-
ఓ భాగ్యమా! నువ్వెప్పుడూ ఇంతే… జేమ్స్ థామ్సన్, ఇంగ్లండు
ప్రేమకి రాజీలేని శత్రువువి! మేము రెండు మనసులు ఒకటిగా కలుస్తుంటే మధ్యలో దూరి వేరు చేస్తుంటావు. యవ్వనం, స్వారస్యమూ హరించుకుపోయి జీవితంలో జీవం ఉడిగిపోయేదాకా ఏ రోజుకి ఆ రోజు నిట్టూరుస్తూ జీవితాంతమూ నీకోసం అపేక్షించేలా చేస్తావు అయినా, నువ్వు చాలా చురుకుగా ఉంటూనే ఉంటావు ప్రేమ, ఆనందమూ లేని ప్రమాణాలను చేయిస్తూ మనసుల్ని సుఖాలతో వంచిస్తూ సున్నితమైనవాళ్ళని మొరటువాళ్ళకి జతగూరుస్తూ. ఆడంబరాలకీ, వేడుకలకీ, అర్థంలేని డంబాలకీ లొంగి, సహజమైన ఆనందాలకి దూరమయేలా చేస్తావు. బంగారపు శృంఖలాలను…
-
జపాను నుండి నూరు “టంకాలు”
ఆ కొండనెమలి పింఛము చాలా నిడివైనది అది ఎగురుతుంటే క్రిందకి ఇంకా సాగుతుంది. అంతకంటే నిడివిగా కనిపిస్తోంది నన్ను నా బాధలకు ఒంటరిగా వదిలేస్తూ ఈ అంతుకనిపించని చీకటి రాత్రి. . కకి నొ మొటొ కవి గురించి గాథ: ఈ కవి జపాను భాషలో కకి అనిపిలవబడే తియ్యని పండ్లచెట్టు మొదల్లో దొరికేడట పెంచుకున్న తల్లి ‘అబయే’ కి. ఇతను క్రీ.శ. 697-707 వరకు పరిపాలించిన మొమ్ము చక్రవర్తికి పరిచారకుడుగా ఉండేవాడు. ఇతను ప్రాచీన జపనీస్ కవిత్వంలో…
-
కిటికీ దగ్గర… పాల్ ఎలూర్, ఫ్రెంచి కవి
మనలో ఉత్తములైన వారికి కూడా భద్రతాభావాన్ని కలుగజేసే నిరాశావాదం మీద అంత ఖచ్చితమైన అభిప్రాయముండేది కాదు నాకు. నా మిత్రులు నన్ను చూసి పరిహసించిన రోజులున్నాయి. నే నెన్నడూ మాటలమీద అంత పట్టున్నవాడిని కాను. ఎందుకో, ఓ రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత, చెప్పదలుచుకున్నది సరిగా చెప్పిన పేరూ లేదు నాకు, దానికి కారణం చాలా సార్లు చెప్పడానికి ఏమీలేకపోవడమూ ఏదో చెప్పాల్సి రావడం, ఎవరూ వినకూడదనుకోవడమూ. నా జీవితం ఒకే ఒక దారప్పోగుకి వేలాడుతోంది. నాకేమీ అర్థం…
-
మహావృక్షము… ఏన్ ఫించ్, వించిల్సీ రాణి, ఇంగ్లండు
అద్భుతమైన ఓ వృక్షరాజమా!ఇంత చక్కని నీడనిచ్చే నీకు ప్రత్యుపకారం చెయ్యడం న్యాయం; నేను ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలి నీకు, నీ చల్లని ఛాయనందుకున్నందుకు. నువ్వు పక్షులకి ఆశ్రయం కల్పిస్తున్నావంటే ప్రతిగా చక్కని సంగీతాన్ని తిరిగి వినిపిస్తున్నాయి; తుఫానులు విసుగెత్తి మరలే వరకూ బాటసారులు నీ అండన తలదాచుకున్నారంటే ఆ సమయమంతా; వాళ్ళు స్తుతిస్తూ గడుపుతారు నిన్నూ, నీ రక్షణకవచాన్నీ; పాపం పశుల కాపరి ఎండకి తాళలేక నీ నీడ చేరినా నీ ఆకుల కదలికలకి అనుగుణంగా వేణువూదుతుంటాడు;…
-
అతిథి .. ఆల్బర్ట్ కామూ
భారతీయులందరికీ 67వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. సెరెన్ కీర్కెగార్డ్ (1813-55) అనే డేనిష్ తత్త్వవేత్త రచనలు ఆధారంగా ప్రారంభమైన ఒక తాత్త్విక సిద్ధాంతం, నేడు “అస్తిత్వవాదం”గా ప్రచారంలో ఉంది. జర్మన్ తత్త్వవేత్త ఫ్రీడ్రిక్ నీచ (‘నీచ’ సరైన ఉచ్చారణే!)(Friedrich Nietzsche), ఫ్రెంచి తత్త్వవేత్త జఁపాల్ సార్‌ట్రె (Jean Paul Sartre) ఈ వాదాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. కీర్కెగార్డ్ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి తనజీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చుకుని, అటువంటి జీవితాన్ని నిజాయితీగానూ, నిష్టగానూ జీవించడంలో…
-
యామినీ గీతం… విలియం రాస్కోథేయర్, అమెరికను కవి
అనంత శక్తిమయివై, విశ్వపరీవ్యాప్తమై, అపారనీరవాన్ని మోసే యామినీ! మనుషి ఏనాటికైనా సాధ్యపడితే, నీవల్లే దైవం పరిమితి తెలుసుకుంటారు. అహంకారియైన సూర్యుడు అసూయతో తనముఖాన్ని చాటుచేసుకుంటున్నాడు లక్షలసూర్యుల్నీ, పాలపుంతనీ నువ్వు ప్రకాశించమని ఆదేశిస్తావు. ప్రతి తారకా లెక్కలేని గ్రహాలకి వెలుగూ, వేడిమీ, చలనమూ అనుగ్రహిస్తుంది అతిదగ్గరనుండి అనంతదూరం వరకూ, అన్నిచుక్కల్నీ కొంగులో దాచుకోగలవు, అన్ని కోట్ల సూర్యప్రభలూ నీ పాదాల క్రిందనలిగే ముచ్చిరేకులు; కేవలం మండుతున్న పూసలు; తిరుగుతూ, తేలుతూ, మెరిసిపడే బుద్బుదాలు. విలియం రాస్కో…
-
రోడ్డువార నిద్ర … ఆర్థర్ కెచం, అమెరికను
ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో! వేసవిలూ శరత్తులూ గడిచిపోతుంటాయి, ఇప్పుడు గడ్డిమీద పూస్తున్నది మంచో, డెయిజీలో కూడా వాళ్ళకి తెలీదు. రోజల్లా “బర్చ్” చెట్టు ఒదిగి చెవి పారేసుకుంది నది లోలోపల ఏమిటిగొణుగుతోందో విందామని చుట్టూ ఆవరించిన నిశ్శబ్దంలో ఓ పిట్ట ఒంటరిగా సాంధ్యగీతాన్ని ఆలపిస్తోంది. గాలి తేలికగా వీచనీ, గట్టిగా రోదించనీ వాళ్ళ కలల అంచుల్లో ఏ చలనమూ ఉండదు. “శాంతి” గుండెలమీద సేదతీరుతున్నారు ఆమె లభించినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఏమి…
-
చిరుకవిత… విలియం రాస్కో థేయర్, అమెరికను
చిన్నప్పుడు నేను కవులతో తిరిగేను ఎందుకంటే వాళ్ళు చిత్రించే ప్రపంచం నేనెరిగిన ప్రపంచంకన్నా ఎన్నోరెట్లు అందంగా, ఉదాత్తంగా కనిపిస్తుండేది. ఇప్పటికీ కవులు నాకు సన్నిహితులే. కాని, చిన్నప్పటికంటే కూడ వాళ్ళిప్పుడు నాకు ఇష్టం. ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుసును వాళ్ళొక్కరే సత్యాన్ని ఆవిష్కరిస్తారని. . విలియం రాస్కో థేయర్ (January 16, 1859 – 1923) అమెరికను . . ENVOI I Walked with poets in my youth, Because the world…
-
మూడు పద్యాలు… లిల్లా కాబో పెర్రీ, అమెరికను కవయిత్రి
1. కప్పు ఆమె అంది: “కప్పును పైకెత్తు!” అని. ఆమె చేయి అలసినట్టు ఏ సూచన కనిపించనీ లేదు, నవ్వుతూనే చెయ్యి పైకి ఎత్తింది అందులో మధువులేదని ఇతరులు చూడకుండా, ఊహించకుండా. 2. నన్ను క్షమించకు! నన్ను క్షమించకు! నన్ను ద్వేషించు, నాకు తెలుస్తుంది నీ గుండెలో ప్రేమాగ్ని అవశేషం ఇంకా జ్వలిస్తోందని! రాగరహితమైన హృదయాలలోనే క్షమ చోటుచేసుకుంటుంది అచేతనమైన అగ్నిపర్వతం మీద మంచుపేరుకున్నట్టు. 3. గులాబి ఒక రక్తవర్ణపు గులాబిని అతని సమాధిలో జారవిడిచేను అంత…
-
బ్రతికున్నవారికో గులాబీ… నిక్సన్ వాటర్ మేన్, అమెరికను
బ్రతికున్న వారికి ఇచ్చే ఒక్క గులాబీ మృతులని ముంచెత్తే వేల దండలకంటే మెరుగు అనంత ప్రేమ భాండాగారాన్ని పూరించే ప్రయత్నంలో బ్రతికున్నవారికి ఇచ్చే గులాబీ ఎంతో విలువైనది కానీ, దానికొరకు తపించే ఆత్మ కృశించేలోగా అయాచితంగా ఉదారంగా సమర్పించాలి. బ్రతికున్న వారికి ఇచ్చే ఒక్క గులాబీ మృతులని ముంచెత్తే వేల దండలకంటే మెరుగు నిక్సన్ వాటర్ మేన్ 12 November 1859 – 1 September 1944 అమెరికను. . . A Rose…