకృతిలో గిరికీలుకొట్టే గాలి అదే; ఆ మంచులో, తనమాట వినేవాళ్ళు ఎవరూ…

  • నవంబర్ 26, 2012

    నివురుగప్పిన జీవితం…ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికన్ కవయిత్రి

    . నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు… ఇపుడిక అన్ని రోజులూ ఒకటే, తినకా తప్పదు, నిద్రపోకా తప్పదు… జీవితమంతా రాత్రైపోతే  బాగుణ్ణు… అబ్బా! రాత్రల్లా మేలుకుని గంటలు ఒకొక్కటీ సాగుతూ గడుస్తుంటే… తెలతెలవారుతుంటే, మళ్ళీ ఉదయం అయితే బాగుణ్ణు అనిపిస్తుంది. . నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు… నాకేం చెయ్యాలో తోచడం లేదు, ఇదనీ, అదనీ, మీరేది చెయ్యమని చెప్పినా అన్నీ నాకు ఒకటే, నేను ప్రారంభించిన ఏ పనీ పూర్తిచెయ్యలేకపోతున్నాను నాకు కనిపిస్తున్నంతవరకు, దేనివల్లా ఏమీ…

  • నవంబర్ 25, 2012

    నేను మృత్యువుకోసం ఆగలేను కాబట్టి… ఎమిలీ డికిన్సన్

    నేను మృత్యువుకోసం ఆగలేను కాబట్టి, పాపం, తనే నా కోసం ఆగేడు. ఆ బగ్గీలో కేవలం మేమిద్దరమూ, అనంతత్వమూ… అంతే! . మేము నెమ్మదిగా వెళ్తున్నాం, అతనికి తొందరంటే ఏమిటో తెలీదు. అతని మర్యాద చూసి, నా శ్రమనీ ఖాళీసమయాన్నీ ప్రక్కనబెట్టవలసి వచ్చింది. . మేము స్కూలు పక్కనుండి వెళ్ళేము, అక్కడ పిల్లలు విరామసమయంలో ఆటస్థలంలో ఆడుకుంటున్నారు. పంటతో కళ్లుచెదిరిపోయే పొలాలపక్కనుండివెళ్ళేము మేము అస్తమిస్తున్న సూర్యుడినికూడా దాటేము. . నిజానికి, అతనే మమ్మల్ని దాటివెళ్ళేడు సాలెపట్టుమీద పేరుకున్న…

  • నవంబర్ 24, 2012

    ప్రకృతీ – వికృతీ … జేమ్స్ సిమ్మన్స్, ఐరిష్ కవి.

    . ఇరవై అడుగులదూరం నుండి, ఒకప్పటి నా ప్రియురాలు కారు తాళం వెయ్యడం చూశాను. చెయ్యి ఊపి, తను నవ్వింది,ఇప్పటికీ అంత అందంగా,ఇరవై ఏళ్ళ పిల్లలా. . గోధుమరంగు జుత్తు తన తలమీద ఇప్పటికీ సూర్యోదయంలా వెల్లివిరుస్తోంది ఆమె నవ్వు, తను ఎంతమామూలువిషయం చెప్పినా నాకు చిరునవ్వు తెప్పిస్తూ ఉండేది. . కానీ ఇరవై ఏళ్ళు గడిచిపోయేయి. చర్మము వేగం చెడిపోయే వస్తువాయె; వ్యాయామాలూ, ఆహార నియమాలూ, సౌందర్య పోషకాలూ సరిపోతాయా . ఆ సూక్ష్మముఖకండరాలని కాపాడటానికి?…

  • నవంబర్ 23, 2012

    Begum Akhtar (Part 2) … Samala Sadasiva, Indian

    . The experience of cognoscente Kishan Sing Chavda is worth mentioning. He was then working as Diwan with Maharaja of Nilam Nagar. It was a common practice those days for the native rulers having some work with the Viceroy to keep him in good humor, and stay close to Viceroy. Calcutta in December is delectable. So,…

  • నవంబర్ 22, 2012

    Begum Akhtar (Part 1) … Samala Sadasiva

    మతాన్నీ, విశ్వాసాల్నీ జీవనమార్గంగా అనువదించుకుని, హిందూ-ముస్లిం సఖ్యతకూ, పాలూ నీళ్లలా కలగలిసిన సంస్కృతీ వారసత్వాలకు నిలువెత్తు నిదర్శనాలుగా, మనకు మార్గదర్శకులుగా  మనకళ్ళెదుటే ఉదాత్తమైన వ్యక్తిత్వాల్ని కనబరుస్తూ,సహజీవనాన్ని సాగించిన అద్భుతమైన వ్యక్తులు కొద్దికాలంక్రిందట ఈ నేలమీద నడిచేరు.  సంగీతమూ, సాహిత్యమూ భాషా ఒక మతానికో ప్రాంతానికో చెందినవని కాకుండా, అవి ఈ దేశ సంపదగా భావించి వాటిలోని స్వారస్యాన్ని గ్రహించి ఆనందించిన ఒక  జీవన ప్రక్రియ ఈ గడ్దమీద నిలిచింది. అటువంటి సంఘీభావం మధ్య కొయ్యలు దిగ్గొట్టి వేరుచేసిన…

  • నవంబర్ 21, 2012

    పెంపుడుపిల్లి స్మృతికి… హోర్షే లూయీ బోర్షెస్ , అర్జెంటీనా కవి

    . నీకున్న నిశ్శబ్దపు ముసుగు అద్దాలకి కూడా ఉండదు తొలిసంధ్యవేకువకి కూడ నీపాటి రహస్యోదయం లేదు, వెన్నెల వెలుగులో, మేము దూరం నుండి మాత్రమే రహస్యంగా కనిపెట్టగలిగిన చిరుతవి నువ్వు. .  ఏ దైవేచ్ఛా పరికల్పనో తెలీదుగాని, మేమెంత వెంటాడినా నిన్ను అందుకోలేము; భాగీరథి కన్నా, సూర్యాస్తమయంకన్నా సుదూరంగా నీ ఏకాంతం నీది, నీ రహస్యం నీది. .  చెయిజాచి అందించిన నా క్షణమాత్ర లాలనని నీ వెన్ను అంగీకరించింది; నువ్వు కనికరించావు, నాటినుండి అనునిత్యం ఈ…

  • నవంబర్ 20, 2012

    సీలియా కి ప్రేమతో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి

    . నీకు అంగీకారమైతే, నను నీ చూపులతో సేవించు, ప్రతిగా, నేను నా కళ్లతో ప్రమాణం చేస్తాను; పోనీ,ఒక్క ముద్దైనా కప్పుమీద గుర్తుగా విడిచిపో, ఇక జీవితంలో మద్యం జోలికి వెళ్ళనేవెళ్ళను. మనసులో చెలరేగుతున్న దాహార్తి తీరడానికి దివ్యసుధలను కోరుకుంటోంది. కానీ, భగవంతుడే స్వయంగా అమృతాన్ని అందించినా నీకు బదులుగా అమరత్వాన్ని స్వీకరించలేను. . ఈ మధ్యనే, గులాబీలమాల ఒకటి పంపించాను, దానితో నిన్నేదో సత్కరిద్దామని కాదు; అక్కడయితే తను వసి వాడదని దానికి ఒక ఆశ్వాసనను…

  • నవంబర్ 19, 2012

    ధూళికణానికి… ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

    . కంటికి కనరాని ఓ చిన్ని వ్యోమగామీ! ఒక సన్నని గాలితీగకు వేలాడుతూ, సూర్యకిరణాలమీద తేలియాడే చైతన్య అణుపదార్థమా! నీ గాలివాటు ప్రయాణానికి గమ్యం ఏది? ఏ ఆలోచనతో నువ్వు ఈ ఈథర్ లో నీ సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టావు? కంటిచూపుని ఎగతాళిచెయ్యడానికా? పాపం! దట్టమైన నీలిమేఘాల మేలిముసుగు నిను దాచేలోగానే వెంటాడే సుడిగాలి నీ ఖగోళయానానికి తెరదించుతుందే. అయ్యో! అచ్చం అలాగే, ఊహాకల్పిత పసిడితీగెలమీద ఆశల ఊపిరులూదే బూటకపుముఖస్తుతులకు పొంగిపోయి ఏడుపొరల ఇంద్రధనుస్సులు తన కళ్ళలో…

←మునుపటి పుట
1 … 202 203 204 205 206 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు