అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 1, 2020

    ఇంటికి ఫోను చేసినపుడు… జోయ్ – హార్యో, అమెరికను కవయిత్రి

    ఈ కవిత కరోనా నిబంధనల సడలింపు నేపథ్యంలో,  ప్రభుత్వాలు ఆల్కహాలు, సారాదుకాణాలకు అనుమతి ఇచ్చిన తర్వాత కొన్ని గ్రామాల్లోని పరిస్థితిని గుర్తు చేసింది. *** ఎమ్మా లీ ని వాళ్ళాయన వారాంతపు శలవుల్లో చితక బాదేడుట. కారణం ప్రభుత్వం అతని జీతాన్ని తొక్కిపెట్టింది తన తాగుడుకోసం అతను అప్పుచెయ్యవలసి వచ్చింది. ఏనా పనికి వారం రోజులు శలవు పెట్టవలసి వచ్చింది వాళ్ళ చిన్నబ్బాయికి సుస్తీ చేసింది. ఆమె అన్నది కదా, “ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది, కానీ, మొగుణ్ణి…

  • మే 30, 2020

    ఋతుచక్రం … తావో చిన్, చీనీ కవి

    ఋతుచక్రం … తావో చిన్, చీనీ కవి

    చంక్రమణం చేస్తున్న ఋతువులు స్వేచ్ఛగా పరిభ్రమిస్తున్నాయి. ప్రాభాత సమయపు అద్భుతమైన ప్రశాంతత నలుదెసలా ఆవరిస్తోంది వసంతఋతు సూచకములైన దుస్తులు ధరించి నేను తూరుపు పొలాలను కలయతిరుగుతున్నాను. హేమంతపు తుది మొయిళ్ళు పర్వతాగ్రాలను తుడిచిపోతున్నై. సాలెగూడువంటి సన్నని తెలిమంచు అకసాన్ని మరుగుపరుస్తోంది. ఇక కొద్దిరోజుల్లో, దక్షిణగాలి తగలడమే ఆలస్యం, పాలుపోసుకున్న గింజ  రెక్కలు అలలుగా విచ్చుకుంటుంది. . తావో చిన్ (365 – 427) చీనీ కవి . Turning Seasons . Turning Seasons turning wildly…

  • మే 26, 2020

    ఒక సాయంవేళ … చియా తావో, చీనీ కవి

    చేతికర్రమీద ఆనుకుని చూస్తున్నా. మంచు స్పష్టంగా పేరుకుంటోంది. మేఘాల, సెలయేళ్ల దొంతరలు మేటువేస్తున్నట్టున్నాయి. కట్టెలుకొట్టి జీవించే వారు ఇంటిదారి పడుతున్నారు. కొద్దిసేపట్లో వాలైన కొండకొమ్ములలో చలిపట్టిన సూరీడు అస్తమించబోతున్నాడు. కొండల అంచున ఎండుగడ్డిమీదనుండి దావానలం వ్యాపిస్తున్నట్టు ఉంది. రాళ్ళ మీదనుండీ, చెట్లమీదనుండీ తెరలు తెరలుగా పొగమంచు పైకి లేస్తోంది కొండమీది ఆరామానికి మలుపుతిరుగుతున్న దారిలో సూర్యాస్తమయ సూచకంగా మ్రోగుతున్న ఘంట నినదిస్తోంది. . చియా తావో (779–843), చీనీ కవి . . Evening landscape, Clearing…

  • మే 20, 2020

    A Stale Roti… Abd Wahed, Telugu, Indian

    Hunger Is much a like loan taken on compound interest; The principal never gets cleared, You perpetually pay the interest … in installments. Forget just one EMI, It will hit you on your tummy Like the brute loan-collector. With mushrooming hotels, restaurants, And pizzas, burgers, and biryanis sold therein A stomach un-famished Can hardly relish…

  • మే 19, 2020

    సంధ్యాగమనము … జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

    సంధ్యాగమనము … జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

    నిశ్శబ్దాన్ని తోడు గొని, మత్తుగొలిపే చీకటి ముసుగు ప్రకృతి యెల్లెడలా అంచెలంచెలుగా పరచుకుంటూ  ప్రశాంతంగా అడుగు మోపింది సాయంసంధ్య; పశుపక్ష్యాదులు  తమ తమ పసరిక నెలవులకూ, గూళ్ళకూ చేరుకున్నాయి;  ఎటుజూసినా నిశ్శబ్దమే, వనప్రియ కోకిలారవం మినహా;  తను రాత్రంతా శృంగారగీతికల నాలపిస్తూనే ఉంది; నిశ్శబ్దపు గుండె పరవశించింది. ఇపు డాకసమునిండా ఇంద్రనీలమణులప్రభలే; ఆ నక్షత్రాతిథులమధ్య రేచుక్క అరుణిమతో జేగీయమానంగా వెలుగులీనుతోంది;   ఇంతలో మొయిలుదొంతరల తెరలుమాటుచేసి రాజోచిత దర్పంతో అసమాన తేజస్వియైన రేరాజు తొంగిచూసాడు. అంతే! అంతటి రజనీ…

  • మే 18, 2020

    జీవన కెరటం … ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇంగ్లీషు కవి

    జీవన కెరటం … ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇంగ్లీషు కవి

    కాన్రాడ్! నీ జీవితం ఏ మార్పూలేక విసుగ్గా ఉందంటావేమి? లంగరువేసి ఆలోచనలో పడ్డావెందుకు? అన్నిపక్కలా పాకిరిపోయిన ఈ కలుపు తగ్గేది కాదు, పైపెచ్చు, నీటివాలు అంతా అల్లుకుంటుంది. జీవిత నౌక చేరడానికి అందమైన తీరాలు అనేకం ఉన్నాయి కానీ, నువ్వెప్పుడూ ఒక్క తీరాన్నే చేరాలని ఆరాటపడుతుంటావు. ఆ తెడ్లని పైకిలాగి పడవకి అడ్డంగా గిరాటు వేశావేమి? ప్రయత్నం లేకుండా పడవ దానంతట అది వాలులోకి ప్రయాణించదు. ఈ జీవన కెరటాన్ని వెంటతరిమి ముందుకు తోసే అల ఉండదు.…

  • మే 12, 2020

    Munny… Ganapathiraju Atchutarama Raju, Telugu Indian

    Munny… Ganapathiraju Atchutarama Raju, Telugu Indian

    Kalaprapoorna Ganapathiraju Atchyutarama Raju ( 5th March 1924 -10th  June 2004) Poet, Short story writer, Dramatist, Lawyer and Educationalist About the Author: Sri Ganapathiraju Atchyutarama Raju (5.3.2024 – 10.6.2004) ) was a versicolored genius born in Kolimeru Village of East Godavari District of Andhra Pradesh. A Graduate in Arts from the Andhra University(1945) and Law from…

  • మే 6, 2020

    తోటమాలి … రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి

    ఈ రోజు రబీంద్రనాథ్ టాగోర్ 159 వ జన్మదిన వార్షికోత్సవం నీకు అదే ఇష్టమనిపితే నా పాటని ఇప్పుడే ఆపేస్తాను. నీ గుండె ఉద్వేగానికి లోనవుతోందంటే నీ ముఖంలోకి చూడడం విరమించుకుంటాను.  నడుస్తూ నడుస్తూ, ఆశ్చర్యంతో అడుగు తడబడితే   నేను ప్రక్కకి తొలగి, వేరే దారి చూసుకుంటాను. పూదండ గ్రుచ్చుతూ తడబడుతున్నావంటే అలికిడిలేని నీ తోటవంక కన్నెత్తైనా చూడను.  ఈ కొలనునీరు తుంటరిగా నీపైకి ఎగురుతోందంటే ఈ ఒడ్డున నా పడవ నడపడమే మానుకుంటాను. .…

  • మే 4, 2020

    వాలిపోతున్న బార్లీ పంటలా… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    Image Courtesy: https://www.farmingindia.in/barley-crop-cultivation/   సముద్రతలానికి దిగువన గాలివాటుకి తలవాల్చినా నిరంతరాయంగా కూని రాగాలు తీసుకునే బార్లీపంటలా తలను వాల్చినా, మళ్ళీ తలెత్తుకునే బార్లీపంటలా నేనుకూడా, బీటలువారకుండా ఈ బాధనుండి బయటపడతాను. నేనూ అలాగే, నెమ్మదిగా ప్రతి పగలూ, ప్రతిరాత్రీ దిగమింగుతున్న దుఃఖాన్ని గేయంగా మలుచుకుంటాను. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . . Like Barley Bending . Like barley bending In…

  • మే 3, 2020

    The Letter Unwritten… Asha Raju, Telugu Poet, India

    Whether you have condemned them as useless Or, forgotten while trimming your wares Some of your belongings Somehow, were left behind with me. Please take them away when you come this way! The sweet scents of your tresses Still linger over my shoulder; And your lukewarm breath Is tangible at the nape of my neck;…

←మునుపటి పుట
1 … 16 17 18 19 20 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు