అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 18, 2013

    గాఢ హేమంతంలో … ఏమీ లోవెల్, అమెరికను

    ఇష్టుడా! మనిద్దరం తోటలోపూసే పుష్పాలవంటి వాళ్ళమి. ఒకరు ఊదారంగయితే రెండోవారు ఎరుపు. ఒంటరిగా ఓమూల వాడిపోయిన ఈ తోటలో . ఈ వనంలోని మొక్కలన్నీ పీకి కొత్తవి వేసేరు ఒక ఎండిపోయిన ఆకు రెండోదానిని రాసుకుంటూ నాటి పూరేకుల సంగీతం ప్రతిధ్వనితోంది. ఇప్పుడు నువ్వూ నేనే దానికి తలలూచేది. . మనతో ఎన్నో కలిసి ఉండేవి; అన్నీ నేడు వాడిపోయేయి. ఇప్పుడు మనిద్దరమే ఎరుపూ ఊదారంగుల్లో మిగిలున్నాం; మంచు కడిగిన సుప్రభాతవేళల్లో మనిద్దరమే సూర్యుడు ఎదుగుతుంటే రాగరంజితులమై…

  • మార్చి 17, 2013

    ఈ యుగపు ఆర్తి .. హేమ్లిన్ గార్లాండ్, అమెరికను

     . నేను న్యాయంగా ప్రవర్తించాలంటే ఏమిటి చెయ్యాలి? నేను సంపాదనకి ఏ మార్గాన్ని అవలంబించాలి? ఈ ప్రపంచానికీ— ఇక్కడి దుఃఖానికి ఏమిటి చెయ్యాలి? ఈ సంక్లిష్ట కూడలిలో సరియైన దారి చూపించు (ప్రభూ!) నా తెలితక్కువదనం నుండీ, దుఃఖము నుండీ కడతేర్చి బాధని ఎలా నివారించాలో ఉపదేశించు! నా వేలికున్న ఉంగరాన్ని ఊడబెరికి గుమ్మం ముందర నిలబడ్డ యాచకునికి ఇద్దునా? నా దగ్గర ఉన్న ప్రతి విలువైన వస్తువునీ తీసి పేదల చేతులలో ఉంచుదునా? నేను న్యాయబద్ధంగా…

  • మార్చి 16, 2013

    నేను పాడుకుంటూ వస్తా… జేకబ్ అస్లాండర్, అమెరికను

    . వానవెలిసిన తర్వాత కోసిన పచ్చిక గుప్పుమని వేసే కమ్మని వాసనలనీ; పొట్టమీదున్న చేలోని గింజలమీంచి సుతారంగా జారే చల్లటి నీటిబిందువుల అలలనీ; మైదానం మీద తేలిపోతూ, ముంచెత్తుతున్న వెలుగునీ పాడుకుంటూవస్తాను. . శరత్కాలంలో విరగబూచిన పువ్వుల్నీ; లోయలలో ప్రతిధ్వనించే పిలుపులకి గుంపులు గుంపులుగా ఎగిరే పిచ్చుకలనీ; ఆ పిచ్చుకలని చెల్లాచెదరుచేసే పడమటి గాలినీ ఆలపిస్తూ వస్తాను; . డిసెంబరు నెలలో కత్తిలాకోసే పదునైన తెల్లని మంచునీ; నివురుగప్పుతున్న సూర్యాస్తమయవేళ, రివ్వుమని వీచే విసురుగాలికి  ఉక్కులా పారే…

  • మార్చి 15, 2013

    వీడ్కోలు… వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను

    నేను మరణించి రేపు పూచే గులాబికి ఎరుపునౌతానన్న మనసునుండిన ఆలోచన కంటే మించినది మరొకటి ఎక్కడుంది. . ఈమాత్రానికే సంతసించే నా మనసుకి ఉన్నదొక్కటే విచారం మెల్లిమెల్లిగా ఈ మట్టి నన్ను క్రిందకి తొక్కిపెడుతుందని. . వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్ (1876-1959) అమెరికను . . The Farewell . What is more beautiful     Than thought, soul-fed, That I may be the crimson of a rose     When…

  • మార్చి 14, 2013

    ఒకదాని వెనక ఒకటి… ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, బ్రిటిష్

    ఒకదాని వెనక ఒకటి ఇసకరేణువులు జారుతున్నై ఒకదాని వెనుక ఒకటి క్షణాలు రాలుతున్నై కొన్ని వస్తున్నై, కొన్ని పోతున్నై అన్నిటినీ పట్టుకుందికి ప్రాకులాడకు. ఒకదాని వెనుక ఒకటి నీ బాధ్యతలు ఎదురుచూస్తునై ప్రతిదానిమీద నీ పూర్తి శక్తియుక్తులు వినియోగించు భవిష్యత్తుమీది ఏ కలలూ నిన్ను ఉల్లాసపరచనీకు ముందుగా ప్రతి ఒక్కటీ నీకేది నేర్పగలదో తెలుసుకో ఒకదాని వెనుక ఒకటి స్వర్గం నుండి ఆశీస్సులు సుఖసంతోషాలుగా నీకు ఇక్కడకి పంపబడతాయి ఎప్పుడు వచ్చినా వాటిని తక్షణం స్వీకరించు అలాగే…

  • మార్చి 13, 2013

    తిరుగుబాటుదారు … జాన్ గోల్డ్ ఫ్లెచెర్, అమెరికను కవి

    అతని కళ్ళకి గంతలు కట్టండి పాదాల దగ్గర తుపాకులు ఓటమితో అంతిమ విషణ్ణ మృత్యుగీతాలాలపించనిండి . అతని శరీరం మీద దుప్పటి కప్పండి ఇక అది కదిలే పని లేదు; తనకోసం ప్రాణాలర్పించినవారి వల్ల సత్యం మరింత ధృఢంగా నిలబడుతుంది . అతనిపుడు తన స్వంత రహస్య స్థావరం చేరుకున్నాడు; అందులోకి చొరబడడానికి మనం సాహసిస్తే ప్రాణహీనమైన ఈ ముఖాన్ని చూసే అవకాశం ఉండదు . జాన్ గోల్డ్ ఫ్లెచెర్ (January 3, 1886 – May…

  • మార్చి 12, 2013

    The Sky… Prasuna, Telugu, Indian

    The sky is a great painter who draws upon herself umpteen self-portraits! To the sky tired of baby-sitting the Sun during the day, and the Moon at night, God shall permit a night off only on the new moon day. Yet, The sky shall not rest but loses herself in gossip gathering all stars about…

  • మార్చి 11, 2013

    విశ్వాత్మ… రూమీ, పెర్షియన్ కవి, సూఫీ తత్త్వవేత్త.

    ఈ మాటలు నేను ఇప్పుడు చెబుతున్నవి కావు, కాలాదినుండి వెలుగు తూలికతో రాసినవి. సత్యానికి రంగూ లేదు, వాసనా లేదు ఏ ఒకరి ప్రయాసలవల్లా, ప్రమాణాలవల్లా ఉత్పన్నమయేది, నిరూపించబడేదీ కాదు   నువ్విక్కడికి రప్పింపబడ్డావు గనుక నీకో స్వర్గ రహస్యం చెబుతాను విను: “ఎవ్వరేమి చెప్పినా, ఏమి రాసినా ఆ రాసింది నువ్వే… స్వయంగా నువ్వే! నువ్వే జీవితానికి వాహికవి; ఈ విశ్వానికి ఆత్మవి! సంచరిస్తున్నా, సమాధిలో ఉన్నా, వేదనలోనూ, నిస్పృహలోనూ నీ జీవిత పర్యంతమూ నీ…

  • మార్చి 10, 2013

    నేను శృంఖలాల బద్ధుణ్ణి… అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్, రష్యను

    ఓ గులాబి కన్నియా! నేను శృంఖలాల బద్ధుణ్ణి. అయినా, ఈ బంధాల కాపలాదారులను చూసి సిగ్గుపడను; దట్టమైన కొమ్మలగుబురులలో కోకిలకూడ బందీనే, ఆ రెక్కల రేడు వనవాణికవులలో కలికితురాయి; కంటికింపైన ఒక సొగసరి గులాబికి చూపు మరల్చలేని మధురమైన దాస్యం చేస్తూ… ఇంద్రియ నిగ్రహాలను సడలించగల చీకటి ముసుగు వివశతలో, ఆమెకై లలితమధురమైన కుహుకుహూ రాగాలాలపిస్తుంది… . అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ 6 June  1799 – 10 February 1837 రష్యను . . I am…

  • మార్చి 9, 2013

    నగరపు పై కప్పులు… ఛార్ల్స్ హేన్సన్ టౌన్, అమెరికను కవి

    ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! మీరేం దాస్తున్నారు? దుఃఖితుల్నీ, దుష్టుల్నీ, జ్వలిస్తున్న ప్రేమికుల్నీ, మేధావుల్నీ, మూర్ఖుల్నీ, దిక్కులేని దీనుల్నీ; ఇంటికప్పులు, ఇంటికప్పులు దాస్తున్నై చింతలూ, వంతలూ. .     ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! మీ రే పాపాలు చూస్తున్నారు? మీ మీదుగా ఆకాశంలో బొల్లిమబ్బులై కొట్టుకుపోతున్నై, క్రింద సంవేదనలూ, దుఃఖాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నై ఎప్పటిలా, పాతపాటే, జీవనపోరాటం కొనసాగించడానికి.    . ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! దౌర్భాగ్యులు, బందీలూ,  పేరుచెప్పాలంటే జాలేస్తుంది… వాళ్ల మానాల్ని కాపాడండి: చుక్కల్ని మరుగుపరచడానికే మిమ్మల్ని మనిషి నిర్మించాడు…

←మునుపటి పుట
1 … 191 192 193 194 195 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు