-
సానెట్ LXII … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
జీవితంలో విఫలమై, నిరాసక్తతో నే నలా దేశాలు తిరుగుతూ మారుతున్న స్థలంతో కేవలం వేదనలలోనే మార్పు గమనించేను; నేను ఎంతకాలంనుండో వెతుకుతున్న ప్రశాంతతను వా రనుభవిస్తూ ఆ పల్లె శ్రామికులు కలతలేని నిదురలో హాయిగా విశ్రమిస్తున్నారు! ఊరు ఇప్పుడు పూర్తిగా మాటుమణిగింది; చూరు దిగువగా ఉన్న ఆ తాటాకు గుడిశ కిటికీలోంచి చలికాచుకుందికి వేసుకున్న నెగళ్ళు మంటతగ్గి బుసి ఆరుతున్నాయి; పాలిపోయిన చంద్రకిరణాలు మెరుస్తున్న మంచుమీద పడి దానికి కొత్త సొబగు ఇస్తున్నాయి. గడ్డకట్టుకుపోతున్న ఈ రాత్రి,…
-
జ్ఞానోదయం .. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
అవి వసంతకాలపు తొలిరాత్రులు హేమంతపు మత్తు నిదర ఇంకా వదల్లేదు మా చుట్టూ ఉన్న నీడలూ, గాలీ మేము మాట్లాడుకోని మాటలకి చెవులురిక్కిస్తున్నాయి. పది సంవత్సరాలు దొర్లిపోయాయి గాని వసంతం ఇప్పుడూ అప్పటంతవాడిగానే ఉంది మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తే అప్పుడు చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తాం ఎదురుచూసిన వసంతం అయితే ఎన్నడూ రాలేదు కాని, అదేమిటో తెలుసుకోగలిగినంత జీవితం గడిచిపోయింది మనకి లేనిది ఎప్పుడూ లేకుండానే మిగిలిపోతుంది, మనకున్న వస్తువుల్నే మనం పోగొట్టుకునేది. . . సారా…
-
మరణించిన పిదప … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
. అతను నేను నిద్రిస్తున్నానేమో ననీ, వినిపించదనుకునీ నా మీదకి వాలి, “అయ్యో పాపం, చిన్న పిల్ల” అనడం విన్నాను. తర్వాత గాఢమైన నిశ్శబ్దం, నాకు అర్థమయింది అతను రోదిస్తున్నాడని. అతను తెరని తొలగించడంగాని, నా ముఖం మీది ముసుగు తియ్యడం గాని, నా చేయి తన చేతిలోకి తీసుకోవడం గాని, నా తలక్రింద ఉంచిన తలగడ సవరించడం గాని చెయ్యలేదు. అతను నేను బ్రతికుండగా ప్రేమించలేదు; కాని మరణించిన పిదప నా గురించి జాలి పడుతున్నాడు;…
-
పరాయీ!… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి
. అలా పక్కనుండి నడిచిపోయే పరాయీ! నీకు తెలీదు నే నెంత ఆశగా నీకోసం వెతుకుతున్నానో, నే నెదురుచూస్తున్న పురుషుడు, లేదా స్త్రీ, నువ్వే కావచ్చు, (నా కది ఒక కలలా అనిపిస్తుంటుంది) నే నెక్కడో నీతోపాటు ఆనందంగా జీవితం గడిపేను, ఒకరికొకరు తారసపడి కనుమరుగవగానే, లీలగా అంతాగుర్తుకువస్తున్నట్టనిపిస్తుంది, నువ్వు నా ఈడు బాలుడివో, బాలికవో, వాత్సల్యంతో, నిష్కల్మషంగా, యుక్తవయసుకి నాతోపాటే ఎదిగావునువ్వు మనిద్దరం కలిసే తిన్నాం, కలిసే పడుక్కున్నాం— నీ శరీరం నీదీ, నా దేహం…
-
సుఖమయజీవితాన్ని సాధించే మార్గాలు… ఎర్ల్ ఆఫ్ సరే, ఇంగ్లీషు కవి
. ఓ మార్షల్! సుఖమయమైన జీవితానికి కావలసినవి ఎవో నేను కనుక్కున్నాను: బాధపడి కూడబెట్టినది గాక, దానంచేసిన సంపదా, ప్రశాంత చిత్తమనే సారవంతమైన నేలా ఈర్ష్యా అసూయలులేని సమ్యక్ దృష్టి పాలకుడూ కాని, పాలితుడూ గాని స్వేచ్ఛా, ఏ రోగమూ లేని ఆరోగ్య జీవనమూ, వంశాన్ని కొనసాగించే సంతానమూ నిస్సారము కాని మితమైన ఆహారమూ నిరాడంబరతతో కూడిన నిజమైన జ్ఞానమూ ఏ చీకూ చింతలూ లేని రాత్రీ, అప్పుడు వివేకాన్నికోల్పోకుండా చేసే మద్యపానమూ వాదోపవాదాలు చేయని విశ్వాసమైన…
-
వినతి… ఎడ్విన్ మార్ఖాం, అమెరికను కవి
తండ్రీ! కొత్తగా మొలకెత్తుతున్న గడ్డిపరకలపై తేల్చితేల్చి ఎలా నడవాలో నాకు బోధించు; క్రూరమైన ఈ ప్రపంచం చేసే గాయాలని రాయిలా తట్టుకోగల ఆత్మనిబ్బరాన్ని ప్రసాదించు; కానీ, ఈ మనసునిమాత్రం నీ శక్తితో నిలబెట్టి, పువ్వుల్లా నిరాడంబరంగా ఉండేలా అనుగ్రహించు; ఆర్ద్రత నిండుకున్న ఈ హృదయకలశాన్ని నిండనీ ఎర్రని పాపీ పువ్వుల్లా తలెత్తి ఎదురుచూస్తూ; జీవితం దాని ఔన్నత్యాన్ని తేలికగా తీసుకోనీ పండిన పాపీలు వినమ్రంగా తలవాల్చుకున్నట్టు; మనసు నైరాశ్యంలో కూరుకుపోయినప్పుడూ, తొలిచిగురుతో తిరిగి బతుకుని ప్రారంభించినపుడూ చెట్లలా…
-
చీకట్లో నీడలు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి
. నాకు పాములన్నా, కప్పలన్నా, పురుగులన్నా, క్రిములన్నా, ఎలుకలన్నా ఆడపిల్లలు జడుసుకేనేవి ఏవన్నా భయం లేదు; అవెంతో మంచివి. నాకు తెలిసి నేను మహాధైర్యవంతుణ్ణి; అయితే పక్క ఎక్కాలంటేనే చికాకు ఎందుకంటే, నా ప్రార్థనలు చదువుకుని, దుప్పట్లో వెచ్చగా ఒదిగిపోగానే అమ్మ “కమ్మగా పడుక్కో” అని చెప్పి దీపం తీసేస్తుంది, రాత్రి చీకట్లో నన్నొకడినే పడుకోమని వదిలేస్తుంది, ఏవేవో ఆకారాలు కనిపిస్తుంటే. ఒక్కోసారి అవి గది మూలనీ, మరోసారి తలుపువెనకా నక్కి ఉంటాయి; ఇంకొక్కసారి గది మధ్యలో…
-
పెంబ్రోక్ కౌంటెస్ పై మృత్యుల్లేఖనం … బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి.
. ఆంగ్ల సాహిత్యంలో పేరుపడ్డ మృత్యుల్లేఖనాలలో ఇది ఒకటి. దీనికి సర్ ఐజాక్ న్యూటన్ స్మృతిలో అలెగ్జాండర్ పోప్ వ్రాసిన స్మృతిగీతం అంత పేరు ఉంది. . ఈ శోకభరమైన నల్లని సమాధిని పెంబ్రోక్ కన్న తల్లీ, సిడ్నీ సోదరీ, కవిత్వానికే ఉపాధి, నిద్రిస్తోంది. ఓ మృత్యువా! ఆమెవంటి చదువరీ సుందరీ, మనస్వినీ మరొకరిని నువ్వు బలిగొనేలోగా, కాలం నిన్ను శరంతో కూల్చుగాక! . బెన్ జాన్సన్ 11 June 1572 – 6 August 1637…
-
లెస్బియా రాసిన ఉత్తరం నుండి … డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
… కాబట్టి, కేటలస్ పోయినందుకు దేముడికి వెయ్యిదండాలు పెట్టు, ప్రియమైన నెచ్చెలీ, ఒక విషయం మాత్రం నీకు నే చెప్పదలుచుకున్నా ఇప్పుడైనా ఎప్పుడైనా, నీకు నచ్చినవాణ్ణి ఎవడినైనా ప్రేమించు, ఒక్క కవిగాడిని తప్ప. వాడెవడైనా ఒక్కటే, చిత్రంగా ప్రవర్తిస్తారు. . వాళ్ళకి కలహమైనా, ముద్దుపెట్టుకోవడమైనా ఒక్కటే, అవి వాళ్లకి పిల్లనగ్రోవిమీద పాడుకునే పాటల్లా ఉంటాయి. అయితే దాన్ని స్తుతిస్తూనో, లేకుంటే దీనికోసం విలపిస్తూనో ఉంటాడు; నా మట్టుకి నాకు, వ్యవహారజ్ఞానం ఉన్నవాడు కావాలి. . ఒకసారి ఆయన…
-
పురాతన వ్రాతప్రతి … ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్, అమెరికను కవి
. ఆకాశం … సూర్యుడూ, చంద్రుడూ తమ దినచర్య రాసుకునే అందమైన పాత తోలుపొరకాగితం. దాన్ని అంతటినీ చదవాలంటే, మీరు బృహస్పతి కంటే భాషాకోవిదులూ, కలలతల్లి కంటే భావుకులూ, యోగదృష్టిగలవారూ అయి ఉండాలి. కానీ, దాన్నిఅందుకున్న అనుభూతి పొందాలంటే మీరు దాని ప్రియ శిష్యులై ఉండాలి: ఆత్మీయ శిష్యుణ్ణి మించి, ఈ భూమిలాగో, సముద్రం లాగో నమ్మకమైన ఏకైక ఆంతరంగికులై నిలవాలి. . ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్. December 10, 1883 – August 14, 1966 అమెరికను కవి,…