-
చిత్రమైన సంఘటన … విష్ణుప్రసాద్ , మలయాళీ కవి
. దృశ్యం 1 లేదా మిలిండా కురియన్ అనే సేల్స్ గర్ల్ వస్త్ర దుకాణంలో ఎలా ఒంటరిగా మిగిలింది? లాఠీలుపట్టుకున్న పోలీసులనే చెత్తబుట్టలోకి ఎవరు ఊరు ఊరంతటినీ ఒంపీసింది? లేదా అకస్మాత్తుగా దుకాణాలు మూసెయ్యమని ఆజ్ఞాపించింది? ఇక్కడ ఊరంతా ఎలా నిర్మానుష్యం ఐందన్నది ప్రాథమికం మేధావులు ఎప్పటినుండో అంటూనే ఉన్నారు ఇక్కడ ప్రతీదీ కుట్రే అని. ఏది ఎమైనా, ఎలా జరిగినా మిలిండా కురియన్ మాత్రం Merriment Textiles లో అకస్మాత్తుగా ఒంటరిగా మిగిలిపోయింది.…
-
విషమ పరిస్థితి… ఓరిక్ గ్లెండే జాన్స్, అమెరికను కవి
కళ్ళు మిరిమిట్లు గొలిపేలా చంద్రుడు ఆకాశంలో మెరిస్తే నేమిటి ఆ చిట్టడవి చివర చెట్లగుబురులతో చుక్కలు దోబూచులాడితే నేమిటి? . తుప్పలునరికి,చదునుచేసీ కలుపుతీసీ మనిషి విత్తు నాటవలసిందే, దానికి రక్షణగా దడికట్టినపుడు హెచ్చరికగా తెల్లగీత గీయవలసిందే. . అందమైన వయిలెట్ పువ్వులగురించీ మనుషులు చేసే పనులు చెప్పడానికీ వానలా పెద్దచప్పుడు చేసుకుంటూ దేముడు వస్తేనేమిటి? . నా మెదడుకి పదునుపెడుతూ నా పాట్లు నే పడవలసిందే నాకు తెలిసిన అన్న మాటల్లోంచి ఒక సత్యాన్ని ఆవిష్కరించవలసిందే. .…
-
ఒక స్మృతి… ఏన్ బ్రాంటె, ఇంగ్లీషు కవయిత్రి
. నువ్వు వెళ్ళిపోయేవన్నది నిజం. మరెన్నడూ నీ తళుకునవ్వులు నా మనసు మురిపించవన్నదీ నిజం. నేను మాత్రం ఆ ప్రాచీన చర్చిద్వారం దాటి వెళ్ళొచ్చు నిన్ను మూసిన నేలమీదే అడుగులు వెయ్యొచ్చు. . ఆ చల్లని చలువరాతి పలకపై నిలుచుని… నాకు తెలిసిన మిక్కిలి హుషారైన వ్యక్తీ ఇకముందెన్నడూ చూడలేని దయార్ద్రహృదయమూ, క్రింద గడ్డకట్టుకుని ఉన్నాయే అని తలుచుకోవచ్చు. . నిన్నిక ఎన్నడూ కళ్ళతో చూడలేకపోయినా నిన్ను గతంలో చూడగలిగేనన్నది ఎంతో సంతృప్తి; నీ అనిత్యమైన జీవితం…
-
దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
ఓడలు రేవులో లంగరేసి ఉన్నాయి. సీగల్స్ వాటి స్థంబాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. నా ఆత్మ వాటిలాగే అశాంతిగా ఎద్రుచూస్తోంది ఎప్పుడెప్పుడు నక్షత్రసీమల్ని చేరుకుంటానా అని. . నాకు దేశాలు తిరగాలంటే ఎంత సరదానో! సముద్రమన్నా, నీలాకాశమన్నా చెప్పలేనంత ఇష్టం. కానీ, ఒక చిన్న సమాధిలో ఇలా కదలకుండా పడుక్కోడం ఎంత దయనీయమైన పరిస్థితి? . జో ఏకిన్స్ (30 October 1886 – 29 October 1958) అమెరికను కవయిత్రి. ఏ కవితకైనా మొదటి పాదాలూ, చివరి…
-
మధ్యంతరం … స్కడర్ మిడిల్టన్, అమెరికను కవి
నాకు అంత పెద్ద వయసు లేకపోయినా, నువ్వు చిన్నదానివని తెలుసుకోగలను. నన్ను చిగురాకు అని పిలుస్తారు నువ్వు ఇప్పుడే విరిసిన మొగ్గవి. . అదిగో కొమ్మ మీద ఆ రాక్షసి ఉందే, గొంగళి, అది నాపై ఒక పొర అల్లేలోగా నేను నీతో పాటే కొంతకాలం ఎదుగుతాను భ్రమర నాదం విని, మబ్బుల్ని తిలకిస్తాను. . స్కడర్ మిడిల్టన్ (Sept 9. 1888 – 1959) అమెరికను కవి. “Life is an interlude between two vast…
-
చిరంజీవి క్లియోపాత్రా… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
చిరంజీవి క్లియోపాత్రా, ఒకప్పుడు ఈజిప్టులో ఆరాధ్య దేవత ఈ దక్షిణాది* యువరాణి కన్నులు, సతత రాగరంజితాలు, పాపం, నేడు, వయసుడిగి, వరుగై, కళావిహీనమై ముద్దులొలికిన ఆమె నోరు నల్లని తారుముద్దతో మూయబడింది. . సమాధి-కొల్లరులు ఆమె చేతుల స్వర్ణాంగుళులు పెకలించేరు ఆమె గుండెలమీది పవిత్రచిహ్నాలను సైతం లక్ష్యపెట్టకుండా; ఆమె చుట్టూ ప్రశాంతంగా తిరుగుతున్న గబ్బిలాలను అదిలించేరు పాపం మహరాణి! ఆమె ఆత్మ ఎప్పుడో ప్రశాంతంగా ఉండేది, . చిర’కాల’ కాలగమనాన్ని పరిహసించడానికి, నేర్పుగా చుట్టి, లేపనాలు పూసి,…
-
సత్… గేథే, జర్మను కవి
ప్రకృతిలోని అన్ని మార్పులనీ ఏ మార్పూ లేని భగవంతుడు సృష్టించినట్టు, ఈ విశాలమైన కళాప్రపంచంలోనూ అంతే. అంతటా ఒకే అర్థం అంతర్లీనంగా గోచరిస్తుంది: . అదే సత్, ఆద్యంతరహితమైన మూలకారణం, అది సౌందర్యం నుండి తన ఆహార్యాన్ని స్వీకరించి కాలవాహినిలో ప్రవహిస్తూ, తరుణమై మనోజ్ఞతకి ప్రతీకగా నిలుస్తుంది, నిజం! . గేథే జర్మను కవి. . As all Nature’s thousand changes But one changeless God proclaim; So in Art’s wide kingdoms…
-
దేముడి సమాధానం … ఎలా వ్హీలర్ విల్కాక్స్, అమెరికను కవయిత్రి
ఒక సారి చాలా కష్టాలు పడుతూ, మంచంపట్టినపుడు, నా బాధగురించి దేముడితో మాటాడినట్టు కలగన్నాను; కలల సీమల్లో సహజంగా ఉండే ధైర్యంతో నాకు అన్యాయమూ, దయారహితమని అనిపించినవి మొరపెట్టుకున్నాను “స్వామీ! నేను పాదాలతో పాకురుతూన్నపుడు కూడా ప్రతి క్షణం నీనామం జపిస్తూ వేడుకున్నాను; అయినా నిష్ఫలం. నే నందుకోగల ఎత్తులకి లేవనెత్తడానికి ఏ చెయ్యీ ముందుకురాలేదు ఈ నిరాశలోనుండి కడతేరే మార్గం ఎవ్వరూ చూపించలేదు.” . అప్పుడు దేముడిలా బదులిచ్చాడు: “నేను నీకు మూడు వరాలిచ్చేను ఆలోచించగల…
-
గొర్రెల కాపరి (2)… ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి
నా చూపు సూర్యకాంత పుష్పంలా స్వచ్ఛంగా ఉంది నాకు రోడ్డు మీద వెళుతున్నప్పుడు కుడిపక్కకీ ఎడమపక్కకీ అప్పుడప్పుడు వెనక్కీ తిరిగి చూస్తూ నడవడము అలవాటు నేను ఎప్పుడు ఏదిచూసినా కొత్తగానూ, అంతకుమునుపెన్నడూ చూసినట్టనిపించదు నాకూ వస్తుపరిశీలినలో నేర్పుంది. అప్పుడే పుట్టిన పాపాయి తను నిజంగా పుట్టినట్టు తెలుసుకోగలిగితే ఎంత ఆశ్చర్యపడుతుందో అంతగా ఆశ్చర్యపడగలను. నాకు అనుక్షణమూ ఏదో వినూత్నలోకంలో అప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది . నాకు ఈ ప్రపంచం మిధ్య కాదు అప్పుడే విరిసిన పూవంత నిజం.…
-
దేశం అంటే ఏమిటి?… సర్ విలియం జోన్స్, వెల్ష్ కవి
దేశం అంటే ఏమిటి? ఆకాశానికి చేతులుచాచే భవంతులూ, ఎత్తైన సైనిక ప్రాకారాలూ, కోటగోడలూ, అగడ్తలూ కాదు; అందమైన మేడలూ, గోపురాలతో విర్రవీగే మహానగరాలూ, తుఫానులను కూడా ధిక్కరించి, బలమైన నావికాదళం కవాతుచేసే పొడుగైన సముద్రతీరాలూ, విశాలమైన ఓడరేవులూ కాదు; కుసంస్కారుల దిగజారుడుతనం, అహంకారానికి అత్తరులద్దే చుక్కలు పొదిగినట్టు మెరిసే రాజదర్బారులూ కాదు. . కాదు, కాదు, కాదు: ఏ మనుషులు… ఏ మేధావులు అడవుల్లో, కొండ గుహల్లో, చెట్టుతొర్రల్లో అనాగరికంగా బ్రతికిన మనిషికంటే చాలా రెట్లు శక్తిమంతులో,…