-
సానెట్ LXVII … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లండు.
. ఆకాశంలో నల్లమబ్బులు ఎగిరెగిరి పడుతున్నాయి, కమ్ముకొస్తున్నతుఫానుకి నేల భయంతో వణుకుతున్నట్టుంది; కేవలం నాలాంటి ఏ దిక్కూలేని వాళ్ళం మాత్రమే రివ్వున వీస్తున్న ఈ రొజ్జగాలి తాకిడికి తలఒగ్గి ఉన్నాం; నలుచెరగులా కూలుతున్నగోడలకి వెరచి, ఆకలేస్తున్నా గుడ్లగూబ తన సాయంత్రపు తిండి వేట విరమించుకుంది; దట్టమైన చిట్టడవిలో గుంటనక్కొకటి గుహలో దాక్కుని ఈ రాత్రి తుఫానుబారి నుండి తన్నుతాను కాపాడుకుంటోంది; కాని, నేను విసర్జించిన ఈ ప్రపంచానికి నన్ను కనపడనీని ఈ చీకటి నా మనసుకి ఎంతో…
-
తగువూ— వియోగమూ…యునిస్ టీచెన్, అమెరికను
. బాధతో ఎర్రబారిన కళ్ళతో, వలలో చిక్కిన జంతువులా నా వంక చూసేవు; తల తాటించేవు అట్నుంచి ఇటూ ఇట్నుంచి అటూ, నీగొంతుకని ఆ బాధ కోపంతోనూ భయంతోనూ మెలిపెట్టిందేమోనన్నట్లు. . అప్పుడు నువ్వు వెనుతిరిగి నన్ను వీడిపోయావు. తెలీని నిశ్చేష్టత ఏదో నన్నావహించి అలా నిలబడ్డాను నువ్వు తొడుక్కున్న వర్షపుకోటు గుండీలని సరిగ్గా పెట్టుకుంటే బాగుండునని మనసులో అనుకున్నాను. . నువ్వు వెళ్ళేదాకా అలా చూస్తూనే ఉన్నా. ఒక్కసారి నా కడపటి మాటలు బెదురుతూ, గాలివాటులోకలిసిపోయాయి.…
-
నే నేమీ కాను… ఎమిలీ డికిన్సన్, అమెరికను
నేనేమీ కాను… నేనొక అనామికను. మరి నువ్వెవరు? నువ్వు కూడా నాలాగే ఏమీ కావా? అలాగైతే మనమొక అనామకపు జంటమన్నమాట. ఈ విషయం ఎవరికీ చెప్పకు. నీకు తెలీదు, తెలిస్తే, వాళ్ళు మనల్ని వెలివేస్తారు. . ఏదో ఒకటవడం ఎంత నిస్సారంగా ఉంటుంది! ఇది కప్ప అని పోల్చుకున్నట్టు, జీవితాంతమూ, ఈ సారవంతమైన నేలలో ఏదో ఒకపేరుతో బతకడం ఎంత బహిరంగమైపోతుంది. . ఎమిలీ డికిన్సన్. అమెరికను ఎమిలీ డికిన్సన్ అజ్ఞాతంగా బ్రతకడం గురించి వ్రాయడంలో వింతలేదు.…
-
రసవాదం.. సారా టీజ్డేల్, అమెరికను
. తొలకరి వర్షానికి వసంతం ఒక బంగరు డెయిజీ తలని ఎత్తినట్టు బాధను పట్టుకునేదయితేనేం, నా మనసు, ఒక అందమైన పాత్రగా చేస్తాను వాటిమీద పడ్డ ప్రతి బిందువుకీ రంగువెయ్యడం నేను ప్రతి పువ్వునుండీ, ఆకునుండీ నేర్చుకుంటాను నిర్జీవమైన బాధాసవాన్ని మెరిసేబంగారుగా మలిచేవిద్య నేర్చుకుంటాను. సారా టీజ్డేల్ అమెరికను . . Alchemy I lift my heart as spring lifts up A yellow daisy to the rain; My heart will be…
-
A Surrealistic Painting… Aripirala Satya Prasad,Telugu, Indian
I sat up. I was still feeling drowsy. I rubbed my eyes to clear my vision and looked at the floor. There was a painting under my feet… On Cross… charcoal on tar road. It was just like the picture I drew some twenty years back. That it remained intact on the road was all…
-
Damayanti’s Daughter … P. Satyavathi, Telugu, Indian
I usually pull the window blinds down on Sundays to keep the Sun away. But my roommate Sneha, who gets up at six no matter whether it is Sunday or working day, and with old Hindi songs in the background cherishes reading every damn Telugu and English daily with its supplement leisurely sipping her coffee,…
-
ఉత్ప్రేరకం … సారా క్లెగ్ హార్న్ , అమెరికను
. ఎండా, గాలీ, వానా, చలీ ఎరగక స్వేచ్ఛగా పెరగడానికి అవకాశంలేక బలహీనంగా తన కొమ్మకే వాడి వాలిపోయిన ఒక బోన్సాయ్ మొక్కని చూసేను నేను. ఇంతలో ఒక మనిషి లోపలనుండి వచ్చి ఇలా అన్నాడు దానితో: “ఓ తెలివితక్కువ మొలకా! ఇక్కడే హాయిగా సంతృప్తిగా ఉండు! ఎప్పుడూ తడిగా ఉండే ఈ చోటూ, బూజులూ, గెత్తమూ నువ్వు పొడుగ్గా పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి. అదిగో, ఆ గోడమీద కనిపిస్తోందే, ఆ ఎండపొడదాకా పెరగడానికి సహాయపడతాయి.…
-
ఎవరో అనామక… జాన్ బానిస్టర్ టాబ్, అమెరికను
. ఎవరో అనామక… నిజానికి పేరెందుకు, వెచ్చగా, కొత్తగా సుగంధాలు వెదజల్లుతూ, వెలుగులీనే ఈ జ్వాల ప్రభవించిందని ఆ రహస్యాన్ని విప్పిచెప్పడానికి ? అలాగే, తన వచ్చిన పని ముగించుకుని, దైవం దానిని గమనించి, అనుగ్రహించేక, ఆ తనువుపై కీర్తిచంద్రిక ప్రకాశించేక, పేరు లేకపోతేనేం? ఏ పేరూ లేకపోతేనేం? (అలాగే, దైవం తనపని ముగించుకుని తన సృష్టిని ఒకసారి పరిశీలించి, తృప్తిచెందేక తన వైభవం ఆ బొమ్మలో ప్రకాశించేక పేరు లేకపోతే నేం? ఏ పేరూ లేకపోతే…
-
పొగత్రాగరాదు … కుఝుర్ విల్సన్, మలయాళం, భారతీయ కవి
1 . డాక్టరు హెచ్చరించాడు: “ఈ అలవాటు మీరు మానుకో పోతే, మీ లివరు చెడిపోతుంది.” “ఈ పువ్వు ఎప్పుడో రాలిపోయింది డాక్టర్!” అన్నాను నేను. “నువ్వీ అలవాటుకి బానిసవైపోతే, నువ్వు నాకు దక్కవు,” అంటుంది గ్రేసీ. “ఇప్పటికే నన్ను నే పోగొట్టుకున్నాను,” బదులిస్తాను నేను. తర్వాతవంతు నా కథక మిత్రుడిది “నిన్ను నేనొక పొగతాగే పాత్రగా చూడలేనురా!” “అసలు నాలాంటి హీరోని నీ కథలో ఉంచకుండా ఉంటే సరిపోయేది కదరా!” “చూడు, నీ పెదాలు ఎంత…
-
…..అప్పుడు నవ్వు… బెర్తా ఏడమ్స్ బేకస్, అమెరికను
నీకోసం ఒక దృఢమైన పెట్టె తయారుచేసుకో, అందులో ప్రతి భాగాన్నీ చాలా శ్రద్ధగా తీర్చిదిద్దు, నీ చేత్తో ఎంత దృఢంగా నేర్పుగా చెయ్యగలవో అంత దృఢంగా చేసి, అందులో నీ బాధలన్నీ అందులో దాచిపెట్టు. అందులోనే నీ గతించిన అపజయాల చరిత్ర దాచిపెట్టు; నువ్వు దిగమింగుకున్న ప్రతి చేదు అనుభవాన్నీ పడెయ్; నీ గుండె గాయం చేసిన సంఘటనలన్నీ అందులో వేసి మూసెయ్, ఇప్పుడు దాని మూతవేసి, మీద కూర్చుని మనసారా నవ్వుకో. మరెవ్వరికీ అందులో ఏముందో…